ఇంకొన్ని అంశాల్లో స్పష్టత వచ్చాక అమలయ్యే చాన్స్
సూత్రప్రాయ అంగీకారం తెలిపిన నెతన్యాహూ
బీరూట్: ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల వెంట కాల్పుల మోత ఆగే సూచనలు కనిపిస్తున్నాయి. హమాస్‌కు అండగా ఇజ్రాయెల్‌తో పోరు జరుపుతున్న హెజ్‌బొల్లా మిలిటెంట్ గ్రూప్ వెనక్కి తగ్గే వీలుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో హెజ్‌బొల్లాకు కుదరబోతున్న కాల్పుల విరమణ ఒప్పందమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
కాల్పుల విరమణకు నెతన్యాహూ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇంకొన్ని కీలక అంశాలపై సంప్రదింపులు జరుగుతున్నాయని, అవి కొలిక్కి వచ్చాక అంగీకారం కుదురుతుందని తెలుస్తోందని సీఎన్‌ఎన్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. సూత్రప్రాయ అంగీకారం త్వరలో కుదరబోతోందని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి డేవిడ్ మెన్సర్ సోమవారం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment