లెబనాన్‌ ఉక్కిరిబిక్కిరి.. ఇజ్రాయెల్‌ మెరుపు దాడులు | Israel Warplanes Hit Hezbollah Targets Southern Lebanon | Sakshi
Sakshi News home page

లెబనాన్‌ ఉక్కిరిబిక్కిరి.. ఇజ్రాయెల్‌ మెరుపు దాడులు

Sep 20 2024 8:27 AM | Updated on Sep 20 2024 9:55 AM

Israel Warplanes Hit Hezbollah Targets Southern Lebanon

ఇజ్రాయెల్‌, హిజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. హిజ్బుల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా హెచ్చరించిన మరుసటి రోజే ఇజ్రాయెల్‌ ప్రత్యక్ష దాడులకు దిగింది. రాకెట్‌ లాంచర్లతో విరుచుకుపడింది. మరోవైపు.. హిజ్బుల్లా నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ వెల్లడించింది.

పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్‌లో భయాకన వాతావరణం నెలకొంది. ఏ సమయంలో ఏం జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో హిజ్బుల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా గురువారం టెలివిజన్‌లో ప్రసంగించారు. పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో ఇజ్రాయెల్‌ హద్దు మీరిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. నస్రల్లా ప్రసంగిస్తున్న సమయంలోనే దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో విరుచుకుపడటం గమనార్హం. వందల సంఖ్యలో వార్‌హెడ్స్‌, రాకెట్లు హిజ్బుల్లా  స్థావరాలపైకి దూసుకెళ్లాయి. తాజా దాడిలో గాయపడిన, చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, అంతకుముందు హిజ్బుల్లా డ్రోన్‌ దాడులు చేసింది. ఇందులో ఇద్దరు ఇజ్రాయెల్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 

 

 

పేజర్లు, వాకీటాకీలపై నిషేధం
పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో అప్రమత్తమైన లెబనాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలు తీసుకుపోవడాన్ని నిషేధించింది. ఇక, లెబనాన్‌లో మంగళ, బుధవారాల్లో జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్లలో చనిపోయిన వారి సంఖ్య గురువారానికి 37కు పెరిగింది. దాదాపు మూడు వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 287 మంది పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. దీంతో, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌ రూటే వేరు.. ఆధారాలుండవ్‌.. అంతా సినీ ఫక్కీలో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement