సాక్షి, నల్గొండ: రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వనికి ,అధికారులుకు సహకరించాలని కోరారు. రైతులు ఆందోళన చెందొద్దు, సీఎం కేసీఆర్ ఉండగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కాదని తెలిపారు. ఈ మధ్య కొంతమంది కేసీఆర్‌ను ఇబ్బందులు గురి చేయాలని బలహీనపరచాలని చూస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ని బలహీనపరిస్తే తెలంగాణ సమాజమే బలహీనం అయినట్లు అవుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణలో ఎక్కడి గొంగిడి అక్కడే అన్న చందంగా మారిపోతుందని అన్నారు.
కొన్ని పార్టీలు విద్వేష పూరితంగా, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ప్రకటనలు చేస్తున్నాయని, ఇది దురదృష్టకరమని తెలిపారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు గొప్ప పేరుప్రఖ్యాతులు ఉన్నాయని, అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాన్ని చెడగొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత సహజమని, అంతిమంగా ప్రజల సంక్షేమం కోసమే అందరూ పాటుపడాలన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడాలని, ప్రజల్లో స్ఫూర్తిని నింపేలా ఉండాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment