War Field
-
సిరియాలో దాడుల టెన్షన్.. భారత పౌరులకు హెచ్చరికలు జారీ
డెమాస్కస్: సిరియాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సిరియాలో మరోసారి తిరుగుబాటు తారస్థాయికి చేరింది. ఆ దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు విజృంభిస్తున్నారు. ప్రభుత్వ దళాలు చేతులెత్తేసిన కారణంగా నగరాలకు నగరాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిరియాలో ఉన్న భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సిరియాలో ఉన్న వారందరూ డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని తెలిపింది. వెంటనే స్వదేశానికి రావాలని సూచించింది.సిరియాలో దాడుల నేపథ్యంలో భారత విదేశాంగశాఖ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తదుపరి నోటిఫికేషన్ జారీ చేసే వరకు భారత పౌరులెవరూ సిరియా వెళ్లొద్దని తెలిపింది. అలాగే, ఇప్పటికే సిరియాలో ఉంటే తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. అక్కడ ఉన్న వారంతా డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంలో టచ్‌లో ఉండాలని కోరింది. భద్రత గురించి జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. ఇదే సమయంలో అత్యవసర సహాయం కోసం +963993385973, hoc.damascus@mea.gov.inను సంప్రదించాలని పేర్కొంది.ఇదిలా ఉండగా.. సిరియాలో మరోసారి తిరుగుబాటు తారస్థాయికి చేరింది. గురువారం హమా నగరాన్ని ఆక్రమించిన హయాత్ తహరీర్ అల్-షామ్(హెచ్‌టీఎస్) నేతృత్వంలోని తిరుగుబాటుదళాలు శుక్రవారం మరో కీలక నగరం హోమ్స్ దిశగా సాగాయి. హోమ్స్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు హెచ్‌టీఎస్ ప్రకటించింది. హోమ్స్ కూడా ప్రభుత్వ దళాల చేతుల్లోంచి చేజారిపోతే, తిరుగుబాటుదళాల తదుపరి లక్ష్యం రాజధాని డమాస్కస్ అయ్యే అవకాశం ఉంది.Travel advisory for Syria:https://t.co/bOnSP3tS03 pic.twitter.com/zg1AH7n6RB— Randhir Jaiswal (@MEAIndia) December 6, 2024మరోవైపు తూర్పు సిరియాలో తుర్కియేకు వ్యతిరేకంగా పోరాడుతున్న కుర్దులు కూడా క్రియాశీలమయ్యారు. వారు ఇరాక్ సరిహద్దుల్లోని దేర్ ఎల్ జోర్ నగరాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. జోర్డాన్ సరిహద్దుల దగ్గర కూడా అధ్యక్షుడు అసద్ సేనలకు ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ పలు చెక్ పాయింట్ల నుంచి ప్రభుత్వదళాలు పారిపోయాయి. వీటిని స్థానిక సాయుధవర్గాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. దక్షిణ ప్రాంతంలో డ్రూజ్ తిరుగుబాటుదారులు రెచ్చిపోతుండడం అసద్ బలగాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సిరియాతో తన సరిహద్దును జోర్డాన్ మూసివేసింది. -
లెబనాన్ ఉక్కిరిబిక్కిరి.. ఇజ్రాయెల్ మెరుపు దాడులు
ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హెచ్చరించిన మరుసటి రోజే ఇజ్రాయెల్ ప్రత్యక్ష దాడులకు దిగింది. రాకెట్ లాంచర్లతో విరుచుకుపడింది. మరోవైపు.. హిజ్బుల్లా నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది.పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్‌లో భయాకన వాతావరణం నెలకొంది. ఏ సమయంలో ఏం జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా గురువారం టెలివిజన్‌లో ప్రసంగించారు. పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో ఇజ్రాయెల్ హద్దు మీరిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. నస్రల్లా ప్రసంగిస్తున్న సమయంలోనే దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడటం గమనార్హం. వందల సంఖ్యలో వార్‌హెడ్స్, రాకెట్లు హిజ్బుల్లా స్థావరాలపైకి దూసుకెళ్లాయి. తాజా దాడిలో గాయపడిన, చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, అంతకుముందు హిజ్బుల్లా డ్రోన్ దాడులు చేసింది. ఇందులో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. Israel is bombarding Hezbollah targets in Lebanon right now, in the most extensive wave of attacks since the war started. That's what you do when thousands of Hezbollah terrorists are incapacitated due to injuries 📟pic.twitter.com/wry0WodZxf— Dr. Eli David (@DrEliDavid) September 19, 2024 పేజర్లు, వాకీటాకీలపై నిషేధంపేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో అప్రమత్తమైన లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలు తీసుకుపోవడాన్ని నిషేధించింది. ఇక, లెబనాన్‌లో మంగళ, బుధవారాల్లో జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్లలో చనిపోయిన వారి సంఖ్య గురువారానికి 37కు పెరిగింది. దాదాపు మూడు వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 287 మంది పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. దీంతో, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.Hezbollah had prepared 100s of rockets launchers, 1000 plus barrels in #Lebanon for attack on Israeli military & civilian targets.Just minutes before the launch, #Israel discovered the plot, struck, & successfully destroyed all the Hizb launch sites in massive IAF Air strikes pic.twitter.com/7ZNmp2BDDq— Megh Updates 🚨™ (@MeghUpdates) September 20, 2024ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ రూటే వేరు.. ఆధారాలుండవ్.. అంతా సినీ ఫక్కీలో..! -
హెజ్బొల్లా Vs ఇజ్రాయెల్.. తెరపైకి డేంజరస్ ‘కత్యూషా’
