ceasefire agreement
-
ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం!
బీరూట్: ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల వెంట కాల్పుల మోత ఆగే సూచనలు కనిపిస్తున్నాయి. హమాస్‌కు అండగా ఇజ్రాయెల్‌తో పోరు జరుపుతున్న హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ వెనక్కి తగ్గే వీలుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో హెజ్బొల్లాకు కుదరబోతున్న కాల్పుల విరమణ ఒప్పందమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాల్పుల విరమణకు నెతన్యాహూ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇంకొన్ని కీలక అంశాలపై సంప్రదింపులు జరుగుతున్నాయని, అవి కొలిక్కి వచ్చాక అంగీకారం కుదురుతుందని తెలుస్తోందని సీఎన్ఎన్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. సూత్రప్రాయ అంగీకారం త్వరలో కుదరబోతోందని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి డేవిడ్ మెన్సర్ సోమవారం చెప్పారు. -
యుద్ధానికి ముగింపు పలకాలి
ఫిలడెల్ఫియా: గాజా స్ట్రిప్‌లో దురాక్రమణకు దిగిన ఇజ్రాయెల్ ఇకనైనా మారణహోమం ఆపాలని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ సాయుధుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందమే గాజా్రస్టిప్ సమస్యకు అసలైన పరిష్కారమని ఆమె అభిప్రాయపడ్డారు. గాజాలోని ప్రతి ఒక్కరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కాల్పుల విరమణకు ఇరు పక్షాలు ముందుకు రావాలని ఆమె అభిలషించారు. ఫిలడెలి్ఫయాలో జరిగిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ (ఎన్ఏబీజే)సమావేశంలో కమల పాల్గొని ప్రసంగించారు. దాదాపు 45 నిమిషాలపాటు పలు అంశాలపై ఆమె మాట్లాడారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో బదులిచ్చారు. హైతీలు ఇంటి పెంపుడు జంతువులను తింటున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను, వలసదారులను సామూహిక బహిష్కరణ చేస్తామని ట్రంప్ ఇచి్చన హామీని హారిస్ తప్పుబట్టారు. ‘ట్రంప్ ద్వేషపూరిత వ్యాఖ్యలు హానికరం. ఇలాంటి వాటిని సహించకూడదు’అని అన్నారు. ఆర్థిక అంశాలపైనా ఆమె విస్తృతంగా మాట్లాడారు. ‘‘అమెరికన్లను ప్రభావితం చేసే పెద్ద సమస్యలలో సరిపడా గృహాలు లేకపోవడం కూడా ఒకటి. నేనుఅధ్యక్షురాలిగా ఎన్నికైతే గృహాల నిర్మాణానికి ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తా. చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ను 6,000 డాలర్లకు విస్తరిస్తాం. దీంతో అమెరికన్లు తమ ఆదాయంలో ఏడు శాతం కంటే ఎక్కువ మొత్తాలను పిల్లల సంరక్షణకు చెల్లించాల్సిన అవసరం లేదు’’అని కమల వ్యాఖ్యానించారు. కమలకు నల్లజాతీయుల బాసట 2020 అధ్యక్ష ఎన్నికల్లో నల్లజాతీయుల్లో ఏకంగా 92 శాతం మంది అప్పటి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతు పలికారు. రిపబ్లికన్ పార్టీ తరఫున నాటి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు కేవలం 8 శాతం మంది నల్లజాతీయులే మద్దతు పలికారు. ఈ సారిసైతం అదే సరళి కనిపిస్తోంది ఎన్ఏఏసీపీ సర్వే తేలి్చంది. ఇటీవల విడుదలైన ఎన్ఏఏసీపీ సర్వే ప్రకారం 63 శాతం మంది నల్లజాతి ఓటర్లు కమలా హారిస్‌కు మద్దతు పలికారు. గతంతో పోలిస్తే డెమొక్రటిక్ పార్టీ నుంచి నల్లజాతీయులు కాస్తంత దూరం జరిగారని చెప్పాలి. అయినప్పటికీ ఇప్పటికీ నల్లజాతీయుల మెజారిటీ మద్దతు కమలకే దక్కడం విశేషం. ఈసారీ పోటీలో నిలిచిన ట్రంప్‌కు కేవలం 13 శాతం మంది నల్లజాతీయులు మద్దతుగా నిలబడినట్లు సర్వే వెల్లడించింది. పెన్సిల్వేనియా, జార్జియా వంటి రాష్ట్రాల్లో నల్లజాతీయుల మద్దతు నిర్ణయాత్మకంగా ఉంటుంది. పెన్సిల్వేనియా అత్యంత కీలకమైన రాష్ట్రం. ఈ రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యం ఎన్ఏబీజేకు ఉందని చెబుతారు. దీంతో వీరిని ఎలాగైనా తమ వైపునకు తిప్పుకోవాలని కమలా హారిస్, ట్రంప్ ఇద్దరూ చెమటోడుస్తున్నారు. అయితే గతంలో ట్రంప్ చేసిన జాత్యాహంకార వ్యాఖ్యల కారణంగా ఇప్పటికీ నల్లజాతీయుల మద్దతు కూడగట్టడం ఆయనకు సంక్లిష్టంగా తయారైంది. జార్జియాలో మూడు వంతుల మంది నల్లజాతీయులే కావడంతో ఇక్కడా వారి ఓటు నిర్ణయాత్మకంగా మారింది. -
Israel-Hamas war: కాల్పుల విరమణకు హమాస్ ఓకే!
జెరూసలెం: ఈజిప్టు– ఖతార్ ప్రతిపాదించిన యుద్ధ విరమణ ప్రతిపాదనను తాము ఆమోదించామని హమాస్ సోమవారం ప్రకటించింది. గాజాలో ఏడు నెలలుగా హమాస్– ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమ అగ్రనేత ఇస్మాయిల్ హనియే కాల్పుల విరమణకు తాము అంగీకరిస్తున్నామనే విషయాన్ని ఖతారు ప్రధాని, ఈజిప్టు ఇంటలిజెన్స్ మినిస్టర్లకు తెలియజేశారని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి యుద్ధ విరమణ, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి మళ్లడం లాంటివి ఈ శాంతి ప్రతిపాదనలో ఉన్నాయో, లేదోననే విషయంపై స్పష్టత లేదు. లక్ష మంది పాలస్తీనియన్లు రఫా నగరం నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హకుం జారీచేసిన కొద్ది గంటల్లోనే హమాస్ ప్రకటన వెలువడటం గమనార్హం. హమాస్ నుంచి ఈ ప్రకటన వెలువడగానే రఫాలోని శిబిరాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనియన్లు ఆనందోత్సాహాన్ని వెలిబుచ్చారు. రఫాపై ఇజ్రాయెల్ దాడి ముప్పు తప్పినట్లేనని వారు భావిస్తున్నారు. అయితే హమాస్ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. -
Israel-Hamas War: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ
ఐక్యరాజ్యసమితి: ఇజ్రాయెల్–హమాస్ మధ్య వివాదం మొదలైన అయిదు నెలల తర్వాత సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత రంజాన్ మాసంలో గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని సంబంధిత వర్గాలను కోరుతూ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. 15 సభ్యదేశాలతో కూడిన మండలిలోని 10 తాత్కాలిక సభ్యదేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రష్యా, చైనా సహా 14 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఎవరూ వ్యతిరేకించనప్పటికీ శాశ్వత సభ్యదేశం అమెరికా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. ‘గాజా విషయంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తీర్మానాన్ని భద్రతా మండలి ఆమోదించింది. తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బేషరతుగా బందీలందరినీ విడుదల చేయాలని కోరింది’అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ‘ఎక్స్’లో తెలిపారు. అలాగే, గాజాలో చిక్కుకున్న పాలస్తీనియన్ల వైద్య, ఇతర మానవతా అవసరాలను పరిష్కరించాలని, నిర్బంధించిన వారందరికీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత వర్గాలపై ఉందని తీర్మానం పేర్కొంది. ‘ఈ తీర్మానాన్ని కచి్చతంగా అమలు చేయాల్సిందే. వైఫల్యం క్షమించరానిది’ అంటూ అని గుటెరస్ వ్యాఖ్యానించారు. మండలి తీర్మానంపై ఇజ్రాయెల్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఐరాస హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ ల్యూయిస్ పేర్కొన్నారు. పాలస్తీనా ప్రజల ఆకలిచావులను ఆపేందుకు మానవతా సాయం అందించేందుకు వీలు కల్పించాలని, చట్ట విరుద్ధ దాడులను ఆపాలని ఇజ్రాయెల్‌ను కోరారు. అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న నెతన్యాహు ఐరాస తీర్మానానికి నిరసనగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్నత స్థాయి బృందంతో తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీకి సహకారం నిలిపివేయాలని కూడా ఇజ్రాయెల్ నిర్ణయించింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేయడం, ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్ తీవ్రస్థాయి యుద్ధంతో విరుచుకుపడుతుంటం తెలిసిందే. -
తక్షణమే కాల్పుల విరమణకు కమలా హారిస్ పిలుపు
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. యుద్ధం కారణంతో గాజాలో తీవ్ర ఆహార కోరత ఏర్పడింది. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పందిస్తూ.. తక్షణమే గాజాలో కాల్పుల విరమణ చేపట్టాలని ఇజ్రాయెల్‌కు పిలుపునిచ్చింది. పాలస్తీనాలోని ప్రజలు అమానవీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని.. మానవతా సాయం పెంచాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు. అలబామాలోని సెల్మాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కమలా హారిస్.. ‘గాజాలోని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అక్కడి పరిస్థితులు అమానవీయంగా ఉన్నాయి. మానవత్వం మమ్మల్ని చర్య తీసుకోవడానికి బలవంతం చేస్తోంది. గాజాలోని ప్రజలకు సహయం పెంచడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం కృషి చేయాలి’ అని కమలా హారిస్ అన్నారు. ‘హమాస్ కాల్పుల విరమణను కోరుకుంటుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ ఒప్పుకోవడానికి సిద్ధం ఉంది. కాల్పుల విరమణ డీల్ చేసుకోండి. బంధీలను వారి కుటుంబాలకు వద్దకు చేర్చండి. అదేవిధంగా వెంటనే గాజా ప్రజలకు కూడా శాంతి, సాయం అందించండి’ అని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తెలిపారు. ఇక.. తమ వద్ద సజీవంగా ఉన్న ఇజ్రాయెల్ బంధీల పేర్లు వెల్లడించడానికి హమాస్ తిరస్కరించినట్లు ఇజ్రాయెల్ స్థానిక మీడియా పేర్కొంటోంది. ఆదివారం కైరోలో జరిగిన గాజా కాల్పుల విరమణ చర్చలను ఇజ్రాయెల్ బాయ్‌కాట్ చేయటం గమనార్హం. -
కాల్పుల విరమణపై తీర్మానం..అమెరికా వీటో!
న్యూయార్క్: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి రావాలంటూ శుక్రవారం ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా మోకాలడ్డింది యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బందీలను హమాస్ మిలిటెంట్లు బేషరతుగా వెంటనే విడిచిపెట్టాలంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేసిన ప్రతిపాదనకు ఐరాసలోని 90 సభ్యదేశాలు మద్దతు పలికాయి. ఆ దేశం మండలిలో ప్రవేశపెట్టిన ఆ తీర్మానానికి మొత్తం 15 దేశాలకు గాను 13 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటేశారు. మరో శాశ్వత సభ్యదేశం బ్రిటన్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. గాజాలో మానవతా సంక్షోభ నివారణ నిమిత్తం ఇటీవల ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ అసాధారణ అధికారాన్ని ఉపయోగించారు. తక్షణమే మానవతా కోణంలో కాల్పుల విరమణ జరగాలని, పౌరుల రక్షణ కోసం, అత్యవసర సాయం అందజేయడానికి అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలని మండలి దేశాలకు గుటెరస్ పిలుపునిచ్చారు. యూఎన్ ఛార్టర్‌లోని ఆర్టికల్ 99 కింద ప్రత్యేక అధికారంతో అంతర్జాతీయంగా ఆందోళనలను కలిగించే పరిస్థితుల్లో భద్రతా మండలిని సమావేశ పరచవచ్చు. దీనిలో భాగంగా సమావేశమైన మండలిలో యూఏఈ తీర్మానంపై ఓటింగ్ జరిగింది. మండలిలో శాశ్వత సభ్య దేశమైన అమెరికా తన వీటో అధికారంతో ఆ తీర్మానాన్ని అడ్డుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అది హమాస్ పుంజుకునేందుకు ఉపయోగపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ దేశ ప్రతినిధి రాబర్ట్ వుడ్ మండలిలో మాట్లాడుతూ.. ‘ఈ తీర్మానం వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం ఉండదు. ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజలు శాంతి, భద్రతల మధ్య జీవించాలని అమెరికా బలంగా కోరుకుంటోంది. అయితే, అస్థిరమైన కాల్పుల విరమణకు అంగీకరిస్తే హమాస్ మరో యుద్ధానికి ప్రణాళిక రచిస్తుంది’అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముసాయిదాలో సవరణలు చేయాలని అమెరికా అంటోంది. మండలిలో తీర్మానాన్ని అమెరికా అడ్డుకోవడంపై యూఏఈ రాయబారి మహ్మద్ అబుషాహబ్ విచారం వ్యక్తం చేశారు. -
Israel-Hamas war: ఇజ్రాయెల్–హమాస్ ఒప్పందం పొడిగింపు
గాజా్రస్టిప్/జెరూసలేం: కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరొక రోజు పొడిగించేందుకు ఇజ్రాయెల్–హమాస్ గురువారం అంగీక రించాయి. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగిసింది. బందీలంతా ఇంకా విడుదల కాకపోవడం, గాజాలోని పాలస్తీనియన్లకు మరింత మానవతా సాయం అందాల్సి ఉండడంతో ఒప్పందం పొడిగింపునకే ఇరుపక్షాలు మొగ్గుచూపాయి. గాజాలోని శాంతి కోసం ఇజ్రాయెల్, హమాస్‌పై అంతర్జాతీయ సమా జం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం రాత్రి ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణలకు తెరదించే దిశగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నట్లు తెలిసింది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ మిలిటెంట్లు ఇప్పటిదాకా 73 మంది ఇజ్రాయెలీలను, 24 మంది ఇతర దేశస్తులను విడుదల చేశారు. ఇంకా 126 మంది హమాస్ చెరలో బందీలుగా ఉన్నట్లు అంచనా. జెరూసలేంలో కాల్పులు.. ముగ్గురి మృతి జెరూసలేంలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. బుధవారం ఉదయం 7.40 గంటలకు వీచ్మ్యాన్ వీధిలో బస్‌స్టాప్‌లో నిల్చున్న ప్రయాణికులపై ఇద్దరు సాయుధ పాలస్తీనియన్ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఇజ్రాయెలీలు మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండుగులు హతమయ్యారు. వారిద్దరూ తూర్పు జెరూసలేంకు చెందిన సోదరులని తెలిసింది. గతంలో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొని జైలుకు వెళ్లొచ్చారు. -
‘విరమణ’ మరో రెండు రోజులు
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య కుదిరిన నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం సోమవారం ముగిసింది. ఒప్పందంలో భాగంగా మిలిటెంట్లు ఇప్పటిదాకా మూడు విడతల్లో మొత్తం 58 మంది బందీలను విడుదల చేశారు. ఇజ్రాయెల్ అధికారులు 117 మంది పాలస్తీనియన్ ఖైదీలను జైలు నుంచి విడిచిపెట్టారు. నాలుగో విడత కింద స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి తర్వాత మరికొంత మంది బందీలను హమాస్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. దీనిపై సంబంధిత బందీల కుటుంబ సభ్యులకు ఇజ్రాయెల్ అధికారులు సమాచారం ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో రెండు రోజులపాటు పొడిగించడానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయని ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సోమవారం వెల్లడించారు. ఒప్పందం పొడిగింపు అమల్లో ఉన్నన్ని రోజులు నిత్యం అదనంగా 10 మంది చొప్పున బందీలను హమాస్ వదిలేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇరుపక్షాలు ముందుగానే ఒక అవగాహనకు వచ్చాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే విషయంలో ఈజిప్టు, ఖతార్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నాయి. ఇజ్రాయెల్‌లో ఎలాన్ మస్క్ పర్యటన సోషల్ మీడియాలో యూదు వ్యతిరేక పోస్టులు పెట్టి విమర్శల పాలైన ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ సోమవారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. అక్టోబర్ 7న హమాస్ దాడిలో ధ్వంసమైన కిబుట్జ్ పట్టణాన్ని దర్శించారు. అక్కడి పరిస్థితిన పరిశీలించారు. ఈ సందర్భంగా మస్క్ వెంట ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఉన్నారు. -
Israel-Hamas war: మరో 17 మంది బందీల విడుదల
గాజా్రస్టిప్: ఇజ్రాయెల్–హమాస్ గ్రూప్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలు విషయంలో సందిగ్ధత వీడింది. ఒప్పందానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉంటున్నాయి. మూడో విడత కింద ఆదివారం మరో 17 మంది బందీలకు హమాస్ విముక్తి కలిగించింది. వీరిలో 14 మంది ఇజ్రాయెలీలు, ముగ్గురు విదేశీయులు ఉన్నారు. అలాగే 39 మంది పాలస్తీనియన్ ఖైదీలను ఇజ్రాయెల్ అధికారులు విడుదల చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ హమాస్ మిలిటెంట్లు శనివారం బందీలను విడుదల చేయడానికి నిరాకరించారు. ఒప్పందం అమలుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఒప్పందం యథాతథంగా అమలవుతున్నట్లు కొన్ని గంటల తర్వాత తేటతెల్లమయ్యింది. శనివారం బందీల్లోని 13 మంది ఇజ్రాయెలీలను, నలుగురు థాయ్‌లాండ్ జాతీయులను హమాస్ విడుదల చేసింది. వీరిలో నాలుగేళ్ల అమెరికన్–ఇజ్రాయెలీ చిన్నారి అబిగైల్ ఎడాన్ కూడా ఉంది. ఆమె తల్లిదండ్రులను అక్టోబర్ 7న మిలిటెంట్లు హత్య చేశారు. అమెరికా బందీలంతా సైతం అతిత్వరలో విడుదలవుతారని ఆశిస్తున్నామని శ్వేతసౌధం జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ చెప్పారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై అనూహ్యంగా దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 240 మందిని బందీలుగా మార్చి, గాజాకు తరలించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్–హమాస్ మధ్య నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇప్పటిదాకా మూడు విడతల్లో మొత్తం 58 మంది బందీలకు హమాస్ స్వేచ్ఛ కలి్పంచింది. నాలుగో విడత కింద సోమవారం మరికొంత మంది విడుదల కానున్నారు. మరోవైపు శనివారం రాత్రి ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులో ఇజ్రాయెల్ దాడుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ సీనియర్ కమాండర్ హతం ఇజ్రాయెల్ దాడిలో హమాస్ సీనియర్ కమాండర్ అహ్మద్ అల్–ఘందౌర్(56) మృతి చెందాడు. ఈ విషయాన్ని హమాస్ ఆదివారం స్వయంగా ప్రకటించింది. అయితే, ఈ దాడి ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న సంగతి బయటపెట్టలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా మరణించిన హమాస్ కమాండర్లలో అహ్మద్ అల్–ఘందౌర్ అత్యంత పెద్ద హోదా ఉన్న నేత కావడం గమనార్హం. ఉత్తర గాజాలో హమాస్ గ్రూప్‌నకు నాయకత్వం వహిస్తున్నాడు. హమాస్ సాయుధ విభాగంలో హై–ర్యాకింగ్ కలిగి ఉన్నాడు. 2002నుంచి ఇజ్రాయెల్ సైన్యం సాగించిన హత్యాయత్నాల నుంచి మూడుసార్లు తప్పించుకున్నాడు. -
Israel-Hamas war: 24 మంది బందీలకు స్వేచ్ఛ
గాజా స్ట్రిప్/జెరూసలేం: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గాజా స్ట్రిప్‌లో శుక్రవారం భూతల, వైమానిక దాడులు ఆగిపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పేరుగాంచిన గాజాలో ఏడు వారాల తర్వాత ప్రశాంత వాతావరణం కనిపించింది. పాలస్తీనియన్ల ఎదురు చూపులు ఫలిస్తున్నాయి. విదేశాల నుంచి పెద్ద ఎత్తున మానవతా సాయం, ఇంధనం గాజాకు చేరుకుంటోంది. అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాల చొరవతో ఇజ్రాయెల్–హమాస్ మధ్య కుదిరిన సంధి శుక్రవారం ఉదయం నుంచే అమల్లోకి వచి్చంది. తాత్కాలిక కాల్పుల విరమణ నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ఒప్పందం మేరకు హమాస్ చెరలోని బందీల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటిరోజు 13 మంది ఇజ్రాయెలీ బందీలకు హమాస్ మిలిటెంట్లు స్వేచ్ఛావాయువులు ప్రసాదించారు. వీరిలో ఆరుగురు వృద్ధులు, నలుగురు పిల్లలున్నారు. వారిని రెడ్‌క్రాస్ సంస్థకు అప్పగించారు. మొత్తం 24 మంది బందీలను హమాస్ విడిచిపెట్టిందని, వారిని 4 వాహనాల్లో ఈజిప్టుకు చేర్చామని రెడ్‌క్రాస్ వెల్లడించింది. వీరిలో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, 10 మంది థాయ్‌లాండ్ పౌరులు, ఒకరు ఫిలిప్పైన్స్ పౌరుడున్నట్టు ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. విడుదలైన బందీలంతా ఆరోగ్యంగానే కనిపిస్తున్నారని ఇజ్రాయెల్ వైద్య శాఖ తెలియజేసింది. హమాస్ డిమాండ్‌ను నెరవేరుస్తూ ఇజ్రాయెల్ కూడా మొదటి దశలో 39 పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిందని సమాచారం. వీరిలో 24 మంది మహిళలు కాగా 15 మంది చిన్నారులు. వారిని తీసుకుని వాహనాలు వెస్ట్ బ్యాంక్‌లోని జైళ్ల నుంచి రమల్లాకు బయల్దేరాయి. నాలుగు రోజుల వ్యవధిలో 50 మంది బందీలకు హమాస్ విముక్తి కల్పించాల్సి ఉంది. అలాగే 150 మంది ఖైదీలను జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విడిచిపెట్టాలి. ప్రస్తుతం 7,200 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్నారు. ‘ఉత్తరాది వలస’లపై కాల్పులు.. ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులు ఆగిపోవడంతో దక్షిణ గాజా నుంచి జనం ఉత్తర గాజాకు కాలినడకన తిరిగివస్తున్నారు. వారిని ఎక్కడికక్కడ అడ్డుకొనేందుకు ఇజ్రాయెల్ సైన్యం ప్రయతి్నస్తోంది. శుక్రవారం పలుచోట్ల వారిపై కాల్పులు జరిపింది. ఎవరూ వెనక్కి వెళ్లొద్దంటూ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారని, 11 మంది గాయపడ్డారని స్థానిక మీడియా తెలియజేసింది. అక్టోబర్ 7న గాజాపై దాడులు మొదలైన తర్వాత ఇజ్రాయెల్ హెచ్చరికల వల్ల ఉత్తర గాజా నుంచి లక్షలాది మంది ప్రాణభయంతో దక్షిణ గాజాకు వలసవెళ్లారు. వారంతా స్వస్థలాలకు తిరిగి రావాలని భావిస్తున్నారు. గాజాకు 1.30 లక్షల లీటర్ల డీజిల్ కాల్పుల విరమణ, బందీల విడుదల ప్రక్రియ ప్రారంభం కావడంతో గాజాకు మానవతా సాయం చేరవేతలోనూ వేగం పెరిగింది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలు, వైద్య పరికరాలు, దుస్తులు తదితర సామగ్రితో దాదాపు 90 వాహనాలు శుక్రవారం ఈజిప్టు నుంచి రఫా క్రాసింగ్ గుండా గాజాలోకి ప్రవేశించాయి. అలాగే 1.30 లక్షల లీటర్ల డీజిల్ కూడా గాజాకు అందింది. డీజిల్ లేక, జనరేటర్లు పనిచేయక గాజా ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఇప్పటికే నిలిచిపోయాయి. కాల్పుల విరమణ అమల్లో ఉన్న నాలుగు రోజుల్లో రోజుకు 1.30 లక్షల లీటర్ల డీజిల్‌ను గాజాకు సరఫరా చేయడానికి ఇజ్రాయెల్ అనుమతి ఇచి్చంది. వాస్తవానికి గాజాకు నిత్యం 10 లక్షల లీటర్ల డీజిల్ అవసరం. కాల్పుల విరమణ పొడగిస్తారా ? ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కేవలం నాలుగు రోజులపాటే అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కూడా ఒప్పందాన్ని పొడిగిస్తారని సమాచారం. హమాస్ చెరలో 240 మంది బందీలు ఉన్నారు. వారందరినీ విడుదల చేయించాలంటే నాలుగు రోజుల సమయం సరిపోదు. అందుకే ఒప్పందం పొడిగింపునకు ఇజ్రాయెల్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. -
Israel-Hamas war: నేటి నుంచే కాల్పుల విరమణ!
ఖాన్ యూనిస్: గాజాలో నాలుగు రోజులపాటు కాల్పుల విరమణ, దాదాపు 50 మంది బందీలకు విముక్తి, ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీనా ఫైటర్ల విడుదలపై ఇజ్రాయెల్–హమాస్ మధ్య కుదిరిన ఒప్పందం ఒక్కరోజు ఆలస్యంగా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. ఖతార్ ఈ విషయాన్ని గురువారం ప్రకటించింది. తొలుత 13 మంది బందీలు విడుదలవుతారని తెలియజేసింది. వాస్తవానికి గురువారం ఉదయం నుంచే ఈ ఒప్పందం అమలు కావాలి. చివరి క్షణంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. కాల్పుల విరమణకు, బందీల విడుదలకు తగిన సానుకూల పరిస్థితులను సృష్టించే పనిలో మధ్యవర్తులు నిమగ్నమయ్యారని ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాజిద్ అల్–అన్సారీ వివరించారు. ఈ కార్యాచరణ దాదాపు పూర్తయినట్లు తెలిపారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఒప్పందం కుదిర్చే విషయంలో ఖతార్ అత్యంత కీలకంగా వ్యవహరించింది. గాజాలో హమాస్ చెరలో ఉన్న తమ ఆప్తుల విడుదల కోసం బందీల కుటుంబ సభ్యులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తమ దేశంలోని జైళ్ల నుంచి విడుదల కావడానికి అర్హతలు కలిగిన 300 మంది పాలస్తీనా ఖైదీల జాబితాను ఇజ్రాయెల్ న్యాయ శాఖ బహిర్గతం చేసింది. వీరిలో చాలామంది యువకులే ఉన్నారు. గత ఏడాది కాలంలో వీరంతా అరెస్టయ్యారు. రాళ్లు విసరడం, చిన్నచిన్న నేరాలకు పాల్పడడం వంటి కారణాలతో ఇజ్రాయెల్ పోలీసులు వీరిని అరెస్టు చేశారు. 50 మంది బందీలను హమాస్ విడుదల చేస్తే, ఒప్పందం ప్రకారం 150 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేయాల్సి ఉంటుంది. అల్–షిఫా డైరెక్టర్, డాక్టర్ల అరెస్టు గాజాలోని అల్–షిఫా హాస్పిటల్ డైరెక్టర్ మొహమ్మద్ అబూ సాల్మియాతోపాటు ఇద్దరు సీనియర్ డాక్టర్లను ఇజ్రాయెల్ సైన్యం అరెస్టు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన వాహనాల్లో రోగులతోపాటు ప్రయాణిస్తుండగా సైన్యం వారిని అడ్డుకొని, అదుపులోకి తీసుకున్నట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అల్–షిఫా హాస్పిటల్ డైరెక్టర్, వైద్యులను ఇజ్రాయెల్ సైన్యం అరెస్టు చేయడాన్ని హమాస్ తీవ్రంగా ఖండించింది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అల్–షిఫా కింద హమాస్ సొరంగం, బంకర్లు గాజా స్ట్రిప్‌లో అతిపెద్దదైన అల్–షిఫా హాస్పిటల్ కింది భాగంలో భారీ సొరంగంలో హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఉందని ఇజ్రాయెల్ సైన్యం పదేపదే చెబుతోంది. ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాన్ని సైన్యం తాజాగా బయటపెట్టింది. విదేశీ జర్నలిస్టుల బృందాన్ని హమాస్ సొరంగంలోకి తీసుకెళ్లి, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూపించింది. రాళ్లతో నిర్మించిన ఈ సొరంగం 150 మీటర్ల పొడవు ఉంది. అల్–షిఫా కింద అండర్‌గ్రౌండ్ బంకర్లను కలుపుతూ దీన్ని నిర్మించారు. సొరంగం చివర వసతి గృహం లాంటిది కనిపిస్తోంది. ఏసీ, వంటగది, బాత్రూమ్, రెండు ఇనుప మంచాలు ఉన్నాయి. గచ్చుపై తెల్లటి టైల్స్ పరిచారు. ఈ టన్నెల్ చాలా రోజులు ఉపయోగంలో లేనట్లు దుమ్ముధూళితో నిండిపోయి ఉంది. అల్–షిఫా కిందనున్న హమాస్ సొరంగం దృశ్యాలను ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. గాజాలోని ఆసుపత్రులను హమాస్ మిలిటెంట్లు ప్రధాన స్థావరాలుగా మార్చుకున్నారని, వాటి కింది భాగంలో సొరంగాలు, బంకర్లు నిర్మించుకున్నారని, ఆయుధాలు నిల్వ చేశారని, అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆసుపత్రులపై గురిపెట్టి వైమానిక దాడులు కొనసాగిస్తోంది. అయితే, ఇజ్రాయెల్ ఆరోపణలను హమాస్ ఖండిస్తోంది. -
Israel-Hamas war: కాల్పులకు విరామం
జెరూసలేం/ఐరాస: తాత్కాలికంగానైనా ప్రార్థనలు ఫలించాయి. ప్రపంచ దేశాల విన్నపాలు ఫలితమిచ్చాయి. తీవ్ర ప్రతీకారేచ్ఛతో గాజాపై ఆరు వారాలుగా వైమానిక, భూతల దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఓ మెట్టు దిగొచి్చంది. అంతర్జాతీయ సమాజం విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ‘‘ఇజ్రాయెల్ నాలుగు రోజుల పాటు కాల్పులను పూర్తిగా నిలిపేస్తుంది. బదులుగా హమాస్ తన చెరలో ఉన్న 240 మంది పై చిలుకు బందీల్లో 50 మందిని విడిచిపెడుతుంది’’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం పేర్కొంది. బందీలందరినీ విడిపించేందుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. ఒప్పందంలో భాగంగా తమ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్టు సమాచారం. హమాస్ చెర నుంచి బయట పడేవారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే ఉంటారని చెబుతున్నారు. ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా మహిళలు, పిల్లలను విడిచి పెట్టనుందని ఖతర్ వెల్లడించింది. ఈజిప్టు, అమెరికాతో పాటు ఖతర్ కూడా ఇరు వర్గాల చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించడం తెలిసిందే. నిత్యావసరాలతో సహా సర్వం నిండుకుని మానవీయ సంక్షోభంతో అల్లాడిపోతున్న గాజాకు ఈ నాలుగు రోజుల్లో అదనపు సాయాన్ని అనుమతించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్టు ఖతర్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒప్పందం మలి దశలో భాగంగా మున్ముందు ఇరువైపుల నుంచి మరింత మంది బందీలు విడుదలవుతారని చెప్పుకొచి్చంది. కాల్పుల విరమణ గురువారం ఉదయం పదింటి నుంచి అమల్లోకి రానుంది. యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కుండబద్దలు కొట్టారు! నాలుగు రోజుల విరామం ముగియగానే గాజాపై దాడులు పునఃప్రారంభం అవుతాయని ఆయన స్పష్టం చేశారు. ‘‘మేం ముట్టడిలో ఉన్నాం. హమాస్‌ను నిర్మూలించి మా లక్ష్యాలన్నింటినీ సాధించేదాకా యుద్ధాన్ని కొనసాగించి తీరతాం’’ అని ప్రకటించారు. దీర్ఘకాలిక యుద్ధానికి సైన్యం మరింతగా సన్నద్ధమయ్యేందుకు విరామం ఉపయోగపడుతుంది తప్ప సైనికుల స్థైర్యాన్ని తగ్గించబోదని ఆయన అన్నారు. అయితే హమాస్ చెరలోని బందీల్లో ప్రతి 10 మంది విడుదలకు ప్రతిగా కాల్పుల విరామాన్ని ఒక రోజు చొప్పున పెంచేందుకు ఇజ్రాయెల్ సమ్మతించింది. కాల్పుల విరమణను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలు దేశాధినేతలు స్వాగతించారు. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ ఇస్లామిక్ మిలిటెంట్లు మెరుపు దాడికి దిగడం తెలిసిందే. 