
న్యూఢిల్లీ / ఇస్లామాబాద్: భారత్–పాకిస్తాన్‌ల మధ్య 2003లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంవో) అంగీకరించారు. ఇరుదేశాల మధ్య నియంత్రణ రేఖ(ఎల్వోసీ)తో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఇరుదేశాల డీజీఎంవోలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో పాటించేందుకు అంగీకరించినట్లు భారత ఆర్మీ తెలిపింది. సరిహద్దులో ఒకవేళ ఉద్రిక్త పరిస్థితి తలెత్తితే హాట్‌లైన్‌తో పాటు ఫ్లాగ్ మీటింగ్‌ల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అంగీకారానికి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment