
నాడు గేటువద్దకూ రానివ్వలేదు.. నేడు ఛైర్మన్!
ఒకప్పుడు తనను అసెంబ్లీ గేటు వద్దకు కూడా రానివ్వలేదని, ఇప్పుడు శాసనమండలికి ఛైర్మన్ అయ్యే అవకాశం దక్కిందని స్వామిగౌడ్ అన్నారు.
ఒకప్పుడు తనను అసెంబ్లీ గేటు వద్దకు కూడా రానివ్వలేదని, అలాంటిది ఇప్పుడు శాసన మండలికి ఛైర్మన్ అయ్యే అవకాశం దక్కిందని టీఆర్ఎస్ తరఫున శాసనమండలి ఛైర్మన్ పదవికి పోటీ చేస్తున్న స్వామిగౌడ్ అన్నారు. శాసనమండలి చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.
తాను ఏదో ఒక పార్టీకి చెందిన వ్యక్తిలా కాకుండా ప్రజల మనిషిలా పనిచేస్తానని స్వామిగౌడ్ ఈ సందర్భంగా చెప్పారు. టీఆర్ఎస్ తరఫున స్వామిగౌడ్, కాంగ్రెస్ పార్టీ తరఫున ఫారుఖ్ హుస్సేన్ ఈ పదవికి పోటీ పడుతున్న విషయం తెలిసిందే.