జెరూసలేం: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపు మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇక, తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో 48 గంటల పాటు దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించారు. దాదాపు వందల సంఖ్యలో రాకెట్లు ఇజ్రాయెల్‌వైపు దూసుకెళ్లాయి.కాగా, గత నెలలో తమ టాప్ కమాండర్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ భూభాగంపైకి వందలాది సంఖ్యలో రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించినట్టు హెజ్బొల్లా గ్రూపు ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్, గోలన్ హైట్స్‌లోని ఆ దేశ సైనిక స్థావరాలు, ఐరన్ డోమ్ లక్ష్యంగా చేసుకొని 320 కత్యూషా రాకెట్లు, భారీ సంఖ్యలో డ్రోన్లను హిజ్బొల్లా ప్రయోగించింది. ఈ సందర్భంగా తమ నేత హత్యకు ప్రతీకారంగా మొదటి దశ దాడులను ముగించినట్టు హిజ్బొల్లా చెప్పుకొచ్చింది. అలాగే, భవిష్యత్ కాలంలో మరిన్ని తీవ్రమైన దాడులు ఉంటాయని హెచ్చరించింది. Today in Tel Aviv we were supposed to wake up to thousands of murdered children in blood soaked sheets. 7.10 Again. Satellite images showed rocket launchers moving into place. So we struck first. 100 IAF planes took to the sky and destroyed the missiles.Never Again is Now. pic.twitter.com/Vq4A3xxwWl— Rachel Gur (@RachelGur) August 25, 2024 మరోవైపు.. హెజ్బొల్లా దాడులను అడ్డుకొనేందుకు దక్షిణ లెబనాన్‌లోని వేలాది రాకెట్ లాంచర్లను లక్ష్యంగా చేసుకొని దాదాపు 100 యుద్ధ విమానాలు వైమానిక దాడులు చేశాయని ఇజ్రాయెల్ పేర్కొన్నది. ఇక, కేవలం సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్టు హెజ్బొల్లా గ్రూపు, ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు మరణించారని, ఇద్దరికి గాయాలయ్యాయని లెబనాన్ అధికారులు పేర్కొనగా, స్వల్ప నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నామని ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కాగా, హెజ్బొల్లా వద్ద దాదాపు 1,50,000 రాకెట్లు ఉన్నాయని, ఇజ్రాయెల్‌లోని అన్ని ప్రాంతాలపై దాడులు చేయగల సామర్థ్యం ఆ గ్రూపునకు ఉన్నదని ఒక అంచనా. The Iron Dome in Action — Saving Countless LivesIn parallel, the IDF has launched a series of calculated preemptive strikes, targeting Hezbollah’s long-range missile sites deep within Lebanon. These strikes are not just military maneuvers but a strategic effort to prevent a… pic.twitter.com/6U7zPKVTJC— Ian Ségal ✍🏻 (@segalian) August 25, 2024 హిజ్బొల్లా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా నెతన్యాహు మాట్లాడుతూ.. మా దేశాన్ని రక్షించుకొనేందుకు అన్ని చర్యలు తీసుకొంటాం. మాపై ఎవరు దాడి చేస్తారో, వారిపై మేం దాడి చేస్తాం. ఉత్తర ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించిన వేలాది రాకెట్లను సైన్యం అడ్డుకొన్నదని ఆయన పేర్కొన్నారు. సైన్యం సూచనలను పాటించాలని పౌరులను కోరారు. హెజ్బొల్లా వద్ద డేంజరస్ ‘కత్యూషా’హెజ్బొల్లా వద్ద రాద్, ఫజర్, జిల్జాల్ మోడల్ రాకెట్లు ఉన్నాయి. వీటిలో శక్తిమంతమైన పేలోడ్లు ఉన్నాయి. ఇవి కత్యూషా క్షిపణుల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించగలవు. ఇక, హెజ్బొల్లా గ్రూపు అమ్ములపొదిలో ‘కత్యూషా’ అనేది ప్రధాన ఆయుధంగా ఉన్నది. ఆదివారం నాటి ఘర్షణల్లో వీటికి చెందిన 300 రాకెట్లను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించినట్లు అంచనా.రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్లు దీన్ని తయారు చేశారు. కత్యూషా రాకెట్లు భారీ వార్హెడ్లను సుదూర లక్ష్యాలపైకి ప్రయోగించగలవు. ఏకకాలంలో వందల సంఖ్యలో వీటిని ప్రయోగించే అవకాశం ఉండటంతో శత్రు లక్ష్యాలను నాశనం చేయగలవు. వీటిని కొన్ని రకాల రహస్య లాంచర్లపై ఉంచి గుర్తు తెలియని ప్రదేశాల నుంచి హెజ్బొల్లా ప్రయోగిస్తుంది. 2006లో లెబనాన్ యుద్ధంలో వీటిని భారీ ఎత్తున వినియోగించారు. -
దేశంకాని దేశంలో.. తమది కాని యుద్ధంలో... సమిధలుగా మనోళ్లు
భవిష్యత్తు మీద బంగారు కలలతో ఆశలకు రెక్కలు కట్టుకొని ఆకాశంలోకి ఎగిరారు. ఉపాధి దొరికితే కొత్త ఉషోదయాలు చూస్తామనుకున్నారు. కానీం చివరకు తమది కాని యుద్ధంలో నిస్సహాయంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరఫున తలపడుతున్న భారత యువకుల విషాదమిది. ఎందుకిలా జరుగుతోంది? తమది కాని దేశంలో, తమకు సంబంధమే లేని యుద్ధంలో వారు ఎందుకిలా బలవుతున్నట్టు...? అతని పేరు రవి మౌన్. హరియాణాకు చెందిన 22 ఏళ్ల యువకుడు. రష్యాలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ చెప్పాడు. నమ్మిన కుటుంబం భూమి తెగనమ్మి మరీ ఏజెంట్‌కు రూ.11.5 లక్షలు ముట్టజెప్పింది. తీరా జనవరి 13న రష్యాకు వెళ్లాక ఏజెంట్ మోసగించినట్టు అర్థమైంది. ఇప్పుడతని ముందు రెండే ఆప్షన్లు. పదేళ్ల జైలు. లేదంటే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున పోరాటం. పదేళ్ల జైలు కంటే తనకిష్టం లేకున్నా యుద్ధ క్షేత్రాన్ని ఎంచుకున్నాడు రవి. ఈ విషయం కుటుంబానికి తెలియనివ్వలేదు. రష్యా సైనిక దుస్తుల్లో ఉన్న భారత యువకుల వీడియోలో అతన్ని చూశాకే వారికి తెలిసింది. చివరగా మార్చిలో కుటుంబంతో మాట్లాడాడు. అప్పటినుంచి వారికతని సమాచారమే లేదు. యుద్ధంలో మరణించిన వారి మృతదేహాలను పూడ్చేందుకు రాత్రంతా గోతులు, కందకాలు తవ్వడమే పని! నాలుగు నెలల తర్వాత యుద్ధభూమిలో ప్రాణాలొదిలాడు. రవి సోదరునితో పాటు రష్యాలోని భారత రాయబార కార్యాలయం కూడా సోమవారం దీన్ని ధ్రువీకరించింది. డ్రైవర్ ఉద్యోగం ఆశ చూపి యుద్ధానికి ఎలా బలి పెడతారన్న రవి కుటుంబం ప్రశ్నకు బదులిచ్చేదెవరు...? భారీ వేతనాలు ఎర చూపి... ఇది ఒక్క రవి కథే కాదు. ఎంతోమంది భారత యువకులకు భారీ వేతనంతో ఉద్యోగాలంటూ ఊరించి రష్యాకు తీసుకెళ్తున్నారు. చివరికిలా బలవంతంగా యుద్ధాన్ని నెత్తిన రుద్దుతున్నారు. 2023 డిసెంబర్ నుంచి 2024 ఫిబ్రవరి మధ్య చాలామంది భారతీయులు ఇలా రష్యా సైన్యంలో చేరారు. వారిక్కూడా అక్కడికి వెళ్లేదాకా ఆ సంగతి తెలియదు! 2023 డిసెంబర్లో హర్‡్ష కుమార్ అనే యువకున్ని బెలారస్కని చెప్పి తీసుకెళ్లిన ఏజెంట్ మధ్యలోనే వదిలేశాడు. రష్యా సైన్యానికి చిక్కడంతో యుద్ధంలో పాల్గొనాల్సి వచి్చంది. అమృత్‌సర్‌కు చెందిన తేజ్‌పాల్‌సింగ్ పరిస్థితీ అంతే. ఏజెంటుకు రూ.2 లక్షలు చెల్లించి మరీ ఉద్యోగం కోసం రష్యా వెళ్లి చివరకు సైన్యంలో తేలాడు. చివరగా మార్చి 3న కుటుంబంతో మాట్లాడారు. జూన్‌లో మరణించాడు. పశి్చమ బెంగాల్‌లోని కాలింపాంగ్‌కు చెందిన ఉర్గెన్ తమాంగ్ క్రిమియా యుద్ధ ప్రాంతం నుంచి మార్చిలో వీడియో పంపాడు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం, మంచి జీతం పేరిట ఏజెంట్ మోసగించాడని వాపోయాడు. 