India-Pakistan
-
భారత్‌తో వాణిజ్యం ఇప్పట్లో లేనట్టే
ఇస్లామాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించలేమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతులు చేసుకోవాలంటూ ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ(ఈసీసీ) చేసిన సిఫారసుల అమలును వాయిదా వేశారు. కేబినెట్ సహచరులతో చర్చించాక ఇమ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు డాన్ పత్రిక తెలిపింది. భారత్‌తో ఇప్పట్లో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవడం కుదరదని వాణిజ్య శాఖకు, ఆర్థిక బృందానికి ఇమ్రాన్ తెలిపారు. దుస్తులు, చక్కెరను తక్కువ ధరకి దిగుమతి చేసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలన్నారు. పాక్ ఆర్థిక, వాణిజ్య రంగాలను బలోపేతం చేయడానికి కసరత్తు చేస్తున్న ఈసీసీ కొన్ని వేల ప్రతిపాదనలు పరిశీలించాక భారత్ నుంచి పత్తి, దుస్తులు, చక్కెర దిగుమతి చేసుకోవాలంటూ సిఫారసులు చేసింది. ఆ సిఫారసుల్ని ఆమోదించడానికి కేబినెట్‌కు పంపింది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదంటూ పాకిస్తాన్ కేబినెట్ ఆ సిఫారసుల్ని తోసిపుచ్చింది. జమ్మూకశ్మీర్ స్వతంత్రప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ 2019లో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆ దేశంతో ఏ రకమైన సంబంధాలు పునరుద్ధరించబోమని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి చెప్పారు. మరోవైపు భారత్ కూడా అంతే గట్టిగా పాక్‌కు వార్నింగ్‌లు ఇచ్చింది. పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్ర సంస్థల్ని కట్టడి చేసే వరకు తాము కూడా ఎలాంటి బంధాల్ని కొనసాగించమని భారత్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. గత ఏడాది కరోనా సంక్షోభం సమయంలో భారత్ నుంచి దిగుమతయ్యే మందులు, వాటి తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలపై ఉన్న ఆంక్షల్ని పాక్ ఎత్తేసింది. -
ఎన్నికలప్పుడే ఆలయాల సందర్శన
బన్సుర్/జైపూర్: కాంగ్రెస్ నేతలు ఎన్నికలు సమీపించినప్పుడే ఆలయాల సందర్శనకు వెళతారని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ నేతలు ఆలయాలు సందర్శించి పూజలు నిర్వహిస్తారు. మిగతా సమయాల్లో వాళ్లు ఆ చుట్టుపక్కల కూడా కనిపించరు. ఆలయాలు, గోవులు ఆ పార్టీకి ఎన్నికల ప్రచారాంశాలు కావొచ్చు. కానీ బీజేపీకి అవి సాంస్కృతిక జీవనంలో అంతర్భాగం’ అని రాజ్‌నాథ్ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో అవసరమైతే పాకిస్తాన్‌కు సాయం చేస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ‘నేను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఒక్కటే చెబుతున్నా. అఫ్గానిస్తాన్‌లో ప్రభుత్వం తాలిబన్ ఉగ్రవాదులపై అమెరికా సాయంతో పోరాడుతోంది. పాక్‌లో ఉగ్రవాదులపై ఒంటరిగా పోరాడలేమని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం భావిస్తే భారత్ సాయం కోరవచ్చు’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. భారత్–పాక్‌ల మధ్య కశ్మీర్ అన్నది సమస్యే కాదనీ, అది భారత్‌లో అంతర్భాగమని రాజ్‌నాథ్ పునరుద్ఘా టించారు. సర్జికల్ స్ట్రైక్స్ యూపీఏ హయాంలోనూ జరిగాయని కాంగ్రెస్ చెప్పడంపై స్పందిస్తూ.. ‘ఈ విషయాన్ని దేశప్రజలకు ముందుగానే ఎందుకు చెప్పలేదు? సైన్యం అలాంటి సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి ఉంటే ప్రజలకు తెలిసేది కాదా? ఈ ఆపరేషన్‌ను ఎందుకు గోప్యంగా ఉంచారు? ఎవరికి భయపడ్డారు?’ అని రాజ్‌నాథ్ అన్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని అల్లాహ్ ఓడిస్తాడన్న ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ‘మతం, కులం ఆధారంగా చేసే రాజకీయాలపై మాకు నమ్మకం లేదు’ అని అన్నారు. -
పాక్‌కు సరిహద్దు రహస్యాలు
ఫిరోజ్‌పూర్: భారత్–పాకిస్తాన్ సరిహద్దులోని కంచెలు, రహదారులకు సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్ ఏజెంటుకు అందజేశాడన్న ఆరోపణలపై ఒక బీఎస్ఎఫ్ జవానును అరెస్టు చేశారు. గత కొన్ని నెలలుగా షేక్ రియాజుద్దీన్ అనే జవానుపై నిఘా పెట్టిన బీఎస్ఎఫ్ వర్గాలు ఆయనను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నాయి. రియాజుద్దీన్ మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా రెన్పురా గ్రామానికి చెందిన వాడని, పంజాబ్‌లో ఫిరోజ్‌పూర్‌లోని 29వ సరిహద్దు భద్రతాదళానికి చెందిన బెటాలియన్‌లో పనిచేస్తున్నాడని తెలిపారు. అతని నుంచి రెండు సెల్ఫోన్లు, ఏడు సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. పాకిస్తాన్ గూఢచార సంస్థకు చెందిన మీర్జా ఫైజల్ అనే వ్యక్తికి సరిహద్దు ఫెన్సింగ్, రోడ్లు, ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లు, ఇతర రహస్య వివరాలు రియాజుద్దీన్ అందజేసినట్టుగా బీఎస్ఎఫ్ వెల్లడించింది. 29వ బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రియాజుద్దీన్ పోలీసు రిమాండ్‌కోసం కోర్టును ఆశ్రయిస్తామని విచారణ అధికారి రంజిత్‌సింగ్ తెలిపారు. -
ఆ టోర్నీ ఆడకండి: సెహ్వాగ్
న్యూఢిల్లీ: ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 18న క్వాలిఫయర్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఆ తర్వాత రోజే దాయాది పాకిస్తాన్‌తో భారత్ మరో మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో వరుసగా రెండు రోజులు వన్డే మ్యాచ్‌లు ఎలా ఆడతారని ఓ ఇంటర్య్వూలో వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు. రెండు వన్డేలకు మధ్య ఓ ప్లేయర్‌కు 24 నుంచి 48 గంటల సమయం అవసరం కాగా, షెడ్యూల్ కూర్పు సరిగా లేదని మండిపడ్డాడు. ‘ఆసియా కప్ షెడ్యూల్ చూసి షాక్‌కు గురయ్యా. ఆ టోర్నీ కోసం అంత బాధ పడాల్సిన పనిలేదు. ఆ టోర్నీ ఆడకండి. దాని బదులు టీమ్‌ను హోమ్ లేదా విదేశీ సిరీస్‌లకు సిద్ధం చేయండి. వరుసగా రెండు రోజులు ఎవరూ వన్డేలు ఆడరు. టీ 20 మ్యాచ్‌లకే రెండు రోజుల విరామం ఉంటుంది. అటు వంటిది వరుసగా రెండు వన్డేల ఎలా ఆడతారు. ఇలాంటి షెడ్యూల్ వల్ల భారత్‌పై పాకిస్తాన్ పైచేయి సాధించే అవకాశం ఉంది’ అని సెహ్వాగ్ తేల్చి చెప్పాడు. చదవండి: ఇది బుర్రలేని షెడ్యూల్ -
ఇది బుర్రలేని షెడ్యూల్: బీసీసీఐ
ముంబై: ఇటీవల విడుదల చేసిన ఆసియా కప్ క్రికెట్ షెడ్యూల్‌పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు బుర్ర పెట్టే షెడ్యూల్‌ను సిద్ధం చేశారా అంటూ మండిపడింది. యూఏఈ వేదికగా సెప్టెంబర్‌లో ఆసియాకప్ జరుగునున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు విడుదల చేసిన షెడ్యూల్ గందగరగోళానికి గురి చేసింది. ప్రధానంగా భారత్ వెంట వెంటనే రెండు మ్యాచ్‌లు ఆడి రావడంపై బీసీసీఐ అసహనానికి కారణమైంది. సెప్టెంబర్ 19వ తేదీన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అయితే షెడ్యూలు ప్రకారం ముందు రోజు ఒక క్వాలిఫయర్ మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. ఇది గమనించిన బీసీసీఐ ‘ప్రణాళిక సిద్ధం చేసేముందు కొంతైనా ముందూ వెనకా ఆలోచించరా’ అంటూ నిర్వాహకులపై అక్కసు వెళ్లగక్కింది. ‘ఈ రోజు మ్యాచ్ ఆడిన దేశం రేపటి మ్యాచ్‌కు వెంటనే ఎలా సిద్ధపడుతుంది? అందులోనూ ఇదేమైనా సాధారణమైన మ్యాచా? భారత్- పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్. పాక్‌కేమో రెండు రోజులు విరామం ఇచ్చారు. భారత్ మాత్రం ఎటువంటి విరామం లేకుండా మ్యాచ్‌కు సిద్ధపడాలా..?, ఇది బుర్రలేని షెడ్యూల్. దీన్ని ఎంతమాత్రం అంగీకరించలేం. ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయాల్సిందే’ అని బీసీసీఐ డిమాండ్ చేసింది. -
క్రికెట్ : భారత్, పాక్ ముఖాముఖి పోరు!
దుబాయ్ : దాయాదీ దేశం పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ అంటే భారత అభిమానులకు ఎక్కడి లేని ఉత్సాహం వస్తుంది. అయితే ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడంలేదు. దీంతో ఆ మజాను అభిమానులు మిస్సవుతున్నారు. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్-పాక్‌లు తలపడుతున్నాయి. గతేడాది జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఇలాంటి ఆసక్తికర మ్యాచ్ ప్రేక్షకులను రెండుసార్లు కనువిందు చేసింది. తొలి మ్యాచ్‌లో భారత్ గెలవగా.. అసలు సిసలు ఫైనల్ మ్యాచ్‌లో పాక్ నెగ్గి టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అలాంటి ఉత్కంఠకర మ్యాచ్ మరికొద్ది రోజుల్లో జరగనుంది. క్రికెట్ ప్రపంచంపై చెరగని ముద్ర వేసిన భారత్,పాక్ జట్లు ముఖా ముఖి పోరుకు సిద్దమయ్యాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా జరిగే ఆసియాకప్ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. సెప్టెంబర్ 15న ప్రారంభమయ్యే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల ప్రాతినిథ్యం ఖరారు కాగా.. మరోస్థానం కోసం యూఏఈ, సింగపూర్, ఒమన్, నేపాల్, మలేసియా, హంకాంగ్లు పోటీపడనున్నాయి. సెప్టంబర్ 18న భారత్, క్వాలిఫయర్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 19న దాయాదీ పాకిస్తాన్‌తో తలపడనుంది. రెండు గ్రూప్‌లు విభజించగా.. ఒక్కో గ్రూపులో మూడు జట్లు తలపడగా టాప్-2లో నిలిచినవి సూపర్-4లోకి అడుగుపెడుతాయి. సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా ఫైనల్ జరగనుంది. -
ఇక కాల్పులు ఆపేద్దాం
న్యూఢిల్లీ / ఇస్లామాబాద్: భారత్–పాకిస్తాన్ల మధ్య 2003లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంవో) అంగీకరించారు. ఇరుదేశాల మధ్య నియంత్రణ రేఖ(ఎల్వోసీ)తో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఇరుదేశాల డీజీఎంవోలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో పాటించేందుకు అంగీకరించినట్లు భారత ఆర్మీ తెలిపింది. సరిహద్దులో ఒకవేళ ఉద్రిక్త పరిస్థితి తలెత్తితే హాట్‌లైన్‌తో పాటు ఫ్లాగ్ మీటింగ్‌ల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అంగీకారానికి వచ్చాయి. -
‘భారత్-పాక్ మ్యాచ్ లేకుంటే టెస్టు చాంపియన్ షిప్ దండుగ’
