మన్మోహన్‌సింగ్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ నివాళులు..
- మన్మోహన్ సింగ్ ఇంటికి చేరుకున్న ప్రధాని మోదీ
- మాజీ ప్రధాని పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన మోదీ
- మన్మోహన్ సతీమణి గురుశరణ్‌కౌర్, కుటుంబ సభ్యులకు సంతాపం
- ప్రధానితో పాటు మన్మోహన్ ఇంటికి వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డా
మన్మోహన్ పార్థివ దేహానికి రాష్ట్రపతి నివాళి
- మన్మోహన్‌సింగ్ పార్థివ దేహానికి రాషష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళి
- మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన ముర్ము
ఢిల్లీ
మన్మోహన్‌సింగ్ పార్థివ దేహానికి తెలంగాణ సీఎం రేవంత్ నివాళులు
- మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్‌ను, ,కుటుంబ సభ్యులను పరామర్శించిన రేవంత్ రెడ్డి
మన్మోహన్ నివాసానికి కాంగ్రెస్ అగ్రనేతలు
- మన్మోహన్ ఇంటికి వచ్చిన సోనియాగాంధీ రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గే, ప్రియాంకగాంధీ
- మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన నేతలు
వ్యక్తిగతంగా నాకు తీరనిలోటు: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
- మన్మోహన్ లేని లోటు పూడ్చలేనిది
- చాలా కాలం నుంచి మన్మోహన్ నాకు తెలుసు
- సభ్యతకు నిలువెత్తు రూపం మన్మోహన్‌సింగ్
- వీడియో విడుదల చేసిన మాజీ రాష్ట్రపతి
ఆ మాటే నిజమైంది: శశిథరూర్
- మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టిన శశిథరూర్
- చరిత్ర నా పట్ల దయతో ఉంటుందని 2014లో వ్యాఖ్యానించిన మన్మోహన్
- ఆయన చెప్పిన మాటలను గుర్తుచేస్తూ పోస్టు పెట్టిన కాంగ్రెస్ ఎంపీ
- పదేళ్ల తర్వాత అదే నిజమైందని వ్యాఖ్య
మన్మోహన్ దేశ సేవ..రాబోయే తరాలకు స్ఫూర్తి: సిక్కిం సీఎం తమాంగ్
- మన్మోహన్ మృతిపట్ల సంతాపం తెలిపిన సిక్కిం సీఎం ప్రేమ్‌సింగ్ తమాంగ్
- ఆర్థిక సంస్కరణలకు నాంది పలికి దేశాభివృద్ధికి గట్టి పునాది వేశారు
- దేశానికి మన్మోహన్ చేసిన సేవలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని వ్యాఖ్య
మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల అమెరికా సంతాపం
- గత రెండు దశాబ్దాల్లో అమెరికా,భారత్ సాధించిన మన్మోహన్ పునాది వేశారు
- అమెరికా, భారత్ పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన్మోహన్ కీలక పాత్ర పోషించారు
- భారత్ వేగంగా అభివృద్ధి చెందడానికి ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలకు గుర్తుండిపోతాయి
- ప్రకటించిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్
Comments
Please login to add a commentAdd a comment