![Hezbollah Warns Any Israeli Attacks On Civilians In Lebanon - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/19/Hezbollah.jpg.webp?itok=Vwse188o)
హమాస్‌ను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకరమైన దాడులను కొనసాగిస్తోంది. అయితే మరోవైపు లెబనాన్‌లోని పాలస్తీనా గ్రూప్‌లతో కూటమిగా ఉన్న హిజ్బుల్లాను కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. గత అక్టోబర్ 7 నుంచి హమాస్-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హిజ్బుల్లా సంస్థ, ఇజ్రాయెల్‌కు మధ్య కూడా కాల్పులు జరుగుతున్నాయి.
సోమవారం ఇజ్రాయెల్ సైన్యాన్ని హిజ్బుల్ సంస్థ తీవ్రంగా హెచ్చరించింది. సామాన్య ప్రజలపై దాడికి చేస్తే.. అంతకంతకు భారీ మూల్యం చెల్లించుకుంటారని తెలిపింది. అంత్యక్రియల సమయంలో సామన్య ప్రజలపై దాడులు చేస్తే పర్యావసానాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని మండిపడింది.
సోమవారం ఓ ఫైటర్ అంత్యక్రియలను హిజ్బుల్లా సంస్థ నిర్వహించింది. అయితే ఈ అంత్యక్రియల్లో పాల్గొనే సామాన్య జనాలే లక్ష్యంగా సమీపంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. ఇటువంటి సమయంలో సామాన్య ప్రజలపై దాడులకు దిగితే.. తాము కూడా అదే స్థాయిలో ప్రతికారం తీర్చుకుంటామని హిజ్బుల్లా సంస్థ.. ఇజ్రాయెల్ సైన్యాన్ని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment