సాక్షి, న్యూఢిల్లీ : సాధారణంగా సరిహద్దులో జరిగే పరిణామాలతో సైనికులు ప్రాణాలు కోల్పోవటం తరచూ చూస్తున్నాం. అయితే యుద్ధం లేకపోయినా వందల సంఖ్యలో సైనికులు ప్రాణాలు వదులుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏటా సుమారు 1600 మందికి పైగా ఆర్మీ సిబ్బంది మృత్యువాత పడుతున్నారని ఓ సర్వేలో వెల్లడైంది.
ఇందుకు గల కారణాలను విశ్లేషిస్తే... ఒక్క రోడ్డు ప్రమాదాల ద్వారానే ఏడాదికి 350 మంది సైనికులు, నావికులు, ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆత్మహత్యల ద్వారా మరో 120 మంది, అనారోగ్య కారణాలతో మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా త్రిదళాలకు సంబంధించి మొత్తం 6,500 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది ఆర్మీకి చెందిన వారే ఉన్నారు. రాత్రిపూటలో ప్రయాణాల సమయంలో ప్రమాదాలు, తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకోవటం లాంటి కేసులే ఎక్కువగా నమోదు అయ్యాయి.
ఇక ఈ ఏడాది 80 మంది పాక్, ఉగ్రవాద కవ్వింపు చర్యలకు బలికాగా, మిగతాకారణాలతో 1,480 మంది మరణించారు. అంటే 12 రేట్లు ఎక్కువగా ఆ మరణాలు చోటు చేసుకున్నాయన్న మాట. సైనికులను కోల్పోవటంపై ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు కూడా. ఇప్పటిదాకా జరిగిన యుద్ధాల్లో మృతి చెందిన సైనికుల లెక్క ఈ కింది విధంగా ఉంది.(టైమ్స్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment