ఎప్పుడూ ఏదో ఒక అనుహ్య నిర్ణయంతో వార్తలో నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి సంచలన వ్యాఖ్యాలు చేసి షాక్‌కి గురిచేశారు. అగ్రరాజ్యంతో తలపడటానికి రెడీ! అంటూ సవాలు విసిరారు. అదీ కూడా ఉత్తర కొరియా యుద్ధ విరమణ దినోత్సవం రోజున ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కిమ్ ప్రత్యేకత కాబోలు.
ఉత్తర కొరియా నాయకుడు కిమి జోంగ్ అమెరికాతో తలపడటానికి తమ దేశం రెడీగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు కిమ్ జోంగ్ ఉన్ తమ దేశం అమెరికాతో అణు యుద్ధం చేయడానికైనా, సైనికులతో దాడి చేయడానికైనా సిద్ధమే అంటూ సవాలు విసిరాడు. అది కూడ జూలై 27 ఉత్తర కొరియా యుద్ధ విరమణ దినోత్సవానికి సంబంధించి 69వ వార్షికోత్సవం సందర్భంగా కిమ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2017 నుంచి ఉత్తర కొరియా అణు పరీక్షలు నిర్వహించినప్పుడే యుద్ధానికి పరోక్షంగా కాలుదువ్వుతున్నట్లు సంకేతం ఇచ్చింది.
ఇప్పుడూ అన్నంత పనిచేశాడు కిమ్. ఎప్పటి నుంచే తాము అమెరికా నుంచి అణు బెదిరింపులు ఎదుర్కొంటున్నామని, ఈ నేపథ్యంలోనే తమ ఆత్మరక్షణకై ఈ కీలకమైన చారిత్రత్మక పనికి పూనుకోవాల్సి వచ్చిందని కిమ్ చెబుతున్నాడు. తమ సాయుధ బలగాలు ఎలాంటి దాడినైనా తిప్పికొట్టగల సమర్థవంతమైనవని., అణ్వాయుధాల పరంగా కూడా చాలా బలమైనదని.. తక్షణమే ఈ యుద్ధం చేసేందకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశాడు. అంతేకాదు దక్షిణ కొరియాతో అమెరికా చట్టవిరుద్ధమైన శత్రుచర్యలు కొనిసాగిస్తోందని ఆరోపించాడు.
పైగా ఉత్తరకొరియాను అమెరికా పెద్ద శత్రువులా చూపించడమే కాకుండా తన చర్యలను సమర్ధించుకుంటోందంటూ కిమ్ పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. తమ భద్రతకు ముప్పుతెచ్చేలా అమెరికా దక్షిణ కొరియాతో ఉమ్మడి సైనిక విన్యాసాలకు పాల్పడిందని విమర్శించాడు. అమెరికా ద్వంద వైఖరితో దోపిడికి పాల్పడుతుందన్నాడు. ద్వైపాక్షిక సంబందాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తోందంటూ అమెరికాపై విమర్శలతో విరుచుకుపడ్డాడు.
దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్-యోల్ పరిపాలనపై కూడా ఆరోపణలు చేశాడు. తమను అసమర్థ దేశంగా చూపే ఏ ప్రయత్నానైనా గట్టిగా తిప్పికొట్టడమే కాకుండా నాశనం చేయగలమంటూ కిమ్ గట్టిగా హెచ్చరించాడు. ఇదిలా ఉండగా... ఇటీవలే ఉత్తర కొరియా హైపర్‌సోనిక్ క్షిపణులు పరీక్షించడమే కాకుండా ఇది వ్యూహాత్మక అణ్వాయుధాలను తీసుకువెళ్లగలదని చెబుతుండడం గమనార్హం.
(చదవండి: శ్రీలంకలో ఎమర్జెన్సీ పొడిగింపు.. మరో 14 రోజులు సింగపూర్‌లోనే గొటబయ!)
Comments
Please login to add a commentAdd a comment