1,200 మందికి పైగా ఇజ్రాయెలీలను హతమార్చడంతో పాటు 240 మందికి పైగా బందీలుగా గాజాకు తరలించారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగి గాజాపై ఆరు వారాలుగా క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తోంది. ఏం జరగనుంది... ► ఇజ్రాయెల్, హమాస్ రెండూ నాలుగు రోజుల పాటు కాల్పులను పూర్తిగా నిలిపేస్తాయి. ►ముందు తమ వద్ద ఉన్న బందీల్లోంచి 50 మంది మహిళలు, చిన్నారులను రోజుకు 12 మంది చొప్పున హమాస్ విడుదల చేస్తుంది. ►అనంతరం ఇజ్రాయెల్ కూడా తన జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లను విడుదల చేస్తుందని ఖతర్ ప్రకటించింది. ►బహుశా గురువారమే బందీల విడుదల ప్రక్రియ మొదలవ్వొచ్చని వైట్‌హౌస్ అభిప్రాయపడింది. ►ఈ నాలుగు రోజుల్లో గాజాకు అదనపు మానవీయ సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతిస్తుంది. ఇప్పట్లో మళ్లీ కాల్పులుండనట్టే...! విరామానికి స్వస్తి చెప్పి ఇజ్రాయెల్ ఇప్పట్లో గాజాపై మళ్లీ దాడులకు దిగడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘‘50 మంది బందీలు విడుదలైతే మిగతా వారినీ విడిపించాలంటూ కుటుంబీకుల నుంచి ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. అందులోనూ హమాస్ తన చెరలో ఉన్న సైనికులను చిట్టచివరన గానీ వదిలిపెట్టదు. అప్పటిదాకా దాడులు మొదలు పెట్టేందుకు వారి కుటుంబాలు ఒప్పుకోకపోవచ్చు’’ అని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో హమాస్ దీన్ని తమ విజయంగా చెప్పుకుంటే అది నెతన్యాహూ సర్కారుకు ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. మరోవైపు, గాజాపై ఇజ్రాయెల్ దాడులు బుధవారం కూడా తీవ్ర స్థాయిలో కొనసాగాయి. ఉత్తర గాజాలో జబాలియా శరణార్థి శిబిరం బాంబు దాడులతో దద్దరిల్లింది. హమాస్ కూడా రోజంతా ఇజ్రాయెల్‌పైకి రాకెట్ దాడులు కొనసాగించింది. -
ఇమ్రాన్‌పై ప్రశ్నల వర్షం.. పిల్లల ప్రాణాలు తీసేవారితో చర్చలా?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తాలిబన్ల పార్టీ అయిన తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)తో పాక్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న ఒక్కరోజు తర్వాత ఆ సంస్థ చేసిన ఊచకోతపై ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2014లో ఆర్మీ ఆధ్వర్యంలో నడిచే స్కూలుపై ఈ ఉగ్రసంస్థ జరిపిన హేయమైన దాడిలో 150 మంది మరణించారు. ఈ ఘటనకు సంబంధించి ఇమ్రాన్ బుధవారం సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు ఇమ్రాన్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. చిన్నారుల ప్రాణాలను బలి తీసుకున్న వారికి మీరు మోకరిల్లుతారా అని ప్రశ్నించింది. ‘మీరు అధికారంలో ఉన్నారు. ఏం చేస్తున్నారు ? ఆ దోషులతో తీరిగ్గా చర్చలు జరుపుతున్నారు’ అని సీజే అహ్మద్ ప్రధానిని నిలదీశారు. ఆనాడు తాము అధికారంలో లేమని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కింద ఆర్థికసాయం చేశామని ఇమ్రాన్ బదులిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రుల గాయాలపై కారం రాసినట్టుగా ప్రధాని మాటలు ఉన్నాయంటూ ప్రధాన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
శాంతికి బాటలు పడాలి
దాదాపు 12 రోజుల దారుణ మారణ హోమం ముగిసింది. ఎప్పటిలాగే ఈజిప్టు చొరవతో ఇజ్రాయెల్–హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దాడులు మొదలైన ప్పుడు ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ చేసుకునే హక్కుందంటూ వెనకేసుకురావడమే కాక, భద్రతా మండలిలో దానికి అండగా నిలిచిన అమెరికా చివరకు వైఖరి మార్చుకుని తెరవెనక పావులు కదిపి ఈ కాల్పుల విరమణ ఒప్పందం సాకారమయ్యేలా చూసింది. కానీ ఈలోగా గాజా స్ట్రిప్‌లో 230మంది పౌరులు బలయ్యారు. 1,700మంది గాయపడ్డారు. రెండు వేలకుపైగా భవంతులు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. పసిపిల్లల నుంచి పండుటాకుల వరకూ ఎందరినో పోగొట్టుకుని, ఆప్తుల్లో అనేకులు ఆసుపత్రుల పాలై విలపించే కుటుంబాలకు లెక్కలేదు. ఎటు చూసినా ఘర్ష ణలు మిగిల్చిన విధ్వంసమే. మొత్తం 60,000 మంది పౌరులు ఇళ్లూ వాకిళ్లూ వదిలి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాల్సివచ్చింది. పాలస్తీనాలో ఎన్నో దశాబ్దాలుగా ఈ దృశ్యాలు పున రావృతమవుతూనే వున్నాయి. తాను ‘ఉగ్రవాద సంస్థల’ నేతల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నానని, వారి సైనిక సంపత్తిని దెబ్బతీస్తున్నానని ఇజ్రాయెల్ చెబుతూ వుంటుంది. అయితే గతంతో పోలిస్తే ప్రతిఘటన పెరిగింది. ఈసారి హమాస్ దాడులకు ఇజ్రాయెల్‌లో ఒక భారతీయ యువతితోసహా 12మంది మరణించారు. ఎవరు ప్రేరేపించారు...ఎవరు రెచ్చి పోయారన్న అంశాల్లో ఎప్పుడూ భిన్న దృక్పథాలుంటాయి. అయితే ఘర్షణలు చెలరేగినప్పుడు మొదటగా తగ్గవలసింది ఎప్పుడూ బలమైన పక్షమే. డోనాల్డ్ ట్రంప్ హయాంలోనైనా, అంతకు ముందు పాలించిన రిపబ్లికన్ అధ్యక్షుల సమయంలోనైనా అమెరికా ఎప్పుడూ ఇజ్రా యెల్‌కు మద్దతుగా నిలిచేది. డెమొక్రాట్లు మాత్రం కొంత ఊగిసలాట వైఖరితో ఇరుపక్షాలకూ శాంతి ప్రబోధం చేయడం రివాజు. ట్రంప్ సృష్టించిన వాతావరణం వల్ల కావొచ్చు... ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం శాంతికి పిలుపునిస్తూనే ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ చేసుకునే హక్కుందని మొదట్లో చెప్పారు. బహుశా స్వపక్షం నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల చివరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో దాదాపు అరడజనుసార్లు మాట్లాడి కాల్పుల విరమణకు సిద్ధపడాలని ఒత్తిడి చేశారు. ఒకప్పుడు మన దేశం ఇజ్రాయెల్ చర్యలను గట్టిగా ఖండించేది. ఐక్యరాజ్య సమితిలో దానికి వ్యతిరేకంగా గళమెత్తేది. కానీ ఆ రోజులు పోయాయి. 2014 తర్వాత గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ చేసిన మొదటి భారీ దాడి కనుక మన ప్రభుత్వం ఏ వైఖరి తీసుకుంటుం దోనన్న ఆసక్తి ప్రపంచ దేశాలన్నిటా వుంది. అయితే ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ఖండించ డంతోపాటు, ఇజ్రాయెల్ జరిపిన ‘ప్రతీకారదాడుల్ని’ కూడా భారత్ గతవారం నిరసించింది. వాటివల్ల భారీ సంఖ్యలో జననష్టం జరిగిందని, మహిళలు, పిల్లలు అనేకులు మరణించారని ప్రస్తావించింది. కానీ ఇజ్రాయెల్‌కు ఇది రుచించలేదు. అందుకే తమకు మద్దతునిచ్చిన దేశాలకు ట్విటర్లో కృతజ్ఞతలు చెప్పిన నెతన్యాహూ మన దేశం ఊసెత్తలేదు. పాలస్తీనా విషయంలో అమెరికా అనుసరిస్తూ వస్తున్న విధానమే ఇజ్రాయెల్‌కు బలంగా మారుతోంది. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికల ప్రమేయం వుంటే...రష్యా, చైనాలకు కూడా పరిష్కార సాధనలో చోటిస్తే ఇజ్రాయెల్ ఇంత దూకుడుగా పోయేది కాదు. పాలస్తీనా ఈసరికే పూర్తి రాజ్య ప్రతిపత్తితో మనుగడ సాగించేది. పశ్చిమాసియాలో తన సైనిక, ఆర్థిక, రాజకీయ పలుకుబడి చెక్కుచెదరకూడదనుకుంటే ఇజ్రాయెల్‌ను గట్టిగా సమర్థించడమే మార్గమని అమెరికా భావిస్తోంది. అదే సమయంలో గాజా స్ట్రిప్‌లో హమాస్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఏం చేయాలో తోచని ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా అక్కడి జనావాసాలపై దాడులు చేస్తోంది. భయకంపితులైన జనాలు సహజంగానే హమాస్‌పై తిరగబడి, దాన్ని కట్టడి చేస్తారని ఇజ్రాయెల్ వ్యూహం. నిరాయుధులైన పౌరులపై చేస్తున్న దాడులకు జవాబుదారీతనం వహించాల్సిందేనన్న ఒత్తిడి లేనంతకాలం అది ఈ వ్యూహాన్నే అమలు చేస్తుంది. భద్రతా మండలిలో ఎవరు తనకు వ్యతిరేకంగా నిలిచినా, అమెరికా తనకు అండగా నిలబడుతుందన్న భరోసా ఇజ్రాయెల్‌కు వుంది. అది పోగొట్టినప్పుడే పాలస్తీనా సమస్యకు పరిష్కారం లభిస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నానని, సౌదీ అరేబియాతో మరింతగా స్నేహసంబంధాలు ఏర్పడ్డాయని, ఇక ఇరాన్ కట్టడికి పకడ్బందీ వ్యూహం రూపొంది స్తున్నానని నెతన్యాహూ జబ్బలు చరుచుకున్నారు. కానీ గాజా స్ట్రిప్ నుంచి హమాస్ రాకెట్ దాడులు చేస్తున్న సమయంలోనే అరబ్, ఇజ్రాయెల్ పౌరుల మధ్య మత ఘర్షణలు, వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనికులతో వేలాదిమంది నిరసనకారులు తలపడటం గమనిస్తే అక్కడ ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ప్రతిఘటన యధాతథంగా వుందని అర్ధమవుతుంది. కనుకనే తమకు వాస్తవమైన శాంతి కావాలని ఇజ్రాయెల్ పౌరులు కోరుకుంటున్నారు. తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంకుల్లో గత కొన్నేళ్లుగా ఆక్రమిస్తూ వస్తున్న ప్రాంతాలనుంచి వైదొలగి, పాలస్తీనాతో శాంతియుత ఒప్పందానికి ఇజ్రాయెల్ సిద్ధపడినప్పుడే ఆ ప్రాంతంలో ప్రశాంతత సాధ్యమవుతుంది. ఇప్పుడు జరిగిన దురదృష్టకర పరిణామాలు ఆ దిశగా అడుగులు పడేందుకు దోహదపడాలని ఆశించాలి. -
దాయాది ఆగడాలు, మరోసారి కాల్పులు
జమ్మూ కాశ్మీర్: పాకిస్తాన్ దళాలు శనివారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్, కథువా జిల్లాల్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి), అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గ్రామాలు, పలు సెక్టార్ పరిధిలో పాకిస్తాన్ దళాలు కాల్పులకు దిగాయని భద్రతా అధికారులు తెలిపారు. పాకిస్తాన్ ఆగడాలతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారని వెల్లడించారు. ఆయా గ్రామాల ప్రజలు రాత్రంతా భూగర్భ రక్షణ వసతుల్లో బిక్కు బిక్కుమంటూ గడపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అన్నారు. పూంచ్‌లోని నియంత్రణ రేఖ వెంబడి, మాన్‌కోట్ సెక్టార్ పరిధిలో తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 4 గంటల వరకు దాడులు చేశారని, హిరానగర్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రాత్రంతా కాల్పులు కొనసాగాయని అధికారులు తెలిపారు. ఆటోమాటిక్స్, మోర్టార్స్‌తో దాయాది బలగాలు దాడులకు తెగబడ్డారని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అంతకు ముందు శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కూడా పాక్ దళాలు కరోల్ కృష్ణ, సత్పాల్, గుర్నామ్‌లో సరిహద్దు వెంట కాల్పులకు దిగారు. భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పాక్ చర్యలను దీటుగా తిప్పికొట్టిందని అధికారులు తెలిపారు. -
అజర్‌బైజాన్‌పై ఆర్మేనియా క్షిపణి దాడులు!
బాకూ(అజర్బైజాన్): ఇరుగు పొరుగు దేశాలైన అజర్బైజాన్, ఆర్మేనియా మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రష్యా చొరవతో ఇరు దేశాల మధ్య అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం గంటల వ్యవధిలోనే ఉల్లంఘనకు గురైంది. ఆర్మేనియా సైనిక దళాలు తమ దేశంపై క్షిపణి దాడులకు పాల్పడ్డాయని అజర్బైజాన్ ఆదివారం ఆరోపించింది. తమ దేశంలోనే రెండో అతిపెద్ద నగరం గాంజాలో ఆర్మేనియా జరిపిన క్షిపణి దాడుల్లో 9 మంది పౌరులు మరణించారని, మరో 30 మంది గాయపడ్డారని, ఒక నివాస భవనం ధ్వంసమైందని వెల్లడించింది. మింగచెవిర్ నగరంలోనూ క్షిపణి దాడులు జరిగాయని తెలిపింది. నగొర్నో–కరాబాఖ్ అనే ప్రాంతంపై పట్టుకోసం అజర్బైజాన్, ఆర్మేనియా కత్తులు దూసుకుంటున్నాయి. శతాబ్దాలుగా ఈ వివాదం కొనసాగుతోంది. ఈ ప్రాంతం భౌగోళికంగా అజర్బైజాన్లో ఉన్నప్పటికీ.. దానిపై ఆర్మేనియా ఆధిపత్యం వహిస్తోంది. -
కశ్మీర్లో పాఠాలు షురూ
శ్రీనగర్/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్/వాషింగ్టన్: కశ్మీర్లో సోమవారం పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే చాలా పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. శ్రీనగర్‌లో 190 ప్రాథమిక పాఠశాలలు తెరుచుకున్నప్పటికీ శాంతిభద్రతల భయంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపలేదు. అయితే బెమినాలోని పోలీస్ పబ్లిక్ స్కూల్, ఇతర కేంద్రీయ విద్యాలయాల్లో మాత్రం చెప్పుకోదగ్గ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. కశ్మీర్లో ఆంక్షలు సడలించినప్పటికీ బలగాల మోహరింపు మాత్రం తగ్గలేదు. ఈ సందర్భంగా బారాముల్లా జిల్లాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘పట్టన్, పల్హలాన్, సింఘ్‌పొరా, బారాముల్లా, సోపోర్ పట్టణాల్లో ఆంక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం పాఠశాలలు తెరుచుకున్నాయి’ అని చెప్పారు. శ్రీనగర్‌లో గత 3 రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నందున పాఠశాలలు తెరుచుకోలేదని వ్యాఖ్యానించారు. అయితే నగరంలో ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో బారికేడ్లను తొలగించి ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా అధికారులు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని ఈ నెల 5న రద్దుచేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా జమ్మూకశ్మీర్‌లో భారీగా బలగాలను మోహరించారు. భారత రాయబారికి పాక్ సమన్లు భారత డిప్యూటీ హైకమిషనర్‌గా గౌరవ్ అహ్లూవాలియాకు పాక్ ప్రభుత్వం సోమవారం సమన్లు జారీచేసింది. అహ్లూవాలియాను ఇస్లామాబాద్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకున్న సార్క్ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ ఫైజల్.. భారత్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. భారత బలగాల తీరుపై తీవ్ర నిరసన తెలియజేశారు. ఆదివారం ఛిక్రీకోట్, హాట్‌స్ప్రింగ్ సెక్టార్లపై భారత ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఇద్దరు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2017 నుంచి ఇప్పటివరకూ భారత్ 1,970 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని విమర్శించారు. ట్రంప్ పాక్‌వైపు మొగ్గు చూపొద్దు భారత్–పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా పొరపాటున కూడా పాక్‌వైపు మొగ్గుచూపరాదని అగ్రరాజ్యానికి చెందిన కౌన్సిల్ ఫర్ ఫారిన్ రిలేషన్స్(సీఎఫ్ఆర్) సంస్థ అధ్యక్షుడు రిచర్డ్ ఎన్ హాస్ సూచించారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్‌వైపు ఏమాత్రం మొగ్గుచూపినా భారత్ దూరమైపోతుందని హెచ్చరించారు. ఈ విషయమై రిచర్డ్ స్పందిస్తూ..