nuclear war
-
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం?
రష్యాపై యూఎస్ తయారీ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్ దాడులు. తీవ్రస్థాయిలో మండిపడుతున్న రష్యా. దీన్ని అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణిస్తామని ప్రకటన. అణు దాడితో దీటుగా బదులిచ్చేందుకు వీలుగా రష్యా అణు విధానాన్ని సవరిస్తూ అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం. ‘ఏ క్షణాన్నయినా అణు యుద్ధం ముంచుకు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి’ అంటూ ప్రజలకు యూరప్ దేశాల ‘వార్ గైడ్‌లైన్స్’. సోమవారం ఒక్క రోజే శరవేగంగా జరిగిన తీవ్ర ఆందోళనకర పరిణామాలివి! ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి తెర తీసి సరిగ్గా 1,000 రోజులు పూర్తయిన నాడే చోటుచేసుకున్న ఈ తీవ్ర పరిణామాలు గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే నాల్కలు చాస్తున్న యుద్ధ జ్వాలలు మరింతగా విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న ఆందోళనలు సర్వత్రా తలెత్తుతున్నాయి.అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ విజయంతో ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడుతుందని, పశ్చిమాసియా కల్లోలమూ కాస్త అదుపులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇందుకు బీజం పడింది. అమెరికా అందజేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాలో సుదూర లక్ష్యాలపై దాడుల నిమిత్తం వాడేందుకు ఉక్రెయిన్‌కు ఆయన అనుమతివ్వడం ఒక్కసారిగా ఉద్రిక్తతలను రాజేసింది. దీన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ మంగళవారమే రష్యాపై యూఎస్ దీర్ఘశ్రేణి ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టం (ఏటీఏసీఎంస్) బాలిస్టిక్ క్షిపణులను ఎడాపెడా ప్రయోగించింది. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతమే లక్ష్యంగా దాడులకు దిగింది. ఈ క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి. అలాంటి చర్యలకు దిగితే తీవ్రస్థాయి ప్రతిస్పందన తప్పదని ఇప్పటికే హెచ్చరించిన రష్యా ఈ పరిణామంపై భగ్గుమంది. తమ భూభాగాలపైకి కనీసం ఆరు అమెరికా తయారీ ఏటీఏసీఎంఎస్ క్షిపణులు వచ్చి పడ్డాయని ధ్రువీకరించింది. వాటిలో ఐదింటిని కూల్చేయడంతో పాటు ఆరో దాన్నీ ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా అణు దాడులు! తాజా పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడుతున్నారు. మంగళవారం ఆయన రక్షణ తదితర శాఖల అత్యున్నత స్థాయి అధికారులతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ క్షిపణి దాడులను అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణించాలని నిర్ణయించారు. అందుకు వీలు కలి్పంచేలా దేశ అణు విధానానికి సవరణ కూడా చేశారు! దాని ప్రకారం సంప్రదాయ ఆయుధాలతో రష్యాపై జరిగే దాడికి ఏ అణ్వాయుధ దేశమైనా మద్దతిస్తే దాన్ని ఆ రెండు దేశాల సంయుక్త దాడిగానే పరిగణిస్తారు. సదరు దేశాలపై అణు దాడులకు దిగుతారా అన్నదానిపై సవరణలో స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే రష్యాపై భారీ స్థాయి వైమానిక, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణి దాడులు జరిగితే అణ్వాయుధాలతో బదులిచ్చేందుకు అది వీలు కలి్పస్తుండటం విశేషం! అంతేగాక మిత్ర దేశమైన బెలారస్‌పై దుందుడుకు చర్యలకు దిగినా అణ్వాయుధాలతో బదులు చెప్పేందుకు తాజా సవరణ అనుమతించనుంది! ఉక్రెయిన్‌కు మరింత సాయం చేయకుండా యూరప్ దేశాలను నియంత్రించడంతో పాటు అవసరమైతే దానిపై అణ్వాయుధ ప్రయోగానికి, అమెరికాపై సైనిక చర్యకు కూడా దిగడం పుతిన్ తాజా నిర్ణయాల ఉద్దేశమని భావిస్తున్నారు. అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులతో ఉక్రెయిన్ చేసిన తాజా దాడులకు బదులుగానే అణు విధాన సవరణ జరిగిందా అన్న ప్రశ్నకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ నేరుగా బదులివ్వలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా అణు విధానాన్ని అప్డేట్ చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారంటూ నర్మగర్భంగా స్పందించారు. ఇటీవలి కాలంలో రష్యా అణు విధానానికి పుతిన్ సవరణ చేయడం ఇది రెండోసారి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా సైన్యం కూడా ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొంటుండటం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అమెరికా ఇప్పటికే ప్రకటించింది. దీర్ఘశ్రేణి క్షిపణుల వాడకానికి అనుమతి దాని పర్యవసానమేనంటున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ జ్వాలలు త్వరలో కొరియా ద్వీపకల్పం దాకా విస్తరించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బైడెన్ మతిలేని విధానాలతో ట్రంప్ పగ్గాలు చేపట్టే నాటికే ప్రపంచాన్ని పెనుయుద్ధం ముంగిట నిలిపేలా ఉన్నారని ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్ మండిపడటం తెలిసిందే.నిత్యావసరాలు నిల్వ చేసుకోండితాజా పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కన్పిస్తుండటంతో యూరప్ దేశాలు భీతిల్లుతున్నాయి. అలాంటి పరిస్థితే తలెత్తితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ స్వీడన్, ఫిన్లండ్, నార్వే, డెన్మార్క్ తదితర నాటో సభ్య దేశాలు తమ పౌరులను హెచ్చరించడం విశేషం. ‘‘ఏ క్షణంలోనైనా అణు యుద్ధం ముంచుకు రావచ్చు. సిద్ధంగా ఉండండి’’ అంటూ స్వీడన్ ఏకంగా ఇంటింటికీ కరపత్రాలే పంచుతోంది. ‘సంక్షోభమో, యుద్ధమో వస్తే...’ అనే శీర్షికతో కూడిన 52 లక్షల కరపత్రాలను సోమవారం నుంచి వారం పాటు పంచనుంది! అది నిజానికి 32 పేజీలతో కూడిన డాక్యుమెంట్. ‘‘మనపై ఎవరైనా దాడికి తెగబడితే దేశ స్వాతంత్య్ర పరిరక్షణకు అందరమూ ఒక్కటవుదాం’’ అని అందులో పౌరులకు స్వీడన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాంతోపాటు, ‘‘పిల్లల డైపర్లు, బేబీ ఫుడ్, దీర్ఘకాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు, మంచినీరు తదితరాలన్నింటినీ వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’’ అని సూచించింది. అంతేగాక బాంబు దాడులు జరిగితే వాటిబారి నుంచి ఎలా తప్పించుకోవాలి, గాయపడితే రక్తస్రావాన్ని నిరోధించేందుకు, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి, యుద్ధ బీభత్సం చూసి భీతిల్లే చిన్నారులను ఎలా సముదాయించాలి వంటి వివరాలెన్నో పొందుపరిచింది.‘‘పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వీడన్ ఇలాంటి చర్యకు దిగడం ఇది ఐదోసారి. నార్వే కూడా ఇలాంటి ‘యుద్ధ’ జాగ్రత్తలతో ప్రజలకు ఎమర్జెన్సీ పాంప్లెంట్లు పంచుతోంది. ‘పూర్తిస్థాయి యుద్ధంతో పాటు ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే వారం దాకా ఇల్లు కదలకుండా గడిపేందుకు సిద్ధపడండి’ అంటూ అప్రమత్తం చేస్తోంది. డెన్మార్క్ కూడా కనీసం మూడు రోజులకు పైగా సరిపడా సరుకులు, మంచినీరు, ఔషధాలు తదితరాలు నిల్వ ఉంచుకోవాలంటూ తన పౌరులందరికీ ఇప్పటికే ఈ–మెయిళ్లు పంపింది! ఫిన్లండ్ కూడా అదే బాట పట్టింది. ‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండండి. నిత్యావసరాలను వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’ అంటూ తన పౌరులకు ఆన్లైన్ బ్రోషర్లు పంపింది.అపారంగా అణ్వాయుధాలు రష్యా వద్ద వేలాదిగా అణ్వాయుధాలు పోగు పడి ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో అణు వార్హెడ్లున్న దేశం రష్యానే. 1994లో సోవియట్ నుంచి విడిపోయేనాటికి ఉక్రెయిన్ వద్ద కూడా భారీగానే అణ్వాయుధాలుండేవి. ఆ జాబితాలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశంగా ఉక్రెయిన్ ఉండేది. కానీ రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణ్వాయుధాలన్నింటినీ నాశనం చేసింది. కాకపోతే అమెరికాతో పాటు అణు సంపత్తి ఉన్న పలు దేశాలు ఉక్రెయిన్‌కు దన్నుగా ఉన్నాయి.క్షిపణులే మాట్లాడతాయి భారీ క్షిపణి దాడులకు మాకు అనుమతి లభించిందంటూ మీడియా ఏదేదో చెబుతోంది. కానీ దాడులు జరిగేది మాటలతో కాదు. వాటిని ముందుగా చెప్పి చేయరు. ఇక మా తరఫున క్షిపణులే మాట్లాడతాయి. – ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Russia Ukrain War: అణుయుద్ధంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు
మాస్కో: దేశంలో సాధారణ ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా గనుక తన సేనలను పంపితే తాము అణు యుద్ధానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. మార్చ్ 15 నుంచి 17 వరకు దేశంలో ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడారు. ప్రస్తుతానికి అణుయుద్ధం చేయాల్సిన పరిస్థితులు లేవని, ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు వాడాల్సిన అవసరం తనకు కనిపించడం లేదన్నారు. అయితే మిలిటరీ, సాంకేతిక కోణంలో తాము అణుయుద్ధం చేసేందుకు అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నామని పుతిన్ బాంబు పేల్చారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో చర్చలకు పుతిన్ సిద్ధంగా లేరని అమెరికా ప్రకటించిన తర్వాత అణుయుద్ధంపై రష్యా అధ్యక్షుడు స్పందించడం గమనార్హం. 1962 క్యూబన్ మిసైల్ సంక్షోభం తర్వాత మళ్లీ ప్రస్తుత ఉక్రెయిన్ యుద్ధం తర్వాతే రష్యా, పశ్చిమ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 2022 ఫిబ్రవరిలో వేలాది మంది రష్యా సైనికులను ఉక్రెయిన్‌కు పంపి ఆ దేశంతో పూర్తిస్థాయి యుద్ధానికి పుతిన్ తెరలేపారు. కాగా, అమెరికా సేనలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశిస్తే యుద్ధం తీవ్రస్థాయికి చేరుతుందని, తాము అణ్వాయుధాలు వాడాల్సి వస్తుందని పుతిన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఇదీ చదవండి.. దాదాపు 70 ఏళ్ల తర్వాత రీ మ్యాచ్ -
Russia-Ukraine war: మరింత జోక్యంతో అణు యుద్ధమే
మాస్కో: ఉక్రెయిన్‌లోని లక్ష్యాలను సాధించే వరకు తమ యుద్ధం కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్‌కు అండగా సైన్యాలను పంపించడం ద్వారా మరింత లోతుగా జోక్యం చేసుకోవాలని చూస్తే అణు యుద్ధం తప్పదని పశ్చిమ దేశాలను ఆయన హెచ్చరించారు. వచ్చే నెల్లో దేశాధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో పుతిన్ విజయం ఇప్పటికే ఖరారైంది. ఎన్నికలను పురస్కరించుకుని గురువారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. యుద్ధంలో పుతిన్ విజయం యూరప్‌లో తీవ్ర విపరిణామాలకు దారి తీస్తుందని, దీనిని నివారించేందుకు నాటో దేశాలు ఉక్రెయిన్‌లోకి ప్రత్యక్షంగా బలగాలను పంపించే అవకాశాలు సైతం ఉన్నాయంటూ ఫ్రాన్సు అధ్యక్షుడు మాక్రాన్ ఇటీవల చేసిన హెచ్చరికలపై ఆయన పైవిధంగా స్పందించినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. ‘గతంలో మన దేశంలోకి సైన్యాన్ని పంపించిన వారికి ఎలాంటి గతి పట్టిందో మనకు తెలుసు. మళ్లీ అటువంటిదే జరిగితే ఈసారి పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయి. మన వద్ద కూడా పశ్చిమదేశాల్లోని లక్ష్యాలను చేరగల ఆయుధాలున్న సంగతిని వాళ్లు గుర్తుంచుకోవాలి. ఆ దేశాలు చేస్తున్న ప్రకటనలు ప్రపంచాన్ని భయపెడు తున్నట్లుగా అగుపిస్తోంది. ఇవన్నీ నిజమైన అణు సంఘర్షణ ముప్పును మరింతగా పెంచుతున్నాయి. దానర్థం మానవ నాగరికత విధ్వంసం. యుద్ధంతో ఎదురయ్యే పెను సవాళ్లు, అణు యుద్ధం తాలూకూ పరిణామాలు వాళ్లకు అర్థం కావా?’అని పుతిన్ ప్రశ్నించారు. ‘దేశం పూర్తిస్థాయి అణు యుద్ధ సన్నద్ధతతో ఉంది. ఎంతో శక్తివంతమైన నూతన ఆయుధాలను సైన్యం మోహరించింది. వాటిలో కొన్నిటిని ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధక్షేత్రంలో ప్రయోగించి చూసింది’ అని చెబుతూ ఆయన శక్తివంతమైన బురెవెస్ట్నిక్ అణు క్రూయిజ్ క్షిపణి వంటి వాటిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాటో దేశాలపై రష్యా దాడి చేసే ప్రమాదముందంటూ పశ్చిమదేశాలు చేస్తున్న ప్రకటనలను భ్రమలుగా అధ్యక్షుడు పుతిన్ కొట్టిపారేశారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పైకి భారీగా సైన్యాన్ని పంపించినప్పటి నుంచి పుతిన్ అణు ముప్పుపై పశ్చిమ దేశాలను పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. -
అవసరమైతే అణుబాంబు వాడతాం.. భారత్‌కు పాక్ మంత్రి బెదిరింపులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మంత్రి షాజియా మర్రి నోరుపారేసుకున్నారు. భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. తమ వద్ద అణుబాంబు ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. అవసరమైతే దాన్ని ఉపయోగించేందుకు తాము వెనుకాడబోమని పరోక్షంగా అణుయుద్ధం బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రధాని మోదీ ప్రభుత్వం యుద్ధానికి దిగితే తాము దీటుగా బదులిస్తామని భేషజాలకు పోయారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ.. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరునాడే షాజియా భారత్‌పై నోరుపారుసుకోవడం చూస్తుంటే.. వాళ్ల అక్కసు స్పష్టమవుతోంది. కాగా.. మోదీపై భుట్టో అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శనివారం దేశ్యవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఆమె దిష్టిబొమ్మను దహనం చేసింది. భారత్‌లో మోదీ గాంధీ సిద్ధాంతాలను కాకుండా హిట్లర్ సిద్ధాంతాలను అనుసరిస్తున్నారని భుట్టో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఉత్తర కొరియా మిసైల్ ప్రయోగం.. జపాన్‌లో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటన -
అణు యుద్ధంపై మరోమారు పుతిన్ వ్యాఖ్యలు.. ఏం జరుగుతోంది?
మాస్కో: అణ్వాయుధాల వినియోగంపై మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రస్తుతం అణు యుద్ధం ముప్పు పెరుగుతోందని, అయితే, తాము అణ్వాస్త్రాలను వినియోగించబోమని పేర్కొన్నారు. రష్యాలోని మానవ హక్కుల మండలితో వర్చువల్‌గా మాట్లాడారు పుతిన్. ఈ సందర్భంగా అగ్రరాజ్యం అమెరికాపై పరోక్ష విమర్శలు చేశారు. ‘ఉక్రెయిన్‌లో యుద్ధం సుదీర్ఘంగా సాగుతున్న ప్రక్రియ. అణు యుద్ధం ముప్పు పెరుగుతోందనడంలో అనుమానాలు లేవు. ఏ పరిస్థితిలోనూ రష్యా మొదట అణ్వాయుదాలను ప్రయోగించదు. వాటిని చూపించి బెదిరించదు. అణ్వాయుధాల సంగతి మాకు తెలుసు. అందుకే ఉన్మాదంగా వ్యవహరించబోం. ప్రపంచమంతా తిరుగుతూ ఆ ఆయుధాలను బ్రాండింగ్ చేసుకోం. ప్రపంచంలోనే అత్యాధునిక అణ్వాస్త్రాలు రష్యా వద్ద ఉన్నాయి. ఇతర దేశాల భూభాగాలపై మా అణ్వాయుధాలు లేవు.’ అని పేర్కొన్నారు పుతిన్. టర్కీ, ఇతర ఐరోపా దేశాల్లో అమెరికాకు చెందిన న్యూక్లియర్ బాంబ్స్ ఉండడాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. కేవలం ఆత్మ రక్షణకే రష్యా న్యూక్లియర్ వెపన్స్ వాడుతుందన్నారు. ఇదీ చదవండి: టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా జెలెన్స్కీ -
‘పుతిన్ ‘అణు’ బెదిరింపులు జోక్ కాదు’.. బైడెన్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ను కొద్ది వారాల్లోనే తన వశం చేసుకుంటుందనుకున్నప్పటికీ రష్యాకు ఊహించని విధంగా ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ క్రమంలో పలు సందర్భాల్లో అణు బాంబుల అంశాన్ని తెరపైకి తెచ్చారు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ యుద్ధంలో పశ్చిమ దేశాలు కలుగజేసుకుంటే.. న్యూక్లియర్ వార్ తప్పదని హెచ్చరించారు. తాజాగా.. పుతిన్ అణు హెచ్చరికలు జోక్ కాదని, న్యూక్లియర్ బాంబులు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. 1962లో క్యూబా మిసైల్ సంక్షోభం తర్వాత తాము ఈ స్థాయి తీవ్రమైన అణు ముప్పును చూడలేదని పేర్కొన్నారు. మాన్‌హట్టన్‌లో గురువారం నిర్వహించిన డెమొక్రాటిక్ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమంలో మాట్లాడారు బైడెన్. ఉక్రెయిన్ను ఆక్రమించాలనే లక్ష్యం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్న అణు బెదిరంపులు ఏమాత్రం జోక్ కాదని వివరించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే క్యూబా మిసైల్ సంక్షోభం తర్వాత తొలిసారి అమెరికా ప్రత్యక్షంగా అణుదాడి ముప్పును ఎదుర్కొంటుందని బైడెన్ పేర్కొన్నారు. అణు దాడిపై బైడెన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఉక్రెయిన్ విలీన భూభాగాలను కాపాడుకొనేందుకు దారులు మూసుకుపోతే అణుదాడి చేస్తానని పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే.. ఇది కేవలం టాక్టికల్ అణ్వాయుధాలను దృష్టిలో పెట్టుకొని చేసిన హెచ్చరికగా నిపుణులు భావిస్తున్నారు. కానీ, ఇటువంటి అణ్వాయుధాలు కూడా తీవ్రస్థాయి సంక్షోభానికి కారణమవుతాయని బైడెన్ హెచ్చరించారు. ‘పుతిన్ జోక్ చేయడంలేదు. అతడు టాక్టికల్ అణ్వాయుధాలు లేదా జీవాయుధాలు లేదా రసాయన ఆయుధాల వినియోగం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వారి సైన్యం ఆశించిన స్థాయిలో పోరాడటంలేదు. ఇది కేవలం అణ్వాయుధ వినియోగంతోనే ముగియదు. పుతిన్‌ను ఆ మార్గం నుంచి ఎలా తప్పించాలనే అంశంపై మేం కసరత్తు చేస్తున్నాం. కేవలం పుతిన్‌ను ఆ స్థానం నుంచి తప్పించడమే కాదు.. అతణ్ని ఓడించడం, రష్యాలో ఆయన్ను బలహీన పర్చడంపై కూడా పనిచేస్తున్నాం’ అని అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: Ukraine Russia War: ఉక్రెయిన్‌లో మళ్లీ రష్యా క్షిపణి దాడులు -
అణుయుద్ధం జరిగినప్పుడూ... జుట్టుకి కండీషనర్ వద్దు ఎందుకంటే?...
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. అదీగాక గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ సేనలు పుంజుకుంటూ రష్యా నియంత్రణలో ఉన్న ప్రాంతాలన్నింటిని తిరిగి స్వాధీనం చేసుకుంటూ విజయ ఢంకా మోగించనుంది. ఈ తరుణంలో ఉక్రెయిన్‌కి అడ్డుకట్టేవేసేలా... రష్యా అధ్యక్షుడు పుతిన్ పెద్ద సంఖ్యలో సైనిక బలగాలను సమీకరిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఒక వేళ రష్యా ఓడిపోతానన్న అనుమానం తలెత్తిన వెంటనే అణుదాడులకు దిగుతుందని ప్రపంచ దేశాలు భయాందోళనలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అణుయుద్ధం జరిగేటప్పుడూ జుట్టుకి కండిషనర్‌ని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని స్వయంగా పుతిన్ చెప్పినట్లు అమెరికా చెబుతుంది. ఈ మేరకు అమెరికా తన పౌరులకు అలాంటి విపత్కర సమయాల్లో చేయాల్సినవి, చేయకూడనవి విషయాలు గురించి వివరించింది. అణు యుద్ధం సమయంలో హెయిర్ కండీషనర్ వినియోగించటం ప్రాణాంతకమని పేర్కొంది. అంతేగాదు అణుబాంబు పేలితే రేడియోధార్మిక ధూళిని మేఘాలు గాల్లోకి నెట్టేస్తాయి. అలాంటి సమయాల్లో వీలైనంత త్వరగా షాంపుతో తల స్నానం చేయాలని సూచించింది. దీనివల్ల సురక్షితంగా ఉండే అవకాశాలు ఎక్కువ శాతమని తెలిపింది. తలస్నానం చేసిన వెంటనే కండీషనర్‌ని మాత్రం వినియోగించొద్దు అని సలహ ఇచ్చింది. షాంపూ జుట్టుని శుభ్రపరిస్తే..కండీషనర్‌లోని సర్ఫ్యాక్టెంట్లు నీటీని, నూనెను ఆకర్షిస్తాయని చెప్పింది. ఈ కండీషనర్, మీ జుట్టుకి రేడియోధార్మిక వంటి పదార్థాల మధ్య జిగురులా పని చేస్తుంది. దీంతో ఈ రేడియోథార్మిక పదార్థాలు జుట్టును గట్టిగా అంటిపెట్టుకుని ఉండిపోతాయని, దీంతో ప్రాణాంతకంగా మారుతోందని అమెరికా హెచ్చరించింది. అలాగే ఇలాంటి అణు విస్పోటనం జరిగినప్పుడూ...రేడియేషన్‌ని నివారించటానికి ఇటుక లేదా కాంక్రీట్ భవనంలో ఆశ్రయం పొందాలని, కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకకూడదని సూచించింది. (చదవండి: ఉక్రెయిన్‌ని నివారించేలా రష్యా ఎత్తుగడ.. పశ్చిమ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్) -
అదే జరిగితే.. 500 కోట్లమంది బతుకులు ఖతం!
న్యూజెర్సీ: ప్రకృతికి బదులు.. సృష్టి వినాశనానికి ఇప్పుడు మనిషే కారణం అయ్యేలా కనిపిస్తున్నాడు. అందునా అణు యుద్ధం ప్రత్యక్షంగా కంటే.. పరోక్షంగానే వందల కోట్ల మందిని బలి తీసుకుటుందనే ఊహా.. భయాందోళనలను రేకెత్తిస్తోంది ఇప్పుడు. న్యూజెర్సీ రూట్గెర్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు.. అణు యుద్ధాలతో తలెత్తబోయే సంక్షోభాల మీద ఒక సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. దీని ప్రకారం.. ఆధునిక అణుయుద్ధం వల్ల తాండవించే కరువు, ఆహారపంటల లేమి ద్వారానే ఎక్కువ మంది బలైపోతారని.. ఆ సంఖ్య సుమారు ఐదు బిలియన్లు(ఐదు వందల కోట్ల మందికిపైనే) ఉంటుందని పేర్కొన్నారు. అణ్వాయుధాల పేలుడుతో వాతావరణంలో సూర్యకాంతి నిరోధించే మసి ద్వారా ఆహార కొరత ఏర్పడుతుందని.. ప్రాణాంతకమైన పేలుళ్ల వల్ల కలిగే ప్రాణనష్టం కంటే ఇది చాలా ఎక్కువని ఆ బృందం అభిప్రాయపడింది. ఒకవేళ అమెరికా-రష్యా మధ్య గనుక అణు యుద్ధం జరిగితే.. సగం మానవ జనాభా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ మేరకు యుద్ధ ప్రభావంతో ఏయే దేశంలో ఎంతమేర ఆహార పంటలపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్పిరిక్ రీసెర్చ్ ద్వారా సేకరించింది శాస్త్రవేత్తల బృందం. అంతెందుకు భారత్-పాక్ మధ్య గనుక చిన్నపాటి యుద్ధం జరిగినా.. ఆ పరిణామం ప్రపంచ ఆహారోత్పత్తి మీద పెను ప్రభావం చూపుతుందని ఆ బృందం వెల్లడించింది. ఐదేళ్లలో ఇరు దేశాల్లో ఏడు శాతం పంట దిగుబడి తగ్గిపోతుందని.. అదే అమెరికా-రష్యాల మధ్య జరిగే యుద్ధం జరిగితేగనుక.. మూడు నుంచి నాలుగేళ్లలో 90 శాతం ఉత్పత్తి పడిపోతుందని తెలిపింది. ఈ ముప్పు నుంచి తప్పించుకునేందుకు తీసుకునే చర్యలు చేపట్టినా.. రాబోయే పెనుఉపద్రవం ముందు ఆ చర్యలు పెద్దగా ప్రభావం చూపెట్టకపోవచ్చనే అభిప్రాయపడింది న్యూజెర్సీ రూట్గెర్స్ యూనివర్సిటీ సైంటిస్టుల బృందం. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలోనే.. ఈ బృందం ఈ తరహా అధ్యయనానికి చేపట్టింది. పైగా అణు యుద్ధం తలెత్తవచ్చంటూ గతంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చేసిన కామెంట్లను సైతం పరిశీలనలోకి తీసుకుంది. ఈ అధ్యయానికి సంబంధించిన విషయాలు నేచర్ ఫుడ్ జర్నల్‌లో తాజాగా ప్రచురితం అయ్యాయి. ఇదీ చదవండి: భారత్ హెచ్చరికలు బేఖాతరు చేసిన చైనా -
ఎనీ టైం యుద్ధానికి రెడీ!... అగ్రరాజ్యానికి స్ట్రాంగ్ వార్నింగ్!
ఎప్పుడూ ఏదో ఒక అనుహ్య నిర్ణయంతో వార్తలో నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి సంచలన వ్యాఖ్యాలు చేసి షాక్‌కి గురిచేశారు. అగ్రరాజ్యంతో తలపడటానికి రెడీ! అంటూ సవాలు విసిరారు. అదీ కూడా ఉత్తర కొరియా యుద్ధ విరమణ దినోత్సవం రోజున ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కిమ్ ప్రత్యేకత కాబోలు. ఉత్తర కొరియా నాయకుడు కిమి జోంగ్ అమెరికాతో తలపడటానికి తమ దేశం రెడీగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు కిమ్ జోంగ్ ఉన్ తమ దేశం అమెరికాతో అణు యుద్ధం చేయడానికైనా, సైనికులతో దాడి చేయడానికైనా సిద్ధమే అంటూ సవాలు విసిరాడు. అది కూడ జూలై 27 ఉత్తర కొరియా యుద్ధ విరమణ దినోత్సవానికి సంబంధించి 69వ వార్షికోత్సవం సందర్భంగా కిమ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2017 నుంచి ఉత్తర కొరియా అణు పరీక్షలు నిర్వహించినప్పుడే యుద్ధానికి పరోక్షంగా కాలుదువ్వుతున్నట్లు సంకేతం ఇచ్చింది. ఇప్పుడూ అన్నంత పనిచేశాడు కిమ్. ఎప్పటి నుంచే తాము అమెరికా నుంచి అణు బెదిరింపులు ఎదుర్కొంటున్నామని, ఈ నేపథ్యంలోనే తమ ఆత్మరక్షణకై ఈ కీలకమైన చారిత్రత్మక పనికి పూనుకోవాల్సి వచ్చిందని కిమ్ చెబుతున్నాడు. తమ సాయుధ బలగాలు ఎలాంటి దాడినైనా తిప్పికొట్టగల సమర్థవంతమైనవని., అణ్వాయుధాల పరంగా కూడా చాలా బలమైనదని.. తక్షణమే ఈ యుద్ధం చేసేందకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశాడు. అంతేకాదు దక్షిణ కొరియాతో అమెరికా చట్టవిరుద్ధమైన శత్రుచర్యలు కొనిసాగిస్తోందని ఆరోపించాడు. పైగా ఉత్తరకొరియాను అమెరికా పెద్ద శత్రువులా చూపించడమే కాకుండా తన చర్యలను సమర్ధించుకుంటోందంటూ కిమ్ పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. తమ భద్రతకు ముప్పుతెచ్చేలా అమెరికా దక్షిణ కొరియాతో ఉమ్మడి సైనిక విన్యాసాలకు పాల్పడిందని విమర్శించాడు. అమెరికా ద్వంద వైఖరితో దోపిడికి పాల్పడుతుందన్నాడు. ద్వైపాక్షిక సంబందాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తోందంటూ అమెరికాపై విమర్శలతో విరుచుకుపడ్డాడు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్-యోల్ పరిపాలనపై కూడా ఆరోపణలు చేశాడు. తమను అసమర్థ దేశంగా చూపే ఏ ప్రయత్నానైనా గట్టిగా తిప్పికొట్టడమే కాకుండా నాశనం చేయగలమంటూ కిమ్ గట్టిగా హెచ్చరించాడు. ఇదిలా ఉండగా... ఇటీవలే ఉత్తర కొరియా హైపర్సోనిక్ క్షిపణులు పరీక్షించడమే కాకుండా ఇది వ్యూహాత్మక అణ్వాయుధాలను తీసుకువెళ్లగలదని చెబుతుండడం గమనార్హం. (చదవండి: శ్రీలంకలో ఎమర్జెన్సీ పొడిగింపు.. మరో 14 రోజులు సింగపూర్‌లోనే గొటబయ!) -
భారత్‌తో అణు యుద్ధం : పాక్ హెచ్చరిక
ఇస్లామాబాద్ : భారత్‌తో తలపడాల్సి వస్తే అది సంప్రదాయ యుద్ధం కాదని..అణు యుద్ధం అనివార్యమని పాకిస్తాన్ హెచ్చరించింది. తమ ఆయుధాలు ముస్లింలను కాపాడతాయని, కేవలం భారత భూభాగాన్నే లక్ష్యంగా చేసుకుంటాయని తెలిపింది. తమ ఆయుధాలు విస్పష్టంగా లక్ష్యాలకు గురిపెడతాయని పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ అన్నారు. పాక్ టీవీ సామా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్‌పై భారత్ దాడికి దిగితే సంప్రదాయ యుద్ధానికి అవకాశం లేదని, ఇది భీకరంగా సాగే అణుయుద్ధానికి దారితీస్తుందని అన్నారు. పాకిస్తాన్ సంప్రదాయ యుద్ధానికి దిగే అవకాశం లేదని, దీంతో ఏదైనా జరిగితే పొరుగు దేశం అంతమవుతుందని భారత్ గుర్తెరగాలని ఆయన హెచ్చరించారు. కాగా పాకిస్తాన్ అణుయుద్ధం ప్రస్తావన తెస్తూ భారత్‌ను హెచ్చరించడం ఇదే తొలిసారి కాదు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం భారత్‌తో అణు యుద్ధంపై గత ఏడాది పలు సందర్భాల్లో మాట్లాడారు. ఇక కశ్మీర్ అంశంపై చైనా మద్దతు కూడగట్టేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. కశ్మీర్ అంశంతో పాటు భారత్-చైనా సరిహద్దు ప్రతిష్టంభనలపైనా చర్చించేందుకు పాక్ విదేశాంగ మంత్రి మక్దూమ్ షా మహ్మద్ ఖురేషి బీజింగ్ పర్యటనకు బయలుదేరివెళ్లారు. చదవండి : పాక్ కుయుక్తులు : కశ్మీర్‌పై డ్రాగన్‌తో మంతనాలు -
యుద్ధం వస్తే...12.5 కోట్ల ప్రాణ నష్టం
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య అణు యుద్ధమే గనక సంభవిస్తే మానవాళి కనివినీ ఎరగని స్థాయిలో ప్రాణ, పర్యావరణ నష్టం ఉంటుందని ఒక తాజా అధ్యయనంలో బయటపడింది. అణుయుద్ధం ప్రారంభమైన వారం రోజుల్లోనే 5 కోట్ల నుంచి 12.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని పేర్కొంది. అది రెండో ప్రపంచయుద్ధం జరిగిన ఆరేళ్లలో జరిగిన ప్రాణ నష్టం కంటే ఎక్కువని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ ప్రభావం ఉంటుందని పేర్కొంది. భారత్, పాక్‌ల మధ్య ఒకవేళ 2025లో యుద్ధం జరిగితే చోటు చేసుకునే పరిణామాలపై యూనివర్సిటీ ఆఫ్ కొలరాడొ బౌల్డర్, రట్జర్స్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. ప్రస్తుతం భారత్, పాక్‌ల వద్ద సుమారు 150 చొప్పున అణ్వాయుధాలున్నాయని, అవి 2025 నాటికి 200 నుంచి 250 వరకు పెరగగలవన్నారు. భారత్, పాక్ యుద్ధం వల్ల సాధారణ మరణ రేటు ఒక్కసారిగా రెట్టింపు అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడొ బౌల్డర్‌లో ప్రొఫెసర్ అయిన బ్రయాన్ టూన్ పేర్కొన్నారు. ఈ అధ్యయన విశేషాలను ‘సైన్స్ అడ్వాన్సెస్’ అనే జర్నన్‌లో ప్రచురించారు. ‘రెండు దేశాలు భారీగా ఆయుధాలను పెంచుకుంటున్నాయి. ఆ రెండు దేశాల్లో జనాభా కూడా ఎక్కువే. అదీకాక, రెండు దేశాల మధ్య అపరిష్కృత కశ్మీర్ సమస్య ఉంది. అందువల్ల యుద్ధమే వస్తే భారీ ప్రాణ నష్టం తప్పదు’ అని టూన్ వ్యాఖ్యానించారు. అణ్వాయుధ ప్రయోగం వల్ల వెలువడిన 16 నుంచి 36 మిలియన్ టన్నుల సూక్ష్మ కార్బన్ అణువులు కొన్ని వారాల్లోపే ప్రపంచమంతా వ్యాపిస్తాయన్నారు. ఇవి సోలార్ రేడియేషన్‌ను గ్రహించి, గాలిని మరింత వేడెక్కిస్తాయని వివరించారు. అలాగే, సూర్యరశ్మి భూమిని చేరడం 20% నుంచి 35% తగ్గుతుందని, దానివల్ల భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత 2 నుంచి 5 సెల్సియస్ డిగ్రీలు తగ్గుతుందని పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం 15% నుంచి 30% తగ్గుతుందన్నారు. -
భారత్‌తో అణు యుద్ధానికైనా రెడీ
ఇస్లామాబాద్: కశ్మీర్ విషయంలో భారత్‌తో అణుయుద్ధానిౖకైనా సిద్ధమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ మరోసారి బెదిరింపులకు దిగారు. సోమవారం ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. ‘కశ్మీర్ పరిస్థితులు యుద్ధానికి దారి తీస్తే.. గుర్తుంచుకోండి రెండు దేశాల వద్దా అణ్వాయుధాలు ఉన్నాయి. కశ్మీర్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. కశ్మీర్ కోసం ఎంతవరకైనా వెళతాం. అంతర్జాతీయ సమాజం ఇప్పుడు బాధ్యత తీసుకోవాలి, లేదా పాక్ ఏదైనా చేయగలుగుతుంది’అని స్పష్టంచేశారు. అంతర్జాతీయంగా జరిగే ప్రతి సమావేశంలోనూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతానన్నారు. ఈ విషయంలో భారత్‌తో చర్చలు జరపడానికి ప్రయత్నించినా సరైన స్పందన రాలేదని తెలిపారు. భారత్‌లో ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంతో చర్చలు జరపవచ్చని భావించానని అయితే మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దుతో చారిత్రాత్మక తప్పు చేసిందని అన్నారు. ఈ క్రమంలో భారత్ తమ సొంత రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను, ఐక్యరాజ్యసమితి సూచనలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానన్నారు. ముస్లిం దేశాలు పాక్‌కు మద్దతివ్వడం లేదన్న విషయంపై స్పందిస్తూ.. ‘ఆర్థిక సంబంధాల వల్ల వారు ముందుకు రాకపోవచ్చు. కానీ వారంతా కచ్చితంగా కాలంతోపాటు కలిసి రావాల్సిందే. కశ్మీరీలను కాపాడతామని ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఇది ఇప్పుడు వారి బాధ్యత. పుల్వామా వంటి దాడులను సాకుగా చూపి కశ్మీర్ అంశం నుంచి అంతర్జాతీయ సమాజ దృష్టిని మార్చే పనిలో భారత్ ఉంది’అన్నారు. -
అణు యుద్ధం వస్తే..?