లాహోర్: భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు లేకుండా టెస్టు చాంపియన్ షిప్ నిర్వహించడం శుద్ద దండుగ అని పాక్ మాజీ కెప్టెన్, కోచ్ వకార్ యునీస్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఐసీసీ 9 దేశాలతో టెస్టు చాంపియన్ షిప్, 13 దేశాల వన్డే లీగ్ నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై వకార్ ఓ చానెల్ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ టెస్టు చాంపియన్ షిప్ మంచి ఆలోచనే. కానీ పాక్, భారత్‌తో క్రికెట్ ఆడటం లేదు. దీంతో టెస్టు చాంపియన్ షిప్‌కు ఇబ్బంది ఏర్పడవచ్చు. ఒకవేళ ఈ టెస్టు చాంపియన్ షిప్లో భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్‌లు జరిగితే.. ఇరుదేశాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతాయి. ఈ రెండు దేశాలు ఒక్కసారికూడా తలపడకుండా టాప్-1,2 ర్యాంకు సాధిస్తే ఇది చాంపియన్ షిప్ అని ఎలా పిలుస్తామని’ వకార్ వ్యాఖ్యానించారు. పాక్‌లో ఆడటానికి భారత్‌కు ఇబ్బందిగా ఉంటే దుబాయ్ వేదికగా ఆడండి. దుబాయ్ పాక్ హోం గ్రౌండ్ లాంటిదేనని వకార్ భారత్‌కు సూచించారు. అక్కడ కాకుంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఎక్కడైనా భారత్‌తో ఆడటానికి పాక్‌కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. రెండేళ్లపాటు జరిగే టెస్టు చాంపియన్ షిప్లో 9 దేశాలు పాల్గొంటాయని, ఒక్కో దేశం ఆరు సిరీస్‌లు ఆడుతుందని ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 3 సిరీస్‌లు స్వదేశంలో మిగిలిన 3 సిరీస్‌లు విదేశాల్లో ఆడాలని తెలిపింది. అయితే భారత్-పాక్ మధ్య సిరీస్‌లు ఎలా కొనసాగుతాయనే విషయంలో ఐసీసీ స్పష్టతను ఇవ్వలేకపోయింది. -
బోలో భారత్ మాతాకీ జై
యుద్ధం.. మొదలవుతూనే సైనికుడి ప్రాణాన్ని కోరుతుంది.ముగిసే రోజొచ్చేసరికి శాంతిని కోరుతుంది.ఈ మధ్యన జరిగేదంతా ఒక పోరాటం. శాంతి కోరని ఓ పోరాటం.ఎన్నెన్ని ముగిసిన యుద్ధాలో.. ఎన్నెన్ని ప్రాణాలో.. ఎన్నెన్ని మొదలవ్వని యుద్ధాలో.. ఎన్నెన్ని ఆగిపోని యుద్ధాలో.. ఒక సైనికుడు ఎప్పుడూ నిలబడే ఉన్నాడక్కడ! ఆ సైనికుడికి ఎప్పుడూ కొడుతూనే ఉందామొక సలామ్!!కార్గిల్ విజయ్ దివస్ ఏంటి? 1999లో ఇండియా–పాకిస్థాన్ మధ్యన రెండు నెలల పాటు జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ చొరబాటుదారుల నుంచి కార్గిల్ ప్రాంతాన్ని భారత దళాలు జూలై 26న పూర్తిగా అదుపులోకి తెచ్చుకొని విజయ పతాకం ఎగరవేశాయి. ఈ యుద్ధంలో 500లకు పైగా భారత జవానులు అమరులయ్యారు. వారిని స్మరించుకుంటూ కార్గిల్ విజయ్ దివస్‌ను భారత ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది. మంచును లెక్క చేయకుండా... నైనితాల్‌కు చెందిన మేజర్ రాజేశ్ సింగ్ అధికారి కార్గిల్ యుద్ధంలో బ్యాటిల్ ఆఫ్ టోలోనింగ్లో కీలకపాత్ర పోషించారు. 15000 అడుగుల ఎత్తున ఉన్న కొండపై ఉన్న పాకిస్థాన్ సైన్యాన్ని అంతమొందించే బాధ్యతను రాజేశ్ చేపట్టారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంచు కురుస్తున్నా, పరిస్థితులను ఎదిరించి మరీ శత్రు సైన్యం ట్యాంకులను ధ్వంసం చేస్తూ వెళ్లారాయన. కాల్పుల్లో గాయపడినా కూడా తన టీమ్‌ను లీడ్ చేస్తూ ముందుకు వెళ్లి ఆ పాయింట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో బుల్లెట్ గాయాల వల్ల ఆయన ఈలోకాన్ని విడిచి వెళ్లారు. ప్రభుత్వం రాజేశ్ సాహసాన్ని గుర్తిస్తూ మహావీర చక్ర అవార్డుతో గౌరవించింది. రాకెట్ లాంచర్‌తో... తమిళనాడు రామేశ్వరంలో పుట్టి పెరిగిన మేజర్ మరియప్పన్ శరవణన్, దేశ సేవ చేయాలన్న ఆలోచనతో ఆర్మీలో చేరారు. కార్గిల్ యుద్ధంలో బాటలిక్ సెక్టార్లో పాకిస్థాన్ సైనికుడు చొరబడ్డ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే బాధ్యతను చేపట్టిన శరవణన్, రాకెట్ లాంచర్‌తో శత్రు సైన్యాన్ని బెదరగొడుతూ ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు. ఇదే సమయంలో ఆయనపై వరుసగా బుల్లెట్ల దాడి జరిగింది. అప్పటికీ పోరాడుతూనే తుదిశ్వాస విడిచారు. ఆయన సాహసాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం వీరచక్ర అవార్డుతో గౌరవించింది. 19 ఏళ్లకే పరమవీర చక్ర 16ఏళ్ల వయసులోనే దేశం కోసం పోరాడాలన్న సంకల్పంతో ఆర్మీలో చేరారు యోగేంద్ర సింగ్ యాదవ్. ఆయనకు 19 ఏళ్ల వయసున్నప్పుడు కార్గిల్ యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో టైగర్ హిల్ ప్రాంతాన్ని అదుపులోకి తెచ్చేందుకు సుమారు 16వేల అడుగులున్న కొండను, కాల్పులు ఎదురైనా ఎక్కారాయన. టైగర్ హిల్ వద్దనున్న నలుగురు పాకిస్థాన్ సైనికులను అక్కడికక్కడే కాల్చేశారు. యుద్ధంలో ఆయన చూపిన సాహసానికి గానూ ప్రభుత్వం పరమ వీరచక్ర అవార్డును అందించింది. 19 ఏళ్లకే పరమ వీరచక్ర అవార్డును అందుకున్న యోగేంద్ర సింగ్ యాదవ్, అతిచిన్న వయసులో ఈ గౌరవాన్ని దక్కించుకున్నవారిలో మొదటి స్థానంలో ఉన్నారు. మరణానికి దగ్గరైనా కూడా... ఢిల్లీలో పుట్టి పెరిగిన కెప్టెన్ అనుజ్ నయ్యర్ కుటుంబంలో అంతా చదువుకున్నవారే! దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆర్మీలో చేరారాయన. కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్థాన్ సైన్యం చొరబడిన పాయింట్ 4875ని స్వాధీనం చేసుకునే బాధ్యతను అనుజ్ నయ్యర్‌కు అప్పగించారు. తన ట్రూప్‌తో కలిసి ఆ పాయింట్‌ను చేరుకున్న ఆయన తొమ్మిది మంది శత్రు సైనికులను అంతమొందించడమే కాక, మూడు యుద్ధ ట్యాంకర్లను ధ్వంసం చేశారు. ఈ సమయంలోనే ఎదురుకాల్పుల్లో తీవ్ర గాయాలపాలై తుది శ్వాస విడిచారు. మరణానికి చేరువైన క్షణంలోనే మరో ట్యాంకర్‌ను ధ్వంసం చేసి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాకే అమరుడయ్యారు. అనుజ్ పోరాటాన్ని స్మరించుకుంటూ ప్రభుత్వం ఆయనను మహవీర చక్ర అవార్డుతో గౌరవించింది. శ్రత్రు సైన్యాన్ని అంతమొందించి... హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కెప్టెన్ విక్రమ్ భాట్రా కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. విక్రమ్ జమ్మూ కశ్మీర్ సోపోర్ ప్రాంతంలో లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్న సమయంలోనే కార్గిల్ యుద్ధం మొదలైంది. దీంతో ఆయనను యుద్ధంలో బాధ్యతలు నెరవేర్చమని ప్రభుత్వం కార్గిల్‌కు పంపింది. తన ట్రూప్‌తో చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటూ, విజయవంతంగా పాకిస్థాన్ క్యాంప్‌లను కొల్లగొట్టిన విక్రమ్, మెషిన్ గన్లతో కాల్పులు ఎదురైనా ఎందరో పాకిస్థాన్ సైనికులను అంతమొందించారు. ఇదే యుద్ధంలో ఆయన అమరుడయ్యారు. ప్రభుత్వం ఆయన సాహస చర్యను స్మరించుకుంటూ పరమ వీర చక్ర అవార్డుతో ఆయనను గౌరవించింది. ఆట నుంచి పోరాటం వైపుకు... ఉత్తర ప్రదేశ్ సీతాపూర్‌లో పుట్టిన కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కలలుగన్నారు. అయితే కాలం ఆయనను ఆర్మీ వైపుకు అడుగులు వేయించి దేశం కోసం పోరాడేలా చేసింది. కార్గిల్ యుద్ధంలో శత్రు సైన్యంపై తిరగబడి ఎంతోమందిని అంతమొందించిన ఆయన, చివరకు అదే యుద్ధంలో అమరులయ్యారు. చనిపోయే నాటికి ఆయన వయస్సు 25 సంవత్సరాలు. కార్గిల్ యుద్ధ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయనను ప్రభుత్వం పరమ వీర చక్ర అవార్డుతో గౌరవించింది. ఛాతీలోకి బుల్లెట్లు దిగినా... హిమాచల్ ప్రదేశ్‌లోని కలొల్ బకైన్ ప్రాంతానికి చెందిన రైఫిల్‌మ్యాన్ సంజయ్ కుమార్‌కు ఆర్మీకి పనిచేయాలన్న కలలు కంటూ ఉండేవారు. మూడు సార్లు రిజెక్ట్ అయినా మళ్లీ ప్రయత్నించారు. ఆయన ప్రయత్నం విజయవంతమై అర్మీలో ఉద్యోగం వచ్చింది. కార్గిల్ యుద్ధంలో ఒక ట్రూప్‌ను లీడ్ చేసే స్థాయికి కూడా వచ్చేశారు. యుద్ధం సమయంలో ఓ కొండపై ఉన్న పాకిస్థాన్ సైనికులను అంతమొందించాలన్న ప్లాన్‌లో భాగంగా పైకి చేరుకుంటున్న సంజయ్ కుమార్ టీమ్‌కు ఎదురుకాల్పులు ఎదురయ్యాయి. పాకిస్థాన్ సైనికులు ట్యాంకర్స్‌తో దాడికి పాల్పడుతూ వచ్చారు. ఇవేవీ లెక్కచేయకుండా కొండ ఎక్కి, శత్రు సైనికులను కాల్చేశారు. అప్పటికే ఆయన ఛాతీలోకి రెండు బుల్లెట్లు దిగినా, ధైర్య సాహసాలతో శత్రు సైనికులను ఎదిరించి ఆ ప్రాంతాన్నంతా స్వాధీనం చేసుకున్నారు. సంజయ్ కుమార్ సాహసోపేత చర్యను గుర్తిస్తూ ప్రభుత్వం ఆయనకు పరమ వీర చక్ర అవార్డును ప్రదానం చేసింది. -
భారత్, పాక్ అలా ఆడే ప్రసక్తే లేదు!
ద్వైపాక్షిక సిరీస్ ఆడబోవని తేల్చిచెప్పిన అమిత్ షా ముంబై: భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు పునరుద్ధరించే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. భారత్, పాక్ జట్లు పరస్పరం అంతర్జాతీయ టోర్నమెంటుల్లో మాత్రమే ఆడుతాయని, అంతకుమించి భారత్‌లో పాకిస్థాన్, పాకిస్థాన్‌లో భారత్ క్రికెట్ ఆడబోవని ఆయన చెప్పారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, పాక్ జట్లు తలపడుతున్న నేపథ్యంలో ఈ విషయమై విలేకరుల ప్రశ్నలకు స్పందించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఐసీసీ టోర్నమెంట్లలో మ్యాచ్‌లు ఆడటం తప్పించి.. నేరుగా ఈ రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడక చాలారోజులవుతోంది. -
భారత్ చర్యలతో పాకిస్తాన్‌కు ఎంతో కష్టం!
కేప్ టౌన్: జమ్మూలోని ఉడీలో భారత ఆర్మీపై పాకిస్తాన్ ఉగ్రదాడుల అనంతరం ఎన్నో పర్యాయాలు కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘించింది. ఉడీ ఉగ్రదాడి పాక్ క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టాన్ని కలిగించే అంశమని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా పాక్ అధికారులు భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) బీసీసీఐ, ఐసీసీలతో పలుమార్లు చర్చించింది. ఈ విషయంపై వస్తున్న వదంతులపై దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో ఐసీసీ కౌన్సిల్ సమావేశంలో పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఇరుదేశాల మధ్య సిరీస్‌ల కోసం పాక్, భారత్‌ను అడుక్కోవడం లేదన్నారు. తమతో సిరీస్‌లు ఆడేందుకు భారత్ నిరాకరించడం వల్ల పీసీబీ ఎంతో ఆదాయాన్ని కోల్పోతుందని, ఆర్థికంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయని షహర్యార్ ఖాన్ చెప్పారు. భారత్-పాక్ మధ్య సిరీస్‌లు జరగాలని మాత్రం మర్యాదపూర్వకంగానే బీసీసీఐతో పాటు ఐసీసీని సంప్రదించినట్లు ఆయన తెలిపారు. 2015-2023 మధ్య కాలంలో ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని పీసీబీ భావించింది. కానీ ఉగ్రదాడుల అనంతరం కేంద్ర ప్రభుత్వంగానీ, బీసీసీఐగానీ ఈ సిరీస్‌లపై ఆసక్తి చూపించడంలేదు. చివరగా 2007లో భారత్‌లో ఇరుదేశాలు మధ్య సిరీస్ జరిగిన విషయాన్ని షహర్యార్ ఖాన్ గుర్తుచేశారు. షహర్యార్ ఖాన్ ఇటీవల ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నెల 17న ఏసీసీ చైర్మన్‌గా తొలి సమావేశంలో ఆయన పాల్గొని, దాయాది దేశాల మధ్య సయోధ్య కుదిర్చే యోచనలో ఉన్నారు. -
పాక్ దాడులు చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా?
న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్ పాకిస్తాన్ తో సంబంధాలపై చేసిన సంచలన వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. పాక్ తీవ్ర చర్యలను, చేష్టలను పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలంటే ఆ దేశ నటీనటలను ఇక్కడ ఆదరించొద్దని, పనిలో పనిగా పాక్-భారత్ సిరీస్ లకు విరామం ఇవ్వాలని వ్యాఖ్యానించిన గంభీర్ కు గంగూలీ మద్దతు తెలిపాడు. వాస్తవానికి ఇది చాలా దురదృష్టకరమైన అంశం అయినా సరే, పాకిస్తాన్ తో క్రికెట్ కొన్నేళ్లు నిలిపివేయడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో భారత్-పాక్ సంబంధాలపై నోరు విప్పాడు. సరిహద్దుల్లో తరచుగా పాక్ ఉగ్రదాడులకు తెగబడుతున్న కారణంగా కొన్ని సందర్భాలలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని తన మనసులో మాట బయటపెట్టాడు. మన జవాన్లను చంపేస్తుంటే పాక్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం భావ్యమేనా అని దాదా ప్రశ్నించాడు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్ ఇదివరకే ఈ విషయంపై మాట్లాడుతూ.. భారత్-పాక్ సిరీస్ లపై తుది నిర్ణయం సంబంధిత క్రీడా బోర్డులకు వదిలేస్తున్నామని చెప్పారు. కాగా, ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి తన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని గంభీర్ చేసిన వ్యాఖ్యలపై గంగూలీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. -
ముస్లిం దేశాల సపోర్ట్ కూడా పాక్‌కు లేదు
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ భారత్‌ను దొంగదెబ్బ తీస్తున్న పాకిస్తాన్‌పై తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందే అన్న వాదనలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ స్పందించారు. పాకిస్తాన్‌తో యుద్ధం అంత మంచిది కాదని ఆయన వెల్లడించారు. పాకిస్తాన్‌పై దౌత్యపరమైన చర్యలు ఉండాలని.. అంతర్జాతీయంగా భారత్ ఇప్పుడు అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించడం మంచిదని నట్వర్ సింగ్ అభిప్రాయపడ్డారు. 56 సంవత్సరాలనుంచి సవ్యంగానే సాగుతున్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్‌తో యుద్ధం అంత సులభం కాదని.. ఒకవేళ భారత్ యుద్ధానికి దిగితే పాకిస్తాన్ తిరిగి దాడి చేస్తుందని నట్వర్ సింగ్ హెచ్చరించారు. ఇరు దేశాలకు అణ్వాయుధ సామర్థ్యం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఒంటరిని చేయడంలో విజయం సాధించామని.. చివరికి ముస్లిం దేశాలు కూడా పాక్‌ను సపోర్ట్ చేయలేదని ఇటీవల ఐక్యరాజ్యసమితిలో నవాజ్ షరీఫ్‌కు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేశారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని.. దీనికి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే అని విమర్శించారు. ఎల్ఓసీని అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించాలని నట్వర్ సింగ్ అన్నారు. -
భారత్-పాక్ మధ్య అణు యుద్ధం తప్పదు!
కరాచీ: కశ్మీర్ కోసం భారత్-పాక్ మధ్య అణు యుద్ధం తప్పదని హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ హెచ్చరించారు. ఈ విషయంలో ఇప్పటికే మూడు సార్లు యుద్ధం జరిగిందని, కశ్మీర్ ప్రజలు రాజీ పడేందుకు సిద్ధంగా లేనందున నాలుగోసారీ యుద్ధం జరగొచ్చని చెప్పారు. కశ్మీరీలకు నైతికంగా మద్దతిచేందుకు పాక్ కట్టుబడి ఉందని, పాక్ సహకరిస్తే ఇరు దేశాల మధ్య అణు యుద్ధం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఆదివారం విలేకరులతో సలాహుద్దీన్ మాట్లాడుతూ.. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వాని హత్య.. కశ్మీర్ కోసం జరుగుతున్న పోరాటానికి కొత్త అర్థాన్నిచ్చిందన్నారు. -
సినిమా థియేటర్లలో భారత్-పాక్ లైవ్ మ్యాచ్!
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ ఉందంటే ఇక క్రికెట్ అభిమానులకు ఫుల్ మీల్సే. ఇరుదేశాల మధ్య మ్యాచ్‌ను వీక్షించేందుకు అటు పాక్‌లోనూ, ఇటు భారత్‌లోనూ ఎడతెగని ఉత్కంఠంతో ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు క్రికెట్ ప్రియులు. శనివారం కోల్‌కతాలో టి20 ప్రపంచ కప్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో భారత్- పాక్ ల మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు పాకిస్తాన్‌లోని పేషావార్ నగరంలో ఏకంగా సినిమా థియేటర్లలో శనివారం లైవ్ మ్యాచ్(ప్రత్యక్ష ప్రసారం)కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు అక్కడి పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు.. 100 (పాకిస్తాన్ కరెన్సీలో) చొప్పున సినిమా థియేటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేస్తున్నట్టు డాన్ ఆన్లైన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా యువకులను ఆకర్షించేందుకు సినిమా థియేటర్ల వద్ద పెద్ద సైజులో పోస్టర్లు, బ్యానర్లు పెట్టినట్టు పాక్ వర్గాలు తెలిపాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వేతర సంస్థలు కూడా ప్రజలందరూ భారత్, పాక్ లైవ్ మ్యాచ్ చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇటీవల ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్, పాక్ ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో కూడా ఈ తరహా ఏర్పాట్లే చేసినట్టు ఓ క్రికెట్ అభిమాని తెలిపాడు. భారత్, పాక్ మ్యాచ్ సమయంలో ఆయా సినిమా థియేటర్లలో అంతరాయం లేకుండా విద్యుత్ తప్పనిసరిగా సరఫరా చేయాలని క్రికెట్ అభిమానులు పాక్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
దాయాదుల పోరుపై బెట్టింగ్‌ల జోరు
విజయవాడ : క్రికెట్ బెట్టింగ్‌ల జోరు మళ్లీ మొదలైంది. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న భారత్-పాకిస్తాన్ల మధ్య టీ 20 క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్ శనివారం జరగనుంది. దీంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బంతి బంతికీ మ్యాచ్ ఫలితంపై బెట్టింగ్‌లు నిర్వహించడానికి నగరంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోనూ పలుచోట్ల బుకీలు బెట్టింగ్‌లకు ఏర్పాట్లు చేశారు. పలుచోట్ల లాడ్జీలు, రియల్ ఎస్టేట్ ఆఫీసు కార్యాలయాలను ఇందుకు వేదికగా చేసుకున్నట్లు సమాచారం. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్ హడావుడిని భారీగా సొమ్ము చేసుకోవడానికి ఇప్పటికే ఆన్లైన్లో బెట్టింగ్ వివరాలు అందుబాటులో ఉంచటం గమనార్హం. 20 ఓవర్ల పరిమిత మ్యాచ్‌లో ఒక్కరోజే దాదాపు రూ.100 కోట్లపైనే బెట్టింగ్ జరిగే అవకాశముందని తెలుస్తోంది. బెట్టింగ్‌లో భారత్ హాట్ ఫేవరెట్‌గా ఉన్నట్లు సమాచారం. విజయవాడలో కృష్ణలంక, సింగ్ నగర్, పటమట తదితర ప్రాంతాల్లో బెట్టింగ్‌లు అధికంగా జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆయా పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా బెట్టింగ్ రాయుళ్లపై దృష్టి సారించారు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా కీలక బుకీల కదలికలపై నిఘా ఉంచారు. కృష్ణలంకలో బెట్టింగ్ ముఠా అరెస్టు విజయవాడ : కృష్ణలంకలోని ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. భ్రమరాంబపురం కాలనీలోని మలేరియా హాస్పిటల్ సమీపంలో గల ఓ ఇంట్లో బెట్టింగులకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఓ టీవీ, ఆరు మొబైల్ ఫోన్లు, రూ.19 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ టీమ్-2 మురళీధర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సురేష్‌రెడ్డి, సిబ్బంది ఈ దాడి నిర్వహించారు. నిందితులను కృష్ణలంక పోలీసులకు అప్పగించారు. -
బీసీసీఐని తప్పుబట్టిన సీఎం!
సిమ్లా: భారత్-పాక్ మ్యాచ్ వేదిక అంశంపై ప్రతిరోజు ఏదో ఓ వార్త వస్తూనే ఉంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ఈ నెల19న దాయాదుల మధ్య పోరు జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఆ వెంటనే మేము ఇక్కడ భద్రత కల్పించలేము, ఇక్కడ మ్యాచ్ అనేది చాలాకష్టమని హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్, బీసీసీఐతో పాటు కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. నిన్న ఈ మ్యాచ్ వేధికను ధర్మశాల నుంచి కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో నిర్వహిస్తామని ఐసీసీ ప్రకటించింది. ఆ మరుసటి రోజు వీరభద్రసింగ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కు కూడా డబ్బులు అవసరమే కానీ పరిస్థితులు అనుకూలించలేదన్నారు. దాయాదుల మ్యాచ్ కు సెక్యూరిటీ మేం అందించలేమని ఎప్పుడూ పేర్కొనలేదని సీఎం వీరభద్రసింగ్ మాటమార్చారు. అంతటితో ఆగకుండా బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ పై విమర్శలకు దిగారు. మ్యాచ్ వేదిక మారడానికి ఠాకూర్ ప్రధాన కారణమంటూ వ్యాఖ్యానించారు. పఠాన్ కోట్ ఉగ్రదాడి, కార్గిల్ అమరవీరుల అంశాన్ని ప్రస్తావించారు. ఈ దాడుల్లో మృతిచెందిన వారి కుటుంబసభ్యులు మ్యాచ్ ఇక్కడ నిర్వహించవద్దని కోరినట్లు మాత్రమే తాను కేంద్రానికి తెలిపినట్లు వివరించాడు. గతంలో ఎన్నో మ్యాచ్ లను నిర్వహించాం అన్నారు. అయితే ప్రజల సెంటిమెంట్లను గౌరవించాలని మాత్రమే తాను పేర్కొన్నట్లు వీరభద్రసింగ్ చెప్పుకొచ్చారు. -
బాంబుల మోత మధ్య బార్డర్ సెల్ఫీలు!
జమ్ము: అది జమ్ములోని సరిహద్దు ప్రాంతం. అక్కడ నిర్విరామంగా తుపాకుల మోత మోగుతూనే ఉంటుంది. ఇరువైపుల సైనికులు ప్రయోగించే షెల్స్, బాంబులతో దద్దరిల్లుతుంటుంది. ఈ కాల్పుల బారి నుంచి తప్పించుకునేందుకు స్థానకులే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తుండగా.. పర్యాటకులు మాత్రం సరిహద్దు అందాలను తిలకించేందుకు సాహసిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో సెల్ఫీలు దిగి మురిసిపోతున్నారు. పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరణమ ఉల్లంఘనకు పాల్పడుతున్నప్పటికీ.. గత రెండేళ్లలో జమ్ములోని ఆర్ఎస్ పుర సెక్టర్లో అంతర్జాతీయ సరిహద్దులను దర్శించేందుకు వందలమంది పర్యాటకులు తరలివస్తున్నారు. దీంతో ఇక్కడ పర్యాటకం నానాటికీ వృద్ధి చెందుతున్నది. ఉత్తరాఖండ్‌కు చెందిన షెల్జా కుటుంబం కూడా ఆర్ఎస్ పురలోని అంతర్జాతీయ సరిహద్దును సందర్శించారు. ఈ అనుభవం గురించి ఆమె చెప్తూ.. 'అదొక కన్నులపండుగలాంటి దృశం. సరిహద్దు కంచె వద్ద నిలబడి మేం సెల్ఫీలు దిగాం. భారత్, పాకిస్థాన్ బంకర్లు, వాటిపై ఎగురుతున్న జెండాలను చూశాం. ఇదెంతో బాగా అనిపించింది. పాకిస్థాన్ టూరిస్టులు కూడా ఇలా సరిహద్దులను సందర్శించేందుకు వస్తే బాగుంటుందనిపించింది' అని చెప్పారు. ఆర్ఎస్ పుర సెక్టర్లో గతవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సరిహద్దు కంచెకు మరమ్మతులు చేస్తున్న భద్రతా సిబ్బంది, కార్మికులపై పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఒక పౌరుడు మరణించగా, 12 మంది గాయపడ్డారు. దీంతో దాదాపు 300 మంది స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. అయినా పర్యాటకులు మాత్రం ఇక్కడికి రావడం ఆపడం లేదు. -
ఇప్పట్లో భారత్‌తో క్రికెట్ సాధ్యం కాదు
పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ కరాచీ: భారత్‌తో క్రికెట్ సిరీస్ ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదని పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొందని గుర్తుచేశారు. ‘ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ జరగాలంటే అంతకన్నా ముందు ఇతర సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. నాకైతే ఇప్పట్లో మ్యాచ్‌లు జరుగుతాయని అనిపించడం లేదు. అయితే ఈ విషయంలో పూర్తి వివరాలు పీసీబీ చెప్పాల్సి ఉంటుంది’ అని అజీజ్ తెలిపారు. -
ఉఫాలో ఎందుకు లేవనెత్తలేదు?
కశ్మీర్ అంశంపై పాక్‌కు హోంమంత్రి రాజ్‌నాథ్ ప్రశ్న * భారత్-పాక్ చర్చల రద్దుపై రాజకీయ పార్టీల విచారం * పాక్ తప్పుకోవడానికి ప్రభుత్వం అవకాశమిచ్చింది: కాంగ్రెస్ * ఉగ్రవాదంపై పాక్ వైఖరిని ప్రపంచం ఎదుట బయటపెట్టాం: బీజేపీ న్యూఢిల్లీ/శ్రీనగర్: భారత్-పాకిస్తాన్ల మధ్య జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్ఎస్ఏ) స్థాయి చర్చలు రద్దవటం పట్ల కేంద్ర ప్రభుత్వం సహా వివిధ రాజకీయ పార్టీలు విచారం వ్యక్తం చేశాయి. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తటంపై ఎంతో ఆసక్తిగా ఉన్న పాక్.. ఆ అంశాన్ని ఉఫాలో ఎందుకు లేవనెత్తలేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశ్నించారు. ఎన్ఎస్ఏ చర్చలకు ఉఫాలో నిర్ణయించిన ఎజెండా నుంచి పాక్ పక్కకు మళ్లాల్సింది కాదన్నారు. పొరుగుదేశంతో స్నేహసంబంధాలకు భారత్ ఎప్పుడూ సానుకూలంగా ఉందని, ఆ దిశగా కృషి కొనసాగుతుందని అన్నారు. అయితే.. ప్రభుత్వం పాక్ ఆడిన ఆటలో పావుగా మారిందని, ఉగ్రవాదంపై చర్చల నుంచి పాక్ తప్పించుకోవటానికి అవకాశమిచ్చిందని ప్రతిపక్ష కాంగ్రెస్ ధ్వజమెత్తింది. కానీ.. ఈ చర్చల నుంచి తప్పుకున్న పాక్ వైఖరిని ప్రపంచం ఎదుట తమ సర్కారు బట్టబయలు చేసిందని అధికార బీజేపీ పేర్కొంది. ప్రతి ద్వైపాక్షిక చర్చల్లో అందరి భాగస్వామ్యం కోసం పట్టుపట్టటం వాంఛనీయం కాదని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వేర్పాటువాద హురియత్ నేతలు విమర్శించారు. చర్చలు రద్దుకావటానికి కారణం వారేనని, వెనక్కు తగ్గి ఉండాల్సిందని కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తప్పుపట్టారు. భారత్ - పాక్‌ల మధ్య చర్చలు రద్దుకావటం పట్ల అమెరికా నిరాశ వ్యక్తంచేసింది. ఇరు దేశాలూ త్వరలో చర్చలు పునరుద్ధరించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ పేర్కొన్నారు. ఉఫాలో భారత్, పాక్ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లు నిర్ణయించిన మేరకు.. పాక్ ఎన్ఎస్ఏ సర్తాజ్ అజీజ్ సోమవారం ఢిల్లీలో భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్‌తో సమావేశమై చర్చలు జరపాల్సి ఉండగా.. అజీజ్ ఢిల్లీలో హురియత్ నేతలను కలవరాదని, చర్చల్లో ఉగ్రవాదం మినహా మరో అంశాన్ని లేవనెత్తరాదని భారత్ స్పష్టంచేయటంతో పాక్ ఆ చర్చలను శనివారం నాడు రద్దుచేసుకున్న విషయం తెలిసిందే. పాక్ నేతలు భారత్ వచ్చినపుడు హురియత్ నేతలను కలవటం మామూలేనని, కశ్మీర్ అంశం లేనిదే చర్చలు నిష్ర్పయోజనమని పేర్కొన్న పాక్.. ఈ అంశాలపై భారత్ ముందస్తు షరతులు పెడుతోందని ఆరోపిస్తూ చర్చలు రద్దుచేసుకుంది. అయితే.. తాము ముందస్తు షరతులు పెట్టలేదని.. ఉఫాలో ఒప్పందం సందర్భంగా నిర్ణయించిన ఎజెండా ప్రకారం కేవలం ఉగ్రవాదం, దానికి సంబంధించిన అంశాలపైనే చర్చ జరపాలని, సిమ్లా ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక చర్చల్లో మూడో పక్షానికి తావులేదని.. ఈ రెండు ఒప్పందాల స్ఫూర్తిని గౌరవించాలని మాత్రమే తాము చెప్తున్నామని భారత ప్రభుత్వం పేర్కొన్న విషయమూ విదితమే. ఈ పరిణామాలపై ఆయా పార్టీల ప్రతిస్పందనలివీ... మూడో పక్షానికి తావులేదు: కేంద్రం ‘‘కశ్మీర్ అంశాన్ని లేవనెత్తటంపై ఎంతో ఆసక్తిగా ఉన్న పాక్ ఉఫాలో ఇరు దేశాల ప్రధానులు కలిసినప్పుడు ఆ విషయాన్ని ఎందుకు లేవనెత్తలేదు? అది ఎజెండాలో ఎన్నడూ లేదు. ఎన్ఎస్ఏల చర్చలు రద్దుకావటం విచారకరం. ఉఫాలో ఇరువురు ప్రధానుల సమావేశం సందర్భంగా నిర్ణయించిన ఎజెండా నుంచి పాక్ దారిమళ్లాల్సింది కాదు. ఎన్ఎస్ఏ చర్చల్లో మూడో పక్షానికి (హురియత్) తావులేదు. ఈ చర్చలకు ముందు కానీ, మధ్యలో కానీ, తర్వాత కానీ ఇతరులతో చర్చలు జరపటమనే ప్రశ్నే లేదు. ముందు నిర్ణయించినట్లు ఉగ్రవాదంపై పాక్ చర్చలు జరపాల్సింది. భవిష్యత్తులో ఎలాంటి చర్చలైనా సాధ్యమవుతాయా లేదా అన్నది పాక్ పైనా ఆధారపడి ఉంది.’’ - రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోంమంత్రి పాక్ ఆటలో పావు అయింది: కాంగ్రెస్ ‘‘పాక్ ఆడిన ఆటలో కేంద్ర ప్రభుత్వం నిక్కచ్చిగా లేకపోవటం, సంసిద్ధంగా లేకపోవటం, దృష్టి కేంద్రీకరించి లేకపోవటం వల్ల పావుగా మారింది. ఉగ్రవాదంపై చర్చల నుంచి తప్పుకుపోవటానికి ఆ దేశానికి అవకాశమిచ్చింది.’’ - అభిషేక్సింఘ్వీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాక్ వైఖరి తేటతెల్లమైంది: బీజేపీ ‘‘చర్చల నుంచి పాక్ వైదొలగటం చాలా విచారకరం. ఉగ్రవాదంపై చర్చిస్తే ప్రపంచం ఎదుట తన బండారం బయటపడుతుందని పాక్‌కు తెలుసు. చర్చల నుంచి పాక్ వైదొలగటంతో.. ఉగ్రవాదం విషయంలో ప్రపంచ వేదికపై ఆ దేశ వైఖరిని మా ప్రభుత్వం బట్టబయలు చేసింది.’’ - సంబిత్పాత్రా, బీజేపీ అధికార ప్రతినిధి ‘‘వేర్పాటు నేతలను కలవాలని పాక్ ఎన్ఎస్ఏ పట్టుపట్టటం సరికాదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎస్పీ పూర్తి మద్దతు ఇస్తోంది.’’ - రామ్‌గోపాల్‌యాదవ్, ఎస్పీ నేత ‘‘హురియత్ నేతలు పాక్ దౌత్యకార్యాలయంలో కార్యక్రమానికి హాజరుకాకుండా ఏ చట్టం కింద నిరోధించవచ్చు? మోదీ నరేంద్రమోదీ మాట్లాడాలి. నా జీవితంలో అత్యంత నిరుత్సాహకరమైన వ్యక్తి ఆయన.’’ - రాంజెఠ్మలాని, బీజేపీ మాజీ నేత లేహ్‌లో పారికర్ పర్యటన.. లదాఖ్ సరిహద్దుల వెంట, సీమాంతర చొరబాట్ల విషయంలో రక్షణ సంసిద్ధత సహా జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితిని రక్షణమంత్రి మనోహర్ పారికర్ ఉన్నతస్థాయి సైనికాధికారులతో సమీక్షించారు. లదాఖ్ పర్యటనలో భాగంగా పారికర్ సైన్యం చీఫ్ జనరల్ దల్బీర్సింగ్తో కలిసి ఆదివారం లేహ్ వచ్చారు. భారత్‌ను తప్పుపట్టిన పాక్ మీడియా భారత్-పాక్‌ల మధ్య ఎన్ఎస్ఏ స్థాయి చర్చలు రద్దుకావటానికి.. ముందస్తు షరతులు పెట్టిన భారత్ వైఖరే కారణమని పాక్ మీడియా తప్పుపట్టింది. ప్రధాన వార్తాపత్రికలన్నీ చర్చల రద్దు కావటంపై ఆదివారం తొలి పేజీలో కథనాలు ప్రచురించాయి. పాక్ ఎన్ఎస్ఏ ఢిల్లీలో భారత్ ఎన్ఎస్ఏను కలసి ఉగ్రవాదం సహా అన్ని అంశాలపైనా చర్చించాల్సి ఉందని.. కానీ భారత్ ముందస్తు షరతులు పెట్టిందని.. దానివల్లే చర్చలు రద్దయ్యాయని విమర్శించాయి. డాన్, న్యూ ఇంటర్నేషనల్, ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తదితర పత్రికలు భారత్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టాయి. గిలానీ సదస్సు ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు శ్రీనగర్: అతివాద హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీ గిలానీ ఆదివారం శ్రీనగర్‌లోని తన నివాసంలో పార్టీ సదస్సు నిర్వహించటానికి చేసిన ప్రయత్నాన్ని ప్రభుత్వాధికారులు విఫలం చేశారు. హైదర్‌పోరాలోని గిలానీ నివాసానికి వెళ్లే ఎయిర్పోర్ట్ రోడ్ వెంట భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి దారిని మూసివేశారు. దీంతో ఆగ్రహించిన హురియత్ కార్యకర్తలు సమీపంలోని ప్రార్థనామందిరం వద్ద సమావేశమై.. పోలీసు వలయం నుంచి దూసుకెళ్లటానికి ప్రయత్నించారు. కార్యకర్తలకు, పోలీసులకు ఘర్షణ తలెత్తింది. కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కానన్, లాఠీలు, బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. డీజీఎంఓ చర్చలు జరుగుతాయి: పాక్ ఇస్లామాబాద్: ఎన్ఎస్ఏ స్థాయి చర్చలను రద్దు చేసుకున్న పాకిస్తాన్.. ఆ మరుసటి రోజే రెండు దేశాల డీజీఎంఓల (డెరైక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) భేటీలు యథావిధిగా జరుగుతాయని పేర్కొంది. ఉఫా ప్రకటన మేరకు పాక్ రేంజర్లు - బీఎస్ఎఫ్ ప్రతినిధుల చర్చలు జరుగుతాయని పాక్ ఎన్ఎస్ఏ సర్తాజ్ అజీజ్ ఆదివారం వెల్లడించారు. వచ్చే నెల 6న నిర్ణయించిన ఈ భేటీకి.. మరింత వ్యవస్థీకరణ అవసరమన్నారు. ఎన్ఎస్ఏ చర్చల రద్దుకు భారతే కారణమన్నారు. ‘‘కశ్మీర్ అంశంపై చర్చలు జరపటం ఉద్రిక్తతను తగ్గిస్తుంది. ఉఫా భేటీ లక్ష్యం.. ఉద్రిక్తతను తగ్గించటం. కాబట్టి కశ్మీర్‌పై చర్చించాల్సిన అవసరముంది’’ అని అన్నారు.