council chairman
-
మంత్రి అనితపై మండలి చైర్మన్ సీరియస్
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలపై మండలి ఛైర్మన్, స్పీకర్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఈ నెల 15వ తేదీ నుంచి జరుగనున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభా సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు, శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్ని శాఖల కార్యదర్శులను, పోలీస్ అధికారులను కోరారు. గత సమావేశాల్లో ప్రస్తుతం సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలను సకాలంలో అందజేయాలని అన్ని శాఖల కార్యదర్శులను వారు కోరారు. చదవండి: దమ్ముంటే అసెంబ్లీకి రా.. చంద్రబాబుకు పార్థసారథి సవాల్ సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం.. ఆంధ్రప్రదేశ్ శాసన సభ కమిటీ హాల్లో పలు శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులతో వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో వారిరువురూ పాల్గొని సభ్యుల ప్రశ్నలకు సకాలంలో సరైన సమాధానాలను అందజేయడం, పోలీస్ బందో బస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్బంగా కొయ్యే మోషేను రాజు మాట్లాడుతూ శాసన మండలి సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సరైన సమాధానాలను అందజేస్తూ వారి గౌరవాన్ని కాపాడాల్సి బాధ్యత అధికారులపై ఉందన్నారు. అటువంటి సత్సంప్రదాయం కొనసాగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆయన కోరారు. శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ ప్రజల యావత్ దృష్టి ఈ నెల 15 నుండి జరుగబోవు శాసన సభా సమావేశాలపై ఉంటుందని, వాటికి ఎంతో ప్రత్యేకత ఉందనే విషయాన్ని అధికారులు అందరూ గుర్తించాలన్నారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ సమావేశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు, చీఫ్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి, డీజీపీ కే. రాజేంద్రనాథ్ రెడ్డి, శాసనసభ సెక్రటరీ పి.బాలకృష్ణమాచార్యులు, శాసన మండలి ఓఎస్డీ కే.సత్యనారాయణరావు తదితరులతో పాటు పలు శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
కౌన్సిల్లోనూ టీడీపీ అదే తంతు
సాక్షి, అమరావతి: శాసన మండలిలో గురువారం కూడా టీడీపీ ఎమ్మెల్సీలు చిడతలతో భజనలు చేస్తూ, ఈలలు వేస్తూ గలాటా సృష్టించారు. చైర్మన్ మోషేన్‌రాజు ఎంత వారిస్తున్నా.. భజనలు చేసే వారు సభ నుంచి వెంటనే బయటకు వెళ్లాలని ఆదేశిస్తున్నా వారు అదే తీరున వ్యవహరించారు. దీంతో ఎనిమిది మందిని సస్పెండ్ చేసేందుకు మంత్రి కన్నబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా చైర్మన్ వారిని ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో.. దీపక్‌రెడ్డి, అశోక్‌బాబు, బచ్చుల అర్జునుడు, అంగర రామ్మోహన్, కేఈ ప్రభాకర్, రాజనర్శింహులు, దువ్వారపు రామారావు, మర్రెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. వీరంతా బయటకు వెళ్లిపోవాలని చైర్మన్ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా వారు సభలోనే రాద్ధాంతాన్ని కొనసాగించారు. దీంతో.. చిడతలు, ఈలలను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని మోషేన్‌రాజు మార్షల్స్‌ను ఆదేశించారు. చైర్మన్‌తో వాదులాట.. తమ సస్పెన్షన్ వ్యవహారంలో చైర్మన్ వైఖరిని తప్పుపడుతూ లోకేశ్ సహా మరికొందరు టీడీపీ సభ్యులు ఆయనతో వాదులాటకు దిగారు. ఇదే సమయంలో దీపక్‌రెడ్డి తమ చుట్టూ ఉన్న మార్షల్స్‌ను తోసుకుంటూ చైర్మన్ పోడియం మెట్లు ఎక్కేందుకు యత్నించగా మోషేన్‌రాజు మండిపడ్డారు. లోకేశ్ ప్రవర్తన బాగోలేదంటూ వ్యాఖ్యానించారు. అనంతరం.. మార్షల్స్ సస్పెండ్ అయిన వారిని బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకువెళ్లారు. అయినా కూడా అంగర రామ్మోహన్, బచ్చుల అర్జునుడు మరో గేట్ నుంచి తిరిగి సభలోకి వచ్చి ఆందోళన కొనసాగించేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. మరోవైపు.. అప్పటిదాకా తన సీటులోనే కూర్చుని ఉన్న టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు సభలో ఈ గందరగోళం జరుగుతున్న సమయంలో