
న్యూఢిల్లీ: ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 18న క్వాలిఫయర్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఆ తర్వాత రోజే దాయాది పాకిస్తాన్‌తో భారత్ మరో మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో వరుసగా రెండు రోజులు వన్డే మ్యాచ్‌లు ఎలా ఆడతారని ఓ ఇంటర్య్వూలో వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు. రెండు వన్డేలకు మధ్య ఓ ప్లేయర్‌కు 24 నుంచి 48 గంటల సమయం అవసరం కాగా, షెడ్యూల్ కూర్పు సరిగా లేదని మండిపడ్డాడు.
‘ఆసియా కప్ షెడ్యూల్ చూసి షాక్‌కు గురయ‍్యా. ఆ టోర్నీ కోసం అంత బాధ పడాల్సిన పనిలేదు. ఆ టోర్నీ ఆడకండి. దాని బదులు టీమ్‌ను హోమ్ లేదా విదేశీ సిరీస్‌లకు సిద్ధం చేయండి. వరుసగా రెండు రోజులు ఎవరూ వన్డేలు ఆడరు. టీ 20 మ్యాచ్‌లకే రెండు రోజుల విరామం ఉంటుంది. అటు వంటిది వరుసగా రెండు వన్డేల ఎలా ఆడతారు. ఇలాంటి షెడ్యూల్ వల్ల భారత్‌పై పాకిస్తాన్ పైచేయి సాధించే అవకాశం ఉంది’ అని సెహ్వాగ్ తేల్చి చెప్పాడు.
చదవండి: ఇది బుర్రలేని షెడ్యూల్
Comments
Please login to add a commentAdd a comment