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో అణ్వాయుధాల ప్రయోగంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగివుండటంతో యుద్ధం వస్తే వీటిని ప్రయోగించే అవకాశం ఉందన్న భయాందోళన వ్యక్తమవుతోంది. యుద్ధం వద్దని రెండు దేశాల ప్రజలు కోరుకుంటున్నారు. ‘సే నో టు వార్’ అంటూ సోషల్ మీడియాలో నినదిస్తున్నారు. అణు యుద్ధం వస్తే సర్వనాశనం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్, పాకిస్థాన్ అణు యుద్ధానికి దిగితే ఆ ప్రభావం మొత్తం ప్రపంచం మీద ఉంటుందని అమెరికాలోని కొలరాడొ బౌల్డర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రియాన్ టూన్ వెల్లడించారు. అణు యుద్ధం ప్రభావంపై 35 ఏళ్లు అధ్యయనం చేసి గతేడాది డెన్వర్‌లో ‘టెడ్ఎక్స్ టాక్’లో ఆయన ప్రసంగించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అణ్వాయుధాలు ప్రయోగించడానికి ఒక్క అపార్థం చాలని అన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య అణు యుద్ధం వస్తే 200 కోట్ల మంది ఆకలితో మరణిస్తారని నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఇరా హెల్ఫాండ్ అంచనా వేసినట్టు వెల్లడించారు. పూర్తిస్థాయిలో అణు యుద్ధం వస్తే పంటలు పండని పరిస్థితులు దాపురిస్తాయని, 90 శాతం మంది ప్రజలు ఆకలితో చనిపోతారని వివరించారు. ఈ వీడియో ట్విటర్లో విస్తృతంగా షేర్ అవుతోంది. అణ్వాయుధాల దుష్ప్రరిణామాలపై రెడ్‌క్రాస్ సొసైటీ అంతర్జాతీయ కమిటీ కూడా ఒక వీడియో రూపొందించింది. నిమిషం నిడివివున్న ఈ వీడియోలో నిర్ఘాంతపరిచే వాస్తవాలను కళ్లకు కట్టింది. అణ్వాయుధాలను నిషేధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. If a nuclear bomb dropped tomorrow, this is what could happen to you. pic.twitter.com/F3d4B2Pztn — ICRC (@ICRC) February 27, 2019 -
అది రాదు.. ఇక ప్రశాంతంగా నిద్రపోండి!
వాషింగ్టన్: సింగపూర్ వేదికగా ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌తో చరిత్రాత్మక చర్చల అనంతరం స్వదేశానికి చేరుకున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు శుభవార్త చెప్పారు. ఇన్‌ఫ్యాక్ట్ అది ప్రపంచానికి కూడా శుభవార్తే అవుతుందేమో!! ‘‘సుదీర్ఘ ప్రయాణం చేసి ఇప్పుడే విమానం దిగాను. నేను అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టినరోజు కంటే ఇవాళ అమెరికన్లు మరింత సురక్షితంగా ఉన్నారని భావించండి. మున్ముందు ఉత్తరకొరియా నుంచి అణుబాంబుల బెదిరింపులేవీ ఉండవు. అసలు యుద్ధమన్నమాటే రాదు. కాబట్టి మీరంతా ప్రశాంతంగా నిద్రపోండి. అమెరికాకు ఉత్తరకొరియానే అతిపెద్ద శత్రువన్న ఒబామా మాటలకు కాలం చెల్లింది. కిమ్ దేశానికి మంచి భవిష్యత్తు ఉంది..’’ అని ట్రంప్ ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి: ట్రంప్, కిమ్ శాంతి మంత్రం) విమానం దిగుతూనే తూటాలవర్షం: కిమ్ జాంగ్‌తో భేటీ కోసం ఆదివారమే సింగపూర్ వెళ్లిన డొనాల్డ్ ట్రంప్.. మంగళవారం రాత్రికి తిరిగి అమెరికా చేరుకున్నారు. విమానం దిగుతూనే ట్విటర్ నుంచి మాటల తూటాల వర్షం కురిపించారు. తాను ఊళ్లోలేని సమయంలో దారుణంగా తిట్టిపోసిన వెటరన్ సినీ నటుడు రాబర్ట్ డీనిరోకు ట్రంప్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ‘‘రాబర్ట్ డీ నిరో ఓ తెలివితక్కువోడు. సినిమాల్లో ఎంతోమంది చేతుల్లో చావుదెబ్బలు తిన్నవాడు. అతను మాట్లాడింది చూశా.. ఫుల్లుగా మద్యం తాగి వాగాడేమో!’’ అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో నటుడు రాబర్ట్.. ట్రంప్‌ను అసభ్యపదజాలంతో దూషించిన సంగతి తెలిసిందే. తర్వాతి టార్గెట్ ఇరాన్: ఉత్తరకొరియాతో శాంతి చర్చలు సఫలంకావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక ఇరాన్‌పై దృష్టి సారిస్తానన్నారు. సింగపూర్‌ను వీడబోయే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒబామా హయాంలో ఇరాన్–ఆరు అగ్ర దేశాల మధ్య కుదిరిన అణు నిరోధక ఒప్పందం నుంచి ఇటీవలే అమెరికా వైదొలిగిందని గుర్తుచూస్తూ నిబంధనల్లో మార్పులు చేసి ఇరాన్‌తో సరికొత్త, వాస్తవిక ఒప్పందం కుదర్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ‘‘ప్రస్తుతం ఇరాన్‌పై విధించిన ఆంక్షలు అమలులోకి వచ్చాక ఆ ప్రభావంతో తగిన సమయంలో వారే చర్చలకు వస్తారు. గడిచిన నాలుగు నెలల్లో ఆ దేశ వైఖరిలో వచ్చిన మార్పును బట్టి నేనిలా ఆశిస్తున్నాను. వాళ్లు(ఇరాన్) గతంలో మాదిరిగా సిరియాకు మద్దతుగా నిలవడంలేదని అనుకుంటున్నా. ఇప్పుడు వాళ్ల ఆత్మ విశ్వాసం తగ్గింది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
భారత్‌పై అణు దాడి తప్పదు : పాక్
ఇస్లామాబాద్ : భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యలపై దాయాది పాకిస్థాన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అనవసరమైన ఆరోపణలు చేస్తే అణు దాడి తప్పదని పేర్కొంది. పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ అసిఫ్ ఈ మేరకు తన ట్విటర్లో ట్వీట్ చేశారు. ‘‘ఇండియన్ ఆర్మీ చీప్ భాద్యతారాహిత్యంగా మాట్లాడారు. ఇది ముమ్మాటికీ కవ్వింపు చర్యనే. అణుక్షిపణుల దాడికి భారత్ మాకు ఆహ్వానం పంపుతున్నట్లుంది. ఒకవేళ వారు యుద్ధానికి కాలుదువ్వితే అందుకు మేం కూడా సిద్ధమే. భారత్‌పై అణుదాడి తీవ్ర స్థాయిలో చేసి తీరతాం. ఆయన(రావత్) అనుమానాలు త్వరలోనే నివృత్తి అవుతాయని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. మరోవైపు విదేశాంగ ప్రతినిధి ఫైసల్ కూడా రావత్ వ్యాఖ్యలను ఖండించారు. ఈ వ్యాఖ్యలను తేలికగా తీసుకోబోమని ఆయన పేర్కొన్నారు. ఇక రావత్ దిగజారి మాట్లాడారని నిఘా వ్యవస్థ ఐఎస్పీఆర్ డైరెక్టర్ జనరల్ అసిఫ్ గుఫర్ మండిపడ్డారు. శుక్రవారం ఆర్మీడే సందర్భంగా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాట్లాడుతూ... నిబంధనలకు విరుద్ధంగా పాక్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని ఆరోపించారు. అణు ఒప్పందాలను పాక్ ఉల్లంఘిస్తోందని.. పరిస్థితి చేజారితే పాక్ వాటిని భారత్ పై ప్రయోగించే అవకాశం లేకపోలేదని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం గనుక అనుమతిస్తే పాకిస్థాన్‌పై అణుయుద్ధానికి సైన్యం సిద్ధంగా ఉందని రావత్ పేర్కొన్నారు. “Very irresponsible statement by Indian Army Chief,not befitting his office. Amounts to invitation for nuclear encounter.If that is what they desire,they are welcome to test our resolve.The general's doubt would swiftly be removed, inshallah.” — Khawaja M. Asif (@KhawajaMAsif) 13 January 2018 The threatening and irresponsible statement by the Indian Army Chief today is representative of a sinister mindset that has taken hold of India. Pakistan has demonstrated deterrence capability.1/2 — Dr Mohammad Faisal (@ForeignOfficePk) 13 January 2018 These are not issues to be taken lightly. There must not be any misadventure based on miscalculation. Pakistan is fully capable of defending itself. 2/2 — Dr Mohammad Faisal (@ForeignOfficePk) 13 January 2018 -
'అణుయుద్ధం తప్పకపోవచ్చు'
సాక్షి, ఇస్లామాబాద్ : దక్షిణాసియా ప్రాంత స్థిరత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని, అది ప్రమాదపుటంచుల్లో వేలాడుతుందంటూ పాకిస్థాన్ భద్రతా సలహాదారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ నజీర్ ఖాన్ జాంజువా ఆందోళన వ్యక్తం చేశారు. అణుయుద్ధం జరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) విషయంలో భారత్‌తో కలిసి అమెరికా కుట్ర చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇస్లామాబాద్‌లో జాతీయ భద్రత అనే అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలన్నింటిని సమకూర్చుకొని స్టాక్ పెట్టుకుంటుందని, వాటితో ప్రతిసారి పాక్‌ను బెదిరిస్తూ వస్తోందని చెప్పారు. 'దక్షిణాసియా స్థిరత్వం ప్రమాదపుటంచున వేలాడుతోంది. అణుయుద్ధం జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం' అని ఆయన వ్యాఖ్యానించారు. అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభావం పెరుగుతుండటంతో అమెరికా వైఫల్యాలను పాకిస్థాన్‌పై నెడుతోందంటూ ఆరోపించారు. అప్ఘనిస్థాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం అమెరికా భారత్‌కు కల్పిస్తోందంటూ మండిపడ్డారు. -
అంగారకుడిపై అణుయుద్ధం?!
అంగారక గ్రహం ఒకనాడు ఆవాసయోగ్యంగా ఉండేదా? అక్కడ మనుషులు జీవించారా? అక్కడ అణు యుద్ధాలు జరిగాయా? యుద్దానంతరం.. జీవరాశిని గ్రహాంతరవాసులు నాశనం చేశారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. వాషింగ్టన్ : అంగారక గ్రహం మీద దశాబ్దాలుగా నాసాసహా పలు దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు రీసెర్చ్ కొనసాగిస్తున్నాయి. ఒకప్పుడు అంగారకుడిపై జీవరాశి ఉండేదన్న నమ్మకాన్ని నాసా పలు సందర్భాల్లో వ్యక్తం చేసింది. తాజాగా ఈ నమ్మకం నిజమనే ఆధారం వెలుగులోకి వచ్చింది. తాజాగా అంగారక గ్రహం మీద ఒక ఫిరంగి గుండు ఉన్న చిత్రాన్ని నాసా విడుదల చేసింది. అంగరాకుడి మీదున్నప్రజలకు, గ్రహాంతర వాసులకు మధ్య జరిగిన యుద్ధంలో ప్రజలంతా నాశనమయ్యారనే వాదన వినిపిస్తోంది. అంగారకుడి మీదకు నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ ఇందుకు సంబంధించిన ఒక వీడియోను పంపింది. ఆ వీడియోలో అంగారకుడి భూ ఉపరితలానికి సంబందించి అతి దగ్గరగా ఫొటోలను రోవర్ చిత్రీకరించింది. అందులో ఫిరంగి గుండులాంటి ఒక పదార్థాన్ని రోవర్ గుర్తించింది. వందల వేల ఏళ్ల కిందట అంగారకుడిపై జీవరాశి ఉండేదని.. అదే సమయంలో అక్కడి జీవరాశికి, గ్రహాంతరవాసుల మధ్య అణుయుద్ధంజరిగిందనే వాదన వినిపస్తోంది. ఈ అణు యుద్ధంలో అంగారకుడిపైనున్న జీవరాశి మొత్తం సర్వనాశనం అయిందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఆ యుద్ధంలో పేలకుండా మిగిలిపోయిన ఫిరంగిగుండుగా దీనిని అనుమానిస్తున్నారు. గ్రహాంతర వాసులపై తీవ్రంగా పరిశోధనలు చేస్తున్న స్కాట్ సీ వార్నింగ్‌కూడా ఈ వీడియో ఇటువంటి అభిప్రాయన్నే వ్యక్తం చేయడం గమనార్హం. -
అణు యుద్ధం.. ప్రతీ దేశం నాశనం!
వాషింగ్టన్/న్యూయార్క్ : ఉత్తర కొరియా ఒకవేళ విధ్వంస కాండకు సిద్ధమైతే... ఆసియా దేశాలన్నీ తమ అణు ఆయుధాలను బయటకు తీయాల్సి ఉంటుందని అమెరికా రక్షణ నిపుణుడు హెన్రీ ఆర్ కిస్సింగర్ చెబుతున్నారు. ఈ మేరకు ఆసియా దేశాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఈ అమెరికా మాజీ రక్షణ అధికారి చెబుతున్నారు. ‘‘తమ దగ్గర మాత్రమే అణు ఆయుధాలు ఉన్నాయని ఉత్తర కొరియా విర్రవీగుతోంది. కానీ, వాటి స్థాయికి కాకపోయినా పొరుగున ఉన్న మరికొన్ని దేశాలు కూడా శక్తివంతమైన క్షిపణులనే కలిగి ఉన్నాయి. అన్ని కలిస్తేనే కిమ్ మెడలు వంచటం సాధ్యమౌతుంది’’ అని హెన్సీ వ్యాఖ్యానించారు. వివాదాస్పద దౌత్యవేత్తగా పేరున్న ఈ మాజీ రక్షణాధికారి, నిక్సన్ హయాంలో కుట్రలకు పాల్పడ్డాడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు. అయితే సమర్థవంతమైన రక్షణ నిపుణుడిగా పేరుండటంతో అవి పెద్దగా నిలవలేదు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన తన సలహాలను మీడియా ద్వారా ఆయన సూచిస్తున్నారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే... గత తొమ్మిది నెలల్లో ఏకంగా 15 పరీక్షలు నిర్వహించారు. వీటిలో చాలా వరకు విజయవంతమయ్యాయి. ఉత్తర కొరియా పరీక్షించిన క్షిపణుల్లో కొన్ని జపాన్ మీదుగా ప్రయాణించాయి. సెప్టెంబరులో నిర్వహించిన అణు పరీక్షతో చైనా సరిహద్దు వెంబడి భూమి కంపించింది. దక్షిణ కొరియా సరిహద్దులో కూడా ప్రకంపనలు వచ్చాయి. వాటి ప్రభావాన్ని బట్టి అవి బాగా శక్తివంతమైనవనే తెలుస్తోంది. కిమ్ వద్ద న్యూయార్క్‌ను చేరుకునే క్షిపణి కూడా ఉన్నట్లు స్పష్టమౌతోంది అని అన్నారు. ప్రభావం ఎంతలా అంటే... మరోవైపు అమెరికా న్యూస్ ఏజెన్సీ ఏబీసీ కూడా కిమ్ విధ్వంసంకాండపై పరిశీలకుల నుంచి వివరాలు సేకరించి ఓ నివేదికను రూపొందించింది. దీనికి సమాధానంగా కొన్ని న్యూస్ ఏజెన్సీలు పరిశోధన చేసి కొన్ని విషయాలు వెల్లడించాయి. - స్కడ్ (సిరీస్ ఆఫ్ టాక్టికల్ మిసైల్)... జపాన్‌లోని ఒసాకాను, దక్షిణా కొరియాను తాకే సామర్థ్యం ఉంది. - మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఈ క్షిపణుల పరిధిలోకి టోక్యోతోపాటు జపాన్‌లోని ఇతర నగరాలను, ఈశాన్య చైనా, తూర్పు మంగోలియా, ఆగ్నేయ రష్యాలు