నెమ్మదిగా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత లోకేశ్ మిగిలిన టీడీపీ ఎమ్మెల్సీలూ వెళ్లిపోయారు. సస్పెండ్ అయిన వారిని బయటకు తీసుకెళ్లకుండా మార్షల్స్ తాత్సారం చేయడంపై మంత్రులు, పలువురు ఎమ్మెల్సీలు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా సమస్యల కోసం కాదు, సస్పెన్షన్ కోసమే.. సస్పెండ్ ప్రక్రియ అనంతరం చైర్మన్ మోషేన్‌రాజు మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు సస్పెండ్ కావడానికే సభకు వచ్చారుగానీ, ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదన్నారు. విచిత్రంగా తమను సస్పెండ్ చేయమని వారు అడుగుతున్నారని, కానీ.. సస్పెండ్ చేయకూడదని బుధవారం వరకూ ఓపిక పట్టామన్నారు. అనంతరం మంత్రులు, పలువురు ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. మండలి స్థాయిని టీడీపీ దిగజార్చిందంటూ తప్పుపట్టారు. పెద్దల సభలో ఇంత చిల్లరగా గలాటా చేయడం దురదృష్టకరమని మంత్రి కన్నబాబు అన్నారు. ఈ సభకు లోకేశ్ లాంటి వారు వచ్చాక ఇది దొడ్డిదారి సభలా ముద్రపడిపోయిందని చెప్పారు. మండలి అంటే చాలా గౌరవంగాను, హుందాగాను ఉండాలని.. కానీ అటువంటి సభా మర్యాదను టీడీపీ సభ్యులు మంటగలిపి సభ ఔన్నత్యాన్ని దిగజార్చారన్నారు. వారి ప్రవర్తనతో సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. చివరికి.. గోవింద నామాలను కించపరిచారన్నారు. బయటకు వెళ్లి ఏం చెప్పినా ప్రజలు నమ్మడంలేదు కాబట్టి ఈ సభను ప్రచారం కోసం వినియోగించుకోవాలని చూశారని మంత్రి అవంతి అన్నారు. దళిత వర్గానికి చెందిన వ్యక్తి చైర్మన్ స్థానంలో ఉండడం ఇష్టంలేనట్లుగా వారి ప్రవర్తన ఉందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని సీ రామచంద్రయ్య, ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాధవ్‌రావు, అరుణ్‌కుమార్, రవీంద్రబాబు, భరత్, గోపాలరెడ్డి తదితరులు కూడా మాట్లాడారు. ఇదిలా ఉంటే.. సస్పెన్షన్‌కు ముందు టీడీపీ ఎమ్మెల్సీలు ‘మా భజన బాగుందా.. మీది బాగుందా’ అంటూ నినాదాలు చేస్తుండగా, మిగిలిన సభ్యుల వైపు నుంచి వీరిపై రూ.500 నోటు విసిరారు. -
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గా నామినేషన్ దాఖలు చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి
-
నాలెడ్జ్ క్యాపిటల్‌గా ఏపీ
సాక్షి,తగరపువలస (విశాఖపట్నం): విద్యార్థులకు నాలెడ్జ్ క్యాపిటల్‌గా ఆంధ్రప్రదేశ్, ప్రపంచానికి వస్తు ఉత్పత్తి కేంద్రంగా భారతదేశం చిరునామాగా మారాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం భీమిలి మండలం దాకమర్రి రఘు ఇంజనీరింగ్ కళాశాలలో ఐఈఈఈ విశాఖ బే సెక్షన్ సాంకేతిక సౌజన్యంతో ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్ అండ్ పవర్ టెక్నాలజీ’–(ఐసి3పి2022) వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్ధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సాంకేతికంగా పురోగతి సాధించిన ప్రస్తుత కాలంలో ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయిందన్నారు. దీనిని విద్యార్థులు తమ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న సాంకేతికతో నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలన్నారు. మారుతున్న సాంకేతికతను అర్ధం చేసుకుంటూ ప్రాథమిక అంశాలపై లోతైన అవగాహన కలిగి ఉండాలన్నారు. స్టార్టప్, ఇంక్యుబేషన్, ఎంటర్ప్యూనర్షిప్లు ప్రస్తుత తరానికి సుపరిచితులన్నారు. ఆ దిశగా విద్యార్థులు అడుగులు వేసి దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఐఈఈఈ వైజాగ్ బే అధ్యక్షుడు ఎస్.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా వివిధ విద్యాసంస్థల్లో నిర్వహిస్తున్న తొలి సదస్సు రఘు ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నామన్నారు. సంస్థ కార్యక్రమాలు, సభ్యులు, విధి విధానాలు తదితర అంశాల గురించి వివరించారు. రఘు విద్యాసంస్థల చైర్మన్ కలిదిండి రఘు మాట్లాడుతూ ఉన్నత విద్య అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా అవసరమైన ప్రోత్సాహం, సహకారం ఉన్నత విద్యామండలి అందిస్తుందన్నారు. ఇలాంటివి విద్యారంగానికి శుభపరిణామన్నారు. బోధన వృత్తి ఎంతో ఉన్నతమైనదన్నారు. విద్యార్థులకు ఆసక్తి పెంచేవిధంగా బోధన జరపాలన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి.సతీష్ రామచౌదరి మాట్లాడుతూ సదస్సుకు మన దేశంతో పాటు వివిధ దేశాల నుంచి 206 పరిశోధనా పత్రాలు వచ్చాయన్నారు. దీనిని హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రెండు రోజుల పాటు కీలక ఉపన్యాసాలు, టెక్నికల్ సెషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సదస్సు సావనీర్‌ను హేమచంద్రారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం అతిథులను జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు సీహెచ్ శ్రీనివాస్, ఎస్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మండలి చైర్మన్‌గా మళ్లీ గుత్తా?
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో వివిధ కోటాల్లో ఖాళీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో సభలో సంఖ్యాపరంగా టీఆర్ఎస్ సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించింది. 40 మంది సభ్యులున్న మండలిలో పార్టీ మద్దతుదారులైన ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో కలుపుకొని టీఆర్ఎస్ బలం 36కు చేరింది. గవర్నర్ కోటాలో ఒకరు, ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు, స్థానిక సంస్థల కోటాలో 12 మంది కలుపుకొని మొత్తం 19 మంది టీఆర్ఎస్ సభ్యులు ఇటీవలి కాలంలో మండలికి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మండలిలో ఖాళీగా ఉన్న పదవులను పలువురు సభ్యులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం మండలిలో చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు చీఫ్ విప్, మరో మూడు విప్ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న సభ్యులూ ఉన్నారు. గత జూన్ మొదటి వారంలో మండలి చైర్మన్‌గా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ఏకకాలంలో ఎమ్మెల్సీలుగా పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. విప్‌లుగా ఉన్న కర్నె ప్రభాకర్ గత ఏడాది మార్చిలో రిటైర్ కాగా, మరో ఇద్దరు విప్‌లు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, టి.భానుప్రసాద్‌రావు తాజాగా జరిగిన స్థానిక కోటా ఎన్నికల్లో మరోమారు ఎన్నికయ్యారు. వీరి పదవీ కాలం జనవరి 4న ముగియనుండగా, ఎంఎస్ ప్రభాకర్ ఒక్కరే విప్ హోదాలో కొనసాగుతారు. చైర్మన్ స్థానంలో ఉన్న వెన్నవరం భూపాల్‌రెడ్డి పదవీకాలం జనవరి 4న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సర్వత్రా ఉత్కంఠ: మండలి చైర్మన్‌గా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి మరోమారు మండలికి ఎన్నిక కాగా, గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన సిరికొండ మధుసూదనాచారి కూడా గవర్నర్ కోటాలో మండలిలో అడుగు పెడుతున్నారు. ఏడాదిన్నర కాలం చైర్మన్‌గా పనిచేసిన గుత్తా మరోమారు చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవమున్న మధుసూదనాచారి మండలి చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశముందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మధుసూదనాచారికి చైర్మన్ పదవి దక్కితే గుత్తాకు ప్రభుత్వంలో మరింత ప్రాధాన్యత ఉన్న పదవి దక్కే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే కోటాలో మండలిలో అడుగుపెడుతున్న బండా ప్రకాశ్ ముదిరాజ్‌కు కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావిస్తున్నారు. ఒకవేళ సామాజిక సమీకరణాల లెక్కల్లో కేబినెట్లో బెర్త్ దక్కకపోతే మండలి వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశముంది. ఈ పదవుల పంపకాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మండలి కోటాలో కేబినెట్ బెర్త్? ప్రస్తుతం మండలి నుంచి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ మంత్రిమండలికి ప్రాతినిథ్యం వహిస్తుండగా, మరికొందరు సీనియర్ నేతలు కూడా కేబినెట్లో చోటు ఆశిస్తున్నారు. గతంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన ఈటల రాజేందర్ స్థానంలో బండా ప్రకాశ్‌కు చోటు దక్కుతుందని భావిస్తుండగా, ఆయనతోపాటు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత ఆశావహుల జాబితాలో ఉన్నారు. మండలిలో ఖాళీగా ఉన్న మూడు విప్ పదవులను ఆశిస్తున్న వారిలో ఇప్పటికే విప్‌లుగా ఉన్న భానుప్రసాద్‌రావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితోపాటు తక్కల్లపల్లి రవీందర్రావు, సురభి వాణీదేవి, ఫారూఖ్ హుస్సేన్, గంగాధర్‌గౌడ్ ఉన్నారు. ఇదిలాఉంటే మండలి ప్రొటెమ్ ఛైర్మన్ పదవీకాలం జనవరి 4న ముగుస్తుండటంతో కొత్త చైర్మన్ ఎన్నిక కోసం రెండు రోజులు మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. -
కేసీఆర్‌ను బలహీనపరచాలని చూస్తున్నారు
సాక్షి, నల్గొండ: రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వనికి ,అధికారులుకు సహకరించాలని కోరారు. రైతులు ఆందోళన చెందొద్దు, సీఎం కేసీఆర్ ఉండగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కాదని తెలిపారు. ఈ మధ్య కొంతమంది కేసీఆర్‌ను ఇబ్బందులు గురి చేయాలని బలహీనపరచాలని చూస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ని బలహీనపరిస్తే తెలంగాణ సమాజమే బలహీనం అయినట్లు అవుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణలో ఎక్కడి గొంగిడి అక్కడే అన్న చందంగా మారిపోతుందని అన్నారు. కొన్ని పార్టీలు విద్వేష పూరితంగా, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ప్రకటనలు చేస్తున్నాయని, ఇది దురదృష్టకరమని తెలిపారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు గొప్ప పేరుప్రఖ్యాతులు ఉన్నాయని, అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాన్ని చెడగొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత సహజమని, అంతిమంగా ప్రజల సంక్షేమం కోసమే అందరూ పాటుపడాలన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడాలని, ప్రజల్లో స్ఫూర్తిని నింపేలా ఉండాలని హితవు పలికారు. -
అభివృది వికేంద్రీకరణ బిల్లుపై స్పష్టత ఇచ్చిన మండలి చైర్మన్
-
మండలి చైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికం
-
‘విలీనం’పై సభాపతులకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : శాసనసభ, మండలిలో తమ సభ్యుల విలీనంపై కాంగ్రెస్ గతంలో దాఖలు చేసిన రెండు పిటిషన్లపై హైకోర్టు చర్యలు చేపట్టింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్ అధిపతిగా వ్యవహరించే శాసనసభ స్పీకర్‌కు, అదే హోదాలో మండలి చైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ తరఫున గెలిచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలు, 10 మంది ఎమ్మెల్యేలతోపాటు అసెంబ్లీ, మండలి కార్యదర్శులు, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ధర్మాసనం నోటీసులిచ్చింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాసనమండలిలో కాంగ్రెస్‌పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ దాఖలు చేసిన వ్యాజ్యం ధర్మాసనం ఎదుట మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. మండలిలో తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలలో నలుగురు పార్టీ ఫిరాయించగా ఎలాంటి అధికారాలు లేకపోయినా మండలి చైర్మన్ కాంగ్రెస్‌పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనమైనట్లుగా ప్రకటించారని షబ్బీర్ అలీ రిట్లో పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు రాగానే మండలి చైర్మన్ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు స్పందిస్తూ సుప్రీంకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ వాదించేందుకు వస్తారని, ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నందున విచారణను వచ్చే నెలకు వాయిదా వేయాలని కోరారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ అభ్యంతరం చెప్పారు. నిన్న, ఈరోజు కూడా హరేన్ రావల్ రాష్ట్ర హైకోర్టులోనే కేసులు వాదించారని చెప్పారు. అయితే ఆయన అమెరికా వెళ్లబోతున్నారని మాత్రమే చెప్పానని రామచంద్రరావు ధర్మాసనానికి వివరణ ఇచ్చారు. కేసుల్ని వాయిదా వేయాలని మీరే కోరుతున్నారని ధర్మాసనం పేర్కొనగా తానేమీ వాయిదాలు కోరలేదని జంధ్యాల బదులిచ్చారు. దీంతో ధర్మాసనం పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్‌గా వ్యవహరించే మండలి చైర్మన్, మండలి సెక్రటరీ, పార్టీ పిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలు ఎం.ఎస్. ప్రభాకర్‌రావు, కె. దామోదర్‌రెడ్డి, టి. సంతోష్ కుమార్, ఆకుల లలితకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికీ నోటీసులు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అసెంబ్లీలో సీఎల్పీ కేసులోనూ.. శాసనసభలో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని (సీఎల్పీ) టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికే కౌన్సిల్లో చేశారంటూ ఏప్రిల్ 29న దాఖలైన మరో రిట్ పిటిషన్‌ను కూడా ధర్మాసనం విచారించింది. పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి ఫిరాయించారని, సీఎల్పీని సైతం టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని (అప్పటికి విలీనం నిర్ణయం తీసుకోలేదు) టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తమ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్‌గా వ్యవహరించే శాసనసభ స్పీకర్, శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శితోపాటు టీఆర్ఎస్లోకి ఫిరాయించిన పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డి. సుధీర్‌రెడ్డి, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, బీరం హర్షవర్దన్‌రెడ్డి, రేగా కాంతారావు, ఆత్రం సక్కు, వనమా వెంకటేశ్వరరావు, జె. సురేందర్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులంతా తమ వాదనలతో కౌంటర్ వ్యాజ్యాలు దాఖలు చేయాలని రెండు కేసుల్లోనూ ధర్మాసనం ఆదేశించింది. కేసుల విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. సీఎల్పీ విలీనంపై తాజా వ్యాజ్యంలో.. కాంగ్రెస్ నుంచి తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్లోకి ఫిరాయించాక సీఎల్పీ టీఆర్ఎస్ఎల్పీలో విలీనమైనట్లు స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీ బులిటెన్ విడుదల చేసింది. అయితే పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్‌గా వ్యవహరించే స్పీకర్ నిర్ణయాన్ని, శాసనసభ కార్యదర్శి ఇచ్చిన బులిటెన్‌ను రద్దు చేయాలని ఉత్తమ్, భట్టి రెండు రోజుల క్రితం మరో రిట్ దాఖలు చేశారు. నేటి విచారణ జాబితాలో కేసు లేకపోవడాన్ని పిటిషనర్ న్యాయవాది చెప్పడంతో బుధవారం విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. కాంగ్రెస్ తరఫున ఎన్నికైన చట్టసభ్యుల్లో మూడింట రెండొంతుల మంది టీఆర్ఎస్లో చేరినప్పుడు ఆ పార్టీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనమైనట్లుగా ప్రకటించే అధికారం అసెంబ్లీ స్పీకర్‌కు లేదని, ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో అనర్హత అంశంపై మాత్రమే స్పీకర్ తీర్పు చెప్పవచ్చునని, విలీన అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్ల వాదన. శాసనసభాపతి వేరు, పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్‌గా వ్యవహరించే స్పీకర్ వేరని, ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయ సమీక్ష చేయవచ్చునని వారు వాదిస్తున్నారు. శాసనమండలి, శాసనసభల్లోని ఒక పార్టీకి చెందిన చట్ట సభ్యులను కలిపితేనే ఆ పార్టీ శాసనసభాపక్షం అవుతుందని, అంటే మండలిలో ఆరుగురు, శాసనసభలో 19 మంది చొప్పున (అప్పటికి ఉత్తమ్ ఎమ్మెల్యేగానే ఉన్నారు) కాంగ్రెస్ సభ్యులు ఉన్నారని, పాతిక మంది ఉన్న వారిలో 19 మంది పార్టీ వీడినప్పుడే విలీనానికి చట్టపరమైన అవకాశం ఉంటుందని కూడా పిటిషనర్ల వాదన. అయితే మండలిలో ఆరుగురులో నలుగురు, అసెంబ్లీకి ఉత్తమ్ రాజీనామా చేశాక మిగిలిన 18 మందిలో 12 మంది పార్టీకి గుడ్‌బై చెప్పాక ఆ సభ్యుల బలం మూడింట రెండు వంతులేనని అధికార టీఆర్ఎస్ చేస్తున్న వాదనను పిటిషనర్లు తప్పుపడుతున్నారు. మరోవైపు రాజ్యాంగ నిబంధనలకు లోబడే మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్లు వ్యవహరించారని ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు గట్టిగా వాదిస్తున్నారు. కాగా, ముగ్గురు ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రాములు నాయక్, భూపతిరెడ్డిలను అనర్హులుగా ప్రకటిస్తూ శాసనమండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ దాఖలైన మరో వ్యాజ్యం కూడా హైకోర్టు విచారణలో ఉన్న విషయం విదితమే. ఈ మూడు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోమని ఈసీ హామీ ఇవ్వడంతో అందుకు అనుగుణంగా ఇటీవలే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