10 రోజులు నామమాత్ర ఆయుధ శిక్షణ ఇచ్చి బలవంతంగా వార్ జోన్లోకి నెట్టారని వెల్లడించాడు. తన యూనిట్‌లోని 15 మంది రష్యనేతర సైనికుల్లో 13 మంది ఎలా దుర్మరణం పాలయ్యారో వివరంగా చెప్పుకొచ్చాడు. ఏపీ నుంచి కూడా పలువురు యువకులు ఈ వలలో చిక్కి ఉక్రెయిన్ యుద్ధక్షేత్రానికి చేరినట్టు చెబుతున్నారు. నేరం నిరుద్యోగానిదే... సంపాదనకు విదేశీ బాట, ప్రవాస భారతీయుని హోదా మన సమాజంలో గౌరవ చిహ్నాలు. గ్రామీణ నిరుద్యోగిత మరీ ఎక్కువ ఉన్న పంజాబ్, హరియాణా యువత కెనడా, యూరప్ దేశాలకు విపరీతంగా వెళ్తుంటారు. కానీ ఆ దేశాలు వీసా నిబంధనలు కఠినతరం చేశాయి. రష్యన్ స్టాంప్ ఐరోపా దేశాలకు వెళ్లడానికి మార్గం సుగమం చేస్తుందనే ఆశతో పంజాబ్, హరియాణా యువకులు రష్యా బాట పడుతున్నారు. తీరా వెళ్లాక ఏజెంట్ల చేతిలో మోసపోయి యుద్ధంలో తేలుతున్నారు. రష్యా సైన్యంలో మనోళ్లు 40 మంది దాకా ఉన్నట్టు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నా వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. 8 మంది భారతీయుల మృతి: కేంద్రం విదేశీ యువతను రష్యా ఇలా ఉక్రెయిన్ యుద్ధానికి బలి పెడుతున్న నేపథ్యంలో తమ పౌరులు ఆ దేశాలకు వెళ్లకుండా పలు దేశాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. నేపాల్ వంటి చిన్న దేశాలు కూడా ఈ విషయంలో నిబంధనలను కఠినతరం చేశాయి. మన దేశంలో అలాంటి చర్యల ఊసే లేదు! కనీసం మోసగిస్తున్న ఏజెంట్లపైనా చర్యల్లేవు. సరికదాం, రష్యాలో ఉపాధి కోసం వెళ్లే భారతీయులు జాగ్రత్తగా ఉండాలనే ప్రకటనలతో కేంద్రం సరిపెడుతోంది! మన యువకులు ఉక్రెయిన్ యుద్ధంలో బలవుతున్న వైనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి రష్యా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా చర్చించినా లాభం లేకపోయింది. మనోళ్లను స్వదేశానికి పంపేందుకు రష్యా అధికారులు ససేమిరా అంటున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో 8 మంది భారతీయులు రష్యా తరఫున పోరాడుతూ మరణించినట్టు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తాజాగా గత గురువారం రాజ్యసభలో వెల్లడించారు. ‘‘12 మంది భారతీయులు ఇప్పటికే రష్యా సైన్యాన్ని వీడినట్టు సమాచారముంది. మరో 63 మంది కూడా సైన్యం నుంచి త్వరగా విడుదల చేయాలని రష్యా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు’’ అని వెల్లడించారు. రష్యా సైన్యం తరఫున యుద్ధక్షేత్రంలో పోరాడుతున్న భారతీయులను వెనక్కు పంపేలా ఆ దేశంతో అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నట్టు చెప్పారు.ఇలా మోసగిస్తున్నారు... నిరుపేద యువతను వారికే తెలియకుండా రష్యా సైన్యంలోకి పంపేందుకు ఏజెంట్లు ప్రధానంగా లక్షల్లో జీతం, మెరుగైన జీవితాన్ని ఎరగా చూపుతున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో సీబీఐ చేసిన దాడుల్లో భారీ మానవ అక్రమ రవాణా రాకెట్ వెలుగు చూసింది. దాని సభ్యులను విచారించగా ఈ వివరాలు బయటికొచ్చాయి. → ఈ ‘రష్యాలో ఉపాధి’ ప్రచారానికి వారు ప్రధానంగా సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. → ఒకసారి బాధితులు తమ వల్లో పడగానే స్థానిక ఏజెంట్లు రంగంలోకి దిగుతారు. రంగుల కల చూపి ఒప్పిస్తారు.→ పలు సందర్భాల్లో ఉన్నత విద్యను కూడా ఎర వేస్తున్నారు. → రష్యాలో దిగీ దిగగానే స్థానిక ఏజెంట్లు వాళ్ల పాస్‌పోర్టులు లాగేసుకుంటారు. → ఆనక బలవంతంగా రష్యా సైన్యంలో చేరక తప్పని పరిస్థితులు కల్పిస్తారు. ఇతని పేరు సయ్యద్ ఇలియాస్ హుసేనీ. కర్నాటకలోని కలబురిగి వాసి. వెనక ఉన్నది అతని మిత్రులు అబ్దుల్ నయీం, మహ్మద్ సమీర్ అహ్మద్. వీళ్లు, తెలంగాణలోని నారాయణపేటకు చెందిన మొహమ్మద్ సూఫియాన్ దుబాయ్ విమానాశ్రయంలో పని చేసేవారు. రష్యాలో సెక్యూరిటీ గార్డులు కావాలంటూ యూట్యూబ్‌లో ప్రకటనలు చూశారు. నెలకు లక్షకు పైగా జీతం వస్తుందన్న ఏజెంట్ మాటలు నమ్మి నలుగురూ గత డిసెంబర్లో రష్యా వెళ్లారు. వారిని బలవంతంగా సైన్యంలో చేర్చుకుని ఉక్రెయిన్ సరిహద్దులకు పంపారు. అక్కడి నుంచి ఇలియాస్ తమ దుస్థితిని ఇలా గోప్యంగా వీడియో తీసి పంపాడు. ఇలియాస్ తండ్రి నవాజ్ అలీ హెడ్ కానిస్టేబుల్. తన కొడుకును, అతని స్నేహితులను ఎలాగైనా సురక్షితంగా తీసుకు రావాలంటూ అప్పటినుంచీ అతను ఎక్కని గడప లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పాలస్తీనియన్లకు భారీ ఊరట.. ఇజ్రాయెల్‌కు కీలక ప్రకటన
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ గాజాలోని రఫాలో కాల్పుల విషయంలో ఇజ్రాయెల్ మరో కీలక ప్రకటన చేసింది. రఫాలో పగటి పూట(దాదాపు 11 గంటల పాటు) కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, గాజా ప్రజలకు మానవతాసాయం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. కాగా, రఫాలో పగటిపూట యుద్ధానికి విరామం ఇవ్వనున్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది. పాలస్తీనియన్లకు మానవతా సాయం అందింందే ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కాల్పుల విరామం ప్రకటించింది. ఇక, ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఆదివారం తెలిపింది. ఇజ్రాయెల్ నిర్ణయంతో కొన్ని వారాలుగా మానవతా సాయం అందక ఇబ్బందులు పడుతున్న గాజా ప్రజలకు ఊరట లభించింది.ISRAEL-HAMAS WARIsraeli army announces "#Tactical #Pause" in part of southern #GAZA strip during daylight hours to facilitate the delivery of aid pic.twitter.com/iDk5caNJnG— Alberto Allen (@albertoallen) June 16, 2024అయితే, దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో 12 కిలోమీటర్ల మేర విస్తరించిన ఉన్న రోడ్డు వెంబడి మాత్రమే కాల్పుల విరమణ కొనసాగనుంది. ఇక, తదుపరి నోటీసులు ఇచ్చే వరకు కాల్పులు విరామం కొనసాగనున్నట్టు ఐడీఎఫ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కెరోమ్ షాలోమ్ క్రాసింగ్ దగ్గర వేచి ఉన్న ట్రక్కులు సురక్షితంగా సలాహ్-అల్-దిన్ రోడ్డు మార్గం నుంచి ప్రయాణించగలవు. దీంతో రఫా ప్రాంతానికే కాకుండా ఉత్తర గాజాతో పాటుగా మరికొన్ని ప్రాంతాలకు కూడా మానవతాసాయం అందనుంది.ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్ ప్రకటనను సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు నేతలు ఖండిస్తున్నారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంపై ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. మానవతా సాయం అందివ్వడానికి యుద్ధానికి విరామం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్-హమాస్ దాడుల నేపథ్యంలో శనివారం ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు మృతిచెందారు. -
#IranAttack: ఇరాన్ దాడులు.. అమెరికా వ్యూహం ఫలించిందా?
Live Updates.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ తాజా వార్నింగ్.. ►ప్రతీకార చర్యలో భాగంగా ఇజ్రాయెల్‌పై శనివారం రాత్రి డ్రోన్లు, మిసైళ్ల వర్షం కురిపించిన ఇరాన్, ఆ దేశానికి ఆదివారం( ఏప్రిల్ 14) మళ్లీ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇరాన్‌ను హెచ్చరించారు. తాము చేసిన డ్రోన్ దాడులకు ఇజ్రాయెల్ ఎలాంటి ప్రతి దాడులకు దిగినా తమ స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ►ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ..‘ఇరాన్ భీకర దాడులను ఇరాన్ ఎదుర్కోని వారిపై విజయం సాధించింది. శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించింది. దీంతో శత్రువులు ఇజ్రాయెల్ణు ఏమీ చేయలేరని వెల్లడించినట్లైంది. ఇజ్రాయెల్ రక్షణకు అమెరికా కట్టుబడి ఉంది. ఇరాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడానికి సాయం చేశాం. మా సైనికులు అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించారు. భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తాం. ఈ దాడులను నేను ఖండిస్తున్నాను’ అని కామెంట్స్ చేశారు. 300 డ్రోన్స్ ప్రయోగించిన ఇరాన్.. ►ఇరాన్ దాదాపు 300 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ పేర్కొంది. వాటిల్లో అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే తమ భూభాగాన్ని తాకాయని వెల్లడించింది. ఈ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఐడీఎఫ్ స్థావరం తీవ్రంగా దెబ్బతినగా.. ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఇరాన్ తన భూభాగంపై నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఇదే తొలిసారి. ఇరాన్ డ్రోన్లను కూల్చిన అమెరికా.. ►అమెరికా దళాలు ఇరాన్ ప్రయోగించిన దాదాపు 70కిపైగా డ్రోన్లు, మూడు బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. మధ్యధరా సముద్రంలోని తమ యుద్ధ నౌకలు స్పందించాయని పేర్కొన్నారు. ఇరాన్ మొత్తం 100కుపైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందన్నారు. ►ఇరాన్ ఆపరేషన్ సక్సెస్.. BREAKING: IRAN CHIEF OF STAFF OF ARMED FORCES “We regard this operation as completely successful and we do not intend to continue the operation, but if Israel responds, our next operation will be much bigger.” pic.twitter.com/ys9nR93bUp — Nabeel Shah (@nabeel_AMU) April 14, 2024 ఇరాన్ పార్లమెంట్లో సంబురాలు.. 🇮🇷🇮🇱 The Iranian Parliament celebrates the Iranian attack on Israel - ISZ reports pic.twitter.com/EBKWjeWHL3 — Zlatti71 (@Zlatti_71) April 14, 2024 ►ఇజ్రాయెల్, ఇరాన్ బలాబలాలు ఇలా.. Iran 🇮🇷 vs Israel 🇮🇱 Total Population: Iran 🇮🇷: 87.6M Israel 🇮🇱: 9.04M Available Manpower: Iran 🇮🇷: 49.05M Israel 🇮🇱: 3.80M Fit-for-Service: Iran 🇮🇷: 41.17M Israel 🇮🇱: 3.16M Military Personnel: Active Personnel: Iran 🇮🇷: 610K Israel 🇮🇱: 170K Reserve Personnel: Iran 🇮🇷: 350K… — World of Statistics (@stats_feed) April 14, 2024 ►ఇరాన్, ఇజ్రాయెల్ దాడులపై స్పందించిన భారత్.. ఇజ్రాయెల్‌పై దాడుల నేపథ్యంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రాంతంలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లడంపై ఆందోళన వ్యక్తపరిచింది. ఈ సందర్భంగా 'తక్షణమే ఇరు పక్షాలు వెనక్కు తగ్గాలని, సంయమనం పాటించాలని, హింస నుంచి వెనుదిరిగి, దౌత్య మార్గానికి తిరిగిన రావాలని పిలుపునిస్తున్నాం. మేము పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఆయా దేశాల్లో ఉన్న భారతీయులతో మా రాయాబార కార్యాలయాలు టచ్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వం ఉండేలా చూడటం చాలా ముఖ్యం' అని భారత్ విదేశాంగ శాఖ పేర్కొంది. 🚨🇮🇱🇮🇷 Iran cruise missiles over Jerusalem War is the greatest failure of human civilisation. We Hope India 🇮🇳 Pray for peace 🕊️ everywhere. Hope everyone safe. #Iran #Israel #WWIII #TheVoice #IranAttack #Iranians #savas #IranAttackIsrael US Air force | Terrorist pic.twitter.com/R0xOq4YHRC — Parmanand (@Parmana75684584) April 14, 2024 ►అప్రమత్తమైన యూకే.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి నేపథ్యంలో యూకే అప్రమత్తమైంది. దాడులను నిరోధించడానికి ఎయిర్‌ఫోర్స్ జెట్లు, ఎయిర్ రీఫ్యూయలింగ్ ట్యాంకర్లను సిద్ధం చేసింది. మరోవైపు ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా గ్రూపు ఇజ్రాయెల్ రక్షణ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని డజన్ల కోద్దీ రాకెట్లను ప్రయోగించింది. 🇮🇷🇮🇱 IRAN is CELEBRATING after the successful attack on ISRAEL!#Iran #Iranians #Iranian pic.twitter.com/lIPj62U6Q8 — Areeba🇵🇸 (@Areeba_sys) April 14, 2024 ► ఇజ్రాయెల్‌పై దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఖండించారు. ప్రపంచం మరో యుద్ధాన్ని భరించే స్థితిలో లేదని తేల్చిచెప్పారు. ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలన్నారు. ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ►ఐరాస చార్టర్‌లోని ఆర్టికల్ 51 ప్రకారమే తాము దాడి చేసినట్లు తెలిపింది. మళ్లీ ఇజ్రాయెల్, అమెరికాలు తమపై దాడులు చేస్తే మాత్రం ఈసారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇరాన్ జాతీయ జెండాలు పట్టుకుని రహదారులపై ర్యాలీలు నిర్వహించారు. Live over Tel Aviv#savas #amici23 #Iran #TheVoice #ENGFAxMajorSongkranFestival #Israel #IranAttack #Coachella #Iranians #LANACHELLA pic.twitter.com/jsTqnbW9qy — Dr.Qayyum (@Qayyum654475038) April 14, 2024 WE STAND WITH IRAN #Palestinians #IranAttackIsrael #Iranians #Iranian pic.twitter.com/AfICHslK7V — Hitler😎 (@happy601_hitler) April 14, 2024 #WorldWar3 1 . Russia, China, Iran,yamen, North Korea 2. Nato , USA, Israel and UK India stand neutral 😐 #Iran#Isreal #IranAttack #Indian pic.twitter.com/v4fXu2Cb5q — Vikas Singh (@VikasKu74248695) April 14, 2024 WW3 HAS OFFICIALLY STARTED ?#IranAttackIsrael #Israel #WorldWar3 pic.twitter.com/lqLLEJToP4 — Amit Jha (@amit_code) April 14, 2024 Palestinians celebrating Iran ballistic missiles#IranAttack #IranAttackIsrael #Iranian #Iranians #StandWithIran #WorldWar3 #WorldWarIII #Iran #Israel #IsraelIranWar #الحرب_العالمية_الثالثة #LALISA pic.twitter.com/1ooFUCCvbX — Abid Ullah (@abidullahmsd03) April 14, 2024 ►ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు మొదలయ్యాయి. దాదాపు రెండు వందలకుపైగా డ్రోన్స్, మిస్సైల్స్‌ను ఇరాన్ ప్రయోగించింది. దీంతో, రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇక, ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. ►కాగా, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు ప్రారంభించింది. ఆకాశంలో ఇజ్రాయెల్‌వైపుగా రెండు వందలకుపైగా డ్రోన్స్, మిస్సైల్స్‌ను ప్రయోగించినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వెల్లడించింది. ఇక, ఈ డ్రోన్స్ ఇజ్రాయెల్ గగనతలంలోకి రాగానే సైరన్ శబ్ధంతో అట్టుడుకుపోయింది. అయితే, వీటిల్లో కొన్నింటిని సిరియా లేదా జోర్డాన్ మీదుగా ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, ఇరాక్ తమ గగనతలాన్ని మూసివేశాయి. ఈ క్రమంలో సిరియా, జోర్డాన్ తమ వైమానిక దళాలను అప్రమత్తం చేశాయి. ఇరాన్లో డ్రోన్ దాడుల్లో ఒక బాలిక గాయపడినట్టు సమాచారం. #WATCH | Tel Aviv: Iranian drones intercepted by Israel's Iron Dome, as Iran launches a drone attack against Israel by sending thousands of drones into its airspace. (Source: Reuters) pic.twitter.com/GyqSRpUPF1 — ANI (@ANI) April 14, 2024 ఇదిలా ఉండగా.. ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్స్ ఇజ్రాయెల్‌కు రావడానికి గంటల కొద్దీ సమయం పడుతుందిని వాటిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు.. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దేశానికి సమీపంగా క్షిపణి విధ్యంసక యుద్ధ నౌకలను మోహరించింది. Israelis’ reality in the last hours: pic.twitter.com/VXeHM8WqJi — Israel Defense Forces (@IDF) April 14, 2024 Outstanding video of Iran targeting Israeli Air defense systems! Iranian missiles with decoy bomblets are first deployed, then several ballistic missiles hit their intended target. What a fantastic video. pic.twitter.com/ff5ftepSj1 — Saeed (@Haman_Ten) April 14, 2024 ISRAELIS in FULL PANIC as IRANIAN missiles land in ISRAEL#Iran #Israel #WorldWar3 #WorldWarIII #Oil #TelAvivTed #IranAttack #iranisraelwar pic.twitter.com/EESNcSV1uc — Time ⭐ (@Sunil__Ahir) April 14, 2024 ఇజ్రాయెల్ నౌకలో భారతీయులు.. మరోవైపు.. 17 మంది భారతీయ నావికులు ఉన్న ఇజ్రాయెల్ కంటైనర్ షిప్‌ను ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డు కమాండోలు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పర్షియన్ గల్ఫ్‌లోని హొర్మూజ్ జలసంధిలో ఈ ఘటన జరిగింది. నౌకను ప్రస్తుతం ఇరాన్ జలాల వైపు మళ్లిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఎంఎస్సీ ఏరీస్ అనే పేరున్న ఈ నౌకపై పోర్చుగీస్ జెండా ఉంది. BREAKING: IRAN BANS ALL SHIPS LINKED TO ISRAEL “Starting today, all vessels linked to the Zionist regime are banned from operating in the Oman Sea and the Persian Gulf. Any such vessels found in these waters will be confiscated.” pic.twitter.com/9z5VAjPzZX — Sulaiman Ahmed (@ShaykhSulaiman) April 14, 2024 ఇది ఇజ్రాయెల్‌లోని జొడియాక్ గ్రూప్‌నకు చెందిన నౌక. ఇరాన్ కమాండోలు సోవియట్ కాలం నాటి మిల్ ఎంఐ–17 హెలికాప్టర్ నుంచి తాడు సహాయంతో నౌకపై దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇరాన్ కమాండోల దుశ్చర్యపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చవద్దని హెచ్చరించింది. ఇరాన్ కమాండోలు స్వాధీనం చేసుకున్న కంటైనర్ నౌకలో ఉన్న 17 మంది భారతీయ నావికుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని భారత వర్గాలు తెలిపాయి. దౌత్యమార్గాల్లో ఇరాన్‌ను అధికారులను సంప్రదిస్తున్నామని పేర్కొన్నాయి. What a beautiful view i have ever seen... i stand with iran💪✌️#Iran #Israel #IranAttack#IranAttackIsrael pic.twitter.com/WOI5xldTC3 — Malik Ehtisham (@MalikEhtisham_1) April 14, 2024 -
ఇజ్రాయెల్‌కు టెన్షన్.. ఇరాన్ సంచలన ప్రకటన!
జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందనే వార్తలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా కూడా ఇజ్రాయెల్‌ను హెచ్చరిండంతో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అలర్ట్ అయ్యారు. కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుత పరిస్థితిల్లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తప్పదేమోనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ను శిక్షించే సమయం ఆసన్నమైందంటూ గురువారం ఇరాన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ పేర్కొంది. దాడి ఎలా చేయాలన్న విషయంలోనే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. దీంతో, ఇజ్రాయెల్‌పై ఏ క్షణంలోనైనా ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇరాన్ దాడులు గురించి అమెరికా కూడా హెచ్చరించింది. అయితే, ఏప్రిల్ ఒకటో తేదీన సిరియాలోని కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ వాయుసేన దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన టాప్ మిలటరీ జనరల్‌తో పాటు ఆరుగురు అధికారులు మరణించారు. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం, ఇరాన్ సుప్రీం అధినేత అయతుల్లా అలీ ఖొమేనీ సహా సైనిక జనరళ్లు కూడా ఇజ్రాయెల్‌ను శిక్షిస్తామని బహిరంగ ప్రకటనలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సమయం కోసం ఇరాన్ వేచిచూస్తున్నట్టు సమాచారం. అయితే, ఇజ్రాయల్‌పై నేరుగా ఇరాన్ దాడి చేయకపోవచ్చని, లెబనాన్ లేదా సిరియా నుంచి తన మద్దతుదారులైన హెజ్బొల్లా, ఇతర మిలిటెంట్ సంస్థలతో దాడులు చేయించొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, ఈ యుద్ధ భయంతో టెహ్రాన్‌కు ఈ నెల 13 వరకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్టు జర్మనీ ఎయిర్‌లైన్స్ లుఫ్తాన్సా ప్రకటించింది. ఇజ్రాయెల్, లెబనాన్, పాలస్తీనియన్ వంటి పశ్చిమాసియా ప్రాంతాలకు ప్రయాణించవద్దంటూ రష్యా విదేశాంగ శాఖ తన పౌరులకు సూచించింది. బైడెన్ కీలక ప్రకటన.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసే అవకాశమున్న నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఇజ్రాయెల్‌కు తాము పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. ఆ దేశ రక్షణకు, భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌తో యుద్ధంలో అమెరికా భాగస్వామ్యమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. -
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత్ వ్యూహాత్మక వైఖరి
ఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ రెండో ప్రకటన వ్యూహత్మకంగా ఉంది. విదేశాంగ శాఖ గురువారం వెలువరించి ప్రకటన ప్రధాని మోదీ మొదట ఇచ్చిన ప్రకటనకు కాస్త విరుద్ధంగా ఉన్నప్పటికీ తటస్థ వైఖరి కనిపిస్తోంది. మొదట ఇజ్రాయెల్ వైపే ఏకపక్షంగా ఉన్న భారత్.. పాలస్తీనాపై కూడా స్పందిస్తూ శాంతిని ఆకాంక్షించింది. పాలస్తీనా సార్వభౌమాధికారం, స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయడంపై ప్రత్యక్ష చర్చలు జరపాలని తాము ఎల్లవేళలా కోరుకుంటున్నామని భారత్ గురువారం తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పాటించాల్సిన సార్వత్రిక బాధ్యత గురించి భారతదేశానికి తెలుసని అన్నారు. ఇజ్రాయెల్‌తో శాంతియుతంగా జీవించే స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు దిశగా చర్యలు ఉండాలని భారత్ భావిస్తున్నట్లు బాగ్చీ చెప్పారు. ప్రధాని మోదీ ప్రకటన ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు జరిపిన ఆరంభంలో ప్రధాని మోదీ ప్రకటన భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ప్రకటనకు కాస్త విరుద్ధంగా ఉంది. ప్రధాని మోదీ పాలస్తీనా పేరు కూడా ఎత్తకుండా ఏకపక్షంగా ఇజ్రాయెల్‌కు భారత్ మద్దతు ఉంటుందని తెలిపారు. హమాస్ దాడులను ఉగ్రదాడులుగా పేర్కొంటూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అరబ్ దేశాలు నోరువిప్పడంతో భారత విదేశాంగ శాఖ, ప్రధాని మోదీ ప్రకటనలలో ఉగ్రవాదంపై వ్యతిరేక వైఖరి ఉమ్మడి అంశంగా ఉన్నప్పటికీ స్వతంత్ర పాలస్తీనా అంశాన్ని కూడా జోడించి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పశ్చిమాసియాతో సంబంధాలు కోల్పోకుండా భారత్ వ్యూహంగా ముందుకు వెళుతోంది. యుద్ధం ఆరంభంలో ఇజ్రాయెల్‌లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ-నెతన్యాహు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ వైపే ఏకపక్షంగా ఉన్నారు. గాజాలో జరుగుతున్న దాడులపై అరబ్ దేశాలు నోరువిప్పడంతో పరిస్థితి కాస్త మారింది. దీంతో వ్యూహాత్మకంగా భారత్ విదేశాంగ శాఖ పాలస్తీనా అంశంపై కూడా మాట్లాడింది. అరబ్ దేశాలతో సంబంధాలు అరబ్ దేశాలతో వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలను భారత్ కలిగి ఉంది. భారతదేశం చమురును ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఇండియా పాలస్తీనాతో కూడా సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. పాలస్తీనాకు చట్టబద్ధ గుర్తింపు కోసం 1974లో మద్దతు తెలిపిన ఏకైక అరబ్ దేశం కాని వాటిల్లో భారత్ మొదటిస్థానంలో ఉంది. 2016లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాలస్తీనాను కూడా సందర్శించారు. 2017లో పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఇండియాను సందర్శించారు. 1977లోనూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వైఖరి కూడా పాలస్తీనాకు మద్దతుగానే ఉంది. అక్రమంగా ఆక్రమించిన పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఖాలీ చేస్తేనే పశ్చిమాసియా సమస్య పరిష్కారమవుతుందని అప్పట్లో వాజ్‌పేయీ కూడా అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత శనివారం ప్రారంభమైన యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరుపక్షాల వైపు రాకెట్ దాడులు, బాంబుల మోతలతో మారణోమాన్ని సృష్టిస్తున్నారు. ఇరుదేశాల్లో కలిపి దాదాపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1300 మంది మరణించగా.. పాలస్తీనాలో 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాను ఖాలీ చేయాలని ఇజ్రాయెల్ దళాలు ఆదేశాలు జారీ చేశాయి. వరుసదాడులతో ఇరుపక్షాలు చెలరేగిపోతున్నాయి. ఇదీ చదవండి: ఉత్తర గాజాను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్ సైన్యం -
ఫలిస్తున్న ఇజ్రాయెల్ ప్లాన్.. హమాస్‌కు ఊహించని షాక్!
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దాడులతో గాజా పట్టణం గజగజ వణుకుతోంది. గాజాపై ముప్పేట దాడి జరుగుతోంది. ఒకవైపు విద్యుత్, ఇంధనం ఆహారాన్ని నిలిపివేసిన ఇజ్రాయెల్.. మరోవైపు వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. యుద్ధం కారణంగా వేలాది మంది ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు గాజాపై హెచ్చరికలు లేకుండా దాడులు చేస్తే బందీలను చంపేస్తామని హమాస్ బెదిరిస్తోంది. వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్ దాడులతో గాజా అల్లకల్లోలం అవుతోంది. ఐదోరోజు యుద్ధంలో భాగంగా గాజా సరిహద్దు ప్రాంతాలను హమాస్ గ్రూపు నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నామని, ఇరువైపులా వేలాది మంది మరణించారని ఇజ్రాయెల్ తెలిపింది. గాజాలోని కిజాన్-అన్-నజ్జర్ పరిసరాల్లోని హమాస్ మిలిటరీ కమాండర్ మొహమ్మద్ దీఫ్ తండ్రి ఇంటిని లక్ష్యంగా చేసుకుని రాత్రిపూట వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ నివేదించింది. అంతే కాకుండా గాజా ప్రాంతంలోని అనేక ప్రదేశాలు, రహదారులను ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణ సాధించింది. నిన్న సాయంత్రం కూడా ఇజ్రాయెల్ దాడులను వేగవంతం చేసినట్టు పేర్కొంది. ఇజ్రాయెల్‌లో దాదాపు 3000 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. Late night attacks on Gaza Strip by IDF#IsraelPalestineWar #Israel #Gaza #غزة_الآن #طوفان_الأقصى #Palestina #HamasMassacre #FreePalastine #PalestineUnderAttack #Palestina #HamasTerrorism #Israel_under_attack #FreePalaestine #Palestine #GazaUnderaAttack pic.twitter.com/p9odltWxS5 — Cctv media (@Cctv__viral) October 11, 2023 ఇక, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడం వల్ల గాజా నగరంలో వందలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. గాజాలోని రెండు వందల మిలిటెంట్ల స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ధ్రువీకరించింది. వీటిలో మిలిటెంట్లు ఆయుధాలు దాచిన ఓ ప్రార్థనా మందిరం, ఒక అపార్టుమెంట్ భవనం ఉన్నాయని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలను అధికారిక వైబ్సైట్లో ఉంచింది. Listen in as an IDF Spokesperson LTC (res.) Jonathan Conricus provides a situational update on all fronts, as the war against Hamas continues. https://t.co/uuen9lQa0F — Israel Defense Forces (@IDF) October 11, 2023 ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ నుంచి కిడ్నాప్ చేసి గాజాకు తీసుకెళ్లిన వారికి ఏమైనా జరిగితే హమాస్ పరిస్థితి మరింత దిగజారుతుందని ఐడీఎఫ్ హెచ్చరించింది. హమాస్ ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న వారి కుటుంబాలను కలిసి సమాచారం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ సైన్యం అధికారులను పంపింది. దాదాపు వంద కుటుంబాల వద్దకు ఈ అధికారులు వెళ్లి వారి ఆత్మీయులు గాజాలో హమాస్ వద్ద బందీలుగా ఉన్న విషయాన్ని వెల్లడించారు. కిడ్నాప్‌నకు గురైన వారి సంఖ్య వంద నుంచి 150 మధ్యలో ఉంటుందని భద్రతా దళాలు ఇప్పటికీ అనుమానిస్తున్నాయి. బందీలను హతమారిస్తే హమాస్ ఉనికి లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, పాలస్తీనా వాసులు వీలైనంత త్వరగా ఈజిప్టుకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. గాజాకు ఈజిప్టుకు నుంచి సాయం అందుతోంది. 2 టన్నుల ఔషధాలను పంపింది. . We want Clean Hamas Form World. Carry on Israel. #GazaUnderAttack #IsraelPalestineWar #Gaza #Palestine #Israel #FreePalastine #طوفان_القدس #Hamas #HamasTerrorists #IStandWithIsrael pic.twitter.com/I89mwce9R5 — Khushi Tiwari 💖 (@Khushitiwari0) October 10, 2023 ఇది కూడా చదవండి: బర్త్‌డే వేడుకల్లో బెలూన్స్ వాడుతున్నారా?.. ఇది తెలుసుకోండి.. -
రష్యా యుద్ద ట్యాంకర్లపై ‘z’ గుర్తు.. వారి ప్రత్యేకత ఇదే..
Mysterious Z Symbol In Russia Military Vehicles మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా వార్ కొనసాగుతోంది. ఈ యుద్దంలో రష్యా అత్యాధునిక బాంబులను, క్షిపణులను ఉక్రెయిన్‌పై ప్రయోగిస్తోంది. రష్యా ధాటికి ఉక్రెయిన్‌లో పెద్ద పెద్ద భవనాలు సైతం కుప్పకూలిపోతున్నాయి. వార్ ధాటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు యుద్దం సందర్బంగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన పలు సైనిక వాహనాలు, యుద్ద ట్యాంకర్లపై ‘z’ గుర్తు ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. ‘z’ గుర్తు స్పెషాలిటీ ఇదే.. ఈ ‘z’ గుర్తు ఉన్న వాహనాలను రోజ్గావార్డియా ట్రూప్స్ అని పిలుస్తుంటారు. వీటికి రష్యా జాతీయ భద్రతా దళం అనే మరో పేరు కూడా ఉంది. కాగా, ఈ రోజ్గా వార్డియా ట్రూప్స్ కేవలం రష్యా అధ్యక్షుడు పుతిన్ భద్రతా వ్యవహారాలనే మాత్రమే చూస్తుంటాయి. వీరందరూ ఎంతో నైపుణ్యంతో కూడిన ట్రైనింగ్ తీసుకొని యుద్దం రంగంలో ఎంతో చాకచక్యంగా విధులను నిర్వర్తిస్తారనని తెలుస్తోంది. ఏ ప్రదేశంలోనైనా చొరబడి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే శక్తి ఈ బలగాలకు ఉంటుందని పలువురు ప్రముఖులు అంటున్నారు. దీంతో యుద్ధంలో ఈ గుర్తు ఉన్న వాహనాలు కనిపించడంతో రష్యా ఆ ట్రూప్స్‌ను కూడా వార్‌లోకి దింపిందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. Russian tanks marked with 'Z' zip down streets of Melitopol, Ukraine. #RussiaUkraineConflict #UkraineRussiaCrisis #WWIII pic.twitter.com/lVGV3I4ZpW — NewsReader (@NewsReaderYT) February 25, 2022 ఇదిలా ఉండగా ఈ గుర్తుపై మరో వాదన కూడా ఉంది. కేవలం యుద్దం జరుగుతున్న సమయంలో ఇదో రకమైన కమ్యూనికేషన్ సిగ్నల్ అని కొందరు అంటున్నారు. రష్యా ట్రూప్‌పై వారి దేశానికి చెందిన యుద్ద వాహనాలు కాల్పులు జరపకుంగా ఈజీగా గుర్తు పట్టేందుకే ఇలా గుర్తులు వాడుతారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, బెలారస్లో రష్యాకు చెందిన మరికొన్ని యుద్ద వాహనాలపై ‘O’ గుర్తు కలిగిన వాహనాలు కూడా కనిపించినట్టు ఓ అంతర్జాతీయ మీడియా తన కథనంలో రాసుకొచ్చింది. -
ఆర్మీలో చేరకున్నా అతని చుట్టూ యుద్ధ వాతావరణమే