తాకగలవు. - ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లు చైనాలోని చాలా నగరాలను ధ్వంసం చేయగలవు. అలాగే తూర్పు రష్యా, ఆగ్నేయాసియాలోని థాయిలాండ్, ఫిలిప్పైన్స్, అమెరికాలోని గువామ్లను చేరుకునే శక్తి ఉంది. - ఇక కీలకమైనవి, అతి ప్రమాదకరమైనవి ఖండాంతర క్షిపణులు. చాలా వరకు మధ్య ప్రాచ్య దేశాలు, ఈశాన్య ఇటలీ, స్కాట్లాండ్, పశ్చిమ ఇంగ్లండ్, ఈశాన్య ఈజిప్ట్, పశ్చిమ సోమాలియా, అలస్కా, అమెరికా, కెనడా, ఇండియా, తూర్పు యూరోప్, టర్కీ, గ్రీస్, స్కాండనేవియా, ఆస్ట్రేలియాలో చాలా వరకు నగరాలను ధ్వంసం చేయగలవు. ఇలా ఉత్తర కొరియా వద్ద నున్న పలు రకాల క్షిపణులు ప్రతీ దేశంలోని ఏదో ఒక మూలను తాకే సామర్థ్యం ఉన్నాయనే అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన్న కిమ్ పరీక్షిస్తున్న క్షిపణులు అమెరికా, బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలను చేరుకోగలవన్నది వాస్తవమేనని ఆ కథనాల సారాంశం. -
ఏ క్షణమైనా అణు యుద్ధం
న్యూయార్క్: ఏ క్షణమైనా అణు యుద్ధం జరగవచ్చంటూ ఉత్తర కొరియా మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. తన దుందుడుకు చర్యలతో కయ్యానికి కాలు దువ్వుతున్న ఆ దేశం ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా, దాని మిత్రదేశాల్ని గట్టిగా హెచ్చరించింది. అమెరికాతో కలిసి సైనిక చర్యలో పాల్గొనే దేశాలకు కూడా గట్టిగా బుద్ధిచెపుతామని పేర్కొంది. ఐరాసలో ఉత్తర కొరియా డిప్యూటీ అంబాసిడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐరాస జనరల్ అసెంబ్లీకి చెందిన నిరాయుధీకరణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘పరిస్థితులు చేయిదాటిపోయాయి. ఏక్షణం లోనైనా అణుయుద్ధం తలెత్తవచ్చు’ అని పేర్కొన్నారు. 1970 నుంచి ప్రపంచంలో అమెరికా నుంచి తీవ్రమైన అణుముప్పు ఎదుర్కొంటున్న దేశం ఉత్తర కొరియా ఒక్కటేనని, ఆత్మరక్షణ కోసం అణ్వాయు ధాలు కలిగిఉండే హక్కు తమ దేశానికి ఉందని ఆయన సమర్థించుకున్నారు. ‘ఉత్తర కొరియాను రెచ్చగొట్టేలా అణ్వాయుధాలతో ప్రతీ ఏటా అమెరికా పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంది. మా అధినేత కిమ్ జోంగ్ ఇల్‌ను హత్య చేసేందుకు ఆ దేశం కుట్ర చేసింది’ అని అమెరికాను తప్పుపట్టారు. ఈ ఏడాదే ఉత్తర కొరియా పూర్తిస్థాయి అణ్వాయుధ సామర్థ్యం సాధిం చిందని, వివిధ దూరాల్లోని లక్ష్యాల్ని ఛేదించే క్షిపణులతో పాటు, అణు బాంబు, హైడ్రోజన్ బాంబు తమ వద్ద ఉన్నాయని ర్యాంగ్ పేర్కొన్నారు. అమెరికాను సర్వ నాశనం చేస్తాం ‘అమెరికా భూభాగం మొత్తం ఉత్తర కొరియా క్షిపణుల పరిధిలో ఉన్నాయి. ఒకవేళ మా దేశంపై యుద్ధానికి అమెరికా సాహసం చేస్తే ప్రపంచంలో ఆ దేశానికి చెందిన అంగుళం భూమిని కూడా వదలకుండా ప్రతీకారం తీర్చుకుంటాం’ అని హెచ్చరించారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. మొదటి బాంబు జారవిడిచే వరకూ ఉ.కొరియా సంక్షోభం పరిష్కారానికి దౌత్య చర్చలు కొనసాగుతాయన్నారు. -
అణుయుద్ధానికే అమెరికా తెగిస్తోంది!
ప్యాంగ్యాంగ్: అమెరికా తాజాగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను (ఐసీబీఎం) మధ్యలోనే కూల్చివేసే వ్యవస్థను అమెరికా విజయవంతంగా పరీక్షించడంపై ఉత్తర కొరియా మండిపడింది. ఇది సైనికంగా తీవ్రంగా రెచ్చగొట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఇది సైనికంగా తీవ్రంగా రెచ్చగొట్టే చర్య. అణుయుద్ధాన్ని తెరతీయాలన్న అమెరికా వికృత కోరికకు ఇది అద్దం పడుతోంది. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా అణుయుద్ధాన్ని మొదలుపెట్టే సన్నాహాలు తుదిదశకు చేరాయన్న సంకేతాన్ని ఈ రిస్కీ చర్య ఇస్తోంది' అని కొరియా ప్రజా ఆర్మీ వ్యూహాత్మక దళ అధికార ప్రతినిధి పేర్కొన్నట్టు ఆ దేశ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) పేర్కొంది. కొరియా తన ఆత్మరక్షణకు అణ్వాయుధ బలాన్ని పెంపొందించుకోవడం సబబేనని అమెరికా తలపెడుతున్న ఇలాంటి చర్యలు రుజువుచేస్తున్నాయని పేర్కొంది. తమ అణ్వాయుధాలను ఇలాంటి ఇంటర్సెప్షన్ వ్యవస్థలు అడ్డుకుంటాయనుకుంటే అది పొరపాటేనని హెచ్చరించింది. ఒకవైపు వరుస అణ్వాయుధ పరీక్షలతో, ప్రయోగాలతో ఉత్తర కొరియా చెలరేగిపోతుండగా.. ప్రత్యర్థులు ప్రయోగించే అణ్వాయుధాలను మధ్యలోనే కూల్చివేసే వ్యవస్థను అమెరికా మంగళవారం విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. -
ట్రంప్ కావాలా.. అణుయుద్ధం కావాలా?
వచ్చే నెలలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌నే ఎన్నుకోవాలని.. లేనిపక్షంలో అణుయుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహిత సహచరుడు ఒకరు హెచ్చరించారు. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలుచేస్తూ.. రష్యన్ ట్రంప్‌గా పేరొందిన వ్లాదిమిర్ జిరినొవ్స్కీ రాయిటర్స్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. మాస్కోకు.. వాషింగ్టన్కు మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించగల ఏకైక వ్యక్తి ట్రంప్ మాత్రమేనని ఆయన తెలిపారు. అదే హిల్లరీ క్లింటన్ ఎన్నికైతే మూడో ప్రపంచ యుద్ధం తప్పకపోవచ్చని జిరినొవ్స్కీ హెచ్చరించారు. గత నెలలో జరిగిన రష్యా పార్లమెంటరీ ఎన్నికల్లో జిరినొవ్స్కీ ప్రాతినిధ్యం వహించే లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ రష్యా మూడోస్థానంలో నిలిచింది. అయితే రష్యాలో చాలామంది ఆయనను ఒక జోకర్లా భావిస్తుంటారు. అందరి దృష్టి తనమీద పడాలన్న ఉద్దేశంతో ఆయన ప్రతి అంశం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. క్రెమ్లిన్ విధానాలకు బాగా కట్టుబడి ఉండే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోడానికి ఒక్కోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. అమెరికా, రష్యాల మధ్య సంబంధాలు ఇప్పటి కంటే దారుణంగా అయ్యేందుకు అవకాశం లేదని.. యుద్ధం మొదలైతేనే అవి మరింత క్షీణిస్తాయని జిరినొవ్స్కీ అన్నారు. భూగ్రహం మీద శాంతి ఉండాలంటే అమెరికన్లు ట్రంప్‌కే ఓటు వేయాలని, కానీ వాళ్లు హిల్లరీని ఎన్నుకుంటే మాత్రం మూడో ప్రపంచ యుద్ధం.. అది కూడా అణుయుద్ధం తప్పదని చెప్పారు. ప్రతిచోటా హిరోషిమా, నాగసాకిలే కనపడతాయని హెచ్చరించారు. -
భారత్-పాక్ మధ్య అణు యుద్ధం తప్పదు!
కరాచీ: కశ్మీర్ కోసం భారత్-పాక్ మధ్య అణు యుద్ధం తప్పదని హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ హెచ్చరించారు. ఈ విషయంలో ఇప్పటికే మూడు సార్లు యుద్ధం జరిగిందని, కశ్మీర్ ప్రజలు రాజీ పడేందుకు సిద్ధంగా లేనందున నాలుగోసారీ యుద్ధం జరగొచ్చని చెప్పారు. కశ్మీరీలకు నైతికంగా మద్దతిచేందుకు పాక్ కట్టుబడి ఉందని, పాక్ సహకరిస్తే ఇరు దేశాల మధ్య అణు యుద్ధం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఆదివారం విలేకరులతో సలాహుద్దీన్ మాట్లాడుతూ.. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వాని హత్య.. కశ్మీర్ కోసం జరుగుతున్న పోరాటానికి కొత్త అర్థాన్నిచ్చిందన్నారు. -
'భారత్ తో అణుయుద్ధం తప్పదు'
కరాచీ: కశ్మీర్ అంశంపై భారత్ తో అణుయుద్ధం తప్పదని హిజ్బుల్ ముజాహిదీన్ నేత సయీద్ సలాహుదీన్ హెచ్చరించారు. కశ్మీర్ పోరాటానికి అన్నివిధాల మద్దతు ఇవాల్సిన బాధ్యత పాకిస్థాన్ పై ఉందని పేర్కొన్నారు. పాకిస్థాన్ అండగా నిలిస్తే రెండు దేశాల మధ్య అణుయుద్ధం వచ్చే అవకాశముందన్నారు. కశ్మీర్ ప్రజలు రాజీ పడడానికి సిద్ధంగా లేరని, నాలుగో ప్రపంచ యుద్ధం రానుందని జోస్యం చెప్పారు. ప్రపంచం, పాకిస్థాన్ మద్దతు ఇవ్వకపోయినా, ఐక్యరాజ్య సమితి తన కర్తవ్యం నిర్వహించకపోయినా కశ్మీర్ ప్రజలు తమ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడాలని సలాహుదీన్ పిలుపునిచ్చారు. సాయుధ యుద్ధం చేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదని కశ్మీర్ ప్రజలు నిర్ణయానికి వచ్చారని వెల్లడించారు. మోదీ ప్రభుత్వం ముక్తి ప్రసాదించకపోతే అణచివేతకు గురవుతున్న కశ్మీర్ ప్రజలు సాయుధ తిరుగుబాటు చేస్తారని చెప్పారు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమాజం విస్మరించినా, పాకిస్థాన్ ప్రయత్నాలు ఫలించకపోయినా, భారత్ వేధింపులు ఆపకపోయినా.. ఇండియా మూల్యం చెల్లించుకోక తప్పదని సలాహుదీన్ హెచ్చరించారు. -
భారత్-పాక్ అణుయుద్ధంపై బ్రిటన్ భయం
- 2001 నాటి ఘటన తాజాగా వెల్లడి - తప్పుడు నిఘా సమాచారంతోనే ఇరాక్‌పై యుద్ధం లండన్ : 2001లో భారత పార్లమెంటుపై ఉగ్రవాద దాడి జరిగినప్పుడు భారత్-పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధం జరుగుతుందేమోనని బ్రిటన్ భయపడినట్లు తాజా నివేదిక ద్వారా తెలిసింది. అప్పుడ ఇరుదేశాలను బుజ్జగించి సైనిక చర్యను ఆపడానికి బ్రిటన్ యత్నించింది. 2003లో ఇరాక్ దాడిపై నియమించిన విచారణ కమిటీ నివేదిక బుధవారం బహిర్గతమైంది. మాజీ ఉన్నతాధికారి జాన్ చిల్కాట్ నేతృత్వంలోని ఈ కమిటీ నివేదిక 12 సంపుటాలతో వెలువడింది. అప్పటి బ్రిటన్ విదేశాంగ మంత్రి జాక్ స్ట్రా ఈ కమిటీ ముందు హాజరై భారత్-పాక్ అణు యుద్ధం గురించి చెప్పారు. దీని గురించి నాటి అమెరికా విదేశాంగ మంత్రి పావెల్‌తో సమాచారం పంచుకున్నట్లు తెలిపారు. అమెరికాలో 9/11 ఉగ్రదాడి తర్వాత బ్రిటన్ దృష్టి అఫ్గానిస్తాన్‌పై ఉండిందని, అయితే దాని తర్వాత 2001 డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై ఉగ్రవాదాడి తర్వాత బ్రిటన్, అమెరికాలు భారత్-పాక్‌లపై దృష్టి పెట్టాయన్నారు. నాటి బ్రిటన్ ప్రధాని బ్లెయిర్ తప్పుడు నిఘా సమాచారంతోనే ఇరాక్ నియంత సద్దాంను తప్పించేందుకు అక్రమ యుద్ధానికి దిగినట్లు స్ట్రా చెప్పారు. నిరాయుధీకరణ అవకాశమున్నా బ్రిటన్ ఎలాంటి శాంతి చర్యలకు పూనుకోలేదని చెప్పారు. ఇరాక్‌పై అమెరికాతో కలసి యుద్ధం చేసిన ఆ సమయంలో సైనిక చర్య చివరి ప్రయ్నతం కాదన్నారు. -
భారత్-పాక్ మధ్య అణుయుద్ధం జరిగితే.. నాగరికత అంతమే!
ఐపీపీఎన్‌డబ్ల్యూ అధ్యయనం హెచ్చరిక ఈ రెండు దేశాల అణుయుద్ధం.. 200 కోట్ల మందికి మరణశాసనం 100 అణ్వాయుధాలు వాడినా ప్రపంచంపై ప్రభావం భారత్ - పాకిస్థాన్‌ల మధ్య అణుయుద్ధమంటూ జరిగితే.. దాని ఫలితంగా ప్రపంచంలో తీవ్ర కరువు తలెత్తుతుందని.. ప్రపంచ జనాభాలో నాలుగో వంతు మంది అంటే 200 కోట్ల మంది హతమైపోతారని.. మానవ నాగరికత ముగిసిపోతుందని ఒక అధ్యయనం హెచ్చరించింది. ప్రస్తుతం ఉన్న అణ్వాయుధాల్లో కేవలం కొన్నిటిని అణు యుద్ధంలో ఉపయోగించినా కూడా.. ఇంతకుముందు ఊహించినదానికంటే ప్రపంచ స్థాయిలో భారీ మరణాలు సంభవిస్తాయని ‘అణుయుద్ధ నివారణ కోసం అంతర్జాతీయ వైద్యులు (ఐపీపీఎన్‌డబ్ల్యూ)’ అనే స్వచ్ఛంద సంస్థ సహ అధ్యక్షుడు.. అధ్యయన రచయిత ఐరా హెల్ఫాండ్ పేర్కొన్నారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ఇదే సంస్థ 2012లో నిర్వహించిన అధ్యయనంలో అణుయుద్ధం జరిగితే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది మృత్యువాత పడతారని అంచనా వేశారు. భూ వాతావరణం, ఇతర పర్యావరణ వ్యవస్థలపై అణు విస్ఫోటనాల ప్రభావం గురించి అంచనా వేసిన వాతావరణ శాస్త్రవేత్తల పరిశోధనల ఆధారంగా నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం.. ప్రపంచంలో ఎక్కడైనా సరే 100 అణ్వాయుధాలను ఉపయోగించినట్లయితే.. అది ప్రపంచ వాతావరణానికి, వ్యవసాయ ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని.. దాని ఫలితంగా 200 కోట్ల మందికి పైగా ప్రజల జీవితాలు ప్రమాదంలో పడతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 100 కోట్ల మంది చనిపోవటమంటే.. మానవ చరిత్రలో కనీవినీ ఎరుగని విపత్తే అవుతుందని ఈ అధ్యయనం చెప్తోంది. దీనికితోడు చైనాలో మరో 130 కోట్ల మంది ప్రమాదంలో పడినట్లయితే.. అది మానవ నాగరికత అంతానికి ఆరంభమేనని హెల్ఫాండ్ అభివర్ణించారు. భారత్ - పాక్‌ల మధ్య అణుయుద్ధం ప్రభావంతో.. ప్రపంచంలో అతి పెద్ద దేశమైన చైనాలో గోధుమల ఉత్పత్తి తొలి ఏడాది సగానికి పడిపోతుందని.. దశాబ్ద కాలంలో సగటున 31 శాతం పడిపోతుందని పేర్కొన్నారు. అలాగే గోధుమలు ఉత్పత్తి చేసే ఇతర దేశాల్లోనూ ఈ పరిస్థితి తలెత్తుతుందన్నారు. దీని ఫలితంగా సగానికిపైగా ప్రజల్లో ఆకలి, పర్యవసానంగా సామాజిక సంక్షోభం అనూహ్యంగా పెరిగిపోతాయని.. ఇది మొత్తం ప్రపంచ సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. ‘ఈ ముప్పును రూపుమాపాలంటే.. మనం అణ్వాయుధాలను రూపుమాపాల్సిందే’ అని హెల్ఫాండ్ పేర్కొన్నారు.