భారత్, పాక్ అలా ఆడే ప్రసక్తే లేదు!
ద్వైపాక్షిక సిరీస్ ఆడబోవని తేల్చిచెప్పిన అమిత్ షా
ముంబై: భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు పునరుద్ధరించే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. భారత్, పాక్ జట్లు పరస్పరం అంతర్జాతీయ టోర్నమెంటుల్లో మాత్రమే ఆడుతాయని, అంతకుమించి భారత్‌లో పాకిస్థాన్, పాకిస్థాన్‌లో భారత్ క్రికెట్ ఆడబోవని ఆయన చెప్పారు.
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్, పాక్ జట్లు తలపడుతున్న నేపథ్యంలో ఈ విషయమై విలేకరుల ప్రశ్నలకు స్పందించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఐసీసీ టోర్నమెంట్‌లలో మ్యాచ్‌లు ఆడటం తప్పించి.. నేరుగా ఈ రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడక చాలారోజులవుతోంది.