Swamy Goud
-
విభజన హామీలు నెరవేర్చడంలో బీజేపీ విఫలమైంది : స్వామి గౌడ్
-
ఉద్యమ బిడ్డలంతా కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్లో చేరారు స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వీరికి కుండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వామిగౌడ్ వీరిచిత పోరాటం చేశారని కేటీఆర్ కొనియాడారు. దాసోజ్ శ్రవణ్ సెల్ఫేమేడ్ లీడర్ అని ప్రశంసించారు. టీఆర్ఎస్లో చేరిన అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతిబిడ్డ కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కీసీఆర్ పిలుపుతోనే ఉద్యమంలో కసితో పనిచేశామని తెలిపారు. ఉద్యమ సమయంలో ఉద్యోగ గర్జన ప్రారంభమైంది ఈ రోజే(అక్టోబర్ 21) అని గుర్తు చేశారు. అదే తేదీన మళ్లీ టీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉందన్నారు. విభజన సమస్యల పరిష్కారం కోసమే తాను గతంలో బీజేపీలో చేరానని స్వామిగౌడ్ పేర్కొన్నారు. సమస్యలపై కేంద్రంలో పెద్దలకు చాలాసార్లు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. కానీ తాను బీజేపీలో చేరిన ఆశయం నెరవేరలేదని, అందుకే తిరిగి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. 8 ఏళ్ల తర్వాత తిరిగి టీఆర్ఎస్ గూటికే రావడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ చేయి పట్టుకుని తెలంగాణ ఉద్యమ గొంతుకగా పనిచేశానని పేర్కొన్నారు. దేశానికే తలమానికంగా తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. బీజేపీలో కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులకే ప్రాధాన్యం ఉందని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు ఆ పార్టీలో స్థానం లేదని విమర్శించారు. చదవండి: బీజేపీకి మరో షాక్.. స్వామిగౌడ్ రాజీనామా.. టీఆర్ఎస్లో చేరిక -
టీఆర్ఎస్కు షాక్.. కమలం గూటికి స్వామిగౌడ్
-
టీఆర్ఎస్కు షాక్.. కమలం గూటికి స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్ : అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత స్వామి గౌడ్ బుధవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. ఈ క్రమంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న స్వామి గౌడ్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ కండువా కప్పి స్వామి గౌడ్‌ను జేపీ నడ్డా పార్టీలోకి ఆహ్వానించారు. స్వామి గౌడ్ వెంట ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నారు. ఇక త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలోని కీలక నేత కమలం గూటికి చేరడంతో టీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలినట్టైంది. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాజకీయాల్లో మార్పులు శరవేగంగా మారిపోతున్నాయి. ఈసారి ఎలాగైనా బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకనుగుణంగా తమ వ్యూహాలకు కూడా పదునుపెట్టింది. ప్రచారంపై దృష్టి పెడుతూ మరోవైపు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని అసంతృప్తి నేతలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇప్పటికే పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను పార్టీలోకి చేర్చుకొని టికెట్ ఇవ్వగా తాజాగా స్వామిగౌడ్‌ను తమ గూటికి చేర్చుకుంది. వందసార్లు అపాయింట్మెంట్ అడిగా: స్వామి గౌడ్ బీజేపీలో చేరడం అంటే తన తల్లి గారి ఇంటికి వచ్చినట్లు భావిస్తున్నట్టు స్వామి గౌడ్ అన్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ జెండా పట్టని వారికి కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. మమ్మల్ని ఎండలో నిలబెట్టారు. తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం దొరుకుతుందనే ఉద్దేశంతో బీజేపీలో చేరాను. వందసార్లు కేసీఆర్ అపాయింట్మెంట్ కోరాను. రెండేళ్లలో నాకు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మాభిమానం కాపాడుకునేందుకే బీజేపీలోకి వచ్చాను. టీర్‌ఆర్‌ఎస్‌లో చాలామంది అవమానాలకు గురవుతున్నారు. తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుంది. హైదరాబాద్ మేయర్ సీటు బీజేపీ గెలుస్తుంద’ని అన్నారు. -
బీజేపీలోకి టీఆర్ఎస్ కీలక నేత!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి పెడుతూనే.. మరోవైపు ఇతర పార్టీలలో పేరున్న నేతలకు గాలంవేసే పనిలో పడ్డాయి. ముఖ్యంగా బీజేపీ ఈ విషయంలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకొని ప్రత్యర్థులను దెబ్బకొట్టాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను పార్టీలోకి చేర్చుకొని టికెట్ ఇచ్చింది. ఇంతటితో ఆగకుండా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల్లోని బడా లీడర్లకు గాలం వేసే పనిలో పడింది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ కేంద్ర మంతి సర్వే సత్యనారాయణ, చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డితో మంతనాలు జరిపిన బీజేపీ నేతలు.. తాజాగా తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మెన్, టీఆర్ఎస్ సీనియర్ నేత స్వామిగౌడ్‌ని పార్టీలోకి తీసుకొచ్చుందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. (చదవండి : బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్, సర్వే సత్యనారాయణ!) శనివారం సాయంత్రం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే స్వామి గౌడ్ మాత్రం పార్టీ మార్పుపై క్లారిటీ ఇవ్వలేదు. ‘పార్టీ మారితే చెప్పే మారుతా.బీజేపీ నేతలతో కేవలం ఆత్మీయ కలయిక మాత్రమే. స్నేహితులను కలిశాను. అది కూడా తప్పేనా’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. (చదవండి : రూ.10 వేలను అడ్డుకొని రూ.25 వేలు ఎలా ఇస్తారు?) అయితే బీజేపీ నేతలు మాత్రం స్వామిగౌడ్ తమ పార్టీలో చేరబోతున్నట్లు పరోక్షంగా చెబుతున్నారు. భేటీ అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. స్వామిగౌడ్‌తో తమది స్నేహపూర్వక భేటీ అంటునే.. ఏదైనా ఉంటే భవిష్యత్తులో చెప్తామని స్వామిగౌడ్ చేరికను పరోక్షంగా అంగీకరించారు. ఇక బండి సంజయ్ మాట్లాడుతూ.. స్వామిగౌడ్‌కు టీఆర్ఎస్లో అన్యాయం జరిగిందన్నారు. స్వామిగౌడ్ హిందుత్వ భావాజాలం ఉన్నవ్యక్తి అంటూ ప్రశంసించారు. భవిష్యత్తులో అనేకమంది పార్టీలోకి వస్తారని, అందరికి కలుపుకొని పార్టీని మరింత బలేపేతం చేస్తామని పేర్కొన్నారు. -
టీఆర్ఎస్లో గుబులు.. స్వామిగౌడ్ ఆగ్రహం
-
స్వామిగౌడ్ ఆగ్రహం: టీఆర్ఎస్లో గుబులు
సాక్షి, హైదరాబాద్ : ప్రశాంతంగా ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ప్రకంపనలు రేపుతున్నారు. ఇటీవల వివిధ సందర్భాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించడం గులాబీ దళంలో గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాక్షితో ముచ్చటించిన స్వామిగౌడ్ టీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో ఉద్యమకారులను కలుపుకుని పోవడంలేదని ఆగ్రహం చెందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమను చూసి హేళన చేసిన వారికి నేడు ప్రభుత్వంలో మంచి గుర్తింపు లభించిందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. (‘గవర్నర్ కోటా’ కసరత్తు షురూ!) గతకొంత కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా ఇవ్వడంలేదని తెలిపారు. ఉద్యమ సమయంలో వెన్నంటి ఉండి నడిచిన వారికి కూడా కలిసే సమయం ఇవ్వకపోతే మరెవ్వరికి ఇస్తారని టీఆర్ఎస్ బాస్‌పై కొపగించుకున్నారు. అయితే ప్రస్తుతం తనకు పార్టీ మారే ఆలోచన లేదని, ఉద్యమకారులను, బడుగు బలహీన వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చేవెళ్ల ఎంపీ టికెట్ తనకు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ తన స్థానంలో మరొకరికి టికెట్ కేటాయించారని గుర్తుచేశారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా.. గతేడాది ఏప్రిల్‌లో శాసనమండలి సభ్యుడిగా, మండలి చైర్మన్‌గా పదవీ కాల పరిమితి పూర్తి చేసుకున్న స్వామిగౌడ్ కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లో అంతగా కనిపించట్లేదు. గతంలో గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ అయిన స్వామిగౌడ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీకి ఆసక్తి చూపినా అవకాశం లభించలేదు. ఏదేని ముఖ్యమైన కార్పొరేషన్ పదవి దక్కుతుందని ఆశించినా పార్టీ అధిష్టానం నుంచి స్పందన లేకపోవడంతో స్వామిగౌడ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్వామిగౌడ్ కలకలం
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ఇటీవల వివిధ సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలు టీఆర్ఎస్లో చర్చనీయాంశమవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన నారాయణగురు జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ‘దేశంలో కొన్ని కులాలే అధికారం చలాయిస్తున్నా’యంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాజాగా ఆదివారం బోయినపల్లిలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బడుగు, బలహీనవర్గాలకు రేవంత్‌రెడ్డి బలమైన వెన్నుపూస, చేతికర్రగా మారారు. తెల్లబట్టల నేతలకు అమ్ముడుపోవద్దు’అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ‘తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్ అన్న పాత్ర ఎవరూ కాదనలేనిది. సమైఖ్య పాలనలో ఆయనపై దాడిచేసిన అధికారులకు కీలక బాధ్యతలిచ్చారు. తెలంగాణ బడుగు, బలహీనవర్గాల బిడ్డను గుర్తింపులేకుండా పక్కనపెట్టారు’అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. డిప్యూటీ స్పీకర్‌తో మంత్రి భేటీ సర్వాయిపాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం వేదికగా రేవంత్‌రెడ్డి, స్వామిగౌడ్ పరస్పరం ప్రశంసలు కురిపించుకోవడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో గౌడ సంఘం నేతలు పల్లె లక్ష్మణ్‌గౌడ్, అయిలి వెంకన్నగౌడ్ తదితరులతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌తో భేటీ అయ్యారు. డిప్యూటీ స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించినా, స్వామిగౌడ్ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ భేటీ జరిగినట్లు భావిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా.. గతేడాది ఏప్రిల్‌లో శాసనమండలి సభ్యుడిగా, మండలి చైర్మన్‌గా పదవీ కాల పరిమితి పూర్తి చేసుకున్న స్వామిగౌడ్ కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లో అంతగా కనిపించట్లేదు. గతంలో గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ అయిన స్వామిగౌడ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీకి ఆసక్తి చూపినా అవకాశం లభించలేదు. ఏదేని ముఖ్యమైన కార్పొరేషన్ పదవి దక్కుతుందని ఆశించినా పార్టీ అధిష్టానం నుంచి స్పందన లేకపోవడంతో స్వామిగౌడ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
శాసనమండలి నిరవధిక వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉభయసభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనమండలి ఆదివారం సమావేశమైంది. ఒక్కరోజు జరిగిన సభలో 4.54గంటల పాటు గవర్నర్ ప్రసంగంలోకి అంశాలపై 18మంది సభ్యులు చర్చలో పాల్గొన్నట్టు మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, భూపతిరెడ్డి, రాములునాయక్‌పై అనర్హత వేటు వేసినట్టు చైర్మన్ తెలిపారు. గవర్నర్ ప్రసంగంపై సభ్యుల చర్చ... సహకరిస్తాం.. కానీ: పొంగులేటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు, అభివృద్ధికి తాము సహకరిస్తామని, కానీ గవర్నర్ ప్రసం గంలో కొన్ని అర్ధసత్యాలు, కొన్ని అసత్యాలున్నాయని, వాటిపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘గాడిలో పడ్డ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ’ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ సీఎంగా రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో అన్ని కులాల్లో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సమగ్రసర్వేతో ఏ కులాలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించాలన్న దానిపై అధ్యయనం చేసి పథకాలు రూపొందించారన్నారు. ‘సమస్యలు తొలగిపోయాయి’ రాష్ట్ర ఏర్పాటు జరిగితే తెలంగాణ అంధకారంలో మగ్గిపోతుందన్న ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యల్ని పటా పంచలు చేయడంలో కేసీఆర్ కృషి ఎనలేనిదని ఎమ్మెల్సీలు సలీం, ఎంఎస్ ప్రభాకర్ అన్నారు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల్లో 60 ఏళ్ల సమస్యలన్నీ నాలుగున్నరేళ్లలో తొలగిపోయాయన్నారు. ‘వ్యవసాయరంగంలో ఎనలేని అభివృద్ధి’ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఎనలేని అభివృ ద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడంలో టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ సఫలీకృతమయ్యారని ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్, కృష్ణారెడ్డి ప్రశంసిం చారు. కేసీఆర్ రాష్ట్రాన్ని రైతుబంధు, రైతుబీమా తో దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దారన్నారు. ‘రైతులు వైఎస్, కేసీఆర్‌లను నమ్మారు’ రైతులు నమ్మిన నేతలే ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తారని ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ అన్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డికి, రైతులకు 24గంటల ఉచిత కరెంట్, రైతు బీమా, రైతు బంధు పథకాలిచ్చిన కేసీఆర్‌లు విజయం సాధించడమే దీనికి నిదర్శనమన్నారు. ‘రైతులకు సంక్షేమాన్ని అందిస్తున్నారు’ రైతులకు సీఎం కేసీఆర్ సంక్షేమాన్ని అందిస్తున్నారని ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అందులో ఒకటి దీర్ఘకాలిక ప్రణాళిక ద్వారా సాగునీటి ప్రాజెక్టులతో నీళ్లందించడం, రెండోది తక్షణసాయం కింద రైతుబీమా, రైతు బంధుతో పాటు విత్తనాలు, ఎరువులివ్వడం చేస్తున్నారన్నారు. మైనారిటీలకు ఏ రాష్ట్రంలో లేని తీరుగా సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలుచేస్తున్నారని ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు రాష్ట్ర అభివృద్ది పథంలో పయనిస్తోందని, అందుకు కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న కృషే నిదర్శనమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించిన సభ్యులు, వారు లేవనెత్తిన అంశాలపై ఆయన సమాధానాలు చెప్పారు. కాగా, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానాన్ని పల్లారాజేశ్వర్‌రెడ్డి ప్రాతిపాదించగా, సభ ఆమోదిస్తున్నట్లు స్వామిగౌడ్ తెలిపారు. మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. -
కోర్టుకెళతా.. న్యాయపోరాటం చేస్తా
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఆరోపణలతో తనపై శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ నేత భూపతిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది రాష్ట్రంలోనే చీకటి రోజు అని, ముగ్గురి మీద అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించడం.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ్ రెడ్డిలను అనర్హలుగా మండలి చైర్మన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. నేను ఏ పార్టీ గుర్తు మీద గెలువలేదు. గవర్నర్ కోటాలో ఎన్నిక కాలేదు. నాపై ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెరాసలో విలీనం అయినట్లు గెజిట్ కూడా విడుదల చేశారు. అలాంటప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది. ఏ ప్రాతిపదికన నాపై అనర్హత వేటు వేశారు? కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి మారిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని ఫిరాయింపు కేసు వేశాం. కానీ, దానిపై చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా ఎన్నుకుంటేనే కదా మండలి చైర్మన్ అయ్యారు. పెద్దల సభలోనే న్యాయం జరగనప్పుడు ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది. ఈ అంశంపై కోర్టుకు వెళతా.. న్యాయపోరాటం చేస్తా’ అని అన్నారు. -
బ్రేకింగ్: ఫిరాయింపు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్సీలపై శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అనర్హత వేటు వేశారు. టీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ్ రెడ్డిలను అనర్హలుగా ప్రకటించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో పొందుపరిచిన పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వారిపై వేటు వేసినట్లు మండలి ఛైర్మన్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముగ్గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లో చేరినందుకు వారి సభ్యత్వాలు రద్దు చేయాలని టీఆర్ఎస్ మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. అనర్హతకు గురైన యాదవ్ రెడ్డి ఎమ్యెల్యేల కోటాలో మండలికి ఎన్నికైయ్యారు. మరోసభ్యుడు భూపతిరెడ్డి నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల కోటాలో మండలి సభ్యుడిగా ఎన్నికైయ్యారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన రాములు నాయక్ కూడా అనర్హతకు గురైయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) ప్రకారం సభ్యులపై చర్యలు తీసుకున్నట్లు మండలి ఛైర్మన్ వెల్లడించారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కొండా మురళి ఇదివరకే మండలి సభ్యుత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీ భేటీ, భద్రతపై మండలి చైర్మన్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 17 నుంచి నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాలు, భద్రతా ఏర్పాట్లపై మండలి చైర్మన్ స్వామిగౌడ్ నేతృత్వంలోని బృందం సోమవారం సమీక్షించింది. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర కమిషనర్ అంజనీకుమార్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉన్నతాధికారులు, ట్రాఫిక్, ఫైర్ విభాగాల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు అసెంబ్లీ, మండలి ప్రాంగణాలను పరిశీలించి సీఎం, వీఐపీల అలైంటింగ్ పాయింట్లు, వాటి భద్రత, అసెంబ్లీ లోపల, బయట ఎంత మంది సిబ్బందిని భద్రతలో నిమగ్నం చేయాలన్న దానిపై చర్చించారు. అదే విధంగా ట్రాఫిక్సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. -
వేటు వేస్తారా!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సభ్యత్వం విషయంలో తమకు ఇచ్చిన నోటీసుకు జవాబు ఇచ్చేందుకు మరింత గడువు కావాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను ఎమ్మెల్సీలు రాములునాయక్, కె.యాదవరెడ్డి, ఆర్.భూపతిరెడ్డి కోరారు. అన్ని అంశాలను పరిశీలించి వివరణ ఇస్తామని తెలిపారు. ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయాలని టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదు ఆధారంగా చైర్మన్ ఈ నెల 18న నోటీసులు జారీ చేశారు. ఒక పార్టీలో చేరి వేరే పార్టీలోకి వెళ్లారన్న ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఈ నెల 26లోపు వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీలు కొండా మురళీ, ఆర్.భూపతిరెడ్డి, కె.యాదవరెడ్డి, రాములునాయక్‌లను చైర్మన్ లిఖిత పూర్వక వివరణ కోరారు. టీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లో చేరినందుకు సభ్యత్వాలు రద్దు చేయాలని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వీరిలో కొండా మురళీ రాజీనామా చేశారు. మిగిలిన ముగ్గురి విషయంలో చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన కె.యాదవరెడ్డి విషయంలో ఇప్పుడే నిర్ణయం తీసుకోబోరని సమాచారం. మైనంపల్లి హనుమంతరావు రాజీనామాతో పాటు మరో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు మార్చితో ఖాళీ అవుతున్నాయి. ఆరు సీట్లకు ఎన్నికలు జరిగితే ఇప్పుడు కాంగ్రెస్‌కు ఉన్న 19 మంది ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో స్థానం ఖాళీ అయితే అప్పుడు కాంగ్రెస్ కచ్చితంగా ఒక స్థానాన్ని గెలుచుకునే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్చిలోపు యాదవరెడ్డి విషయంలో ఎలాంటి చర్యలు ఉండబోవని తెలుస్తోంది. -
హైకోర్టును ఆశ్రయించిన టీ కాంగ్రెస్ నేతలు
-
‘నన్ను అంతంచేయాలని చూస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: ‘నాపై సుపారీ ఇచ్చి అంతమెందించాలనే కుట్ర జరుగుతోంది. నన్ను ఖతం చేయాలని చూస్తున్నారు. నాకేమి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత’’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం శాసన మండలి ఛైర్మన్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఛైర్మన్ నుంచి నోటీసు వచ్చినందున వివరణ ఇచ్చానని వెల్లడించారు. తగిన కారణాలు తెలిపేందుకు నాలుగు వారాల సమయం కోరానని తెలిపారు. సామాజిక సేవకుడిగానే తనకు గవర్నర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, తమపై స్వామిగౌడ్ తీరు బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు. ఎస్టీని ఐనందుకే తానపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అక్రమ కేసులు పెట్టి వేధించాలని ప్రభుత్వం చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ సమస్యలపైనే గతంలో తాను రాహుల్ గాంధీని కలిశానని, కాంగ్రెస్ సభ్యుడిని మాత్రం కానని పేర్కొన్నారు. టీఆర్ఎస్లో చేరిన వాళ్లకో న్యాయం, మాకో న్యాయమా అని ప్రశ్నించారు. తనకు జరిగిన అన్యాయంపై కోర్టుకి వెళ్తానని, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. బ్లాక్ డే.. చట్టాన్ని రక్షించాల్సిన మండలి ఛైర్మన్, రాష్ట్ర సీఎంలే ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్‌పై అనర్హత వేటు వేయాలని శాసన మండలి ఛైర్మన్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక పార్టీని మరోక పార్టీలో విలీనం చేసే అధికారం ఎలక్షన్ కమిషన్‌కు మాత్రమే ఉంటుందని అన్నారు. సీఎల్పీ విలీనం డ్రాఫ్ట్ ప్రగతి భవన్లో తయారు చేశారని, కేసీఆర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ చర్రితలో ఇదో బ్లాక్ డే అని అన్నారు. -
స్వామిగౌడ్‌తో షబ్బీర్ అలీ భేటీ
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను టీఆర్ఎస్లో విలీనం చేయడంపై టీ కాంగ్రెస్ నేతలు న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగ సుత్రాలకు విరుద్ధంగా ఛైర్మన్ వ్యవహరిస్తున్నారని వారు పిటిషన్లో పేర్కొన్నారు. అంతకుముందు స్వామిగౌడ్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ భేటీ అయ్యారు. టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాములు నాయక్ మండలి ఛైర్మన్‌ను కలిశారు. కాంగ్రెస్‌లో చేరడానికి గల కారణాలను ఆయనకు వివరించారు. ఇటీవల రాములు నాయక్‌కు టీఆర్ఎస్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది. -
ఆ నలుగురిపై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన నలుగురు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం మండలి చైర్మన్‌ను స్వామిగౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్లో ఎమ్మెల్సీలుగా ఉన్న యాదవరెడ్డి, భూపతిరెడ్డి, రాములు నాయక్, కొండా మురళిలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే వీరిపై వేటు వేయాల్సిందిగా టీఆర్ఎస్ నాయకులు చైర్మన్‌కు నేడు విజ్ఞప్తి చేశారు. స్వామి గౌడ్‌ను కలిసిన వారిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పొతూరి సుధాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు ఉన్నారు. -
సర్వాయి పాపన్న అందరివాడు
హైదరాబాద్: బహుజన విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న అందరివాడని, కొన్ని వర్గాలకే పరిమితం చేస్తే ఆయన స్ఫూర్తి దెబ్బతింటుందని ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శనివారం చిక్కడపల్లిలో గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ, మన తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న 368 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బూర మాట్లాడుతూ.. గెరిల్లా తరహాలో యుద్ధం చేసి 12 కోటలను కైవసం చేసుకున్న గొప్ప వీరుడు పాపన్న అని పేర్కొన్నారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. ట్యాంక్ బండ్‌పై పాపన్న విగ్రహం ఏర్పాటుకు, పాపన్న చరిత్రను పాఠ్యాంశంలో చేర్చేందుకు కృషి చేస్తానన్నారు. గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజుగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ చైర్మన్ ఈడ శేషగిరి రావుగౌడ్, కన్వీనర్ వెంకన్నగౌడ్, వర్కింగ్ చైర్మన్ నారాయణగౌడ్ పాల్గొన్నారు. -
ప్రభుత్వమే నీరాను ప్రోత్సహిస్తుంది
హైదరాబాద్: ప్రభుత్వమే నీరాను ప్రోత్సహిస్తుందని, సాఫ్ట్‌డ్రింక్‌గా తయారు చేసి మార్కెటింగ్‌కు అవకాశం కల్పిస్తుందని ఐటీ, పురపాలక మంత్రి కె.తారక రామారావు తెలిపారు. గీత కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో 3.70 కోట్ల ఈత, తాటి, గిరిక, ఖర్జూర మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్ ప్రధాన రహదారి వద్ద ఉన్న రాష్ట్ర ఎక్సైజ్ పోలీస్ అకాడమీలో శుక్రవారం ఈత మొక్కలు నాటే కార్యక్రమం, గౌడ ఆత్మీయ సదస్సులో మంత్రి మాట్లాడారు. కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తోందని, రూ.43 వేల కోట్ల సంక్షేమ పథకాలతో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. కడియం నర్సరీ నుంచి 12 వేల గిరిక, తాటి చెట్లను సిరిసిల్లకు తెప్పించామని, వీటిని పైలట్ ప్రాజెక్టుగా నాటి సంరక్షిస్తున్నామని చెప్పారు. తాటి, ఈత చెట్టును నరికితే జరిమానాను రూ.150 నుంచి రూ.2 వేలకు పెంచామన్నారు. గౌడ కులస్తుల కోసం ఐదు ఎకరాల స్థలం, రూ.5 కోట్లు అందించామని, సొసైటీల బకాయిలను రద్దు చేశామని తెలిపారు. వైన్‌షాపు టెండర్లలో రిజర్వేషన్, ఇతర వృత్తుల్లోకి వెళ్లేవారికి రుణాలు అందించే విషయాలను సీఎంకు వివరిస్తామన్నారు. గత ప్రభుత్వం జంట నగరాల్లో బంద్ చేయించిన 103 సొసైటీలను తిరిగి ప్రారంభించి 50 వేల కుటుంబాలకు ఉపాధి చూపామని కేటీఆర్ పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిన సర్దార్ కేసీఆర్: స్వామిగౌడ్ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ గ్రామంలో ఒక గీత కార్మికుడు బాగుపడితే అనుబంధంగా 16 కులాలకు చెందిన వారు అభివృద్ధి చెందుతారన్నారు. తాటి చెట్టుపై పూర్తి హక్కును గౌడ సోదరులకు ఇవ్వాలన్నారు. ప్రైవేటు పట్టా భూముల్లో ఉన్న చెట్లపై యజమానులు రూ.1,000 వరకు అద్దె, కల్లు తీసుకోవడంతో గీత కార్మికుడు నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 350 ఏళ్ల క్రితం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చెట్టుపై పన్ను రద్దు చేయాలని ఉద్యమం చేపట్టారని, ఇప్పుడు సర్దార్ కేసీఆర్ పన్నును రద్దు చేసి చరిత్రలో నిలిచారని కొనియాడారు. చిచ్చా... రచ్చ చేసిండ్రు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ తన మనసులోని మాటలను చెప్పలేక పోతున్నానని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తనకు ఎక్సైజ్ శాఖను అప్పగించి కులసోదరులకు ఏదైనా చేయమని సలహా ఇచ్చారని, కానీ, వారికి ఏమి చేయలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల్లో ఉన్న గీతకార్మికుల పరిస్థితి అధ్వానంగా మారిందని, వీరికి న్యాయం చేయాలన్నారు. ఈ విషయాలను విన్న కేటీఆర్ ‘చిచ్చా... రచ్చ చేసిండ్రు’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభిం చారు. గౌడ కులస్తులపట్ల ఆవేదనతో మాట్లాడా రని, దీనిని అర్థం చేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, గాంధీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీలకు అండగా ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన కార్యాలయాన్ని బషీర్‌బాగ్‌లోని పరిశ్రమల భవన్ 3వ అంతస్తులో శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, శాసన మండలి ప్రభుత్వ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, సమాచారహక్కు ప్రధాన కమిషనర్ రాజాసదారాం, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్.రాములు, కార్పొరేషన్ చైర్మ న్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఈ కమిషన్ ఉందా అనే అనుమానం ఉండేదన్నారు. తెలంగాణ వస్తే వారికి పరిపాలించుకొనే స్తోమత ఉందా అని సమైక్యరాష్ట్ర పాలకులు ఎద్దేవా చేశారని, అన్ని అవరోధాల ను అధిగమించి అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు కమిషన్ చైర్మన్‌గా అవకాశం ఇవ్వడంతో ఎస్సీ, ఎస్టీలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, 2003లోనే కమిషన్ ఏర్పాటైనా ఎక్కడా పనిచేయలేదన్నారు. గతంలో సమైక్యపాలకులకు మాత్రమే కమిషన్‌లో అవకాశం ఇచ్చారని, తెలంగాణ దళితులకు అడుగడుగునా అన్యాయం జరిగిందన్నారు. కమిషన్ ద్వారా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి ముందుంటామన్నారు. దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా కమిషన్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. -
పీఆర్సీ అమలుకు కృషి చేస్తా: స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీపై కృషి చేస్తానని మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్ అధ్యక్షతన ‘ఈద్ మి లాప్’కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వామిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలని కోరారు. సకలజనుల సమ్మెలో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రతి ఉద్యోగి ఐదు చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం నేతలు పాల్గొన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కమలాకర్‌రావు సాక్షి, హైదరాబాద్: పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన బీరెల్లి కమలాకర్‌రావు ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.సరోత్తంరెడ్డి అధ్యక్షతన బుధవారం ఇక్కడ జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన్ను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం పలు అంశాలపై కార్యవర్గం తీర్మానాలు చేసింది. ఉపాధ్యాయ బదిలీల్లో నష్టపోయిన వారికి న్యాయం చేయటంతో పాటు ఖాళీగా ఉన్న జీహెచ్ఎం, ఎంఈవో పోస్టులను సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరుతూ తీర్మానించింది. -
ప్రతానికి డాక్టరేట్
తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ ‘యునైటెడ్ ధియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ’ (యుటిఆర్) నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బర్కిలీకి అనుబంధంగా గుర్తింపు పొందిన యుటిఆర్ యూనివర్సిటీ రామకృష్ణ గౌడ్, నటుడు సుమన్‌లను గౌరవ డాక్టరేట్‌కి ఎంపిక చేసింది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య, తెలంగాణ శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ చేతుల మీదుగా రామకృష్ణ గౌడ్ గౌరవ డాక్టరేట్, 51వేల నగదు అందుకున్నారు. ఐదు వేల మంది సినీ కార్మికులకు హెల్త్ కార్డ్స్, ఐదు లక్షల ఉచిత బీమా కల్పించడంతో పాటు రెండు వందల మంది సినీ వర్కర్లకు గృహాలు ఇప్పించారు ప్రతాని. సినిమారంగంలో ఆయన చేసిన సోషల్ సర్వీస్‌కి గాను ఈ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రతానికి అభినందనలు తెలిపారు. ‘‘గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఆనందంగా ఉంది’’ అని ప్రతాని అన్నారు. -
గవర్నర్ ఇఫ్తార్ విందు
హైదరాబాద్: గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రంజాన్‌ను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఆదివారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. పలువురు ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఇతర ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. -
కేసీఆర్ ...చావుకు భయపడేవాడిని కాదు..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ దొరలాగా పోలీసులను నమ్ముకొని బతుకుతుంటే...తాను దమ్మున్న గుండెని, ప్రజలను నమ్ముకున్నానని ఆయన అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ....‘నాకు గన్మెన్లను తీసివేసి నన్ను హత్య చేయించాలని చూస్తున్నావా?. నాకు ఏమైనా జరిగితే కేసీఆర్‌తో పాటు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. చావుకు భయపడే వ్యక్తిని కాదు. నేను చనిపోతే నా కొడుకు దగ్గరకు వెళతాను అంతే. ఇక బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసులో కాల్ డేటాలో 26సార్లు మాట్లాడినవారిపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. నాలాంటి వాళ్లను భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారు. నీలాంటి పిరికిపందలాగా ఆస్పత్రిలో పోరాటం చేయలేదు. రోడ్డుమీద నిరాహార దీక్ష చేశాను. కోమాలోకి పోతానని తెలిసి కూడా భయపడకుండా దీక్ష చేశాను. కేసీఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నారు. అకారణంగా మా సభ్యత్వం రద్దు చేశారు. స్వామిగౌడ్‌పై దాడి చేసినందుకు మా సభ్యత్వం రద్దు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా, ఎప్పుడు ఇలా ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయడం జరగలేదు. కానీ కోర్టులో మాత్రం ప్లేట్ ఫిరాయించారు.గతంలో హరీశ్ రావు గవర్నర్ మీద దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. దానిపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ ...అందరినీ పిలిపించి మాట్లాడి.. వారం పాటు సస్పెండ్ చేశారు. ఇప్పటి ప్రభుత్వం మాత్రం నిబంధనలు అనుసరించకుండా నా అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది మాత్రం స్వామిగౌడ్‌కు మైక్ తగిలినందుకు కాదు, గవర్నర్ అడ్రస్‌ను అడ్డుకున్నందుకు ...మా సభ్యత్వం రద్దు చేశామని చెబుతున్నారు. నాకున్న నలుగురు గన్మెన్లను తీసివేశారు. పీఏని ఉపసంహరించారు. కావాలనే పాత కేసులను రీ ఓపెన్ చేయించి అరెస్ట్ వారెంట్ జారీ చేశారని తెలిసింది.’ అని మండిపడ్డారు. -
బడ్జెట్ అంకెల గారడీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ అని.. భారీగా కేటాయింపులు చూపుతూ, తక్కువగా ఖర్చు చేస్తున్నారని శాసన మండలిలో బీజేపీ మండిపడింది. ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలా చేస్తోందని విమర్శించింది. సోమవారం శాసనమండలి లో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడారు. రెండున్నర లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తా మని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని.. కానీ నాలుగేళ్లలో నిర్మించినది 9 వేల ఇళ్లు మాత్రమేనన్నారు. ప్రస్తుత బడ్జెట్లోనూ డబుల్ ఇళ్లకు కేటాయించింది రూ.4 వేల కోట్లేనని.. ఈ నిధులతో ఎన్ని లక్షల ఇళ్లు కడతారని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే అంకెల గారడీ బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరు రైతులు ఖరీఫ్, రబీ రెండు పంటలు పండించడం సాధ్యం కాదని.. అలాంటప్పుడు రెండో పంటకు కూడా రూ.4 వేల చొప్పున ఏవిధంగా సహాయం అందిస్తారన్న దానిపై స్పష్టత లేదన్నారు. దీనికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమాధానమిస్తూ.. మహబూబ్‌నగర్‌లోని ప్రాజెక్టుల ద్వారా 6.5 లక్షల ఎకరాల్లో రెండో పంట సాగవుతోందని, ఈ ఏడాది జూలై, ఆగస్టు కల్లా కాళేశ్వరం ప్రాజెక్టుతో మరిన్ని లక్షల ఎకరాల్లో రెండో పంట సాగవుతుందని చెప్పారు. రెండో పంట పండించే రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇచ్చి తీరుతామని చెప్పారు. కాగా, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు వ్యాఖ్యలను మండలిలో టీఆర్ఎస్ సభ్యులు తిప్పికొట్టారు. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దగా నిధులివ్వలేదని, తమ ప్రభుత్వం రూ.15 వేల కోట్లకుపైగా కేటాయించిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బడ్జెట్ ప్రతి వర్గాన్ని సంతృప్తి పరిచేలా ఉందని టీఆర్ఎస్ మరో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు అన్నారు. మంత్రులు మండలికి రావాలి: స్వామిగౌడ్ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ సోమవారం సమావేశాలకు హాజరయ్యారు. మంత్రులు శాసన మండలికి దూరంగా ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయం కేటాయించిన విధంగా మంత్రులు మండలికి హాజరుకావాలని.. సమయం ప్రకారం అసెంబ్లీకి వెళ్లాలని సూచించారు. -
‘సినిమా చూపిస్తున్న కేసీఆర్’
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ సూపర్ స్టార్ రాజ్‌కపూర్ సినిమా కంటే గొప్ప సినిమాని ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు విమర్శించారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ నేతలను సస్పెండ్ చేయడంపై ఆయన పై విధంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంత పెద్ద డ్రామా తాను ఇంతవరకు చూడలేదని, కేవలం గౌడ్ సామాజిక వర్గం ఓట్ల కోసమే స్వామిగౌడ్‌కు దెబ్బ తగిలినట్టు నాటకం ఆడిస్తున్నారని ఆరోపించారు. ఇయర్ ఫోన్స్‌తో అసలు దెబ్బ తగులుతుందా, ఇదంతా జనం ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇస్తానని తానే మూడు ఇళ్లు కట్టుకున్నారని, ఒక ముఖ్యమంత్రికి అన్ని ఇళ్లు ఎందుకని విమర్శించారు. గిట్టుబాటు ధర లేదని రైతులు ఆందోళన చేస్తే వారిని అరెస్టు చేయించిన కేసీఆర్‌కి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రశ్నించిన ప్రతిపక్ష సభ్యులందరిని సభ నుంచి సస్పెండ్ చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలపై వీహెచ్ మాట్లాడుతూ.. భారతీయ జనత పార్టీ పతనం ప్రారంభమైందని అన్నారు. 2019లో కేంద్రంలో, రాష్టంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తెరాస ఎంపీలు రిజర్వేషన్ కోటా పెంచాలని డిమాండ్ చేస్తుంటే, కేసీఆర్ మాత్రం ఇక్కడ సర్పంచ్, కార్పొరేటర్లలకు అధికారం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ పెంపు సాధ్యం కాదని తెలిసే టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారని అన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ సాధ్యం కాదని అసదుద్దీన్ ఎందుకు మద్దతు ఇస్తున్నారని, ఆయన ఎందుకు ఢిల్లీ రాలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో తెరాస ఎంపీలు చేసేదంత ఒక డ్రామా అని అన్నారు. సమగ్ర సర్వే చేయించిన కేసీఆర్‌కు బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలో తెలియదా అని ప్రశ్నించారు. -
స్వామిగౌడ్ హెల్త్ బులిటెన్ విడుదల
-
‘అదంతా డ్రామా’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో సోమవారం జరిగిన ఘటనను ఓ డ్రామాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ చేత సీఎం కేసీఆర్ నాటకం ఆడిస్తున్నారని ఆరోపించారు. చైర్మన్‌కు దెబ్బతగలడం నిజమైతే ఆ వీడియోను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. చైర్మన్ ఒకవైపు కూర్చుంటే మరో వైపు ఉన్న కంటికి ఎలా దెబ్బ తగిలిందని నిలదీశారు. నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందని, తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. అప్పుడు హరీష్ చేయలేదా? గతంలో గవర్నర్ ప్రసంగ సమయంలో హరీశ్‌రావు బెంచీల మీద దూకుతూ వెల్‌లోకి దూసుకెళ్లలేదా అని గుర్తు చేశారు. ఆయన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే వ్యవహరించిందా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై స్పందించని స్పీకర్ మమల్ని సస్పెండ్ చేయడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. స్పీకర్ విధుల నిర్వహణలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. పార్లమెంట్లో కేసీఆర్ కూతురు స్పీకర్ ముఖం మీద ప్లకార్డులు ప్రదర్శిస్తోందని, ఇక్కడ మేం మాత్రం నిరసన చేపట్టొద్దా.. ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్లో రైతులు, గిరిజనుల గురించి ప్రస్తావన లేదని, ప్రధాన అంశాలు లేవని మేము చెప్పడానికి వెళితే మాపై 50 మంది పోలీసులతో దాడి చేయించారన్నారు. చివరి బడ్జెట్ సమావేశంలో.. సమాధానాలు ఇవ్వొద్దనే ఉద్దేశంతో మాపై సస్పెన్షన్ వేటు వేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ లాంటి నియంతలు అధికారంలోకి రావద్దంటూ ఈ సందర్భంగా ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ అనే నినాదాన్ని ఇచ్చారు. -
నా కుడికన్ను కార్నియా దెబ్బతింది
-
కుడికన్ను కార్నియా దెబ్బతింది
సాక్షి, హైదరాబాద్: హెడ్‌ఫోన్ బలంగా తగలడంతో శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ కుడికన్ను కార్నియా దెబ్బతిన్నట్టు సరోజినీదేవి ఆస్పత్రి సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్ చెప్పారు. అసెంబ్లీలో ఘటన తర్వా త ఆసుపత్రిలో చేరిన చైర్మన్‌కు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇన్‌పేషెం ట్‌గా చేర్చుకొని చికిత్స అందిస్తున్నామని, రెండ్రోజులపాటు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని సూప రింటెండెంట్ తెలిపారు. కాగా అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు లక్ష్మారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, తదితర సీనియర్ నాయ కులు ఆసుపత్రికి వెళ్లి స్వామిగౌడ్‌ను పరా మర్శించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్ అలీ ఆస్పత్రికి చేరుకోగా.. అప్పటికే అక్కడున్న టీఆర్ఎస్ కార్యకర్తలు వారిని చూసి ఆగ్రహం తో ఊగిపోయారు. ఆస్పత్రిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. వారే ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ సభ్యులు విసిరిన హెడ్‌ఫోన్ నేరుగా కంటికి తగిలింది. కుడికన్ను వాచిపోయింది. నొప్పితో విలవిల్లాడి పోయాను. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల తీరు బాధాకరం. వారు తమ ప్రవర్తనపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజాస్వామ్యం లో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ నిరసనల పేరుతో ఎదుటి వ్యక్తులపై దాడులకు దిగడం సరికాదు. గవర్నర్‌ను లక్ష్యంగా చేసుకుని హెడ్‌ఫోన్ విసిరితే.. పొరపాటున చైర్మన్‌కు తగిలిందని చెబుతుండటం హాస్యాస్పదం. నా దుర దృష్టమేమో కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు వద్ద జరిగిన ఘటనలో అప్పటి ప్రభుత్వం నన్ను చంపేందుకు కుట్ర పన్నింది. మళ్లీ ఇప్పుడు ఇలా కాంగ్రెస్ నేతల దాడిలో గాయపడ్డాను. – స్వామిగౌడ్ దాడి బాధాకరం: స్పీకర్ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై దాడి, ఆయన కంటికి గాయమైన నేపథ్యంలో సంబంధించిన వీడియో దృశ్యాలను బీఏసీ సమావేశంలో పరిశీలించారు. స్వామిగౌడ్‌పై దాడికి పాల్పడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కొందరు కాంగ్రెస్ సభ్యులపై చర్య తీసుకోవాలని అధికారపక్షం డిమాండ్ చేసింది. ఈ అంశంపై స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడారు. ప్రసంగం సందర్భంగా సహకరించాలని గవర్నర్ స్వయం గా అన్ని పార్టీల నేతలకు ఫోన్ చేసి కోరానని.. అయినా ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. దీనిపై జానారెడ్డి వివరణ ఇస్తూ.. కాంగ్రెస్ సభ్యులు ఉద్దేశపూర్వకం గా అలా వ్యవహరించలేదన్నారు. ఈ ఘటనను భౌతిక దాడిగా చూడవద్దని, నిరసన చెప్పే అవకాశమివ్వకపోవడంతో.. ఇబ్బందిని తెలియజేసే క్రమంలో జరిగిన ఘటనగా చూడాలని మల్లు భట్టివిక్రమార్క విజ్ఞప్తి చేశారు. మండలి చైర్మన్‌పై దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. గవర్నర్ లక్ష్యంగా దాడి చేసినట్టు చెప్పడం దారుణమని, కోమటిరెడ్డిపై పోలీసు కేసు పెట్టాలని ఒవైసీ కోరినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే కోమటిరెడ్డిపై చర్యల కోసం ప్రభుత్వం తీర్మానం పెట్టే అవకాశముంది. -
కోమటిరెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం
-
స్వామిగౌడ్ అంటే నాకు అభిమానం: కోమటిరెడ్డి
సాక్షి, యాదాద్రి: తెలంగాణ అసెంబ్లీలో తాను ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఘటనలు చోటుచేసుకున్నవిషయం తెలిసిందే. ఈ అంశంపై కోమటిరెడ్డి స్పందించారు. స్వామి గౌడ్‌పై దాడి ఉద్దేశపూర్వకంగా జరగలేదని, ఆయనంటే తనకు అభిమానమని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అర్ధరహితంగా ముగించడంతో కోపోద్రిక్తతకు గురైనట్టు ఆయన తెలిపారు. అసెంబ్లీ చివరి సెషన్లో ప్రభుత్వ వ్యవహరించిన తీరు దారుణమని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలను కనీసం మాట్లాడనీయకుండా పోలీసులతో అడ్డుకున్నారని తెలిపారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి చెత్త సమావేశాలను తానెప్పుడూ చూడలేదని ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేశారని, ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరుతో కోట్ల రూపాయాలు దండుకున్నారన్నారు. ఒక్క కాళేశ్వరంలోనే రూ. 40 వేల కోట్లు కొట్టేశారని విమర్శించారు. ధనిక రాష్ట్రం అని చెబుతూ ప్రజలను సీఎం కేసీఆర్ మభ్యపెడుతూ తెలంగాణను అప్పుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. -
27వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 13,14 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరపనున్నారు. 15న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 25 వ తేదీ( ఆదివారం) కూడా సభను నడపాలని బీఏసీలో నిర్ణయించారు. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. అనంతరం సభ వాయిదా పడింది. కాగా, గవర్నర్ ప్రసంగానికి కాంగ్రెస్ అడ్డుతగలడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై బీఏసీ సమావేశంలో చర్చ జరిగింది. కాంగ్రెస్ సభ్యులు ప్రవర్తించిన తీరుపై సభ్యులు బీఏసీ సమాచవేశంలో విచారం వ్యక్తం చేశారు. అయితే మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు గాయాలు అవడంపై చింతిస్తున్నామని కాంగ్రెస్ నేత జానారెడ్డి తెలిపారు. మరో వైపు ఈ ఘటనపై పోలీసులకు పిర్యాదు చేయాలని మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. వీటిపై స్పందించిన సభాపతి మధుసూదనచారి అన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
కోమటిరెడ్డిపై ఏడాది వేటు?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై చర్యలకు రంగం సిద్ధమైంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం సమయంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు గాయమైన ఘటన వీడియో ఫుటేజీలను అసెంబ్లీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏడాది పాటు కోమటిరెడ్డిని అసెంబ్లీ నుంచి బహిష్కరించే అవకావం ఉన్నట్టు తెలుస్తోంది. అదే విధంగా మరికొందరు ఎమ్మెల్యేలపైనా వేటు పడనుందని తెలుస్తోంది. దీనిపై మంగళవారం సభలో తీర్మానం ప్రవేశ పెట్టే విధంగా ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ ఘటనపై మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ సభ్యులు కావాలనే గొడవ చేశారన్నారు. సీఎం కేసీఆర్ ముందుగానే తమను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. బడ్జెట్ సమావేశాల నుంచి బహిష్కరణకు గురవ్వాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. సభలో జరిగిన ఘటనకు సబంధించిన వీడియోలు పరిశీలిస్తున్నామన్నారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సంబంధిత వార్త: హెడ్సెట్ విసిరిన కోమటిరెడ్డి; చైర్మన్‌కు గాయం -
హెడ్సెట్ విసిరిన కోమటిరెడ్డి; చైర్మన్‌కు గాయం
సాక్షి, హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాల తొలిరోజు తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఘటనలు చోటుచేసుకున్నాయి. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో విపక్ష కాంగ్రెస్ సభ్యుల్లో కొందరు దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన హెడ్‌సెట్‌ను విసిరికొట్టినట్లు సమాచారం. అదేసమయంలో మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి స్వల్ప గాయమైందని, వెంటనే ఆయనను సరోజనినీ దేవి కంటి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు వార్తలు వెలువడ్డాయి. కోమటిరెడ్డి హెడ్ సెట్ విసిరేసిన దృశ్యాలు అసెంబ్లీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నన్ను కూడా కొట్టారు : సభలోపల చోటుచేసుకున్న పరిణామాలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాకు వివరించారు. గవర్నర్ ప్రసంగంలో రైతు సమస్యల గురించి మాట మాత్రమైనా స్పందించకపోవడంపై తాము ఆందోళన చేశామని, అయితే, కొంత ఆవేశానికి గురైనమాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. ‘‘విపక్ష సభ్యులుగా మా నిరసన తెలియజెప్పడానికి స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లాం. కానీ మార్షల్స్ మాకు అడ్డుతగిలారు. గలాటాలో మార్షల్స్ నన్ను కూడా తన్నారు. నా కాలికి గాయమైంది. ఎక్స్‌రే కూడా తీయించుకున్నాను. అయినా, మమ్మల్ని పోడియం వద్దకు వెళ్లకుండా అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు? పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ప్రతిరోజూ స్పీకర్ పోడియం దగ్గరికి వెళుతున్నారుకదా, మరి ఇక్కడ మాత్రం నిర్బంధాలు ఎందుకు?’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌పై సీరియస్ యాక్షన్? : గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలితే తీవ్ర పరిణామాలు తప్పవని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే హెచ్చరించారు. అయినాసరే కాంగ్రెస్ ముందు చెప్పినట్లే సభలో ఆందోళన చేసింది. బడ్జెట్ ప్రతులను చించి, గవర్నర్‌పైకి విసిరేసింది. కోమటిరెడ్డి హెడ్సెట్ విసరేయడంతో మండలి చైర్మన్‌కు గాయమైంది. జరిగిన వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని, కాంగ్రెస్ సభ్యులపై సీరియస్ యాక్షన్ తీసుకుంటారని వార్తలు వినవస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
