అవసరమైతే అణుబాంబు వాడతాం.. భారత్‌కు పాక్ మంత్రి బెదిరింపులు | Pakistan Minister Shazia Marri Nuclear War Threat To India | Sakshi
Sakshi News home page

మా దగ్గర అణుబాంబు ఉందని భారత్ మర్చిపోవద్దు.. పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు

Published Sun, Dec 18 2022 3:04 PM | Last Updated on Sun, Dec 18 2022 3:30 PM

Pakistan Minister Shazia Marri Nuclear War Threat To India - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ మంత్రి షాజియా మర్రి నోరుపారేసుకున్నారు. భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. తమ వద్ద అణుబాంబు ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. అవసరమైతే దాన్ని ఉపయోగించేందుకు తాము వెనుకాడబోమని పరోక్షంగా అణుయుద్ధం బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రధాని మోదీ ప్రభుత్వం
యుద్ధానికి దిగితే తాము దీటుగా బదులిస్తామని భేషజాలకు పోయారు.

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ.. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరునాడే షాజియా భారత్‌పై నోరుపారుసుకోవడం చూస్తుంటే.. వాళ్ల అక్కసు స్పష్టమవుతోంది.

కాగా.. మోదీపై భుట్టో అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శనివారం దేశ్యవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఆమె దిష్టిబొమ్మను దహనం చేసింది. భారత్‌లో మోదీ గాంధీ సిద్ధాంతాలను కాకుండా హిట్లర్ సిద్ధాంతాలను అనుసరిస్తున్నారని భుట్టో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
చదవండి: ఉత్తర కొరియా మిసైల్‌ ప్రయోగం.. జపాన్‌లో ఎమర్జెన్సీ అలర్ట్‌ ప్రకటన

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement