india pakistan
-
అసలు... ఆ రాత్రి ఏం జరిగింది?
భారత ద్వితీయ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. అది హత్యా? సహజ మరణమా? లేక ఇన్సైడర్ (లోపలి వ్యక్తి) పనా? అయిదు దశాబ్దాలు గడిచినా, ఏ ఇన్వెస్టిగేషన్, ఏ ఎంక్వైరీ కమిషన్‌కు నోచుకోకుండానే ఆయన మరణం దేశ చరిత్ర పుటల్లో మిస్టరీగానే మిగిలిపోయింది! 1965 భారత్–పాక్ యుద్ధానంతరం, 1966 జనవరి 4న రష్యాలోని తాష్కెంట్లో ప్రారంభమైన ఇరు దేశాల చర్చలు జన వరి 10 రాత్రి ‘నోవార్ ప్యాక్ట్ ’ అగ్రిమెంటుతో ముగిశాయి. ఆ తర్వాత తనకు ఏర్పాటు చేసిన ‘డాచా’ (గెస్ట్ హౌజ్ విల్లా)లోని విశాలమైన బెడ్ రూంలో కెళ్ళిపోయారు శాస్త్రి. భోజనానంతరం, కుక్ రావ్‌ునాథ్ తెచ్చిన గ్లాసులోని పాలు త్రాగి నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 1.20 గంటలకు ప్రధాని పర్సనల్ సెక్రెటరీ జగన్నాథ్ సహాయ్ బెడ్ రూం తలుపును ఎవరో తడుతున్న చప్పుడు. తలుపులు తెరచిన ఆయనకు ఎదురుగా కుడి చేత్తో ఛాతీ వత్తుకుంటూ, ‘డాక్టర్ సాబ్ కహా హై’ వగరుస్తూ ప్రధాని ఆర్థింపు. సంగతి తెలిసిపోయింది పీఏ సహాయ్‌కి. అసిస్టెంట్లు ఇద్దరు కలిసి శాస్త్రిజీని ఆయన రూంలోకి తీసు కెళ్ళి గ్లాసులో ఆయనకు నీళ్లు ఇచ్చారు. బెడ్‌పై ఆయనను పడుకోబెట్టి, పక్కరూంలో ఉన్న ప్రధాని పర్సనల్ వైద్యుడు డాక్టర్ ఆర్ఎన్ చుఘ్కు కబురు చేశాడు పీఏ క్షణాల్లో మెడికల్ కిట్‌తో శాస్త్రీజీ రూంలో కొచ్చి ఆయన పల్స్ చెక్ చేశాడు. శ్వాస పీల్చుకోలేక, ‘మేరే రామ్’ అంటూ అవస్థ పడుతున్నారాయన. ప్రధాని గుండెపోటుకు గురయ్యారని నిర్ధారణకు వచ్చి వెంటనే ఒక ఇంజెక్షన్ చేసి ఛాతీ వత్తడం ప్రారంభించాడు డాక్టర్ అయినా శాస్త్రీజీ క్రమంగా స్పృహ కోల్పోయారు. ఆఖరు ప్రయత్నంగా మరో ఇంజెక్షన్‌ను నేరుగా శాస్త్రిజీ గుండె దగ్గరే ఇచ్చాడు చుఘ్. అయినా లాభం లేకపోయింది. ఆశ వదలుకుని, గద్గద స్వరంతో ‘బాబూజీ, ఆప్నే ముజె మౌకా నహీ దియా (నాకు మీరు తగిన సమయం ఇవ్వలేదు)’ అంటూ ఆశ్రునయనాలతో శాస్త్రీజీ పల్స్‌ను వదిలేశాడు డాక్టర్ చుఘ్. తాష్కెంట్లో అప్పుడు సమయం రాత్రి 1.32 గంటలు. ‘యువర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ డైయింగ్’ అన్న ఒక రష్యన్ లేడీ విలేకరి మాటతో, నిద్రలో నుండి హుటా హుటిన లేచి చెప్పులు లేకుండానే తన గది నుండి ఆదుర్దాగా శాస్త్రిజీ బెడ్ రూవ్‌ు వైపు పరుగు తీశాడు ఆయన ప్రెస్ సెక్రెటరీ కులదీప్ నయ్యర్. అప్పటికే అంతా అయి పోయింది. ఆయన బెడ్ దగ్గర రష్యన్ ప్రధాని కోసిగిన్, పాక్ నేత ఆయూబ్ ఖాన్, ప్రధాని సహచరులు, మంత్రులూ అయిన స్వర్ణ సింగ్, యశ్వంత్ రావు చవాన్ దీన వదనాలతో శిల్పాల్లా నిలుచున్నారు. ఆ నిశాంత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, పాక్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్, కుల్దీప్ వైపు చూస్తూ ‘హియర్ ఈస్ ఏ మేన్ ఆఫ్ పీస్, హూ గేవ్ హిస్ లైఫ్ ఫర్ ఎమిటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్’ అంటూ వాపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం 2.30 గం.కు జాతీయ జెండాలో చుట్టిన ప్రధాని పార్థివ దేహంతో సోవియట్ ఎయిరోఫ్లోట్ విమానం తాష్కెంట్ నుండి ఢిల్లీ పాలవ్ు ఎయిర్ పోర్ట్ చేరు కుంది. అక్కడి నుంచి గన్ క్యారేజ్‌లో శాస్త్రీజీ డెడ్ బాడీని ఆ సాయంత్రం 4.10 గంటలకు 10, జనపథ్‌కు చేర్చారు. రోడ్డంతా శోకసంద్రంలో మునిగిన ఢిల్లీ వాసులతో నిండింది. ఏమీ తోచని ప్రధాని కుటుంబీకులు వారిస్తున్నా ఆగమేఘాల మీద ఏ పోస్టుమార్టం లేకుండానే అదే రోజు శాంతివన్లో శాస్త్రీజీ అంత్యక్రియలు జరిపారు. ఊహించని రీతిలో నిష్క్రమించిన ప్రధాని లాల్ బహదూర్ స్థానంలో నూతన నాయకుణ్ణి ఎన్నుకోవటానికి, కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సభ్యులు పలుమార్లు సమా వేశమయ్యారు. సీనియర్ కాంగ్రెస్ నేత మొరార్జీ దేశాయ్ ఈ పదవికి గట్టి పోటీ ఇచ్చారు. కరడు గట్టిన గాంధేయవాది అయినప్పటికీ దేశాయ్‌ది నిరంకుశ తత్వం. పార్టీ అధ్యక్షుడు కామరాజ్ నాడార్కు ఇది మింగుడు పడలేదు. చాణక్య రీతితో దేశాయ్‌ని పోటీ నుండి తప్పించి, నెహ్రూ తనయ, ఇందిరా గాంధీ పేరును పార్లమెంటరీ బోర్డు నాయకురా లిగా తెరపైకి తేగలిగారు కింగ్ మేకర్ కామరాజ్. రేపో మాపో లండన్ బ్రిటిష్ హైకమిషనర్‌గా వెళ్లవలసిన అప్పటి ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ ఇందిర చేతిలోకి 1966 జనవరి 24న నాటకీయంగా దేశ ప్రధాని పగ్గాలు వెళ్లిపోయాయి. జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త విశ్రాంత ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ మొబైల్: 98190 96949 (అనూజ్ ధర్ పుస్తకం ‘యువర్ ప్రైమ్ మినిష్టర్ ఈజ్ డెడ్’, ఆధారంగా. నేడు లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి) -
కుదిరి చెదిరిన ఒప్పందం
దీర్ఘకాల సరిహద్దు ఘర్షణలను పరిష్కరించే ఒక ఒప్పందం భారత్, పాకిస్తాన్ మధ్య దాదాపుగా కుదిరినట్లు కనిపించిందని సతీందర్ లాంబా పుస్తకం ‘ఇన్ పర్స్యూట్ ఆఫ్ పీస్’ వెల్లడిస్తోంది. ఈ ఒప్పందం కోసం ఇరుదేశాలు తెరవెనుక చర్చలను విస్తారంగా కొనసాగించాయనీ, దాదాపు సంతకాల దాకా వచ్చాయనీ ఈ పుస్తకం చెబుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికలపై భారత్ దృష్టి పెట్టిన తర్వాత ఈ ప్రక్రియ నత్తనడక నడిచి ఆగిపోయింది. ఈ ఒప్పందం కుదిరివుంటే, చరిత్రే మారిపోయేది. ఈ ఒప్పంద ప్రక్రియను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇరుపక్షాలూ భావిస్తే దానికి అవసరమైన మార్గదర్శక సూత్రాలు సిద్ధంగా ఉన్నాయని ఈ పుస్తకం గట్టిగా చెబుతోంది. మాజీ రాయబారి సతీందర్ లాంబా రచించిన పుస్తకం ‘ఇన్ పర్సూ్యట్ ఆఫ్ పీస్’ విషాదకరంగా ఆయన మరణానంతరం ప్రచురితమైంది. అయితే భారత్, పాకిస్తాన్ బ్యాక్ చానెల్‌కు (గుప్త లేదా ద్వితీయ శ్రేణి సమా చార బదిలీ మార్గం) సంబంధించిన అద్భుతమైన వివరాలను ఈ పుస్తకం వెల్లడించింది. అలాగే రెండు దేశాలు ఒప్పందానికి ఎంత సమీపానికి వచ్చాయో కూడా ఇది చక్కగా వివరించింది. యూపీఏ ప్రభుత్వ రెండో పాలనా కాలంలో, ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ పదేళ్ల పాలన చివరలో ఈ ముసాయిదా ఒప్పందంపై సంతకాలు చేయడానికి కూడా అంగీ కారం కుదిరిందని ఈ పుస్తకం నిర్ధారిస్తోంది. ‘2003 మే నుంచి 2014 మార్చి వరకు బ్యాక్ చానెల్ సమా వేశాలు 36 జరిగాయి’ అని నాకు తెలిసిన సతీ (సతీందర్) రాశారు. ఈ ఒప్పందంలో చాలావరకు జనరల్ ముషారఫ్ హయాంలో ముగింపునకు వచ్చింది. ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఏమీ జరగ లేదు. కానీ నవాజ్ షరీఫ్ ‘ఈ ప్రక్రియకు కొత్త ఊపును, వేగాన్ని తీసు కొచ్చారు’. దురదృష్టవశాత్తూ, ఆ తర్వాత ‘భారత్ దృష్టి 2014 సార్వ త్రిక ఎన్నికల వైపు మళ్లింది.’ నేను అనుకునేది సరైనదే అయితే, రెండు సందర్భాల్లో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరే పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదట 2007లో అది సాధ్యపడేట్టు కనిపించింది కానీ ముషారఫ్‌కు ఉన్న ‘అంతర్గత సమస్యల’ వల్ల వీగిపోయింది. ఇక రెండోది– ఇది నా వ్యాఖ్యానం – ఎన్నికల వైపు దృష్టిని భారత్ మరల్చడానికి ముందుగా నవాజ్ షరీఫ్ కాలంలో! అనూహ్య ఘటన అయితే, మోదీ గెలుపుతో ఆశలేమీ పోలేదు. ‘బ్యాక్ చానెల్ ప్రక్రియను కొనసాగించాలనే ఉద్దేశం ఉన్నట్లు కనిపించింది’ అని సతీ పేర్కొన్నారు. ‘ఈ అంశంపై ఫైల్ని సమీక్షించారు. ఈ ఒప్పందంలో ఎలాంటి ముఖ్యమైన మార్పూ ఉండబోదని కూడా నాకోసారి చెప్పారు. ప్రత్యేక దూతగా ఒక విశిష్ట రాయబారిని నియమించాలని కూడా ప్రధానమంత్రి మోదీ భావించారు. నన్ను ఆయన్ని కలవాలని కోరారు.’ కానీ ఆ రాయబారిని నియమించనేలేదు. మోదీ ప్రభుత్వం 2017 ఏప్రిల్‌లో మరోసారి ఆ ఒప్పందం కోసం ప్రయత్నించింది. ‘ప్రధాని కార్యాలయంలోని సీనియర్ అధికారి ఒకరు నన్ను కలవడానికి మా ఇంటికొచ్చారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో భేటీ కావడానికి మీరు పాకిస్తాన్ వెళ్లాలని ప్రధాని కోరుకుంటున్నారని ఆయన నాతో చెప్పారు’. అయ్యో! అయితే, భారత్ తరహా ఒక పరిణామం దీన్ని మొగ్గలోనే తుంచేసింది. షరీఫ్‌తో చర్చించాల్సిన అంశాల వివరాలతో పాటు పాకిస్తాన్‌కు ప్రయాణించడానికి అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్లను ఇవ్వాలని సతీందర్ కోరి, వాటికోసం వేచి ఉన్నారు. కానీ ఆ తరుణంలోనే విచిత్రమైన ఘటన జరిగింది. ‘దూతగా వ్యవహరిస్తున్న ఒక ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త తన వ్యక్తిగత విమానంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీ కావడానికి పాకిస్తాన్ వెళ్లారనే వార్తను నేను చూశాను. అలాంటి పరిస్థితుల్లో ఒకే ఉద్దేశం కోసం పాక్ ప్రధాని వద్దకు వెళ్లడానికి ఇద్దరు వ్యక్తులు ప్రాతినిధ్యం వహించడం సరైంది కాదు.’ ఆ వ్యాపారవేత్త పేరు సతీందర్ బయటపెట్టలేదు. అయితే ఆయన సజ్జన్ జిందాల్ కావచ్చునని పాకిస్తాన్ హైకమిషనర్‌గా పనిచేసిన అబ్దుల్ బాసిత్ అన్నారు. ‘ఈ అంశం మీద నేను జరిపిన చివరి సంభాషణ ఇదే’ అని సతీందర్ రాశారు. మన్మోహన్ సింగ్ పాలనలో ఇరుదేశాల మధ్య ఒప్పందం దాదాపుగా ఫలవంతమయ్యేటట్టు కనిపించిందని సతీందర్ చెప్పిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. ‘ప్రధాని మన్మోహన్‌తో నేను 68 సార్లు కలిసినట్లు నా డైరీ గుర్తుచేసింది’. పైగా ‘ఈ పరిణామాల గురించిన మొత్తం సమాచారం ప్రణబ్ ముఖర్జీకి తెలియజేయడమైంది’. 2006 నవంబర్‌లో సోనియాగాంధీకి ఈ ఒప్పంద వివరాలు తెలపడం జరిగింది. అంతకుముందు 2005లో ఆర్మీ చీఫ్ ఈ విషయంలో పాలు పంచుకున్నారు. పైగా అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అడ్వాణీ, బ్రజేశ్ మిశ్రా, ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీ మహమ్మద్ సయీద్, కరణ్ సింగ్, గులామ్ నబీ ఆజాద్‌లకు కూడా ఈ సమా చారం అందించడం జరిగింది. ఈ ఒప్పందం ఫలితం భారత రాజ్యాంగానికీ, జమ్ము–కశ్మీర్ రాజ్యాంగానికీ, పార్లమెంటరీ తీర్మానాలకూ అనుగుణంగా ఉండేలా ప్రయత్నాలు జరిగాయి. ప్రధాన న్యాయ మూర్తి ఆనంద్‌తో 2006 మార్చి నుంచి 2007 మార్చి మధ్యలో సతీందర్ ఆరుసార్లు సమావేశమయ్యారు. ప్రఖ్యాత న్యాయవాది ఫాలీ నారిమన్‌ను కూడా కలిశారు. సరిహద్దులు మారవు ముషారఫ్ నాలుగు సూత్రాల(ఫోర్–పాయింట్ ఫార్ములా)పై, మన్మోహన్ సింగ్ అమృత్‌సర్‌లో చేసిన ప్రసంగంలోని మూడు ఆలోచనలపై ఈ ఒప్పందం ఆధారపడింది. ఈ చర్చలకు పెట్టుకున్న 14 మార్గదర్శక సూత్రాలను సతీందర్ పేర్కొన్నారు. వాటిల్లో కొన్ని: ‘సరిహద్దులను తిరగరాసే ప్రసక్తి లేదు.’ ‘ఎల్ఓసీ(నియంత్రణ రేఖ)కి ఇరువైపులా, ముఖ్యంగా జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైనిక కదలికలను కనిష్ఠ స్థాయిలో ఉంచాలి.’ ‘నియంత్రణ రేఖకు ఇరు వైపులా అంతర్గత నిర్వహణ కోసం స్వయంపాలనను ఏర్పర్చాలి.’ ‘నియంత్రణ రేఖకు ఇరువైపులా ఉన్న ప్రజలు ఒక వైపు నుంచి మరొక వైపునకు వెళ్లడానికి స్వేచ్ఛ ఉండాలి.’ అలాగే, ‘ప్రభుత్వ విధానంగా ఉగ్రవాదాన్ని ఉపయోగించకుండా, తన భూభాగాన్ని రాజ్యేతర శక్తులకు అనుమతించకుండా పాక్ కట్టడి చేయాలి’. ఈ ఒప్పందం జరిగివుంటే, ‘చరిత్ర క్రమాన్ని మార్చివేయడం సాధ్యపడేది’. అయితే ఇప్పటికి కూడా ఇది ముగిసిపోలేదని సతీందర్ సూచిస్తున్నారు. ‘ఈ ఒప్పంద సంభావ్యత ఇప్పటికీ ఉనికిలో ఉంది. ముసాయిదా ఒప్పంద సూత్రాలు కానీ, దాని పాఠం కానీ ఇప్పటికీ ఉన్నాయి. ఒప్పంద ప్రక్రియను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉందని ఇరుపక్షాలూ భావించినప్పుడు ఎప్పుడైనా దాన్ని మొదలు పెట్టవచ్చు’. నేననుకోవడం ఆశ అనేది నిత్యవసంతం! - కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
బుద్ధిమారని పాక్.. టర్కీకి భారత్ సాయం అందకుండా మోకాలడ్డు!
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధి చాటుకుంది. భూకంపంతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న టర్కీకి సాయం అందించేందుకు వెళ్తున్న భారత యుద్ధ విమానాలు తమ గగనతలం మీద నుంచి వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో భారత సీ-17 యుద్ధ విమానం వెనక్కి వచ్చి వేరే దేశం మీదుగా టర్కీకి చేరుకోవాల్సి వచ్చింది. ఈమేరకు భారత మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే భారత యుద్ధవిమానాలు అసలు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లలేదని, ఇందుకు సంబంధించి ఎలాంటి అనుమతులు కూడా పాకిస్తాన్‌ను భారత్ అడగలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. భారత్‌లోని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ కూడా ఈ విషయంపై స్పందించారు. భారత యుద్ధవిమానాలు ఎగిరేందుకు పాకిస్తాన్ అనుమతి నిరాకరించిందనే విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. 2021లో కూడా అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పుడు భారతీయులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చింది కేంద్రం. అప్పుడు కూడా మనం పాక్ గగనతలాన్ని వినియోగించుకోలేదు. మన విమానాలు అఫ్గాన్ నుంచి ఇరాన్ మీదుగా భారత్ చేరుకున్నాయి. రెండు యుద్ధవిమానాలు.. భూకంపం అనంతరం టర్కీకి భారత్ తనవంతు సాయం చేస్తోంది. ఇప్పటివరకు రెండు యుద్ధ విమానాల్లో సహాయక సిబ్బంది, పరికరాలు, ఔషధాలను పంపింది. మొదటి యుద్ధ విమానం సోమవారం రాత్రే టర్కీ చేరుకోగా.. రెండో యుద్ధ విమానం మంగళవారం వేకువజామున టర్కీకి వెళ్లింది. ఈ విమానాల్లో జాతీయ విపత్తు నిర్వహణ దళాలు, ప్రత్యేక శిక్షణ తీసుకున్న డాగ్ స్క్వాడ్లు, డ్రిల్లింగ్ మెషీన్లు, ఔషధాలు, పరికరాలు సహా ఇతర సామగ్రిని భారత్ టర్కీకి పంపింది. First Indian C17 flight with more than 50 @NDRFHQ Search & Rescue personnel, specially trained dog squads,drilling machines, relief material, medicines and other necessary utilities & equipment reaches Adana,Türkiye. Second plane getting ready for departure. @MevlutCavusoglu pic.twitter.com/sSjuRJJrIO — Dr. S. Jaishankar (@DrSJaishankar) February 7, 2023 చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్.. -
పాక్, భారత్ మధ్య అణు సమాచార మార్పిడి
ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ మధ్య భవిష్యత్‌లో ఉద్రిక్తతలు పెరిగిపోతే దాడులు చేయకూడదని అణు కేంద్రాలు, స్థావరాలపై సమాచారాన్ని ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించినప్పటికీ మూడు దశాబ్దాలుగా ప్రతీ ఏడాది జరిగే అణు సమాచారాన్ని ఇరుదేశాలు ఒకరికొకకు అందించుకున్నట్టుగా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 1991లో ఇరు దేశాల మధ్య అమల్లోకి వచ్చిన అణు కేంద్రాలు, స్థావరాలపై దాడులు నిషిద్ధమనే ఒప్పందం మేరకు ఈ స్థావరాల వివరాలు అందించుకున్నారు. ఈ ఒప్పందంపై 1988, డిసెంబర్ 31న సంతకాలు జరగగా.. 1991, జనవరి 27న అమలులోకి వచ్చింది. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లో ఒకేసారి ఈ ప్రక్రియను చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. తొలిసారి 1992లో అణు సమచారాన్ని ఇచ్చిపుచ్చుకోగా.. 32 ఏళ్లుగా ప్రతిఏటా ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: దేవుడా ఏమిటీ పరీక్ష? పాకిస్థాన్‌లో నిరుద్యోగ సమస్యకు నిదర్శనం..! -
భారత్-పాక్ సంబంధాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్-అమెరికా సంబంధాలపై అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రెండు దేశాల మధ్య తాము మాటల యుద్ధం కోరుకోవటం లేదని చెప్పింది. సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక చర్చలు చేపట్టాలని సూచించింది. అగ్రరాజ్యం విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ ఈమేరకు సోమవారం మీడియాతో మాట్లాడారు. భారత్‌తో అమెరికాకు అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, అటు పాకిస్తాన్‌తోనూ తమకు బలమైన సంబంధాలు ఉన్నాయని ప్రైస్ పేర్కొన్నారు. ఈ రెండు దేశాలతో సంబంధాలను ఒకదానికొకటి ముడిపెట్టలేమని వివరించారు. భారత్-పాక్ మధ్య మాటల యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదన్నారు. ప్రధానీ మోదీపై పాక్ మంత్రి బిలావల్ భుట్టో చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా ఈమేరకు బదులిచ్చారు. రెండు దేశాలతోనూ ద్వైపాక్షిక సంబంధాలు తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. భారత్-పాక్ నిర్మాణాత్మక చర్చలతో సమస్యలు పరిష్కరించుకుంటే రెండు దేశాల ప్రజలకు శ్రేయస్కరం అని పేర్కొన్నారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారత్‌పై పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కుతోంది. పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఈ వ్యవహారంపై రెండు దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమయంలోనే అమెరికా స్పందించింది. చదవండి: షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు..! -
అవసరమైతే అణుబాంబు వాడతాం.. భారత్‌కు పాక్ మంత్రి బెదిరింపులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మంత్రి షాజియా మర్రి నోరుపారేసుకున్నారు. భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. తమ వద్ద అణుబాంబు ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. అవసరమైతే దాన్ని ఉపయోగించేందుకు తాము వెనుకాడబోమని పరోక్షంగా అణుయుద్ధం బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రధాని మోదీ ప్రభుత్వం యుద్ధానికి దిగితే తాము దీటుగా బదులిస్తామని భేషజాలకు పోయారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ.. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరునాడే షాజియా భారత్‌పై నోరుపారుసుకోవడం చూస్తుంటే.. వాళ్ల అక్కసు స్పష్టమవుతోంది. కాగా.. మోదీపై భుట్టో అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శనివారం దేశ్యవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఆమె దిష్టిబొమ్మను దహనం చేసింది. భారత్‌లో మోదీ గాంధీ సిద్ధాంతాలను కాకుండా హిట్లర్ సిద్ధాంతాలను అనుసరిస్తున్నారని భుట్టో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఉత్తర కొరియా మిసైల్ ప్రయోగం.. జపాన్‌లో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటన -
స్వతంత్ర భారతి: రెండవ కశ్మీర్ యుద్ధం
భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వద్ద జరిగిన చిన్న ఘర్షణలు తారస్థాయికి చేరుకోవడంతో 1965లో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఆ యుద్ధాన్నే రెండవ కశ్మీర్ యుద్ధం అని కూడా అంటారు. మొదటి కశ్మీర్ యుద్ధం 1947లో జరిగింది. పాకిస్తాన్ తలపెట్టిన ‘ఆపరేషన్ జిబ్రాల్టర్’ ఈ రెండో యుద్ధానికి మూల కారణం. ఆ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీరులోకి తీవ్రవాదులను చొప్పించడం. ఐదు వారాల పాటు జరిగిన ఆ యుద్ధంలో ఇరు వైపుల వేలాది మంది సైనికులు చనిపోయారు. చివరికి ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధం ముగిసింది. ఈ యుద్దం చాలా వరకు నేల మీదే జరిగింది. కశ్మీరులో భారీ ఎత్తున బలగాలను మొహరించారు. వాయు, నావికా దళాల నుంచీ కూడా అవసరమైన సహకారం అందింది. అన్ని భారత్–పాక్ యుద్దాల లాగే ఈ యుద్ధానికి సంబంధించి కూడా చాలా విషయాలు వెలుగులోకి రాలేదు. యుద్ధానికి కారణంగా కొన్ని పూర్వపు ఘర్షణలు కూడా ఉన్నాయి. 1947లో భారతదేశ విభజన జరిగినప్పటి నుండి భారత్‌పైకి పాక్ కాలు దువ్వుతూనే ఉంది. కశ్మీరు ప్రధాన సమస్య అయినప్పటికీ, ఇతర సరిహద్దు తగాదాలు కూడా ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది గుజరాత్ రాష్ట్రంలోని రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతం. 1965 మార్చి 20న, ఆ తర్వాత ఏప్రిల్‌లో పాకిస్థాన్ కావాలని రెచ్చగొట్టడంతో ఈ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ప్రారంభంలో ఆ ఘర్షణలు ఇరు దేశాల సరిహద్దు పోలీసుల మధ్యే జరిగినప్పటికీ, అనతికాలంలోనే సైనిక దళాలు రంగంలోకి దిగాయి. 1965 జూన్‌లో బ్రిటిష్ ప్రధానమంత్రి హెరాల్డ్ విల్సన్ ఇరుదేశాలను తమ శత్రుభావనలను ఆపాల్సిందిగా ఒప్పించి, వివాద పరిష్కారానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. 1968లో వచ్చిన ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో పాకిస్తాన్ కి 900 చ.కి.మీ. దక్కింది. పాకిస్తాన్ మాత్రం 9,100 చ.కి.మీ. తన భాగంగా పేర్కొంది. రాణ్ ఆఫ్ కచ్ లో పాక్ వచ్చిన సత్ఫలితాల తరువాత, 1962లో చైనాతో యుద్ధం వల్ల నష్టపోయిన భారత సైన్యం.. కశ్మీరులో తాము మెరుపుదాడి చేస్తే తనను తాను కాపాడుకోలేదని జనరల్ ఆయుబ్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్థాన్ భావించింది. కశ్మీర్ ప్రజలు భారత పాలనతో విసిగిపోయారని పాకిస్తాన్ నమ్మింది. అందువల్ల చొరబాటుదారులతో ఏదైనా తిరుగుబాటు మొదలుపెట్టించి తనకు అనుకూల ఫలితాలు రాబట్టవచ్చనుకుంది. దీనికే ఆపరేషన్ జిబ్రాల్టర్ అనే కోడ్ నేమ్ పెట్టుకుంది. కానీ స్థానిక కశ్మీరీలు పాకిస్తాన్ చొరబాటుదారుల వివరాలను భారత అధికారులకు అందించారు. దీంతో చొరబాటుదారులను వెంటనే కనిపెట్టడంతో వారి ఆపరేషన్ పూర్తిగా విఫలమయ్యింది. -
ముప్పు అనివార్యమైనప్పుడే ముందస్తు దాడులు: భారత్
ఐక్యరాజ్యసమితి: మూడో దేశం భూభాగం నుంచి ఎదురయ్యే సాయుధ దాడి ముప్పును ఎదుర్కొనేందుకే ముందస్తు దాడులకు పాల్పడాల్సి వస్తోందని భారత్ వ్యాఖ్యానించింది. మారుమూల ప్రాంతాల్లో ఉగ్రమూకలకు శిక్షణ, సాయం, ప్రోత్సాహం కల్పిస్తున్న ఈ దేశాలు సార్వభౌమత్వం ముసుగులో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపిం చింది. ఇటువంటప్పుడు ఉగ్రవాదుల ప్రయత్నాలను తిప్పికొట్టడానికి మూడో దేశం భూభాగంపై ముందస్తు దాడులకు దిగాల్సి వస్తోందని పేర్కొంది. 2001లో భద్రతా మండలి చేసిన నంబర్ 1368, 1373 తీర్మానాలు కూడా ముంబై దాడుల వంటి వాటిని నిలువరించేందుకు ఆత్మ రక్షణ చర్యలు అవసరమనే విషయాన్ని ధ్రువీకరి స్తున్నాయని తెలిపింది. మెక్సికో నేతృత్వంలో భద్రతామండలి అనధికారిక అరియా ఫార్ములా సమావేశంలో ఐరాసలో భారత డిప్యూటీ శాశ్వత రాయబారి నాగరాజ్ నాయుడుపై వ్యాఖ్యలు చేశారు. మూడో దేశం దన్నుతో సాగే దాడులను నిలువరించాల్సిన తక్షణ, తీవ్ర పరిస్థితులు ఉత్పన్న మైనప్పుడు ఆత్మరక్షణ అనేది ఒక దేశం ప్రాథమిక హక్కు అని ఆయన అన్నారు. పుల్వామా ఘటనకు ప్రతిగా పాక్‌లోని బాలాకోట్ ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం దాడులకు పాల్పడిన విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. పాక్‌తో సాధారణ సంబంధాలను కోరుకుంటున్నాం: భారత్ న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందాలను గట్టిగా పాటించాలని భారత్, పాక్ సైనిక బలగాలు నిర్ణయించుకున్నాయని భారత విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. పాకిస్తాన్‌తో సాధారణ సంబంధాలను కోరుకుంటున్నామనీ, రెండు దేశాల మధ్య అంశాలను శాంతియుతంగా పరిష్కరించు కునేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ‘కీలక అంశాలపై మా వైఖరిలో మార్పు ఉండదు. ఇదే విషయాన్ని మరోసారి చెప్పాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు. భారత్, పాక్‌ల మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరళ్ల మధ్య హాట్‌లైన్ ద్వారా జరిగిన చర్చల అనంతరం రెండు దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. వాస్తవ నియంత్రణ రేఖ సహా ఇతర ప్రాంతాల్లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, కాల్పుల విరమణ ఒప్పందాలను బుధవారం అర్ధరాత్రి నుంచి తు.చ. తప్పకుండా పాటించేందుకు ఈ చర్చల్లో అంగీకారానికి వచ్చాయి. ఈ పరిణామంపై అనురాగ్ శ్రీవాస్తవ పై వ్యాఖ్యలు చేశారు. -
ఆ 54 మంది సైనికులు ఏమయ్యారు?
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతీ ఏడాది డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుకొంటాము. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం చేకూర్చిన 1971 నాటి ఇండో- పాక్ యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తాం. ఇక ఈ యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద బుధవారం స్వర్ణ జ్యోతిని వెలిగించారు. వీర జవాన్ల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. దాయాది దేశం పాకిస్తాన్ మీద భారత ఆర్మీ సాధించిన అతి గొప్ప చారిత్రక విజయాల్లో ఒకటిగా నిలిచిన నేటి రోజున భారతీయుల గుండెలు ఉద్వేగంతో ఉప్పొంగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, అదే సమయంలో ఇండో- పాక్ యుద్ధ కాలం (1947-48, 1965, 1971)లో ముఖ్యంగా 1971 యుద్ధంలో అదృశ్యమై పోయిన 54 మంది భారత సైనికులను కూడా గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. పాకిస్తాన్ ఆర్మీకి పట్టుబడిన ఆ జవాన్లు ఇంకా బతికే ఉన్నారని వారి కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు. కొంతమందైతే వారి జాడను వెదుక్కుంటూ పాక్‌కు వెళ్లారు కూడా. కానీ అక్కడ వారికి నిరాశే ఎదురైంది. మరి.. యుద్ధ ఖైదీలుగా పాకిస్తాన్‌కు చిక్కిన ఆ 54 మంది సైనికులు ఏమయ్యారు? నాలుగు దశాబ్దాలు గడిచినా తమవారు తిరిగి వస్తారని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యుల ఎదురుచూపులకు సమాధానం దొరుకుతుందా?! నిజానికి అధికారికంగా 54 మంది మాత్రమే అదృశ్యమయ్యారని పైకి చెబుతున్నా.. ఇవే కచ్చితమైన గణాంకాలు కావనే వాదనలూ ఉన్నాయి. వారు బతికే ఉన్నారా లేదా మరణించారా అన్న సందేహాలకు కూడా జవాబు లేదు. అయితే పాకిస్తాన్ నుంచి వచ్చిన కొన్ని ఉత్తరాలు మాత్రం వారు బతికే ఉన్నాయని ఆశలు కల్పిస్తున్నాయి. (చదవండి : పాకిస్తాన్ మెడలు వంచిన భారత ఆర్మీ) మోకరిల్లిన పాక్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆమిర్ అబ్దుల్లా ఖాన్ నాయిజీతో సహా 93 వేల మంది పాక్ సైనికులు భారత దళాల ఎదుట బేషరతుగా లొంగిపోవడంతో 13 రోజుల పాటు ఏకధాటిగా సాగిన యుద్ధం ముగిసింది. భారత్ విజయంతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది. కానీ, పాకిస్తాన్లో చెరలో ఉన్నట్టు భావిస్తున్న సైనికుల కుటుంబాల్లో నెలకొన్న చీకట్లు తొలగిపోలేదు. అశోక్ అనే సైనికుడు తాము పాకిస్తాన్లో చిక్కుకున్నామని చెప్తూ డిసెంబరు 26, 1974న భారత్‌లోని తన తండ్రి ఆర్ఎస్ సురికి రాసిన ఓ లేఖ మాత్రం వారి మనసుల్లో కాంతిరేఖలు ప్రసరింపజేసింది. 1975 ఆగస్టులో.. ‘ప్రియమైన నాన్న.. ఆశీర్వాదం కోసం అశోక్ మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాడు. నేనిక్కడ బాగానే ఉన్నాను. ఇండియన్ ఆర్మీ, భారత ప్రభుత్వంతో మా గురించి మాట్లాడండి. మేమిక్కడ 20 మంది ఆఫీసర్లం ఉన్నాం. నా గురించి బాధ పడొద్దు. ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి. ముఖ్యంగా అమ్మ, తాతయ్యను. మాకు విముక్తి కల్పించేందుకు భారత ప్రభుత్వం పాకిస్తాన్ సర్కారును సంప్రదిస్తే బాగుంటుంది’అని లేఖలో పేర్కొన్నాడు. అప్పటి రక్షణ శాఖా కార్యదర్శి ఆ లేఖలో ఉన్న సంతకం అశోక్‌దేనని నిర్ధారించారు. మేజర్ ఏకే ఘోష్ పాకిస్తాన్‌తో యుద్ధంలో పాల్గొన్నట్టు ఆయన ఫొటోలు టైమ్ మ్యాగజీన్లో ప్రచురితమయ్యాయి. కానీ, యుద్ధానంతరం ఆయన మాత్రం ఇండియాకు తిరిగి రాలేదు. ఆయన మరణించి ఉండొచ్చనే అభిప్రాయాలు ఒకవైపు, పాక్‌లో పట్టుబడి ఉన్నారేమోననే వాదనలు మరోవైపు వినిపించాయి. ఇదిలాఉంటే.. మోహన్‌లాల్ భాస్కర్ అనే సైనికుడు 1968- 1974 వరకు పాకిస్తాన్ జైలులో గడిపిన ఆయన డిసెంబరులో విడుదలయ్యారు. యాన్ ఇండియన్ స్పై ఇన్ పాకిస్తాన్ పేరిట పుస్తకం రాశారు. పాకిస్తాన్ సెకండ్ పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన కల్నల్ అసీఫ్ షఫీని తాను కలిసినట్టు అందులో పేర్కొన్నారు. అదేవిధంగా మేజర్ అయాజ్ అహ్మద్ సిప్రాను కలిశానని 1968-71 యుద్ధ సమయంలో దాదాపు 40 భారత సైనికులు జైళ్లలో మగ్గుతున్నట్టు ఆయన చెప్పినట్టు రాసుకొచ్చారు. ఇక బేనజీర్ భుట్టో బయోగ్రఫీలో బ్రిటీష్ చరిత్రకారులు విక్టోరియస్ కఫిల్ తనకు పాకిస్తాన్లో భారత యుద్ధ ఖైదీలు ఉన్నట్టు ఆ దేశానికి చెందిన ఓ లాయర్ తనకు చెప్పారని పేర్కొన్నారు. అంతేకాక పాకిస్తాన్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. భారత వింగ్ కమాండర్ హరిసేన్ గిల్ నడుపుతున్న యుద్ధ విమానం డిసెంబర్ 3న కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్‌ను ప్రాణాలతో పట్టుకున్నట్టు ఆర్మీ అధికార ప్రతినిధి చెప్పిన మాటలు రేడియో ప్రకటనలో వెలువడ్డాయి. 