పాత సామాన్లు.. చెక్కతో చక్కగా యుద్ధ పరికరాలు తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు ఆ యువకుడు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు వెంకటరాయపురానికి చెందిన పంపన వెంకటరమణ వడ్రంగి పని చేస్తుంటాడు. అతని కుమారుడు నాగేంద్ర ఇంటర్మీడియట్ వరకూ చదివాడు. బాల్యం నుంచి పోలీసులు.. సైనికులు అంటే అమితంగా ఇష్టం. యుద్ధ ఇతివృత్తాలున్న సినిమాలనే చూసేవాడు. చెక్కతో తయారు చేసిన జేసీబీ సైనికుడు తరహాలో యూనిఫాంకుట్టించుకుని ధరించేవాడు. సైన్యంలో చేరాలనే ప్రయత్నాలు ఫలించలేదు. అయినా అదే ధ్యాసతో తనలోని వృత్తిపరమైన నైపుణ్యానికి పదును పెడుతున్నాడు. చెక్కతోపాటు ఇంట్లోని కొన్ని వ్యర్థ సామాన్లతో ఏకే–47ను తలపించే తుపాకీ తయారు చేశాడు. వాటిలో ఉపయోగించడానికి చెక్క బుల్లెట్లనూ తయారు చేశాడు. గన్‌లో బుల్లెట్ వేసి పేల్చగానే చెక్క బుల్లెట్ సుమారు 10 మీటర్ల దూరం దూసుకుపోతోంది. వడ్రంగి సామాన్లతో చెక్కలతో యుద్దటాంక్, బాంబర్లను తయారు చేశాడు. దీపావళి మందుగుండు సామగ్రితో బాంబర్ల మాదిరి సౌండ్‌తో పాటు దూసుకు పోతుండడం విశేషం. ఇది ఉత్తుత్తి యుద్ద ట్యాంకే.. ఆర్మీకల నెరవేరకున్నా.. ఎలాగైనా సైన్యంలో చేరాలనే పట్టుదలతో గతంలో నాగేంద్ర కాకినాడలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంటు ర్యాలీకి వెళ్లాడు. పరుగులో వెనుకబడటంతో ఆర్మీ చాన్సు పోయింది.. కొడుకు ఉత్సాహం చూసి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. తమ వంతు సహకారం అందించారు. ప్రయత్నాలు ఫలించలేదు. అదే సమయంలో ఆర్ధిక పరిస్థితులూ అనుకూలించలేదు. దీంతో మధ్య లోనే చదువు ఆపేసిన కుల వృత్తిలో సెటిలయ్యాడు. తండ్రికి చేదోడువాదోడయ్యాడు. అయినా అతనిలో సైనికోత్సాహం వీడలేదు. తీరిక దొరికనప్పుడల్లా యుద్ధ పరికరాలు తయారు చేస్తుంటాడు. ఎప్పటికైనా మరిన్ని యుద్ద పరికరాలు, సామగ్రి, ఆయుధాలు, ట్యాంకులు తయారు చేసి ఆర్మీ పేరున ఎగ్జిబిషన్ పెట్టాలని నాగేంద్ర ఉత్సాహపడుతున్నాడు. -
ఆఖరి క్షణంలో ఆగిన యుద్ధం
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీస్తాయని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న వేళ ఒకడుగు ముందుకు వేసి సమరానికి సై అన్న అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఖరి క్షణంలో వెనక్కి తగ్గారు. ఇరాన్‌లోని ఎంపిక చేసిన మూడు లక్ష్యాలపై గురువారం రాత్రే దాడి చేయాలని అంతా సిద్ధం చేసినప్పటికీ, దాడి చేస్తే 150 మంది చనిపోతారని తెలియడంతో ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో శుక్రవారం ప్రకటించారు. ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా నిఘా డ్రోన్‌ని ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డులు కూల్చివేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకోవడం తెలిసిందే. యుద్ధానికి తాము ఎప్పుడూ సిద్ధమేనంటూ ఇరాన్ రివల్యూషనరీ గార్డు కవ్వింపు చర్యలకి దిగేసరికి డ్రోన్ కూల్చేసి ఇరాన్ అతి పెద్ద తప్పు చేసిందంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. భద్రతా అధికారులతో ట్రంప్ భేటీ డ్రోన్‌ని కూల్చిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే జాతీయ భద్రతా అధికారులతో ట్రంప్ గురువారం రాత్రి సమావేశమయ్యారు. ఇరాన్‌పై దాడులకు మార్గాలు అన్వేషించారు. ఇరాన్ డ్రోన్‌ని కూల్చేయడం అంత చెత్త పని మరొకటి లేదని మండిపడ్డారు. యుద్ధం ప్రకటించడానికే సిద్ధమయ్యారు. అయితే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం ట్రంప్‌ని వారించారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్‌పై ఎలాంటి కఠిన చర్యలకు దిగవద్దని ఆయనకు నచ్చ చెప్పారు. విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో, జాతీయ భద్రతా సలహాదారు జాన్ బాల్డన్ ఇరాన్‌పై కఠినాత్మకంగా వ్యవహరించాలని సూచిస్తే, హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ ఆడమ్ స్కిఫ్ మాత్రం ఈ దశలో యుద్ధం మంచిది కాదని వారించారు. చివరకు ఆ దాడి చేస్తే 150 మంది చనిపోతారని చెప్పడంతో, డ్రోన్‌ను కూల్చేసినందుకు అంత మందిని చంపడం భావ్యం కాదని తాను దాడి ఆలోచనను విరమించుకున్నట్లు ట్రంప్ చెప్పారు. స్పష్టమైన ఆధారాలున్నాయి: ఇరాన్ అమెరికా డ్రోన్ అంతర్జాతీయ గగనతల నిబంధనల్ని అతిక్రమించి మరీ తమ దేశంలోకి ప్రవేశించిందనడానికి కచ్చితమైన సాక్ష్యాధారాలున్నాయని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. డ్రోన్ శకలాలు ఇరాన్ ప్రాంతంలోని జలాల్లో కనిపించాయని తెలిపింది. ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రి మహమ్మద్ జావేద్ జరీఫ్ మాత్రం తాము యుద్ధం కోరుకోవడం లేదని, తమ గగనతలంలోకి, జలాల్లోకి ఎవరు ప్రవేశించినా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. -
కదన రంగంలో ‘ఏఐ’ రోబోలు
వాషింగ్టన్: భవిష్యత్‌లో యుద్ధ రంగంలో సైనికులకు సాయపడే రోబోల కోసం కృత్రిమ మేథ(ఏఐ) సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. కదనరంగంలో సైనికుడి మెదడు ప్రతిస్పందనల ఆధారంగా ఈ సాంకేతికతకు తుదిరూపు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై ఆర్మీ రీసెర్చ్ ల్యాబొరేటరీ(ఏఆర్ఎల్)కి చెందిన సీనియర్ న్యూరో సైంటిస్ట్ జీన్ వెటెల్ మాట్లాడుతూ.. ఓ సైనికుడి ప్రవర్తనను అంచనా వేసే సాంకేతికతల ఆధారంగా సమర్థవంతమైన బృందాన్ని తయారుచేయొచ్చని తెలిపారు. ఏఆర్ఎల్తో పాటు యూనివర్సిటీ ఆఫ్ బఫెలో శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. పరిశోధనలో భాగంగా వేర్వేరు పనులు చేసే సమయంలో ఓ సైనికుడి మెదడు పనితీరుతో పాటు అందులోని వేర్వేరు భాగాల మధ్య సమన్వయాన్ని అధ్యయనం చేశామని జీన్ అన్నారు. ‘మిలటరీ ఆపరేషన్లు చేపట్టినప్పుడు సైనికులు చాలా పనుల్ని ఏకకాలంలో చేయాల్సి ఉంటుంది. వేర్వేరు వర్గాల నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషించి, ఎదురయ్యే ముప్పుపై అప్రమత్తంగా ఉంటూ ముందుకు కదలాల్సి ఉంటుంది. అదే సమయంలో తోటి సైనిక బృందాలతో సమన్వయం చేసుకుంటూ చిన్నచిన్న బృందాలుగా సైనికులు ముందుకు సాగుతారు. ఇలా చేయాలంటే ప్రతీ సైనికుడు వేర్వేరు అంశాలపై చాలావేగంగా దృష్టిసారించాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగానే ఒక్కో పనికి మెదడులోని ఒక్కో భాగం ఉత్తేజితం అవుతూ ఉంటుంది’ అని జీన్ వివరించారు. నాడీతంతుల మ్యాపింగ్ పరిశోధన కోసం తాము 30 మంది సైనికులను ఎంపిక చేసుకున్నామని జీన్ తెలిపారు. ‘సాధారణంగా మెదడులోని నాడీకణాలను కలుపుతూ నాడీ తంతులు ఉంటాయి. వీటిని వైట్ మ్యాటర్‌గా వ్యవహరిస్తాం. మా పరిశోధనలో భాగంగా 30 మంది జవాన్ల మెదళ్లలోని వేర్వేరు భాగాలు ఈ నాడీ తంతుల సాయంతో ఎలా అనుసంధానమయ్యాయో మ్యాపింగ్ చేపట్టాం. ఒకవేళ మెదడులోని ఏదైనా ఓ భాగాన్ని ఉత్తేజితం చేస్తే ఏమవుతుందో ప్రత్యేకంగా రూపొందించిన కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా విశ్లేషించాం. అలాగే వేర్వేరు పనుల సందర్భంగా మెదడు సమన్వయంతో వ్యవహరించడాన్ని గుర్తించాం’ అని వెల్లడించారు. ఈ పరిశోధనలో సైనికుల మెదడు పనితీరును విడివిడిగానే విశ్లేషించామని పేర్కొన్నారు. ఒకవేళ కృత్రిమ మేథతో పనిచేసే రోబోలు, సైనికుల మధ్య సమన్వయాన్ని అధ్యయనం చేయగలిగితే నిజంగా అద్భుతంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. మెదడు పనితీరు డేటా ఆధారంగా ఓ సైనికుడు ఏ పని చేస్తున్నాడో విశ్లేషించవచ్చనీ, తద్వారా ఏఐతో పనిచేసే రోబోల సాయంతో వారికి పనిలో సాయపడొచ్చని జీన్ అభిప్రాయపడ్డారు. -
స్మార్ట్ ఫోన్లు వాడకుండా వారిని ఆపలేం..
సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక యుద్ధ తంత్రాల్లో సోషల్ మీడియా పాత్రను విస్మరించలేమని, సైనికులు వారి కుటుంబాలను స్మార్ట్ ఫోన్లు ఉపయోగించకుండా ఎవరూ ఆపలేరని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలని సైనికులను కోరాలని తమకు సూచనలు వచ్చాయని, స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండాలని సైనికులు, వారి కుటుంబాలను కోరగలమా అని ఆయన ప్రశ్నించారు. స్మార్ట్ ఫోన్‌ను అనుమతిస్తూనే క్రమశిక్షణను తీసుకురాగలగడం ముఖ్యమని ఆర్మీ చీఫ్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాను విస్మరించలేమని, సైనికులు దీన్ని వాడుకుంటారని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను సైనికులు అవకాశంగా మలుచుకోవాలని రావత్ సూచించారు. ఆధునిక కదనరంగంలో కృత్రిమ మేథను అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ సోషల్ మీడియా ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందిపుచ్చుకునే ఆలోచన చేయాలని కోరారు. -
మన జవాన్ల ప్రాణాలు ఎలా పోతున్నాయో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణంగా సరిహద్దులో జరిగే పరిణామాలతో సైనికులు ప్రాణాలు కోల్పోవటం తరచూ చూస్తున్నాం. అయితే యుద్ధం లేకపోయినా వందల సంఖ్యలో సైనికులు ప్రాణాలు వదులుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏటా సుమారు 1600 మందికి పైగా ఆర్మీ సిబ్బంది మృత్యువాత పడుతున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. ఇందుకు గల కారణాలను విశ్లేషిస్తే... ఒక్క రోడ్డు ప్రమాదాల ద్వారానే ఏడాదికి 350 మంది సైనికులు, నావికులు, ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆత్మహత్యల ద్వారా మరో 120 మంది, అనారోగ్య కారణాలతో మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా త్రిదళాలకు సంబంధించి మొత్తం 6,500 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది ఆర్మీకి చెందిన వారే ఉన్నారు. రాత్రిపూటలో ప్రయాణాల సమయంలో ప్రమాదాలు, తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకోవటం లాంటి కేసులే ఎక్కువగా నమోదు అయ్యాయి. ఇక ఈ ఏడాది 80 మంది పాక్, ఉగ్రవాద కవ్వింపు చర్యలకు బలికాగా, మిగతాకారణాలతో 1,480 మంది మరణించారు. అంటే 12 రేట్లు ఎక్కువగా ఆ మరణాలు చోటు చేసుకున్నాయన్న మాట. సైనికులను కోల్పోవటంపై ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు కూడా. ఇప్పటిదాకా జరిగిన యుద్ధాల్లో మృతి చెందిన సైనికుల లెక్క ఈ కింది విధంగా ఉంది.(టైమ్స్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో) -
...నీటిలోకి జారిపోయాం
యుద్ధ క్షేత్రం కశ్మీర్లో రాష్ట్రపతి పాలన కాలంలో గవర్నర్‌కు రక్షణాధికారి... వైష్ణోదేవి దర్శనానికి రోడ్డు వేయించడంలో కీలక పాత్రధారి... ఉగ్రవాదుల బారి నుంచి శరణార్థులను కాపాడిన వీరజవాను... అయిన బ్రిగేడియర్ డాక్టర్ వి.డి అబ్రహామ్ వృత్తిగత అనుభవాలు... అది 1995వ సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీ. మనదేశం నుంచి అంటార్కిటికా ఖండానికి 15వ అంటార్కిటికా సైంటిఫిక్ ఎక్స్‌పెడిషన్ ప్రారంభమైంది. ఆ బృందానికి జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన అరుణ్ చతుర్వేది నాయకత్వం వహించారు. నేను ఆ బృందానికి డిప్యూటీ లీడర్ని. గోవా తీరం నుంచి అరేబియా సముద్రంలో ప్రారంభమైన మా ప్రయాణం హిందూ మహాసముద్రం మీదుగా దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికా ఖండానికి మూడు వారాలకు చేరింది. అంటార్కిటికాలో సముద్రపు నీటి మీద కొన్ని చోట్ల మంచు దిబ్బలు ఏర్పడి నీటి మీద కదులుతూ ఉంటాయి. షిప్పులో రవాణా చేసిన పెట్రోల్, ఆహార పదార్థాలు, మందులు, పరిశోధన కోసం తీసుకెళ్లిన పరికరాలను మేము క్రేన్ సాయంతో షెల్ఫ్ ఐస్ (మంచు బల్లలాగ సమతలంగా ఉండే ప్రదేశం) మీదకు తరలిస్తున్నాం. ఇంతలో హఠాత్తుగా మేము ఉన్న చోట మంచు ఒక్కసారిగా సముద్రంపై కదిలిపోతోంది. నేను, నా సహోద్యోగి పి.ఎమ్. మీనా నీటిలోకి జారిపోయాం. ఆ ప్రమాదంలో మీనా మంచు పలక మీద నుంచి సముద్రపు నీటిలో మునిగిపోయాడు. నేను ఓడ అంచు పట్టుకున్నాను. షిప్పులో ఉన్న వాళ్లు పైనుంచి పెద్ద తాడు వదిలారు. నేనా తాడు పట్టుకోగానే, నన్ను పైకి లాగి రక్షించేందుకు ప్రయత్నించారు. సముద్రంలోకి దిగేందుకు తగినంత పొడవుగా తాడు వదలమని కోరి, ఎట్టకేలకు 90 అడుగుల లోతుకు వెళ్లి మీనాను రక్షించి పైకి తీసుకొచ్చాను. ఆ తర్వాత నా సాహసానికి మెచ్చిన మా బృందం నాయకుడు అరుణ్ చతుర్వేది ‘అశోక్ చక్ర’ పురస్కారానికి నా పేరు సూచించారు. కానీ అప్పట్లో నా సాహసానికి సంబంధించిన రుజువులను ప్రభుత్వానికి అందించే పరిస్థితి లేదు. 1995లో వెళ్లిన వాడిని 16 నెలల తర్వాత ఇండియాకు వచ్చాను. దాంతో ఆ పురస్కారాన్ని అందుకోలేకపోయాను. కానీ సైనికులకు ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఇచ్చే ‘సేనా మెడల్’ అందుకున్నాను. లెఫ్టినెంట్‌గా మొదలై... హైదరాబాద్‌లో పుట్టిన నేను.. మా నాన్న ఆర్మీ ఉద్యోగం కారణంగా దేశంలోని చాలా ప్రదేశాల్లో పెరిగాను. 1979లో రక్షణ రంగంలోకి వచ్చాను. భోపాల్‌లో లెఫ్టినెంట్‌గా ఉద్యోగ జీవితాన్ని మొదలు పెట్టి, 2013లో బ్రిగేడియర్‌గా రిటైరయ్యాను. ఎక్కువకాలం జమ్మూ- కశ్మీర్లో ఉద్యోగం చేశాను. రాష్ట్రపతి పాలన కాలంలో 1987 నుంచి గవర్నర్ జగ్మోహన్కి రక్షణాధికారిగా పనిచేశాను. వైష్ణోదేవి ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా పనిచేశాను. కశ్మీర్లో 1991లో ఉగ్రవాద కార్యకలాపాలు మొదలైనప్పుడు కశ్మీర్ పండిట్ల కోసం ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల నిర్వహణ బాధ్యతలు చూశాను. ఆ సేవలకు నేషనల్ అవార్డు అందుకున్నాను. తర్వాత అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో సేవలకు కూడా ఆర్మీ కమాండర్స్ కమెండేషన్తోపాటు సైంటిఫిక్ ఇంటర్వెన్షన్, ఇండిజినైజ్డ్ క్రయోజనిక్ కూలర్‌ను కనిపెట్టి మోటార్ గన్‌లో ఉపయోగించే విధానాన్ని అందుబాటులోకి తెచ్చినందుకు కమెండేషన్ కార్డ్.. అలా మొత్తం ఐదు మెడల్స్ అందుకున్నాను. నేను కనుక్కొన్న ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్‌ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి అవిశ్రాంతంగా... రక్షణరంగంలో చేరిన తర్వాత ఎంటెక్, సీడీఎమ్ఏ పరిజ్ఞానం మీద పీహెచ్డీ చేశాను. రిటైరయ్యాక ఇండోర్‌లోని ఓరియెంటల్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా బాధ్యతలు నిర్వర్తించి ఈ ఏడాది జనవరి 31న రిటైరయ్యాను. ప్రస్తుతం ఇండియన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీకి అధ్యక్షుడిని. మరికొన్ని సామాజిక కార్యకలాపాల్లో బిజీగా ఉన్నాను. - బ్రిగేడియర్ డాక్టర్ వి.డి. అబ్రహామ్ (విశ్రాంత సైనికాధికారి)