
నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి(పాత చిత్రం)
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాదులను అణచివేయాలని..
నల్గొండ: దేశంలో చిచ్చుపెట్టే పాకిస్తాన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండ విలేకరులతో మాట్లాడుతూ.. సైన్యానికి మద్ధతుగా యావత్ దేశం నిలవడం అభినందనీయమన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాదులను అణచివేయాలని కోరారు. పాకిస్తాన్‌తో యుద్ధం జరగకూడదనే ఆశిద్ధామని అభిప్రాయం వ్యక్తం చేశారు. సమగ్రతకు మారుపేరు భారతదేశమని అన్నారు. ఈర్ష్యాద్వేషాలతో దేశంలో నరమేధాన్ని సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని తీవ్రంగా విమర్శించారు.