‘భారత్‌ను ఎదుర్కోవడానికి కాబూల్(అఫ్గానిస్తాన్)లో తన మిత్రులు అధికారంలో ఉండాలని పాక్ కోరుకుంటోంది. కాబట్టి పాక్‌ను శాసించే సైనిక, నిఘా వ్యవస్థలు తాలిబన్లను నియంత్రిస్తాయనీ, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాయని నమ్మేందుకు చాలాతక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో భారత్‌కు అమెరికా దూరం జరగడం అంత తెలివైన నిర్ణయంకాదు. ప్రజాస్వామ్య భారత్ జనాభా త్వరలోనే చైనాను దాటేస్తుంది. అంతేకాకుండా భారత్ ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించబోతోంది. కాబట్టి అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే ఇండియావైపు మొగ్గడమే శ్రేయస్కరం. ఆసియాలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ అమెరికాకు సహకరిస్తుంది’ అని తెలిపారు. మరోవైపు కశ్మీర్ సమస్య కారణంగా తాలిబన్–అమెరికాల మధ్య శాంతిచర్చలకు విఘాతం కలుగుతుందన్న పాక్ వ్యాఖ్యలపై అఫ్గానిస్తాన్ ప్రభుత్వం మండిపడింది. జమ్మూకశ్మీర్ భారత్–పాక్‌ల ద్వైపాక్షిక సమస్యనీ, దాన్ని అఫ్గాన్‌తో ముడిపెట్టడం పూర్తిగా బాధ్యతారాహిత్యమేనని స్పష్టం చేసింది. అమిత్ షాతో దోవల్ భేటీ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయలో దాదాపు 10 రోజులపాటు పర్యటించిన దోవల్.. అక్కడి పరిస్థితిని షాకు వివరించారు. ఈ సందర్భం గా జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలపై చర్చించారు. హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబాతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
పాక్‌కు బుద్ధి చెప్పిన భారత్
జమ్మూ: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సరిహద్దు ప్రాంతాలైన రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో మోర్టారు దాడులు, కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్‌కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. పాక్‌కు చెందిన 7 సైనిక పోస్టులను భారత్ ధ్వంసం చేసింది. పలువురు పాక్ సైనికులు గాయపడ్డారు. ఈ మేరకు ఉన్నతాధికారులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో సరిహద్దు ప్రాంతాల్లోని స్కూళ్లను మూసివేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి సోమవారం పాక్ మోర్టారు దాడులు చేయడంతో ఓ బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఐదేళ్ల బాలికతోపాటు ముగ్గురు మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్, నౌషెరా సెక్టార్ పరిధిలోని రాజౌరీలో పాక్ సోమవారం మొదలుపెట్టిన మోర్టారు దాడులు, కాల్పులు మంగళవారం కొనసాగాయి. ఇందుకు ప్రతిగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఎల్ఓసీ వెంబడి రాక్‌చిక్రి, రావలకోటె ప్రాంతాల్లో ఉన్న 7 పాక్ సైనిక పోస్టులను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ముగ్గురు పాక్ సైనికులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు పాకిస్తాన్ ప్రభుత్వ విభాగం తెలిపింది. -
రంజాన్‌నాడు నెత్తురోడిన అఫ్గాన్
జలాలాబాద్: రంజాన్ రోజు అఫ్గానిస్తాన్ నెత్తురోడింది. కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రజలు, తాలిబన్ ఫైటర్లు కలిసి జరుపుకున్న వేడుకలపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 21 మంది మృతిచెందగా 41 మంది గాయపడ్డారు. మృతులు, గాయపడిన వారిలో ఎక్కువ మంది తాలిబన్లే ఉన్నారని అఫ్గాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అఫ్గానిస్తాన్‌లోని జలాలాబాద్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తాలిబన్లతో సర్కారు కుదర్చుకున్న కాల్పలు విరమణ ఒప్పందం ఆదివారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ప్రభుత్వ ఒప్పందం నేపథ్యంలో అఫ్గాన్ భద్రతా దళాలతో కలిసి తాలిబన్ ఫైటర్లు, ప్రజలు ఆలింగనాలు చేసుకోవడం, సెల్ఫీలు తీసుకుంటూ ఆహ్లాదంగా గడిపిన కాసేపటికే ఈ దాడి జరిగింది. దాడిని అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తీవ్రంగా ఖండించారు. కాల్పుల విరమణను పొడగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ మూడ్రోజుల కాల్పుల విరమణకు తాలిబన్ నాయకుడు హైబతుల్లా అఖున్జాదా అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. ఇది గురువారం నుంచి ఆదివారం వరకు అమల్లో ఉంది.ఈ ఘటనకు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత ప్రకటించుకోలేదు. అఫ్గాన్‌లో శాంతిస్థాపన కోసం అష్రఫ్ ఘనీ ప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చలకు కొంతకాలంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే.. కాల్పుల విరమణకు తాలిబాన్లు అంగీకారం తెలిపారు. ఇంతలోనే తాలిబన్లు లక్ష్యంగా దాడి జరగడం కలకలం రేపుతోంది. -
కాల్పుల విరమణకు తూట్లు
జమ్మూ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట భారత బలగాలు లక్ష్యంగా మంగళవారం రాత్రి విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ దాడిలో ఓ అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ అధికారి సహా నలుగురు సరిహద్దు భద్రతాదళం(బీఎస్ఎఫ్) జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయమై బీఎస్ఎఫ్ పశ్చిమ కమాండ్ అదనపు డైరెక్టర్ జనరల్(ఏడీజీ) కేఎన్ చౌబే స్పందిస్తూ.. ‘కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు భారత్ అంగీకరిస్తే, పాకిస్తాన్ మాత్రం దానికి తూట్లు పొడిచింది. పాక్ చేయాల్సింది చేసింది. ఈ నమ్మక ద్రోహానికి దీటుగా స్పందించడం ఇప్పుడు మావంతు’ అని వ్యాఖ్యానించారు. సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్లో ఉన్న ఛామ్లియాల్ బోర్డర్ పోస్ట్‌కు రక్షణ సామగ్రిని తీసుకెళ్తున్న బీఎస్ఎఫ్ బృందంపై పాక్ రేంజర్లు మంగళవారం రాత్రి 9.40 గంటలకు ఏకపక్షంగా కాల్పులు జరిపారన్నారు. దీంతో వీరిని రక్షించేందుకు అసిస్టెంట్ కమాండెంట్ జితేందర్ సింగ్ బృందం అక్కడికి చేరుకోగానే పాక్ బలగాలు వెంటనే మోర్టార్లను ప్రయోగించాయన్నారు. ఈ దాడిలో బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేందర్ సింగ్(రాజస్తాన్)తో పాటు ఎస్సై రజ్నీశ్ కుమార్(యూపీ), ఏఎస్సై రామ్నివాస్(రాజస్తాన్), కానిస్టేబుల్ హన్స్‌రాజ్(రాజస్తాన్) ప్రాణాలు కోల్పోయినట్లు చౌబే తెలిపారు. పాక్ కాల్పుల్లో గాయపడ్డ ఐదుగురు జవాన్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నామన్నారు. పాక్ కాల్పులు బుధవారం తెల్లవారుజాము 4.30 గంటలవరకూ కొనసాగాయనీ, భారత బలగాలు పాక్ దాడిని దీటుగా తిప్పికొట్టాయన్నారు. దీనిపై పాక్‌కు నిరసన తెలియజేస్తామన్నారు. -
ఉగ్ర కలాపాల్ని పాక్ తక్షణం ఆపాలి: రాజ్‌నాథ్
శ్రీనగర్: ఉగ్రవాద కార్యకలాపాల్ని తక్షణం ఆపివేయాలని హోం మంత్రి రాజ్‌నాథ్ పాక్‌ను కోరారు. కశ్మీర్, పాక్‌లో కశ్మీర్ అంశంపై సరైన ఆలోచన ఉన్న అందరితో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కశ్మీర్లో రెండ్రోజుల పర్యటనకు వచ్చిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. చర్చలకోసం గతేడాది అక్టోబరులోనే కేంద్ర ం ప్రత్యేక ప్రతినిధిని నియమించిందని గుర్తు చేశారు. కశ్మీర్లో కేంద్రం ప్రకటించిన కాల్పుల విరమణను రంజాన్ వరకు పొడిగించే వీలుందన్నారు. పోలీసు అధికారులపై రాళ్లు రువ్విన ఘటనల్లో పాల్గొన్న యువతపై కేసుల్ని ఉపసంహ రించుకోవాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలోని యువతను కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారని, అయితే చిన్నపిల్లలు తప్పులు చేయడం సహజమని ఆయన అన్నారు. -
కాల్పుల విరమణకు పాకిస్తాన్ తూట్లు
జమ్మూ / శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట భారత పోస్టులు, పౌర ఆవాసాలపై ఆదివారం ఎలాంటి కవ్వింపు లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. పాక్ రేంజర్లు జరిపిన ఈ కాల్పుల్లో ఇద్దరు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్లు ప్రాణాలు కోల్పోగా, ఓ పోలీస్ అధికారి సహా 14 మంది గాయపడ్డారు. 2003 కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంవో) గత నెల 29న అంగీకరించారు. ఈ ఘటన జరిగి వారంరోజులు కూడా గడవకముందే పాకిస్తాన్ ఆదివారం తెల్లవారుజామున 1.15 గంటలకు జమ్మూలోని అఖ్నూర్, కనచాక్, ఖౌర్ సెక్టార్లపై మోర్టార్లు, భారీ ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు పాక్ దాడిని దీటుగా తిప్పికొట్టాయి. పాక్ కాల్పుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ ఏఎస్సై ఎస్.ఎన్.యాదవ్(47), కానిస్టేబుల్ వీకే పాండేలు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వీరిద్దరూ మృతిచెందారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో పాక్ వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. పాక్ మాటల్లో ఒకటి చెప్పి, చేతల్లో మరొకటి చేస్తుందని తాజా ఘటన రుజువు చేసిందని జమ్మూ ఫ్రాంటియర్ బీఎస్ఎఫ్ ఐజీ రామ్ అవతార్ మండిపడ్డారు. రక్తపాతాన్ని ఆపండి: మెహబూబా జమ్మూకశ్మీర్‌లో రక్తపాతాన్ని ఆపేందుకు భారత్, పాక్‌ల డీజీఎంవోలు వెంటనే మరోసారి చర్చలు జరపాలని ఆ రాష్ట్ర సీఎం మెహబూబా ముఫ్తీ విజ్ఞప్తి చేశారు. శ్రీనగర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇరుదేశాల కాల్పులతో జవాన్లు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు వేర్పాటువాదులు కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం ముందుకు రావాలన్నారు. కశ్మీర్ సమస్యను రాజకీయంగానే పరిష్కరించగలమన్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో రంజాన్‌మాసంలో మిలటరీ ఆపరేషన్లు నిలిపివేసిన నేపథ్యంలో ఉగ్రవాద సంస్థల్లో కశ్మీరీ యువత భారీగా చేరుతోందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ ఏడాదిలో కశ్మీర్ నుంచి 81 మంది యువకులు వివిధ ఉగ్ర సంస్థల్లో చేరినట్లు వెల్లడించాయి. ఈ ఏడాదే విచ్చలవిడిగా.. సంవత్సరం పాక్ కాల్పుల ఘటనలు 2015 287 2016 271 2017 860 2018(మే చివరి నాటికి) 1252 -
ఇక కాల్పులు ఆపేద్దాం
న్యూఢిల్లీ / ఇస్లామాబాద్: భారత్–పాకిస్తాన్ల మధ్య 2003లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంవో) అంగీకరించారు. ఇరుదేశాల మధ్య నియంత్రణ రేఖ(ఎల్వోసీ)తో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఇరుదేశాల డీజీఎంవోలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో పాటించేందుకు అంగీకరించినట్లు భారత ఆర్మీ తెలిపింది. సరిహద్దులో ఒకవేళ ఉద్రిక్త పరిస్థితి తలెత్తితే హాట్‌లైన్‌తో పాటు ఫ్లాగ్ మీటింగ్‌ల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అంగీకారానికి వచ్చాయి. -
‘సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు’
న్యూయార్క్: సిరియా కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయడంలో ఐక్యరాజ్యసమితి, రష్యా విఫలమయ్యాయని అమెరికా విమర్శించింది. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని ఐక్యరాజ్యసమతిలో అమెరికా రాయబారి నిక్కి హేలీ వ్యాఖ్యానించారు. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్, రష్యా కలిసి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచారని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడుతూ... సిరియాలో ఉన్నా రష్యా, ఇరాన్ సంకీర్ణ సేనలను వెనక్కు పిలిపించడంలో సమితి విఫలమైందన్నారు. డమాస్కస్ సమీపంలో తూర్పు ఘౌటా ప్రాంతంలో కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి 30 రోజులు గడిచినా పరిస్ధితిలో ఎటువంటి మార్పులేదన్నారు. అసద్, రష్యా సంకీర్ణ బలగాలు ఈ ఒప్పందాన్ని అతిక్రమించాయని మండిపడ్డారు. ‘ఇది చాలా తప్పు. భద్రతామండలిలోని ప్రతి సభ్యుడికి ఇది అవమానకరమైన రోజు’ అని నిక్కీ హేలీ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కాల్పులు విరమణ ఒప్పందానికి ఓటు వేసిన రష్యా కట్టుబాటు చాటలేదని, ఈ విషయంలో మాస్కో కంటే తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. -
జమ్మూ కశ్మీర్లో పాక్ దుశ్చర్య
జమ్మూ: పొరుగు దేశం పాకిస్తాన్ మళ్లీ దుశ్చర్యకు తెగబడింది. భారత్‌ను రెచ్చగొట్టేలా ఆ దేశం కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇరుదేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పూంచ్ లోని బాలాకోటే సెక్టార్ సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం ఆదివారం మోర్టారు బాంబులతో విరుచుకు పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించగా ఇద్దరు బాలికలు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు మైనర్ సోదరులు. మరో ఐదుగురు ఆర్మీ సిబ్బంది కూడా గాయపడగా వారిని సైనిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలికలను మాత్రం హెలికాప్టర్ ద్వారా జమ్మూలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు భారత భద్రతా బలగాలకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన పట్ల జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఫ్తీ తన సంతాప సందేశాన్ని ట్వీటర్లో పోస్ట్ చేశారు. ఆదివారం ఉదయం 7.45 నుంచి 11.30 గంటల వరకు పాకిస్తాన్ విచక్షణారహితంగా దాడులకు తెగబడినట్లు ఆర్మీ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. పాక్ కవ్వింపు చర్యల ఫలితంగా ఐదుగురు సాధారణ పౌరులు చనిపోయారనీ, ఆ దేశం ఎప్పుడూ అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని ఆయన చెప్పారు. పౌరుల ప్రాణాలకు ఎటువంటి ముప్పూ లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు జమ్మూ ఐజీ ఎస్డీఎస్ జమ్వాల్ చెప్పారు.