భారత్-పాక్ మధ్య అణు యుద్ధం తప్పదు!
కరాచీ: కశ్మీర్ కోసం భారత్-పాక్ మధ్య అణు యుద్ధం తప్పదని హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ హెచ్చరించారు. ఈ విషయంలో ఇప్పటికే మూడు సార్లు యుద్ధం జరిగిందని, కశ్మీర్ ప్రజలు రాజీ పడేందుకు సిద్ధంగా లేనందున నాలుగోసారీ యుద్ధం జరగొచ్చని చెప్పారు. కశ్మీరీలకు నైతికంగా మద్దతిచేందుకు పాక్ కట్టుబడి ఉందని, పాక్ సహకరిస్తే ఇరు దేశాల మధ్య అణు యుద్ధం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఆదివారం విలేకరులతో సలాహుద్దీన్ మాట్లాడుతూ.. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వాని హత్య.. కశ్మీర్ కోసం జరుగుతున్న పోరాటానికి కొత్త అర్థాన్నిచ్చిందన్నారు.