54 మంది అదృశ్యం.. ఎన్నో అనుమానాలు చందర్ సుతా డోగ్రా వంటి సీనియర్ జర్నలిస్టులు వీరి గురించి వివరాలు తెలుసుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. రిటైర్డ్ ఆర్మీ అధికారులు, బ్యూరోక్రాట్లు, జవాన్ల బంధువులు, వారి దగ్గర ఉన్న ఉత్తరాలు, వార్తా పత్రికల క్లిప్పింగులు, డైరీలు, ఫొటోలు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న వివరాల ఆధారంగా వారు ఏమైపోయారన్న ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు కృషి చేశారు. తన పరిశోధనలో భాగంగా.. పాకిస్తాన్ నిజంగానే ఈ 54 మందిని చంపేసిందా? వారు పాక్‌లోనే బంధీలుగా ఉన్నారని ఇండియా నిరూపించగలదా? వారి శరీరంలో చిప్‌లు పెట్టి భవిష్యత్తులో వారిని ఆయుధాలుగా ఉపయోగిస్తుందా? నిజానికి చాలా మంది పాక్ అధికారులు.. తమ దేశంలో గూఢచర్యం చేసేందుకే ఈ సైనికులు పట్టుబడ్డారని భావించడం, పట్టుబడిన భారత జవాన్లలో కొద్ది మందిని వెంటనే చంపేయడం, మిగతా వారిని యుద్ధ ఖైదీలుగా బంధించడం వెనుక గల కారణాల గురించి ఆమె అన్వేషించారు. ఇక అదృశ్యమై పోయిన 54వ మంది సైనికుల గురించి పిటిషన్ దాఖలైన నేపథ్యంలో.. వారిలో 15 మంది కచ్చితంగా వీరమరణం పొందారని భారత ప్రభుత్వం రెండు అఫిడవిట్లలో పేర్కొనడం వంటి అంశాల ఆధారంగా.. భారత్ ఇంకా 54 మంది మాయమైపోయారని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటన్న అంశాల గురించి ఆరా తీశారు. పాక్ జైళ్లకు వెళ్లి మరి ఇక తమ వారి జాడను వెదుక్కుంటూ ఈ సైనికుల బంధువులు పాకిస్తాన్‌కు వెళ్లారు. వారి ఫొటోలు పట్టుకుని, వివరాలు అడుగుతూ 1983లో ఆరుగురు, 2007లో 14 మంది పాక్‌ను సందర్శించారు. అక్కడి జైళ్లకు వెళ్లి ఆరా తీశారు. తమ వాళ్లు జైళ్ల గోడల అవతలే ఉన్నారంటూ వారు బలంగా విశ్వసించారు. దీంతో యుద్ధఖైదీలు ఎవరూ లేరని పాక్ ప్రభుత్వం మరోసారి ప్రకటన చేసింది. కానీ, మిస్టరీగా మారిన భారత సైనికుల ఆచూకీ ఏమై ఉంటుందన్న ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది.. ఏనాటికైనా దీనికి జవాబు దొరుకుతుందా! భారత సైన్యం సిబ్బంది 1. మేజర్ ఎస్పీఎస్ వారాయిచ్ (15 పంజాబ్ ఈయనను పాక్ఖైదీగా పట్టుకున్న వెంటనే తుపాకీ కాల్పుల్లో చనిపోయారని చెప్తున్నారు) 2. మేజర్ కన్వల్జిత్సింగ్సంధూ (15 పంజాబ్) 3. సెకండ్ లెఫ్టినెంట్ సుధీర్ మోహన్ సభర్వాల్(87 లైట్‌రెజిమెంట్) 4. కెప్టెన్ రవీందర్ కౌరా (మెడికల్ రెజిమెంట్) 5. కెప్టెన్ గిరిరాజ్ సింగ్(5 అస్సాం) 6. కెప్టెన్ ఓమ్ ప్రకాష్ దలాల్(గ్రెనేడియర్స్) 7. మేజర్ సూరజ్ సింగ్(15 రాజ్‌పుత్) 8. మేజర్ ఎ.కె.సూరి (5 అసోం) 9. కెప్టెన్ కల్యాణ్ సింగ్ రాథోడ్(5 అసోం) 10. మేజర్ జస్కిరణ్ సింగ్ మాలిక్(8 రాజ్రైఫిల్స్) 11. మేజర్ ఎస్.సి. గులేరి (9 జాట్) 12. లెఫ్టినెంట్ విజయ్‌కుమార్ ఆజాద్(1/9 జి రెజ్) 13. కెప్టెన్ కమల్బక్షి (5 సిఖ్) 14. సెకండ్ లెఫ్టినెంట్ పరస్రామ్ శర్మ (5/8 జి. ఆర్.) 15. కెప్టెన్ వశిష్ట్ నాథ్ 16. లెఫ్టినెంట్ హవల్దార్ కృష్ణలాల్ శర్మ (1 జమ్మూకశ్మీర్రైఫిల్స్) 17 సుబేదార్ అస్సాసింగ్(5 సిఖ్) 18. సుబేదార్ కాళిదాస్(8 జమ్మూకశ్మీర్ఎల్ఐ) 19. లాన్స్‌నాయక్ జగదీశ్‌రాజ్(మహర్రెజిమెంట్) 20 లాన్స్‌నాయక్ హజూరాసింగ్ 21 గన్నర్ సుజన్ సింగ్(14 ఫార్వర్డ్రెజిమెంట్) 22. సిపాయ్ దలేర్ సింగ్(15 పంజాబ్) 23. గన్నర్ పాల్‌సింగ్(181 లైట్‌రెజిమెంట్) 24. సిపాయ్ జాగీర్‌సింగ్(16 పంజాబ్) 25 గన్నర్ మదన్ మోహన్(94 మౌంటెయిన్రెజిమెంట్) 26. గన్నర్గ్యాన్చంద్/ గన్నర్శ్యామ్సింగ్ 27. లాన్స్‌నాయక్ బల్బీర్సింగ్ఎస్.బి.ఎస్. చౌహాన్ 28. కెప్టెన్ డి.ఎస్.జామ్వాల్(81 ఫీల్డ్రెజిమెంట్) 29. కెప్టెన్ వశిష్ట్నాథ్(అటాక్) భారత వైమానిక దళ సిబ్బంది 30. స్క్వాడ్రన్‌లీడర్ మోహీందర్ కుమార్ జైన్(27 స్క్వాడ్రన్) 31. ఫ్లైట్‌లెఫ్టినెంట్ సుధీర్ కుమార్ గోస్వామి (5 స్క్వాడ్రన్) 32. ఫ్లైయింగ్ ఆఫీసర్ సుధీర్ త్యాగి (27 స్క్వాడ్రన్) 33. ఫ్లైట్‌లెఫ్టినెంట్ విజయ్ వసంత్ తాంబే (32 స్క్వాడ్రన్) 34. ఫ్లైట్ లెఫ్టినెంట్ నాగస్వామి శంకర్(32 స్క్వాడ్రన్) 35. ఫ్లైట్ లెఫ్టినెంట్ రామ్ మేథారామ్ అద్వానీ (జేబీసీయూ) 36. ఫ్లైట్ లెఫ్టినెంట్ మనోహర్ పురోహిత్(5 స్క్వాడ్రన్) 37. ఫ్లైట్‌లెఫ్టినెంట్ తన్మయ సింగ్ దాన్దాస్(26 స్క్వాడ్రన్) 38. వింగ్ కమాండర్ హర్శరన్ సింగ్(47 స్క్వాడ్రన్) 39. ఫ్లైట్ లెఫ్టినెంట్ బాబుల్గుహ 40. ఫ్లైట్ లెఫ్టినెంట్ సురేశ్చందర్ సందాల్(35 స్క్వాడ్రన్) 41. స్క్వాడ్రన్‌లీడర్ జల్మాణిక్షా మిస్త్రీ 42. ఫ్లైట్‌లెఫ్టినెంట్ హర్వీందర్‌సింగ్(222 స్క్వాడ్రన్) 43. స్క్వాడ్రన్‌లీడర్ జతీందర్దాస్కుమార్(3 స్క్వాడ్రన్) 44. ఫ్లైట్‌లెఫ్టినెంట్ ఎల్.ఎం.సాసూన్(జేబీసీయూ) 45. ఫ్లైట్‌లెఫ్టినెంట్ కుషల్పాల్ సింగ్ నందా (35 స్క్వాడ్రన్) 46. ఫ్లాగ్‌ఆఫీసర్ కృషన్ఎల్. మల్కానీ (27 స్క్వాడ్రన్) 47. ఫ్లైట్‌లెఫ్టినెంట్ బల్వంత్ధవాలే (1 స్క్వాడ్రన్) 48. ఫ్లైట్‌లెఫ్టినెంట్ శ్రీకాంత్సి. మహాజన్(5 స్క్వాడ్రన్) 49. ఫ్లైట్‌లెఫ్టినెంట్ గుర్దేవ్సింగ్రాయ్(27 స్క్వాడ్రన్) 50. ఫ్లైట్‌లెఫ్టినెంట్ రమేశ్‌జి. కాదమ్(టీఏసీడీఈ) 51. ఫ్లాగ్‌ఆఫీసర్ కె.పి.మురళీధరన్(20 స్క్వాడ్రన్) 52. నావల్ పైలట్లెఫ్టినెంట్ కమాండర్అశోక్రాయ్ 53. స్క్వాడ్రన్‌లీడర్ దేవప్రసాద్ఛటర్జీ 54. పెటీ ఆఫీసర్ తేజీందర్‌సింగ్ సేథీ -
ఆ సాహసం.. సదా స్మరణీయం
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధవీరుల ధైర్య సాహసాలను ప్రధాని మోదీ స్మరించుకున్నారు. సాయుధ దళాల నైతిక స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడకూడదని, వారి ధైర్య సాహసాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని ఆదివారం మాసాంతపు రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో ప్రజలకు సూచించారు. ‘దేశం తరువాతే ఏదైనా’అనే భావంతో ప్రజలంతా ఉంటే సైనికుల ఆత్మస్థైర్యం మరింత పెరుగుతుందన్నారు. కార్గిల్ యుద్ధంలో సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ జరుపుకునే విజయ్ దివస్ (జూలై 26) కూడా ఇదే రోజు రావడంతో ప్రధాని ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు. 1999లో ఇదే రోజు కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. స్నేహ హస్తం చాచిన భారత్‌కు ఆనాడు పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచిందని ప్రధాని గుర్తు చేశారు. ‘అంతర్గత సమస్యల నుంచి తప్పించుకునేందుకు.. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే దుస్సాహసానికి పాక్ ఒడిగట్టింది’అన్నారు. ‘శత్రు సైన్యం శిఖరాల పైభాగంలో ఉంది. భారతీయ సైనికులు ఆ పర్వత పాదాల ప్రాంతాల్లో ఉన్నారు. భౌగోళికంగా వారికి అనుకూల స్థితి. కానీ భారత సైనికులు అత్యంత ధైర్య సాహసాలు, నైతిక స్థైర్యంతో వారిని మట్టికరిపించారు’అని కార్గిల్ యుద్ధాన్ని ప్రధాని గుర్తు చేశారు. తూర్పు లద్దాఖ్‌లో ఇటీవలి చైనా దుష్ట పన్నాగాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘కొందరు శత్రువులుగానే ఉండాలని కోరుకుంటారు’అని వ్యాఖ్యానించారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ దేశ ప్రజలను హెచ్చరించారు. కరోనా ముప్పు నేపథ్యంలో ఈ సారి స్వాతంత్య్ర దినోత్సవం కూడా ప్రత్యేకంగా ఉండబోతోందన్నారు. ఆరోజు స్వావలంబ, కరోనా రహిత భారత్ దిశగా ముందుకు వెళ్తామని యువత ప్రతినబూనాలన్నారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రధాని కోరారు. కార్గిల్ యుద్ధం అనంతరం నాటి ప్రధాని వాజ్‌పేయి చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని మోదీ గుర్తు చేశారు. సురినామ్ కొత్త అధ్యక్షుడు చంద్రిక ప్రసాద్ సంతోఖి ప్రమాణ స్వీకారం చేసిన తీరు భారతీయులందరికీ గర్వకారణమని మోదీ తెలిపారు. వేద మంత్రాలు పఠిస్తూ, అగ్ని దేవుడిని స్తుతిస్తూ ఆయన ప్రమాణం చేశారన్నారు. -
విభజన వ్యూహాలు ప్రమాదకరం
ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత, పాకిస్తాన్ అవలక్షణాలుగా చెబుతున్న అంశాల నుంచి తనను తాను వేరుచేసుకోవడానికి భారత్‌కు 25 ఏళ్లు పట్టింది. కానీ ఇన్నేళ్లుగా దేశం సాధించిన ప్రయోజనాలన్నింటినీ దేశీయ ప్రయోజనాల పేరిట మోదీ, అమిత్ షాలు వృథా చేసేశారు. భారత్ గురించి పాకిస్తాన్లో పెంచిపోషిస్తూ వచ్చిన అభద్రతా భావం, వైరభావం, ఉన్మాద ప్రచారం వంటివి మన దేశంలో ప్రస్తుతం కొన్ని చర్చల్లో కనిపించడం ఆశ్చర్యకరం. దేశీయ రాజకీయాల్లో తనకు ఉపయోగపడే సాధనంగా పాకిస్తాన్‌ను భారత్ ఇప్పుడు కొత్తగా కనుగొంటోంది. మత ప్రాధాన్యమైన, జాతీయ భద్రతా రాజ్యాన్ని నిర్మించుకోవడంలో పాక్ చేసిన ప్రయోగాలను భారత్ ఇప్పుడు చేపట్టాలనుకోవడం వేర్పాటువాదంలోకి మనకు మనం కూరుకుపోయేలా చేస్తుంది. నిజానికి ఈ విభజన తత్వం మనం అధిగమించాల్సిన విషాదం మాత్రమే. జాతీయ భద్రత కలిగిన దేశాన్ని మనం ఎలా నిర్వచించాలి? మన పొరుగునే ఉంటున్న పాకిస్తాన్ నుంచి దీనికి ఉదాహరణలను చూద్దాం. జాతీయ భద్రత లేక అభద్రత అనే భావం చుట్టూతానే పాకిస్తాన్‌కి సంబంధించిన ప్రతి విషయం నిర్మాణమవుతూ వచ్చింది. అందుకే పాక్ సైన్యం దేశ అధికార చట్రంలో శాశ్వతమైన, ప్రత్యేక హోదాను కలిగి ఉంది. దాని నిఘా సంస్థ అయిన ఐఎస్ఐకి ఎవరికీ లేనంత సంస్థాగత స్వయం ప్రతిపత్తిని కట్టబెట్టారు. పాకిస్తాన్‌లోని 21 కోట్ల మందికి పైగా ప్రజలను ఎవరైనా ఎలా భ్రమల్లో పెట్టగలరు? అంటే ఒక ప్రమాదకరమైన దెయ్యాన్ని చూపించడం ద్వారా ఇన్ని కోట్ల మందిని భయపెడుతూ పాక్ తన పబ్బం గడుపుకుంటూ వచ్చింది. జాతీయ భద్రత కలిగిన దేశ నిర్మాణం అంటూ సమర్థించుకోవాలంటే ముందుగా మీరు ప్రజల్లో భయాన్ని పాదుకొల్పాలి. పాక్ ప్రజల పాలిట భయంకరమైన రాక్షసిగా భారత్‌ని పాక్ విజయవంతంగా చిత్రిస్తూ వచ్చింది. భారత్ బూచిని చూపించడం ద్వారానే పాక్ ప్రభుత్వాలు సైన్యంపై అంత ఖర్చు పెట్టగలిగాయి. పాక్ గురించి నేను సందర్భానుసారం రాస్తూవచ్చిన అనేక కథనాల్లో ఒక దాంట్లో ఇలా పేర్కొన్నాను. ‘వాఘా బోర్డర్ వద్ద మీ పాస్‌పోర్టులో స్టాంప్ వేస్తున్న ఇమిగ్రేషన్ అధికారి తలపై ఒక నోటీసు వేలాడుతూ ఉంటుంది. ఆ నోటీసులో ఇలా రాసి ఉంటుంది. మేం అందరినీ గౌరవిస్తాం. అందరినీ అనుమానిస్తాం’. దీనర్థం ఏమిటంటే జాతీయ భద్రతా ప్రభుత్వం అంటేనే అనుమానాస్పదమైన ప్రభుత్వం అనే. పైగా, ఈ కారణం వల్లే పాక్ అంత అస్తవ్యస్తతలో ఉంటోంది. దివాలా తీసిన, రుణాల కోసం సాగిలబడుతున్న ఆర్థిక వ్యవస్థ, విచ్ఛిన్నమైపోయిన సమాజం, పతనమవుతున్న సామాజిక సూచికలు, జాతీయ సంపదలను టోకున అమ్మిపడేయడం, పొరుగునున్న ‘అంకుల్ చైనా’కు రక్షణ ఫీజుల కింద దేశ భూభాగాన్నే అప్పగించేయడం, జిహాద్ యూనివర్సిటీ, ప్రపంచ వలస సరఫరా కేంద్రం వంటి వాటికి పేరొందడం ఇవీ పాక్ లక్షణాలు. ప్రత్యేకించి పొరుగుదేశాలు పాక్ నుంచి నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన పాఠం ఏమిటంటే.. ‘నాలాగా ఎవరూ ఉండవద్దు’ అనే. ప్రస్తుత భారతదేశం సరిగ్గా దీనికి సాక్ష్యాధారంగా నిలబడుతోంది. ఎందుకంటే పాక్ ఇస్తున్న పై సందేశరూపంలోని హెచ్చరికను సీరియస్‌గా తీసుకోవద్దని మనం నిర్ణయించుకున్నాం. మరోవైపున, 2015 తదుపరి పాకిస్తాన్ చిక్కుకున్న స్వీయ భావావరోధంలో మనం ఇప్పుడు ఇరుక్కుపోయాం. 2014 నాటికి పాకిస్తాన్ మన బహిరంగ ప్రసంగాలు, చర్చల్లో కనిపించకుండా పోయింది. పరుగుపందెంలో భారత్, పాక్ కంటే ఎంతో ముందుకెళ్లింది. పాక్ చికాకు కలిగించే రాజ్యంగా దిగజారిపోయింది. తాజాగా పార్లమెంటులో పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ, జార్ఖండ్ ఎన్నికల ప్రచార సందర్భంగా పాక్ గురించి గత వారం పాకిస్తాన్ పేరును పదే పదే చర్చిస్తూ వచ్చారు. సర్జికల్ దాడులు, బాలాకోట్ వైమానిక దాడి సమయంలో కాంగ్రెస్ వైఖరి సరిగ్గా పాకిస్తాన్ వైఖరితో ఎలా సరిపోలిందంటూ హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో ఇదే వైఖరిని ప్రతిబింబించారు. దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ ఇప్పుడు పాక్ పేరును తరచుగా ప్రస్తావిస్తూ వస్తోందన్న విషయం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. పుల్వామా ఘటన నేపథ్యంలో మీరు మా వైపు ఉంటారా లేక పాక్ వైపు ఉంటారా అనే అంశం చుట్టూనే 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమం నడిచింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, మహారాష్ట్ర వంటి నాలుగు రాష్ట్రాల్లో జరిపిన బహిరంగ సభల్లో మోదీ పాక్ పేరును 90 సార్లు ప్రస్తావించారు. తర్వాత హరియాణా, మహా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఇది కొనసాగింది. చాలా కాలం తర్వాత మన బహిరంగ చర్చల్లో, మన రోజువారీ జీవి తంలో కూడా పాకిస్తాన్ పేరును ప్రస్తావిస్తున్నాము. ఇప్పుడు పౌరసత్వ సవరణ బిల్లుపై జరిగిన చర్చ మొత్తంగా పాకిస్తాన్, దేశ విభజన ప్రాతిపదికపైనే నడిచింది. పాకిస్తాన్లో మైనారిటీలతో వ్యవహరిస్తున్న తీరు మనకు చర్చనీయాంశమైంది. అందుచేత పాకిస్తాన్‌లోని ముస్లిమేతర మైనారిటీల క్షేమాన్ని పట్టించుకోవలసిన ప్రత్యేక బాధ్యత భారత్‌పై పడినట్లుగా ఉంది. పాకిస్తాన్‌ని సహజంగానే ముస్లింల నివాస స్థలంగా ఎలా పరిగణిస్తూ వస్తున్నారో భారత్ కూడా ఇప్పుడు హిందువుల నివాసస్థలంగా ఉండాలనే వాతావరణం దేశంలో బలపడుతోంది. భారత్ గురించి పాకిస్తాన్లో పెంచిపోషిస్తూ వచ్చిన అభద్రతా భావం, వైరభావం, ఉన్మాద ప్రచారం వంటివి మన దేశంలో ప్రస్తుతం కొన్ని చర్చల్లో కనిపించడం ఆశ్చర్యకరం. రాజకీయ చర్చలను దేశ విభజన వద్దకు తీసుకుపోవడం, విభజన నాటి తప్పులను సరిదిద్దుతామని హామీ ఇవ్వడం, అతిపెద్ద శత్రువును అప్పట్లో ఊరికే వదిలేశామని విమర్శలు చేయడం.. వంటి పరిణామాలను చూస్తుంటే పాకిస్తాన్‌ను భారత్ కొత్తగా కనిపెడుతున్నట్లు కనిపిస్తోంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య అంతరం ఎంత దూరం పోయిందంటే ప్రపంచంలో ఏ ఒక్కరూ చివరకు చైనాతో సహా మన రెండు దేశాలను ఒకే వైఖరితో చూడడం లేదు. భారత్–పాక్ మధ్య ఉన్న హైపనేషన్ ఇప్పుడు పూర్తిగా చెరిగిపోయింది. అంటే భారత్, పాక్‌లను కలిపి చూసే పరిస్థితి మాయమైపోయిందని అర్థం. ఒకప్పుడు పాక్ అవలంబించిన వైఖరిని ఇప్పుడు మనం తవ్వి తలకెత్తుకుంటున్నామా అనిపిస్తోంది. ఎందుకంటే మొదట అభద్రతా భావాన్ని పెంచిపోషించకుంటే మీరు జాతీయ భద్రతా రాజ్యాన్ని ఎలా నిర్మించగలరు? అందుకే ఈ అవసరం కోసం మీకు భయపెట్టే శత్రువు అవసరం. అది పాకిస్తానే మరి. ఇప్పటికి అది అంత భయపెట్టకపోవచ్చు కానీ పాన్ ఇస్లామిజం అనే పెద్ద ప్రమాదాన్ని చూసినప్పుడు అది భయంకర రాక్షసిగా మారక తప్పదు. అదే ఇప్పుడు అనుమానాన్ని కలిగిస్తుండగా, భారత్‌లోని 20 కోట్ల మంది ముస్లింలకేసి చూస్తే అతిపెద్ద ఉపద్రవంలాగే కనిపిస్తారు మరి. 1947లో రెండు దేశాలు కొత్త చరిత్ర దిశగా అడుగులేయడం ప్రారంభించిన నాటి పరిస్థితిని సమీక్షిద్దాం. మన రెండు దేశాలూ విభిన్నమైన మార్గాలను ఎంచుకున్నాయి. ఒకటి ఉదారవాద రాజ్యాంగ గణతంత్ర రాజ్యంగా మారగా, మరొకటి మెజారిటీవాద, మతతత్వ, సైనిక రాజ్యంగా మారింది. ఒకటి అలీన రాజ్యంగా మారగా, మరొకటి ఆయా కాలాల్లో ప్రాబల్యంలోకి వచ్చిన సైనిక కూటములలో చేరింది. కేవలం 25 సంవత్సరాలలోపే, మతప్రాధాన్య రాజ్యంగా తనను తాను పేర్కొన్న పాకిస్తాన్ తన భూభాగంలో సగానికి పైగా జారవిడుచుకుంది, మరో కొత్త దేశం బంగ్లాదేశ్ రూపంలో ఉనికిలోకి వచ్చింది. చివరకు ఆ కొత్త దేశం కూడా తన మాతృదేశం నమూనాలోకే వెళ్లిపోయి, ఇస్లాంని తన మెజారిటీ వాద భావజాలంగా ఎంచుకునేసింది. దానికి తోడుగా మిలిటరీ పాలకులూ పుట్టుకొచ్చారు. రెండు దశాబ్దాలకుపైగా అప్పులను యాచిం చడం, దారిద్య్రంలో కూరుకుపోవడం జరిగాక, అనేక మూడో ప్రపంచ దేశాల చెడు లక్షణాలకు బంగ్లాదేశ్ ఒక నమూనాగా నిలిచిపోయింది. అధిక జనాభా, దారిద్య్రం అనే సాంక్రమిక వ్యాధుల దేశంగా దానికి పేరుపడిపోయింది. ‘ఆల్ ది ట్రబుల్ ఇన్ ది వరల్డ్’ అనే తన సంకలనంలో అమెరికన్ ప్రముఖ రచయిత పీజే ఓ రూర్కే అధిక జనాభాతో వచ్చే సమస్యలకు బంగ్లాదేశ్‌నే ఉదాహరణగా పేర్కొనడం భావోద్వేగాలను రెచ్చగొట్టింది. పైగా అది ఒక అసందర్భ వ్యాఖ్య కూడా. కానీ అంత దూకుడు రచనలో కూడా రూర్కే ఒక వాస్తవాన్ని పదునైన వాక్యంలో చెప్పాడు. ‘తినడానికి తగినంత ఆహారం లేని దేశం, పండకముందే పంటను వాసన చూస్తున్న దేశం ఎలా మనగలుగుతుంది?‘ కానీ, చాలా త్వరలోనే ఆ కొత్త దేశం భారత్ వంటి దేశాన్ని పోలిన లౌకిక, ఆధునిక ఆదర్శ రాజ్య నమూనావైపు నడక మార్చుకుంది. మరో రెండు దశాబ్దాలలోపే, బంగ్లాదేశ్ ప్రతి సామాజిక, ఆర్థిక సూచికలోనూ పాక్‌కంటే ఎంతో ముందుకు సాగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 48 ఏళ్లక్రితం పాక్ పీడన నుంచి తన విముక్తిలో సహాయం చేసిన భారత్‌నే అది ఇప్పుడు వెనుకకు నెడుతోంది. ఆకలిదప్పులకు, బహిరంగ మలవిసర్జనకు నమూనాగా రూర్కే వ్యాఖ్యానించిన ఆ బంగ్లాదేశ్ ఇప్పుడు ఈ రెండు శాపాలను భూస్థాపితం చేసిపడేసింది. బంగ్లాదేశ్ ఇప్పుడు బహిరంగ మల విసర్జన నుంచి దాదాపుగా బయటపడింది. దాని జనాభా వృద్ధి రేటు గణనీయంగా అంటే భారత వృద్ధి రేటు స్థాయికి.. ఒక్కశాతానికి పడిపోయింది. పాకిస్తాన్ నుంచి కొని తెచ్చుకున్న భావజాల వైరస్‌ను తుంగలో తొక్కి బయటపడిన దాని ఫలితమే ఇదంతా మరి. 1985లో పాకిస్తాన్‌కు మొట్టమొదటి సారిగా సందర్శించినప్పుడు అదెంత మెరుగైన స్థితిలో ఉండేదో చూసి ఆశ్చర్యపోయాను. ఆనాటికి దాని తలసరి ఆదాయం భారత్ కంటే 65 శాతం ఎక్కువగా నమోదయ్యింది. కానీ 2019లో భారత్ తలసరి ఆదాయం పాక్ కంటే 60 శాతం ఎక్కువగా నమోదైంది. ఇదెలా జరిగింది? పాకిస్తాన్ సామాజిక–ఆర్థిక వృద్ధి సూచికలు ఎంతగా కుప్పగూలిపోయాయంటే ఐఎమ్ఎఫ్ నుంచి ఆ దేశం 13వసారి ఉద్దీపన ప్యాకేజీని అందుకోవాల్సి వచ్చింది. ఇక పాక్ జనాభా వృద్ది రేటు భారత్, బంగ్లాదేశ్‌ల కంటే రెట్టింపు పెరిగింది. కాని ఇప్పటికీ అది జాతీయ భద్రతా రాజ్యంగా సైనికాధిపత్యంతోనే ఉంటోంది. ఎంతలా అంటే పాక్ ప్రధాని తన ఆర్మీ చీఫ్‌కు సలామ్ చేసేంతగా. భారత్ కంటే ఏ రంగంలో అయినా పాక్ ముందుందంటే బహుశా అణ్వాయుధాల సంఖ్యలోనే కావచ్చు. కానీ భారతీయ వ్యూహాత్మక అధ్యయనాల నిపుణుడు దివంగత కె. సుబ్రహ్మణ్యం తరచుగా ఒక మాట చెప్పేవారు, నీ దేశ రక్షణకు తక్కువ ఆయుధాలు అవసరమైనప్పుడు ఎందుకు ఎక్కువ ఆయుధాలకోసం వెంపర్లాడతావు? కాగా, దేశీయ రాజకీయాల్లో తనకు ఉపయోగపడే సాధనంగా పాక్‌ను భారత్ ఇప్పుడు కొత్తగా కనుగొంటోంది. నిజానికి ఇది పేలవమైన ఎంపిక. ఇప్పుడు పాక్‌తో మనల్ని మనం పోల్చుకోవాలంటే భారత్ తన కాళ్లు నెప్పి పెట్టేలా ముందుకు వంగాల్సి ఉంటుంది. మరోమాటలో చెప్పాలంటే.. మత ప్రాధాన్యమైన, జాతీయ భద్రతా రాజ్యాన్ని నిర్మించుకోవడంలో పాక్ చేసిన ప్రయోగాలను భారత్ ఇప్పుడు చేపట్టాలనుకోవడం వేర్పాటువాదంలోకి మనకు మనం కూరుకుపోయేలా చేస్తుంది. నిజానికి ఇది మనం అధిగమించాల్సిన విషాదం మాత్రమే. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
వెనక్కి తగ్గని పాక్, ఏడాదికి రూ.259 కోట్లు ఆదాయం
న్యూఢిల్లీ : పంజాబ్‌లోని డేరా బాబా నానక్ మందిరానికి, పాక్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారాకు మధ్య సిక్కు యాత్రికుల రాకపోకలకు సంబంధించి ప్రతిష్టాత్మక కర్తార్‌పూర్ కారిడార్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాంతాల మధ్య రాకపోకలకు సంబంధించి భారత్, పాక్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వీసా అవసరం లేకుండా యాత్రికులు పాక్‌లోని కర్తార్‌పూర్‌కు వెళ్లే అవకాశాన్ని ఈ కారిడార్ కల్పిస్తోంది. ప్రతిరోజు దాదాపు 5,000 మంది యాత్రికులను అనుమతించనున్నారు. అయితే ప్రతి యాత్రికుడి నుంచి పాక్ 20 డాలర్లు వసూలు చేసేందుకు నిర్ణయించింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పాక్ వెనక్కు తగ్గలేదు. దీంతో.. భారతీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని భారత్ ఈ ఒప్పందానికి అంగీకరించింది. ఈ విషయం అలా ఉంచితే.. సర్వీస్ చార్జీ వల్ల పాక్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాలా ఏడాదికి 259 కోట్ల రూపాయలు. దీనికి యాత్రికులు చేసే ఇతరత్రా ఖర్చులు కూడా తోడవనున్నాయి. ఇక్కడికి వెళ్లే యాత్రికులు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నిబంధనల ప్రకారం ప్రయాణికులు గరిష్టంగా రూ. 11వేలు తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఈ యాత్రకు సంబంధించి ఒక ఆన్లైన్ పోర్టల్ prakashpurb550.mha.gov.inను ఏర్పాటు చేశారు. ఇందులో తమకు కావాల్సిన రోజుల్లో టికెట్లను ఆన్లైన్లో నమోదు చేసుకుంటే ప్రయాణానికి మూడు రోజుల ముందు సమాచారం ఇవ్వబడుతుంది. ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే పాకిస్థాన్‌కు ఈ రాబడి కొంతమేర రక్షిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సిక్కు యాత్రికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఒప్పందం కుదుర్చుకున్నాయి. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ 550 జయంతి ఉత్సవాల సందర్భంగా నవంబర్ 9న కర్తార్‌పూర్ కారిడార్ భారత్ - పాక్‌లు సంయుక్తంగా ప్రారంభించనున్నాయి. చదవండి: కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
సొంత హెలికాప్టర్‌ను కూల్చడం పెద్ద తప్పు
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఫిబ్రవరి చివరలో.. తమ సొంత హెలికాప్టర్‌ను కశ్మీర్లో తామే కూల్చివేయడం అతిపెద్ద తప్పిదమని వైమానిక దళ(ఐఏఎఫ్) ప్రధానాధికారి రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా అంగీకరించారు. పాక్ వైపు నుంచి జరిగే ఏ దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తక్కువ సమయంలోనే స్పందించి, సైన్యం, నౌకాదళంతో సమన్వయం చేసుకుని దాడులు చేయగలమన్నారు. ఫిబ్రవరి 27న పొరపాటున బుద్గాం జిల్లాలో ఐఏఎఫ్‌కు చెందిన ఎంఐ 17 చాపర్‌ను వైమానిక దళం భూమి మీది నుంచి ఆకాశంపై ప్రయోగించగల క్షిపణి ద్వారా కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు ఐఏఎఫ్ అధికారులు, ఒక పౌరుడు మరణించారు. ఈ ఘటనపై జరిపిన అంతర్గత విచారణ ముగిసిందని, బాధ్యులుగా తేలిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని భదౌరియా శుక్రవారం తన తొలి ప్రెస్మీట్లో వెల్లడించారు. ఇద్దరు సీనియర్ అధికారులపై కోర్టు మార్షల్ ప్రక్రియ ప్రారంభించామన్నారు.అంతకుముందు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలపై ఐఏఎఫ్ చేసిన దాడులకు సంబంధించిన వీడియో క్లిప్‌లను ప్రదర్శించారు. చాపర్‌లోని సిబ్బంది, కంట్రోల్ సెంటర్లోని అధికారుల మధ్య సమాచార లోపం విచారణలో స్పష్టంగా కనిపించిందని భదౌరియా తెలిపారు. కూల్చివేతకు గురైన సమయంలో చాపర్‌లోని ‘ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రెండ్ ఆర్ ఫో’(ఐఎఫ్ఎఫ్– మిత్రుడా, శత్రువా గుర్తించడం) సిస్టమ్ నిలిపేసి ఉందని వాయుసేన వర్గాలు వెల్లడించాయి. దాంతో శత్రు చాపర్‌గా భావించి దానిని క్షిపణి ద్వారా కూల్చివేశారన్నారు. ఫిబ్రవరి 27న కశ్మీర్‌లోని నౌషేరాలో భారత్, పాక్‌ల మధ్య యుద్ధ విమానాలు భీకర పోరు సలుపుతున్న సమయంలో భారత్‌కు చెందిన ఎంఐ 17 కూల్చివేతకు గురైన విషయం తెలిసిందే. డ్రోన్లతో ముప్పు సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడవడం కొత్త ముప్పుగా మారిందని భదౌరియా పేర్కొన్నారు. పాక్‌లోని ఉగ్ర సంస్థలే దీనికి పాల్పడుతున్నాయన్నారు. టిబెట్ ప్రాంతంలో చైనా భారీగా మిలటరీ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండటాన్ని నిశితంగా గమనిస్తున్నామన్నారు.అయితే, దానిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పాక్ ఒప్పుకోకపోయినా, ఫిబ్రవరి 27న పాక్‌కు చెందిన ఎఫ్ 16ను భారత్ కూల్చివేయడం వాస్తవమేనని స్పష్టం చేశారు. మరో బాలాకోట్ తరహా దాడులకు సిద్ధమేనా అన్న ప్రశ్నకు.. ప్రభుత్వ ఆదేశాలపై, లక్ష్యాలేవైనా, వాటి పని పడ్తామని సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత వైమానిక దళ సమాచార వ్యవస్థను భవిష్యత్తులో పాక్ అడ్డుకునే వీలు లేకుండా సాంకేతికతను మెరుగుపర్చామన్నారు. పాక్ ఎఫ్ 16ను కూల్చేసిన అనంతరం భారత వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌కు భారత వాయుసేన నుంచి సందేశాలు నిలిచిపోవడం వల్లనే, ఆయన ప్రయాణిస్తున్న మిగ్ 21ను పాక్ దళాలు కూల్చివేయగలిగాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. -
భారత్‌తో యుద్ధంలో ఓడిపోతాం
ఇస్లామాబాద్: భారత్‌తో సంప్రదాయ యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఓడిపోతుందని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అంగీకరించారు. అయితే, దాని ప్రభావం ఉపఖండానికి వెలుపల కూడా ఉంటుందని చెప్పారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో భారత్‌తో చర్చల ప్రసక్తే లేదన్నారు. ‘పాక్ ముందుగా యుద్ధానికి దిగదు. నేను యుద్ధానికి వ్యతిరేకిని. శాంతివాదిని. యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావనేది నా నమ్మకం’అని తెలిపారు. సంప్రదాయ యుద్ధమే జరిగితే పాక్ ఓడిపోతుంది. అలాంటప్పుడు మాకు రెండే అవకాశాలున్నాయి. ఒకటి లొంగిపోవడం, రెండోది తుదికంటా పోరాడటం. అయితే, స్వాతంత్య్రం కోసం పాక్ ప్రజలు చనిపోయేదాకా పోరాడతారని నాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు. ‘అయితే, రెండు అణ్వస్త్ర దేశాలు యుద్ధానికి దిగితే..ప్రారంభంలో అది సంప్రదాయ పోరైనా.. అణ్వస్త్ర ప్రయోగంతోనే ముగిసేందుకు అవకాశం ఉంది. దానిని ఊహించలేం’అని అన్నారు. ‘భారత్‌తో యుద్ధం జరిగేందుకు అవకాశం ఉందని గట్టిగా నమ్ముతున్నా. దీనిని నివారించేందుకే ఐరాసకు వెళ్లాం. ప్రతి అంతర్జాతీయ వేదికపైనా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాం’అని పేర్కొన్నారు. యుద్ధం ఫలితంగా ఉపఖండానికి అవతల కూడా ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. భారత్ ఎఫ్ఏటీఎఫ్(ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్) సంస్థ పాకిస్తాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ ఆయన.. ఆంక్షల ద్వారా పాక్ ను ఆర్థికంగా దివాళా తీయించేందుకు, కష్టాల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తోంది’అని అన్నారు. కశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ రద్దును ఉపసంహరించుకునే భారత్‌తో చర్చలుంటాయని స్పష్టం చేశారు. కాగా, ఈ నెల 27వ తేదీన ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రధాని ఇమ్రాన్ ప్రసంగించేదాకా ఎల్వోసీ వరకు చేపట్టే ర్యాలీ వాయిదా వేయాలని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రాజకీయ, మత సంస్థలు నిర్ణయించుకున్నాయి. కశ్మీరీలకు సంఘీభావంగా ఎల్వోసీ వరకు ర్యాలీ చేపట్టాలని ఇమ్రాన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సరిహద్దులో పాక్ కవ్వింపులు: 2,050 న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ ఏడాదిలో పాక్ ఇప్పటి వరకూ 2,050 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రావీశ్ కుమార్ ఆదివారం వెల్లడించారు. ఈ ఘటనల్లో 21 మంది భారత సైనికులు మృతిచెందినట్లు ఆయన తెలిపారు. ఒప్పందాన్ని ఉల్లంఘించడమేగాక భారత్‌లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు మద్దతు ఇస్తోందని మండిపడ్డారు. నియంత్రణ రేఖ వెంట శాంతి భద్రతలు నెలకొనేలా చేసుకున్న 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ పదేపదే ఉల్లంఘిస్తోందని అన్నారు. దీనికితోడు ఈ నెల మొదటి వారంలో పాక్ దాదాపు 100 నుంచి 200 మంది సైనికులను నియంత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి తరలించినట్లు తమకు సమాచారం ఉందన్నారు. పాకిస్తాన్ ఇన్ని కవ్వింపు చర్యలు చేపడుతున్నప్పటికీ భారత బలగాలు సహనం చూపుతున్నాయని, ఉగ్రవాదులు చొరబడాలని చూసినపుడు మాత్రం తగిన జవాబు ఇస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎల్వోసీ వెంట భారత బలగాల సంసిద్ధతను ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ శనివారం పరిశీలించారు. దీనికి ముందే ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా పరిస్థితులను స్వయంగా వచ్చి పరిశీలించారు. -
యుద్ధం వస్తే..?
-
కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి రెడీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాతపాటే పాడారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం భారత్–పాకిస్తాన్ల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఫ్రాన్స్‌లోని బియార్రిట్జ్‌లో ఈ వారాంతంలో జరిగే జీ7 సదస్సు సందర్భంగా కశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని మోదీతో చర్చిస్తానని ట్రంప్ తెలిపారు. వాషింగ్టన్లో ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్, పాకిస్తాన్లతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు ప్రస్తుతం బాగోలేవు. కాబట్టి ఈ పరిస్థితిని చక్కదిద్దదేందుకు నా వల్ల వీలైనంతమేరకు ప్రయత్నిస్తాను. అవసరమైతే అందుకోసం మధ్యవర్తిత్వం చేస్తాను’ అని వెల్లడించారు. భారత్–పాక్‌ల మధ్య సంబంధాలు ప్రస్తుతం ఘోరంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను కేంద్రం ఇటీవల రద్దుచేసిన సంగతి తెలిసిందే. అలాగే జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలు(జమ్మూకశ్మీర్, లదాఖ్)గా విభజించింది. దీంతో భారత్–పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంపై ట్రంప్ ఈ మేరకు స్పష్టం చేశారు. కశ్మీర్ ద్వైపాక్షిక సమస్యనీ, ఇందులో మూడోపక్షం జోక్యాన్ని తాము సహించబోమని భారత్ ప్రకటించినప్పటికీ మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ చెప్పడం గమనార్హం. మరోవైపు తాలిబన్లతో చర్చలపై ట్రంప్ స్పందిస్తూ.. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు బలపడకుండా అమెరికా బలగాలు అక్కడే మరికొంతకాలం ఉంటాయని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం తాము తాలిబన్లతో చర్చలు జరుపుతున్నామనీ, గతంలో ఏ అధ్యక్షుడూ ఈ పనిని చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. ద్వైపాక్షికమే: బ్రిటన్ ప్రధాని లండన్: జమ్మూకశ్మీర్ అన్నది భారత్–పాకిస్తాన్ల ద్వైపాక్షిక సమస్య మాత్రమేనని బ్రిటన్ తెలిపింది. ఈ సమస్యను ఇరుదేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కశ్మీర్, ఉగ్రవాదం, లండన్‌లో భారత హైకమిషన్ దగ్గర విధ్వంసం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బోరిస్ మాట్లాడుతూ..‘కశ్మీర్ సమస్యను భారత్–పాక్‌ల ద్వైపాక్షిక సమస్యగానే బ్రిటన్ గుర్తిస్తోంది. దీన్ని ఇరుదేశాలు చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. భారత్–బ్రిటన్లు తమ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరముంది’ అని తెలిపారు. ఉగ్రవాదమే పెనుముప్పు: మోదీ ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ.. భారత్‌తో పాటు యూరప్‌కు ప్రస్తుతం ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందని తెలిపారు. ‘ఈ ఉగ్రభూతంపై పోరాడేందుకు మనం సమిష్టిగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే తీవ్రవాదం, హింస అసహనం పెచ్చరిల్లకుండా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్) వంటి ఉగ్రవాద సంస్థలు మన గడ్డపై అడుగుపెట్టకుండా నిలువరించగలం’ అని ప్రధాని తెలిపారు. ఫ్రాన్స్‌లో జరిగే జీ7 సదస్సు సందర్భంగా మోదీ, బోరిస్ కలుసుకోనున్నారు. -
ఇమ్రాన్..జాగ్రత్తగా మాట్లాడండి!
వాషింగ్టన్: భారత్‌పై చేసే వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు సూచించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రాంతంలో పరిస్థితి జఠిలంగానే ఉందని, ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు కలిసి పనిచేయాలని భారత్, పాక్‌లను ఆయన కోరారు. కశ్మీర్ విషయంలో తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్‌తో కలిసి పనిచేయాలని, సంయమనంతో వ్యవహరించాలని, అదే సమయంలో భారత్‌పై చేసే వ్యాఖ్యల విషయంలో నిగ్రహంతో వ్యవహరించాలని అధ్యక్షుడు ట్రంప్ ఇమ్రాన్‌ను కోరారని అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో పేర్కొంది. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై పాక్ తీవ్ర అభ్యంతరం తెలపడం, రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాల ప్రధానులతో సోమవారం ఫోన్లో సంభాషించారు. అనంతరం ఆయన ట్విట్టర్లో ‘వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపుతో రెండు దేశాల ప్రధానులతో చర్చించా. ముఖ్యంగా కశ్మీర్ విషయంలో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, ఇమ్రాన్‌ఖాన్‌లకు సూచించా. అక్కడ పరిస్థితి జఠిలంగానే ఉన్నప్పటికీ, మా మధ్య సంభాషణలు ఫలప్రదంగా సాగాయి’అని ట్రంప్ ట్విట్టర్లో తెలిపారు. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, ఆ ప్రాంతంలో శాంతి నెలకొనాల్సిన అవసరాన్ని అధ్యక్షుడు ట్రంప్ వారికి వివరించారు. ప్రాంతీయ పరిణామాలతోపాటు అమెరికా– భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యంపైనా భారత ప్రధాని మోదీతో చర్చించారని, త్వరలోనే మరోసారి సమావేశం కావాలని ఆకాంక్షించారని తెలిపింది. ఉగ్రవాదం, హింసకు తావులేని వాతావరణం నెలకొల్పాల్సిన అవసరాన్ని, సీమాంతర ఉగ్రవాదాన్ని పోషించడం పాక్ ఆపాలని ట్రంప్‌ను మోదీ కోరారని వెల్లడించింది. భారత ప్రభుత్వం జాత్యహంకార, ఫాసిస్టు ధోరణితో వ్యవహరిస్తోందని, దీని కారణంగా పాకిస్తాన్‌తోపాటు భారత్‌లోని మైనారిటీల సంక్షేమం ప్రమాదంలో పడిందని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ వద్ద ఉన్న అణ్వాయుధాల భద్రతపై అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలన్నారు. సోమవారం ట్రంప్‌తో దాదాపు అరగంటపాటు జరిగిన ఫోన్ సంభాషణల్లో ప్రధాని మోదీ ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. అనంతరం ట్రంప్ పాక్ ప్రధానితో మాట్లాడారు. అయితే, కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రధాని ఇమ్రాన్ కోరారని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషి పేర్కొన్నారు. కశ్మీర్లో ఆంక్షలను ఎత్తివేయాలని, మానవహక్కుల సంఘాలను కశ్మీర్లో పరిస్థితులపై అంచనా వేసేందుకు పంపించాలని కూడా ఇమ్రాన్ కోరారన్నారు. ఇలా ఉండగా, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్æ మంగళవారం అమెరికా రక్షణ మంత్రి ఎస్పెర్‌తో ఫోన్లో సంభాషించారు. భారత్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఆర్టికల్ 370 రద్దు, సంబంధిత అంశాలు తమ అంతర్గత విషయమని కూడా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి జరుగుతున్న పరిణామాలు భారత్ అంతరంగిక వ్యవహారమని, భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఎస్పెర్ ప్రశంసించారని అధికారులు తెలిపారు. భారత్, పాక్‌కు ఈ అంశాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని కూడా సూచించారన్నారు. -
హింసను రెచ్చగొట్టేలా ఇమ్రాన్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ఈ సంభాషణలో మోదీ మాట్లాడుతూ..‘ఈ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు భారత్‌కు వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది శాంతిస్థాపనకు ఎంతమాత్రం సహాయకారి కాదు. దక్షిణాసియాలో శాంతిస్థాపన కోసం ఉగ్రవాదం, హింసలేని వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరముంది. అందులోభాగంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా నియంత్రించాలి. దీంట్లో ఎలాంటి మినహాయింపులు ఉండకూడదు’ అని వ్యాఖ్యానించారు. ఉగ్రబాటను వీడి పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులపై పోరాడే ఏ దేశానికైనా భారత్ పూర్తి సహాయసహకారాలు అందజేస్తుందని ట్రంప్‌కు మోదీ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య, స్వతంత్ర, సురక్షితమైన అఫ్గానిస్తాన్ కోసం తాము కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో భారత ప్రభుత్వాన్ని ఫాసిస్టు, జాత్యహంకారిగా ఇమ్రాన్ అభివర్ణించడం తెల్సిందే. భారత అణ్వాయుధాలపై దృష్టి సారించాలని ఆయన ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. దీంతో ఇమ్రాన్ ఖాన్‌కు ఫోన్‌చేసిన ట్రంప్ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇది జరిగిన రెండ్రోజులకే ట్రంప్ భారత ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. మరోవైపు, ఈ విషయమై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. మోదీ, ట్రంప్‌ల మధ్య చర్చలు సహృద్భావ వాతావరణంలో, ఫలప్రదంగా సాగాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఇరుదేశాల అధినేతలు దాదాపు 30 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారని వెల్లడించింది. ‘ఈ టెలిఫోన్ సంభాషణ సందర్భంగా జపాన్‌లోని ఒకాసాలో గత జూన్‌లో జరిగిన జీ–20 భేటీని మోదీ గుర్తుచేశారు. ఈ సమావేశంలో కుదిరిన అంగీకారం మేరకు భారత్–అమెరికాలకు చెందిన వాణిజ్య మంత్రులు త్వరగా సమావేశమై ఇరు దేశాలకు లబ్ధి కలిగేలా ఒప్పందాలను కుదుర్చుకోవాలని మోదీ ఆకాంక్షించారు’ అని విదేశాంగ శాఖ పేర్కొంది. అఫ్గాన్‌కు అండగా నిలుస్తాం.. అఫ్గానిస్తాన్‌లో శాంతి, సుస్థిరత, భద్రత కోసం అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని మోదీ తెలిపారు. సోమవారం అఫ్గానిస్తాన్ 100వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో అఫ్గాన్ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. -
ఢిల్లీ–లాహోర్ బస్సు రద్దు
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అనంతరం లాహోర్–ఢిల్లీ బస్ సర్వీసులను పాక్ రద్దు చేసిన నేపథ్యంలో, భారత్ కూడా ఢిల్లీ–లాహోర్ బస్ సర్వీసును రద్దు చేసిందని ప్రజారవాణా సీనియర్ అధికారి తెలిపారు. ఈ బస్సు సోమవారం ఉదయం 6 గంటలకు లాహోర్‌కు వెళ్లాల్సి ఉండగా ప్రస్తుతం రద్దు అయింది. తమ దేశం నుంచి వస్తున్న బస్ సర్వీసులన్నీ సోమవారం నుంచి నిలిచిపోతాయని శనివారమే పాక్ స్పష్టం చేసింది. 1999 ఫిబ్రవరిలో ఈ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. -
పాక్ మీదుగా రయ్రయ్
న్యూఢిల్లీ: ఎట్టకేలకు పాకిస్తాన్ గగనతలాన్ని అందుబాటులోకి తెచ్చింది. భారత్, పాకిస్తాన్ల మధ్య విమానయాన సేవలను మంగళవారం పునరుద్ధరించింది. బాలాకోట్ దాడుల అనంతరం దాదాపు నాలుగున్నర నెలల తర్వాత అన్ని పౌర విమానాలను తమ భూభాగంలోకి అనుమతించింది. ఈ మేరకు పాకిస్తాన్ విమానయాన సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య విమానయాన సేవలను పునరుద్ధరించనున్నట్లు భారత్ పేర్కొంది. ఇరు దేశాల గగనతలాలపై విమానాలు తిరిగేందుకు ఎలాంటి ఆంక్షల్లేవని భారత పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులకు చాలా మేలు కలుగుతుందని పేర్కొంది. పాకిస్తాన్ గగనతలాన్ని మూసేయడంతో విమానాలను దారి మళ్లించడం ద్వారా రూ.491 కోట్ల నష్టాలను చవిచూసిన ఎయిరిండియా విమాన సంస్థకు కూడా ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరంపై భారత వాయుసేన ఫిబ్రవరి 26న దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాకిస్తాన్‌కు ఉన్న 11 గగనతలాల్లో కేవలం రెండింటినే అందుబాటులో ఉంచింది. అయితే తన గగనతలంపై విధించిన తాత్కాలిక ఆంక్షలను భారత్ ఎత్తేసింది. దీనివల్ల వాణిజ్య విమానయాన సంస్థలకు పెద్దగా లాభం చేకూరలేదు. పాకిస్తాన్ గగనతలాన్ని మూసేయడంతో జూలై 2 వరకు స్పైస్‌జెట్ రూ.30.73 కోట్లు, ఇండిగో 25.1 కోట్లు, గోఎయిర్ రూ.2.1 కోట్లు నష్టపోయినట్లు జూలై 3న రాజ్యసభలో పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. -
ఆ సమయంలో రాఫెల్ యుద్ధ విమానాలుంటే..
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం వద్ద రాఫెల్ యుద్ధ విమానాలు ఉండి ఉంటే, అవి పాకిస్తాన్‌కు చెందిన యుద్ధ విమానాల్లో సగం కూల్చివేసి ఉండేవని భారత మాజీ ఐఏఎఫ్ చీఫ్, ఎయిర్ మార్షల్ ఏవై టిప్నిస్ అభిప్రాయపడ్డారు. ఏవై టిప్నిస్ మంగళవారం ఆజ్‌తక్ ఛానల్ నిర్వహించిన భద్రతా సదస్సులో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లోని శ్రీనగర్, అవంతిపురా ఎయిర్ బేస్‌లపై దాడిచేయడమే పాకిస్తాన్‌కు చెందిన 24 యుద్ధ విమానాల లక్ష్యమన్నారు. మొన్న టెర్రరిస్టు స్థావరాలపై దాడి జరిగినపుడు ఇండియా దగ్గర రాఫెల్ యుద్ధవిమానాలుంటే, కనీసం 12 పాకిస్తాన్ యుద్ధవిమానాలు నేలకూలేవని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటపుడు ఇండియా నిశ్శబ్దంగా కూర్చోకూడదని, ప్రభుత్వం మారినప్పుడల్లా దాడుల ప్రణాళిక మారకూడదని హితబోధ చేశారు. దాడులు సరైన దిశలో జరగాలని సూచించారు. అలాగే పాకిస్తాన్‌తో దౌత్య, సాంస్కృతిక, క్రీడా సంబంధాలను తెంచుకుని వారిపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాలని కోరారు. ఇదే సదస్సులో పాల్గొన్న మాజీ ఆర్మీ జనరల్ బిక్రం సింగ్ మాట్లాడుతూ.. ఇండియా, పాకిస్తాన్ ప్రధాన స్థావరంపై దెబ్బకొట్టాలని, అప్పుడే పాకిస్తాన్ మాటపై నిలబడుతుందని వ్యాక్యానించారు. పాకిస్తాన్లో టెర్రరిజం అనేది ఉద్యోగం లాంటిదని, అక్కడి ప్రభుత్వం సరైన విధంగా చర్యలు తీసుకుంటేనే టెర్రరిజం అంతమవుతుందని అన్నారు. -
భౌగోళిక రాజకీయ అంశాలే కీలకం..!
ముంబై: భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్ధ్‌మాన్‌ను వాఘా సరిహద్దు దగ్గర పాక్ అప్పగించిన నేపథ్యంలో గతవారం దేశీ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. పైలట్‌ను తిరిగి అప్పగించడంతో భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొంత వరకు తగ్గి దాయాదుల మధ్య కమ్ముకున్న యుద్థ మేఘాలు సమసిపోయినట్లేనని మార్కెట్ వర్గాలు భావించాయి. ఈ అంశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కీలక వ్యాఖ్యలు కూడా మార్కెట్‌ను నిలబెట్టాయి. అణ్వాయుధ శక్తి కలిగిన ఇద్దరు దాయాదుల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు త్వరలోనే సమసిపోయే అవకాశం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్నది ఉగ్రవాద శిబిరాలపై దాడులు తప్పించి.. ఇరు దేశాల మధ్య యుద్ధంకాదన్న స్పష్టతతో వారంతంనాడు మార్కెట్లు సానుకూల స్పందించినప్పటికీ, యుద్ధ భయాలు మాత్రం ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ భయాలు మరింత పెరిగినా, యుద్ధ వాతావరణమే మరోసారి కనిపించినా రానున్నరోజుల్లో ఒక్కసారిగా భారీ పతనం ఉండేందుకు అవకాశం ఉందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. అంతర్జాతీయ అంశాలపై దృష్టి.. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ మధ్య భేటీ గురువారం ఎలాంటి సత్ఫలితం లేకుండానే ముగిసింది. ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షలన్నీ ఎత్తివేయాలని కిమ్ కోరగా ఇందుకు తాము అంగీకరించలేదని ట్రంప్ వెల్లడించారు. ఇక్కడి వాతావరణం అయోమయంగానే ఉన్నప్పటికీ.. మరోవైపు అమెరికా–చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. ఇరు దేశాల తుది వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా అధికారులు సిద్ధంచేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ కథనం ప్రచురించింది. రెండు దేశాల చర్చల్లో అద్భుత పురోగతి ఉందని వైట్‌హౌస్ ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో వ్యాఖ్యానించడం మార్కెట్‌కు సానుకూల అంశంగా ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. మొదలైన ఎన్నికల వేడి.. సార్వత్రిక ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి సునీల్ అరోరా స్పష్టం చేసిన నేపథ్యంలో మార్కెట్లో ఎన్నికల వేడి మొదలుకానుందని యస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అమర్ అంబానీ అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున సూచీల్లో ఒక భారీ పెరుగుదల ఉండనుందని అంచనావేస్తున్నట్లు వెల్లడించారు. ఇక వచ్చే వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అంచనాలు ఉన్న కారణంగా సూచీల్లో అధిక స్థాయి ఒడిదుడుకులకు అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గణాంకాలపై దృష్టి.. ఈఏడాది ఫిబ్రవరికి సంబంధించిన నికాయ్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ మార్చి5న (మంగళవారం) వెల్లడికానుంది. డిసెంబర్ నెల యూఎస్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటా బుధవారం వెల్లడికానుండగా.. ఆదేశ జనవరి వాణిజ్య గణాంకాలు గురువారం రానున్నాయి. శుక్రవారం చైనా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వెల్లడికానుండగా.. అదేరోజున యూఎస్ నాన్ ఫామ్ పేరోల్స్ గణాంకాలు విడుదలకానున్నాయి. ఇక ఇతర అంతర్జాతీయ ప్రధాన అంశాల్లో.. వడ్డీ రేట్లకు సంబంధించి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) తన నిర్ణయాన్ని మార్చి 7న (గురువారం) ప్రకటించనుంది. ముడిచమురు ధరల ప్రభావం.. గతవారంలో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర దిగొచ్చింది. ఫ్యూచర్స్ రేట్లు 2 శాతం తగ్గాయి. అయితే, గతేడాది డిసెంబర్లో నమోదైన 50.5 డాలర్ల వద్ద నుంచి చూస్తే 15% పెరిగాయి. ఒపెక్ ఉత్పత్తి కోత కారణంగా ధరల్లో ఈస్థాయి పెరుగుదల నమోదైందని నార్నోలియా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కమోడిటీ విశ్లేషకులు సకినా అన్నారు. 15–నెలల గరిష్టస్థాయికి ఎఫ్ఐఐల పెట్టుబడి... ఈ ఏడాది ఫిబ్రవరిలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) జోరుగా పెట్టుబడులు పెట్టారు. రూ.17,220 కోట్లను దేశీయ స్టాక్ మార్కెట్లో నికరంగా వెచ్చిం చినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడైంది. 2017 నవంబర్‌లో రూ.19,728 కోట్ల నికర పెట్టుబడి పెట్టిన ఎఫ్‌పీఐలు. ఆ తరువాత గతనెల్లోనే భారీగా నిధులు కుమ్మరించారు. నేడు మార్కెట్‌కు సెలవు మహాశివరాత్రి సందర్భంగా మార్చి4న (సోమవారం) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. తిరిగి మంగళవారం(5న) యథాప్రకారం మార్కెట్ ప్రారంభమవుతుంది. ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. -
యుద్ధం జరగకూడదనే ఆశిద్దాం
నల్గొండ: దేశంలో చిచ్చుపెట్టే పాకిస్తాన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండ విలేకరులతో మాట్లాడుతూ.. సైన్యానికి మద్ధతుగా యావత్ దేశం నిలవడం అభినందనీయమన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాదులను అణచివేయాలని కోరారు. పాకిస్తాన్‌తో యుద్ధం జరగకూడదనే ఆశిద్ధామని అభిప్రాయం వ్యక్తం చేశారు. సమగ్రతకు మారుపేరు భారతదేశమని అన్నారు. ఈర్ష్యాద్వేషాలతో దేశంలో నరమేధాన్ని సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని తీవ్రంగా విమర్శించారు. -
‘ఇదే 56 అంగుళాల ఛాతీ’
చండీగఢ్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన 56 అంగుళాల ఛాతీని పాకిస్తాన్ ఉగ్రమూకలకు చూయించాడని భారత వాయిసేన మంగళవారం వేకువజామున జరిపిన సర్జికల్ దాడుల అనంతరం హర్యానా బీజేపీ ఎమ్మెల్యే అంజి విజ్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షనేతలకు చెప్పారు. ‘ మోదీ ఏం చెప్తారో అదే చేస్తారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదని మోదీ ఎప్పుడూ చెబుతారు. పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పారు. వాళ్లను(పాకిస్తాన్) వాళ్ల ఇంట్లోనే కొట్టాం. ఇదే 56 అంగుళాల ఛాతీ అంటే. ఇదే సింహం ఛాతీ అంటే’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే అంజి విజ్, మోదీని ఆకాశానికెత్తేశారు. బీజేపీ అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను విమర్శించడానికి మోదీ తన 56 అంగుళాల ఛాతీని ఎన్నికల ప్రచార ఆయుధంగా తరచూ వాడేవారు. 2014కు ముందు సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్‌ను విమర్శించాల్సి వచ్చినపుడు కూడా ఛాతీ గురించి ప్రస్తావించారు. యూపీని, గుజరాత్‌లా తీర్చిదిద్దాలంటే మీకు(ములాయం) 56 అంగుళాల ఛాతీ ఉండాలని అప్పట్లో వ్యాక్యానించిన విషయాన్ని అంజివిజ్ గుర్తు చేశారు. హర్యానా కాంగ్రెస్ నాయకుల తీరును కూడా బీజేపీ ఎమ్మెల్యే అంజివిజ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇండియా పాకిస్తాన్ భూభాగంలో రెండో సారి సర్జికల్ దాడులు చేయడం యావత్ భారత్ గర్వించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. నియంత్రణ రేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌కు 80 కి.మీ దూరంలో ఉన్న జైషే మహ్మద్ సంస్థ ఉగ్రవాద శిబిరంపై వేకువజామున 3 గంటల సమయంలో 12 మిరాజ్ యుద్ధ విమానాలతో రెప్పపాటులో దాడి సుమారు 1000 కిలోల లేజర్ బాంబులను జారవిడిచిన సంగతి తెల్సిందే. మిరాజ్ యుద్ధ విమానాల ద్వారా సర్జికల్ దాడులకు దిగడంతో దాదాపు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిసింది. -
2019ఎన్నికల తర్వాత భారత్‌తో చర్చలు : పాక్ ప్రధాని
రియాద్ : భారత్‌తో 2019 ఎన్నికల తర్వాత సంబంధాలపై చర్చలు ప్రారంభిస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. భారత్‌తో శాంతి చర్చలు జరిపేందుకు తాను ప్రయత్నింతిస్తున్నానని చెప్పారు. కానీ భారత్ నుంచి సానుకూల స్పందన రాలేదని వెల్లడించారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో పెట్టుబడుల సమాఖ్య సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఎల్లప్పుడు పొరుగు దేశాలతో శాంతినే కోరుకుంటుందన్నారు. ముఖ్యంగా భారత్, అప్గానిస్తాన్లతో శాంతియుత సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చేందుకు తాను కృషి చేస్తానని వెల్లడించారు. తమ దేశానికి ప్రస్తుతం శాంతి, భద్రత కావాలని ఆయన అన్నారు. గత నెల సెప్టెంబర్‌లో భారత్ - పాక్‌ల మధ్య జరగాల్సిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశాన్ని భారత్ రద్దు చేసుకుంది. ఆ సమయంలో పాకిస్తాన్ సైన్యం భారత్‌కు చెందిన భద్రతా సిబ్బందిని తీసుకెళ్లి హత్యచేసినందుకు నిరసనగా భారత్ ఆ సమావేశాన్ని బహిష్కరించింది.