సీఐఐ తెలంగాణ చైర్మన్ గా నృపేంద్ర రావు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్‌గా 2016-17 సంవత్సరానికి పెన్నార్ ఇండస్ట్రీస్ చైర్మన్ నృపేంద్ర రావు ఎన్నికయ్యారు. సీఐఐ (తెలంగాణ) కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్, రీజనల్ హెడ్ వి.రాజన్న ఎంపికయ్యారు. -
ఆ ఎమ్మెల్సీలపై తొందరగా చర్య తీసుకోండి
కౌన్సిల్ చైర్మన్‌కు డీఎస్ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్ : విప్‌ను ధిక్కరించి అధికారపక్షానికి అనుకూలంగా ఓటేసిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలపై తొందరగా చర్య తీసుకుని ప్రజాస్వామ్య గౌరవాన్ని కాపాడాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత ధర్మపురి శ్రీనివాస్ మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. డీఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంతోష్‌కుమార్, ఎమ్మెస్ ప్రభాకర్, మాగం రంగారెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్, బి.వెంకట్రావు, మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి తదితరులు సోమవారం స్వామిగౌడ్‌ను కలిసి విడివిడిగా అనర్హత పిటిషన్లు అందజేశారు. శాసనమండలి సాక్షిగా విప్ ఉల్లంఘన జరిగినందున తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. -
నేడే శాసనమండలి ఎన్నికలు
-
నాడు గేటువద్దకూ రానివ్వలేదు.. నేడు ఛైర్మన్!
-
నాడు గేటువద్దకూ రానివ్వలేదు.. నేడు ఛైర్మన్!
ఒకప్పుడు తనను అసెంబ్లీ గేటు వద్దకు కూడా రానివ్వలేదని, అలాంటిది ఇప్పుడు శాసన మండలికి ఛైర్మన్ అయ్యే అవకాశం దక్కిందని టీఆర్ఎస్ తరఫున శాసనమండలి ఛైర్మన్ పదవికి పోటీ చేస్తున్న స్వామిగౌడ్ అన్నారు. శాసనమండలి చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. తాను ఏదో ఒక పార్టీకి చెందిన వ్యక్తిలా కాకుండా ప్రజల మనిషిలా పనిచేస్తానని స్వామిగౌడ్ ఈ సందర్భంగా చెప్పారు. టీఆర్ఎస్ తరఫున స్వామిగౌడ్, కాంగ్రెస్ పార్టీ తరఫున ఫారుఖ్ హుస్సేన్ ఈ పదవికి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. -
మండలి చైర్మన్ పదవికి కాంగ్రెస్ పోటీ
-
'ఆ ఎన్నికను వాయిదా వేయండి'
-
కాంగ్రెస్ మండలి చైర్మన్‌గా ఫారూఖ్ హుస్సేన్
హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి చైర్మన్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. అంతకు ముందు గాంధీభవన్‌లో సమావేశం అయిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ... మండలి చైర్మన్ పదవికి చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు హాజరు అయ్యారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ నుంచి మండలి ఛైర్మన్‌గా స్వామిగౌడ్ పేరు దాదాపు ఖరారైంది. ఈరోజు సాయంత్రం పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. చైర్మన్ పదవికి రేపు నామినేషన్ దాఖలు చేశారు. -
మండలి చైర్మన్ పదవికి కాంగ్రెస్ పోటీ
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం శాసనమండలిలో పాగా కోసం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సోమవారం గాంధీభవన్‌లో సమావేశం అయ్యారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎంపికపై నేతలు ఈ భేటీలో కసరత్తు చేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీని చైర్మన్ ఎన్నికలో ధీటుగా ఎదుర్కొనేందుకు మైనార్టీ, ఎస్సీ ఎమ్మెల్సీల్లో ఒకరిని చైర్మన్ అభ్యర్థిగా పోటీ పెట్టాలని యోచిస్తోంది. పలువురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరడంతో చైర్మన్ ఎంపిక వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్, ఎమ్మెల్యే జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు హాజరు అయ్యారు. మరోవైపు శాసనమండలి చైర్మన్ పదవికి పార్టీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్ పేరును కెసిఆర్ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.