అసెంబ్లీలో గణతంత్ర వేడుకలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, మండలిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభలో స్పీకర్ మధుసూదనాచారి, మండలిలో చైర్మన్ స్వామిగౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాసనసభా కార్యదర్శి నరసింహాచార్యులు, శాసనసభ సచివాలయ ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జాతీయ పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర వేడుకలు జరిపారు. -
బంగారు తెలంగాణగా మలచుకోవాలి
హైదరాబాద్: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలచుకోవాల్సిన అవసరం ఉందని శాసన మండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ అన్నారు. ఆదివారం రవీంద్రభారతి ప్రాంగణంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం–యూఎస్ఏ ఆధ్వర్యంలో 5వ ప్రవాసీ తెలంగాణ దివస్ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన స్వామిగౌడ్ మాట్లాడుతూ.. ఎన్నో ఆత్మత్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్నిబంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవిరళ కృషి చేస్తోందన్నారు. నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో ఎక్కువగా ఉందని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. గ్రాడ్యుయేషన్, ఆపై చదువులు చదివిన వాళ్లు 22 లక్షల మంది ఉన్నారన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రతలో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో తెలిపి, క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న 3,400 మంది రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర వ్యవసాయ విధానం తీసుకు రావాలన్నారు. తమకెవరితో శత్రుత్వం లేదని.. తెలంగాణలో అందరికీ అవకాశం, బతుకుదెరువు దొరకడమే ధ్యేయమని అన్నారు. మరోసారి ఉద్యమ బాట పట్టాలి: రేవంత్ రాష్ట్రంలో మరోసారి ఉద్యమబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. తుదిదశ తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు కలసి రావాలని కోరారు. తెలంగాణను దాచిదాచి దయ్యాల పాలు చేశారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క విమర్శించారు. అందరూ కోరుకున్న తెలంగాణ రాలేదన్నారు. కొలువుల కోసం కొట్లాడితే హత్య చేసి, దాన్ని ఎన్కౌంటర్ అన్నారని విమర్శించారు. ఎన్ని రాజకీయాలున్నా అందరికీ తెలంగాణ తల్లి ఒక్కటేనని ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్ అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం దేశంలోని అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కె. ప్రభాకర్, యాదగిరిగుట్ట ఆర్కిటెక్ట్ ఆనందసాయి, రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సభ సజావుగా సాగాలి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ 8వ సమావేశాలు సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ నెల 27 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇరు సభలు ప్రశాంతంగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్పీకర్ చాంబర్లో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఇందులో స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మండలి విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు పాల్గొన్నారు. సభలు కొనసాగుతున్న సమయంలో పటిష్ట భద్రతకు చర్యలు తీసుకోవాలని, గుర్తింపు కార్డులుం టేనే లోనికి అనుమతించాలని ఆదేశించారు. బ్యానర్లు, ఇతర సామగ్రిని లోనికి అనుమతించరాదని సూచించారు. అంతకుముందు సీఎస్ ఎస్పీసింగ్‌తో సమావేశమయ్యారు. వివిధ శాఖలపై సభ్యులడిగే ప్రశ్నలకు సమాధానాలు వేగవంతంగా, అర్థవంతంగా రావడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేదీ, హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 3 వేల మందితో బందోబస్తు: సీపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు 3 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి చెప్పారు. సమీక్ష అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడుతూ.. గుర్తింపు కార్డు ఉన్న వ్యక్తులనే లోనికి అనుమతిస్తామని, జిల్లాలో ఉన్న పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారని చెప్పారు. శాంతి భద్రతలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, సమావేశాల సందర్భంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఎవరైనా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తే వారిని అసెంబ్లీ పరిసర ప్రాంతాలకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. -
కవులు ప్రభుత్వాలకు మార్గదర్శకులు: స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైతాళికుడు దాశరథి కృష్ణమాచార్య జయంతిని అధికారికంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వం కవులకిస్తున్న గౌరవానికి ప్రతీక అని శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ శనివారం ఇక్కడ రవీంద్రభారతిలో నిర్వహించిన డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య 93వ జయంతి ఉత్సవాలు, దాశరథి సాహితీ పురస్కార ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. కవులు ప్రభుత్వాలకు మార్గదర్శకులని అన్నారు. దాశరథి రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’అనే వాక్యం ఉద్యమకారుల్లో చైతన్యాన్ని రగిలించిందని అన్నారు. అంతటి గొప్ప కవి పేరిట నెలకొల్పిన సాహితీ పురస్కారాన్ని ఆచార్య గోపి వంటి మరొక గొప్ప తెలంగాణ కవికి అందజేయడం మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ 23 సంవత్సరాల వయసులో సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన రచనలు వెలువరించిన గొప్ప సాహితీ దిగ్గజం దాశరథి అని కొనియాడారు. దాశరథి, కాళోజీ తెలంగాణ ఆణిముత్యాలని అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ దాశరథి అరుదైన కవి అని, నిరంతరం ప్రజల పక్షాన పోరాడిన యోధుడని అన్నారు. గిరిజన, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ తెలంగాణ విముక్తికై ఆనాడు తన కలం ద్వారా జనాలను మేలుకొల్పారని కొనియాడారు. దాశరథి తొలి రచన అగ్నిధారలతో ఎంత పేరు పొందారో, అంతటి పేరును ఆచార్య గోపి తన తొలి రచన తంగేడుపూలతో పొందారని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. దాశరథి కవితా స్ఫూర్తిని సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్ కొనియాడారు. అనంతరం ఆచార్య డాక్టర్ గోపీని అతిథులు శాలువాలతో సత్కరించి పురస్కారాన్ని అందజేశారు. గోపీ మాట్లాడుతూ దాశరథి పేరిట సాహితీ పురస్కారాన్ని నెలకొల్పి మహనీయులను గౌరవించే సంస్కృతి తమదని తెలంగాణ ప్రభుత్వం రుజువు చేసుకుందని అన్నారు. దాశరథి పేరిట గడ్డిపోచ ఇచ్చినా దానిని బంగారు కడ్డీగా భావిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, గ్రంథాలయాల సంస్థ చైర్మన్ శ్రీధర్, తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎస్వీ సత్యనారాయణ, సీఎం వోఎస్డీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ దాశరథి కుమారుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. -
పాత పెన్షన్ స్కీం అమలుకు కృషి
మండలి చైర్మన్ స్వామిగౌడ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: పోరాడి సాధించు కున్న తెలంగాణలో ప్రతి ఉద్యోగిని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని మండలి చైర్మన్ స్వామి గౌడ్ పేర్కొన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానంపై ఉద్యోగుల ఆందోళ నను పరిగణనలోకి తీసుకొని, వారికి ఏ విధానం లాభదాయ కమో దానినే ప్రభుత్వం అమలు చేసేలా కృషి చేస్తానని హామీ నిచ్చారు. తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ డైరీని ఆయన చాంబర్లో సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఆందోళనకరంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని సంఘం ప్రతినిధులు స్వామిగౌడ్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
ఐదు బిల్లులకు ఆమోదం
శాసన మండలి నిరవధిక వాయిదా: స్వామిగౌడ్ సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో సోమవారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన తెలంగాణ చెల్లింపులు, వేతనాలు, పింఛన్ల సవరణ బిల్లును రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భూదాన్, గ్రామదాన్ సవరణ బిల్లును ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్ అలీ, ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్ మెంట్ ప్లాన్ బిల్లును మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఇవికాక మరో రెండు ద్రవ్యవినిమయ బిల్లులను కూడా ప్రభుత్వం మండలిలో ప్రవేశపెట్టింది. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లా డుతూ.. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని కొద్దిగా మెరుగు పరచి ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక బిల్లును రూపొందించామన్నారు. పాత చట్టానికి 109 సవరణలు చేసినందున సవరణ బిల్లుగా కాకుండా కొత్త చట్టం రూపంలో సభ ముందు ఉంచుతున్నామని చెప్పారు. ఏదేని కారణాలతో ఆయా వర్గాలకు బడ్జెట్లో కేటాయించిన నిధులు ఖర్చు కాకుంటే తదుపరి ఏడాది బడ్జెట్లో అంత మొత్తాన్ని కేటాయిస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగు లేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు కాకపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణ మన్నారు. ఎపెక్స్ కమిటీ చైర్మన్‌గా ముఖ్య మంత్రి మూడేళ్లలో ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించక పోవడంతో అధికారులలోనూ ఉదాసీనత ఏర్పడిం దన్నారు. కొత్త చట్టం ద్వారానైనా ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు చేసేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ.. ఎస్సీఎస్టీ ఉపప్రణాళిక అమలులో లోపాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, సమాజంలో వస్తున్న మార్పులకు ఆయా వర్గాలను దూరంగా ఉంచకూడదన్నారు. విపక్షనేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. ఈ ఏడాది బడ్జెట్లో కేటాయిం చిన నిధులు ఖర్చు చేయని పక్షంలో వచ్చే ఏడాది బడ్జెట్లో కేటాయింపులకు అదనంగా బ్యాక్‌లాగ్స్ (బకాయిలను)కలిపి నిధులు కేటాయించా లన్నారు. భూదాన్ సవరణ బిల్లుపై చర్చలో.. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ భూదాన్, గ్రామదాన్ చట్టం ద్వారా ఆచార్య వినోభాబావే ఆశయాలకు అనుగుణంగా పేదలకు భూమి పంపిణీ చేసే నిమిత్తం చట్టంలో కొన్ని సవరణలు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. భూదాన్ చట్టం కింద ప్రస్తుతం ఎంత భూమి మిగిలి ఉంది, అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఏమి చర్యలు చేపట్టారో ప్రభుత్వం తెలపాలన్నారు. భూదాన్ బోర్డు పరిధిలో ఉన్న భూములను అన్యాక్రాంతం కాకుండా రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. చెల్లింపులు, వేతనాలు, పింఛన్లు సవరణ బిల్లుపై చర్చలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లా డుతూ.. ఈ చట్టం పరిధిలో ప్రస్తుతం 120 సంస్థలు ఉన్నాయని, వక్ఫ్‌బోర్డ్‌ను కూడా చట్ట పరిధిలోకి తెచ్చేందుకు సవరణ బిల్లును ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. ఆయా బిల్లు లన్నీ ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. అనంతరం ఆయన శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
అన్ని రంగాల్లో తెలంగాణ పురోభివృద్ధి
⇒ స్పీకర్ మధుసూదనాచారి వెల్లడి ⇒ అసెంబ్లీ తెలుగు, ఉర్దూ వెబ్సైట్ల ఆవిష్కరణ ⇒ పాల్గొన్న మండలి చైర్మన్, డిప్యూటీ స్పీకర్, మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన రెండేళ్ల తొమ్మిది నెలల్లోనే తెలంగాణ అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించిందని శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి తెలిపారు. సోమవారం అసెంబ్లీ మీటింగ్ హాలులో తెలుగు, ఉర్దూ భాషల్లో అసెంబ్లీ వెబ్సైట్లు, డిపార్ట్మెంట్ సభ్యుల పోర్టల్స్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అసెంబ్లీ తెలుగు వెబ్‌సైట్‌ను స్పీకర్ మధుసూదనాచారి, ఉర్దూ వెబ్‌సైట్‌ను శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, మెంబర్స్ పోర్టల్‌ను శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. డిపార్ట్మెంటల్ పోర్టల్‌ను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ తెలంగాణ శాసనసభ, సచివాలయ వెబ్సైట్లు తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రారంభం కావడం రాష్ట్రాభివృద్ధికి మచ్చుతునకగా అభివర్ణించారు. దేశంలో మరే రాష్ట్ర అసెంబ్లీలోనూ తెలంగాణ తరహాలో మూడు భాషల్లో వెబ్సైట్లను ప్రారంభించలేదన్నారు. గతంలో శాసనసభ , శాసన మండలి సమావేశాలంటే సామాన్యులకు సదభిప్రాయం ఉండేది కాదని...కానీ తెలంగాణ ఏర్పడ్డాక సభలు సామాన్యుల మెప్పు పొందేలా సాగుతున్నాయని మధుసూదనాచారి వివరించారు. వెబ్‌సైట్‌తో సభ్యులకు తగిన సమాచారం అందుతుందన్న స్పీకర్...వెబ్సైట్ రూపకల్పనకు కృషి చేసిన వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. స్థానిక భాషల్లో సభ వెబ్సైట్లు సంతోషకరం: స్వామిగౌడ్ స్థానిక భాషల్లో శాసనసభ వెబ్సైట్లు రావడం సంతోషదాయకమని మండలి చైర్మన్ స్వామిగౌడ్ పేర్కొన్నారు. మంత్రి హరీశ్‌రావు కోరిక మేరకు ఉర్దూలో ప్రసంగించిన స్వామిగౌడ్...గతంలో హైదరాబాద్ పాలనా వ్యవహారాలు నడిచిన ఉర్దూ భాషలోనూ వెబ్‌సైట్‌ను రూపొందించడం ప్రభుత్వం ద్వితీయ భాషకు ఇస్తున్న ప్రాదాన్యతను చాటుతోందన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ వెబ్సైట్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వెబ్సైట్ల ఏర్పాటుకు హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పారు. స్థానిక భాషల్లో వెబ్సైట్లు రావడంతో తెలంగాణ శాసనసభ సచివాలయం దేశంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని మంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాచారమంతా అసెంబ్లీ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో శాసనసభ సచివాలయం కార్యదర్శి రాజ సదారాం, జాయింట్ సెక్రటరీ నరసింహాచార్యులు, ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాపన్న విగ్రహాల ఏర్పాటులో వివక్ష
శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ నెల్లికుదురు (మహబూబాబాద్): తెలం గాణ బహుజన విప్లవ నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్తోపాటు ఎంతో మంది తెలంగాణ పోరాట యోధుల విగ్రహాల ప్రతిష్టాపనలో అప్పటి ప్రభుత్వాలు వివక్ష చూపాయని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మేచరాజుపల్లిలో గురు వారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహా న్ని స్వామిగౌడ్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధు ల విగ్రహాలను ఏర్పాటు చేస్తే.. వారి స్ఫూర్తితో ఉద్యమిస్తారనుకుని వారి ఫొటో లు, విగ్రహాలను నాడు కనిపించని వ్వలేద న్నారు. ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, రాష్ట్ర నాయకుడు పెద్ది వెంకటనారాయణగౌడ్ పాల్గొన్నారు. -
కార్యదర్శులే గ్రామాలకు కలెక్టర్లు
పంచాయతీ సెక్రటరీల సదస్సులో స్వామిగౌడ్ సాక్షి, హైదరాబాద్: జిల్లాలకు కలెక్టర్లు లానే.. గ్రామ పంచాయతీలకు కార్యదర్శులే స్థానిక కలెక్టర్లని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. రాజేంద్రనగర్‌లోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ (టీసీపార్డ్)లో ఆదివారం జరిగిన టీఎన్జీవో పంచాయతీ కార్యదర్శుల సదస్సులో స్వామి గౌడ్ ప్రసంగించారు. గ్రామాలకు సర్పంచ్‌లు ముఖ్యమంత్రులైతే, వార్డు మెంబర్లు మంత్రు ల్లాంటి వారన్నారు. గ్రామాల అభివృద్ధికి వారందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన బాధ్యత కార్యదర్శు లపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో కార్యదర్శు లకు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్నింటినీ అధిగమించుకుంటూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ శాఖకు జూపల్లి కృష్ణా రావు లాంటి సమర్థు డైన మంత్రి ఉన్నా రని, సమస్యల వద్దకే ఆయనే వెళ్లి పరిష్కరి స్తారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణతోనే వారికి నివాళి.. తెలంగాణ కోసం అమరులైన వారి ఆకాంక్షల ను నెరవేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉంద ని, బంగారు తెలంగాణ సాధనే అమరులకు అసలైన నివాళి అని మంత్రి జూపల్లి అన్నారు. తెలంగాణ సాధనలో ఉద్యోగుల పాత్ర మరవలేనిదని, అందరం సంఘటితంగా పనిచేసి బంగారు తెలంగాణ సాధనకు కృషి చేయాలని కోరారు. కష్టపడి కాకుండా ఇష్ట పడి పనిచేస్తేనే నిర్దేశించుకున్న లక్ష్యాలు సులువుగా అధిగమించగలమన్నారు. ఇప్ప టికే టీఎస్ఐపాస్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయవంటి కార్యక్రమాలతో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, పంచాయతీ రాజ్ శాఖనూ ఆదర్శంగా నిలిపేందుకు కార్యదర్శులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. 2018 అక్టోబర్ 2నాటికి తెలంగాణను వంద శాతం బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా మార్చడంలో కార్యదర్శులు కీలకం గా వ్యవహరించాలన్నారు. గ్రామ కార్యద ర్శులను రేషనలైజేషన్ చేయడం ద్వారా పనిభారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటు న్నామని మంత్రి జూపల్లి చెప్పారు. పంచాయతీ కార్యదర్శుల సంఘం రూపొం దించిన నూతన సంవత్సర డైరీని, కేలండర్‌ను జూపల్లి, స్వామిగౌడ్ ఆవిష్కరిం చారు. కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం గౌరవాధ్యక్షుడు దేవీప్రసాదరావు, అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, పంచాయతీ కార్యద ర్శుల సంఘం ప్రతినిధులు పర్వతాలు, శేషు, రాజేందర్, రామకృష్ణ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
చైర్మన్, చీఫ్ విప్ మధ్య వాదన
పాతూరి అనుబంధ ప్రశ్నలపై స్వామిగౌడ్ అసహనం సాక్షి, హైదరాబాద్: ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలు వేసి సుదీర్ఘంగా మాట్లా డటంపై బుధవారం శాసనమండలిలో చైర్మన్ స్వామిగౌడ్, చీఫ్ విప్ పాతూరి సుధాకరరెడ్డిల మధ్య స్వల్ప వాదన జరిగింది. ఆయుర్వేద, యునాని వైద్య విద్య ప్రోత్సహంపై మంత్రి లక్ష్మారెడ్డి సమాధానంపై పాతూరి వరసగా 5, 6 అనుబంధ ప్రశ్నలు వేసి ప్రసంగం సాగిం చారు. ప్రశ్నలు ఇంత పొడుగున ఉంటాయా, ఇన్ని అనుబంధ ప్రశ్నలు వేస్తారా అని స్వామి గౌడ్ ప్రశ్నించారు. తాను ప్రశ్నలే అడుగుతు న్నానని ఆవేశానికి లోనైన సుధాకర్‌రెడ్డి స్పందించారు. మరో సందర్భంలో బీబీనగర్ నిమ్స్‌కు అసలు విపక్ష సభ్యులు వెళ్లారో లేదోకాని, తాను వెళ్లానని పాతూరి పేర్కొన డంతో.. ఆ విధంగా ఇతర సభ్యుల గురించి మాట్లాడటం సరికాదని చైర్మన్ సూచించారు. బీబీనగర్ నిమ్స్ నిర్మాణంలో వేగం పెంచాలని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కోరడం తో.. లక్ష్మారెడ్డి స్పందిస్తూ 9 ఏళ్ల కిందట నిర్మా ణం మొదలైందని, తాము వచ్చాక వేగవంతం చేశామని, ఇలా గతంలోనే (కాంగ్రెస్ అధికా రంలో ఉండగా) ఆవేశపడితే బాగుండేదని వ్యా ఖ్యానించడంతో సభలో నవ్వులు విరిశాయి. మరోవైపు ఒకేరోజు ఒక్క మంత్రికే 7 ప్రశ్నలు వస్తే మిగతా మంత్రుల సంగతే మిటని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అడిగారు. కాగా, శాసనమండలి సభ్యులు కూడా చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని, దీనిపై ఆధారపడిన వారిని ఆదుకునేందుకు చేనేత కొనుగోళ్లు చేయాలని స్వామిగౌడ్ సభలో విజ్ఞప్తి చేశారు. -
శాసనమండలి ప్రశ్నోత్తరాలు...
ప్రశ్నోత్తరాల సమయాన్ని వృథా చేయొద్దు మండలి చైర్మన్ స్వామిగౌడ్ సాక్షి. హైదరాబాద్: శుక్రవారం శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా తొలుత ప్రశ్నోత్తరాల సమయంలో మరే ఇతర అంశంపై చర్చకు ఆస్కారం లేదని మండలి చైర్మన్ స్వామిగౌడ్ స్పష్టంచేశారు. సమయాన్ని ఏ మాత్రం వృథా చేయొద్దని, అనుకున్న సమయంలో ప్రశ్నోత్తరాలు పూర్తి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే గంటా ఇరవై నిముషాల వ్యవధిలోనే ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయా అంశాలపై అధికార, విపక్ష సభ్యులు వేసిన ప్రశ్నలపై మంత్రులు సమాధానాలిచ్చారు. అవి సంక్షిప్తంగా... వచ్చే జూన్ నాటికి డిజిటల్ క్లాసులు: కడియం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హైస్కూళ్లు, రెసిడెన్షియల్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో వచ్చే జూన్ (2017) నాటికి డిజిటల్ క్లాసులను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. అలాగే ప్రైమరీ స్కూళ్లలోనే అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి, అంగన్వాడీలు, ప్రీప్రైమరీలను జోడించి వాటి ద్వారా ఎన్రోల్మెంట్ పెంచేందుకు చర్యలు చేపట్టాలనే ఆలోచనతో ఆయన తెలిపారు. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనంపై పరిశీలన.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని కడియం శ్రీహరి తెలిపారు. అన్ని అంశాలను పరిశీలించి ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. రైతుల దశ మారుతుంది: పోచారం స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్రం పంటలకు ధరలు కల్పిస్తేనే రైతుల భవిష్యత్ మారుతుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకు అనుగుణంగానే రాష్ట్రంలో చెల్లిస్తున్నామన్నారు. ఈ ధరను నిర్ణయించే అధికారం రాష్ట్రానికి లేదని చెప్పారు. ఎలాంటి మార్పు ఉండదు: జూపల్లి ఎన్నికైన జిల్లా పరిషత్‌ల కాలపరిమితి ముగిసే వరకు కొత్తగా ఏర్పడిన జిల్లాలకు అనుగుణంగా కొత్త జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొత్తగా జిల్లాల విభజన జరిగినా గతంలోని పాత జిల్లా పరిషత్‌ల పరిధిలోకే ఆ జిల్లాలు కూడా వస్తాయని, విధులు, నిధులు, ఇతర విషయాల్లోనూ ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేశారు. అనుకున్న విధంగా భద్రాద్రి ప్లాంట్: జగదీశ్‌రెడ్డి భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను అనుకున్న విధంగా పూర్తిచేసి 2017–18లో ఉత్పత్తి దశకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఈ విద్యుత్ ప్లాంట్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వృద్ధాశ్రమాల ఏర్పాటుకు యత్నం: తుమ్మల వృద్ధాశ్రమాలు లేని జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని రోడ్లు, భవనాలు, మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. తండాల అభివృద్ధి బోర్డు ప్రతిపాదన లేదు ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ గిరిజన తండాల అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. దీనిని సీఎం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. -
బడుగుల బాంధవుడు కొండా లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: బలహీనవర్గాలు సామాజికంగా ఎదిగేందుకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఎంతగానో కృషి చేశారని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. సహకార సంఘాలను, కుల వృత్తులను ప్రోత్సహించిన బాపూజీ బడుగు వర్గాల బాంధవుడని కొని యాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని, 90 ఏళ్ల వయసులోనూ తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించారన్నారు. మంగళవారమిక్కడ ఆర్టీసీ కళాభవన్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వామిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, జోగు రామన్న, ఎంపీలు కేశవరావు, బూర నర్సయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ రాపోలు ఆనందబాస్కర్ పాల్గొన్నారు. స్వామిగౌడ్ మాట్లాడుతూ.. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కమిషన్‌ను ఏర్పాటు చేసి, సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంచార జాతులను గుర్తించి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వారిని అభివృద్ధి పరచాలన్నారు. బీసీ సాధికారిత భవనాన్ని నిర్మించి అక్కడే కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాన్ని నిర్వహించాలని, అప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. నిజాం పాలనలో మొదటిసారి ఆబిడ్‌సలోని హెడ్ పోస్టాఫీసుపై జాతీయ జెండా ఎగురవేసిన గొప్ప ధీశాలి బాపూజీ అని కొనియాడారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్నారన్నారు. ఆ పోరాట పటిమ అందరిలో రావాలి స్వాతంత్రోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు లక్ష్మణ్ బాపూజీ చూపిన పోరాట పటిమ అందరిలోనూ రావాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని బలహీనవర్గాలు అభివద్ధి చెందాలని ఆకాంక్షించారు. బాపూజీ విగ్రహాన్ని తప్పకుండా ఏర్పాటు చేయాలని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. తాను, బాపూజీ ఒక కుటుంబ సభ్యులుగా మెలిగామని ఎంపీ కేశవరావు గుర్తుచేసుకున్నారు. ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పేదల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన వ్యక్తి బాపూజీ అని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగితేనే అభివృద్ది సాధ్యమని, 50 శాతం ఉన్న బీసీలకు, విద్య, రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని బాపూజీ జయంతి ఉత్సవ కమిటి చైర్మన్ , మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. బీసీలకు సబ్ ప్లాన్ పై ప్రభుత్వం చర్చ జరుపుతోందన్నారు. బీసీలకు ఉపకార వేతనాలను పెంచే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. జలదృశ్యంలో బాపూజీ విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తానన్నారు. నిజాయితీ, నిబద్ధతకు మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆర్.కృష్ణయ్య కొనియాడారు. కొద్దిగా రాజీపడ్డా ఆయన సీఎం అయ్యేవారని అన్నారు. కార్యక్రమంలో సామాజిక దర్శిని పుస్తకం, బాపూజీ పాటల సీడీ, బీసీ మీడియా ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అరుణ, కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ఉత్సవ సమితి వైస్ చైర్మన్లు యాదగరి, కాల్లప్ప, మల్లయ్య, వెంకటేశ్వర్, గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకులను ఆకర్షించాలి
సాక్షి, హైదరాబాద్: ఇంటికి చుట్టాలు రాకుంటే ఎంత దరిద్రమో రాష్ట్రానికి పర్యాటకులు రాకపోయినా అదే పరిస్థితి అని శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ పేర్కొన్నారు. అందువల్ల పర్యాటకులను ఆకర్షించాలని పర్యాటకశాఖకు సూచించారు. మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామిగౌడ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు బయటి ప్రాంత విశేషాలు, వాటి గొప్పతనం గురించి పర్యాటకశాఖ తెలియజేసి, రాష్ట్రానికి అతిథులు వచ్చేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తోం దని, వాటిని ప్రజలంతా సద్వినియోగం చే సుకోవాలని సూచించారు. గతంలో తాను అనారోగ్యానికి గురైనప్పుడు ఆస్పత్రిలో ఎన్ని రోజులు చికిత్స తీసుకున్నా రోగం తగ్గలేదని... గండిపేట చెరువుకు తరచూ విహారానికి వెళ్లగా రోగం నయమైందన్నారు. రాష్ట్రంలోని చారిత్రక ప్రాంతాలు ఉమ్మడి ఏపీలో మరుగునపడ్డాయని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆవేదన వ్యక్తంచేశారు. భువనగిరి కోట, రామప్ప గుడి వంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలు రాష్ట్రంలో ఉన్నాయని...పాఠశాల విద్యార్థులు సబ్సిడీపై వాటిని తిలకించేలా చేస్తామన్నారు. పర్యాటకానికి 500 కోట్లు: పేర్వారం మానవాళిని ఒకే వేదికపై నిలబెట్టేందుకు పర్యాటకం ఎంతో దోహదం చేస్తుందని పర్యాటక అభివృద్ధి మండలి చైర్మన్ పేర్వారం రాములు పేర్కొన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగానికి కేవలం రూ. 130 కోట్ల మేర బడ్జెట్ కేటాయింపులు ఉండగా తెలంగాణ వచ్చాక ఈ రంగంపై సీఎం కే సీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపారని, పర్యాటక రంగానికి కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించాయని తెలిపారు. టూరిజం ఫిల్మ్స్, మ్యూజియం ఆన్ విల్స్, గ్లాస్ నెగిటివ్స్తోపాటు ‘ట్రావెల్.. బీ సేఫ్’ మొబైల్ యాప్‌ని ఆవిష్కరించారు. అలాగే హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్ ఫ్రమ్ చిల్డ్రన్.. ఫర్ చిల్డ్రన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ టూరిజం ఎక్సలెన్సీ అవార్డులను స్వామిగౌడ్, చందూలాల్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో పర్యాటక కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, రాష్ట్ర పర్యాటక, యువజన, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి. వెంకటేశం, టీఎస్‌టీడీసీ ఎండీ క్రిస్టినా జడ్ చోంగ్తూ, పర్యాటకశాఖ డెరైక్టర్ సునీతా ఎం భగవత్, సాంస్కృతికశాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, విశాలాక్షి పాల్గొన్నారు. బెస్ట్ ట్రావెల్ ఏజెంట్‌గా సదరన్ ట్రావెల్స్ రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ట్రావెల్ ఏజెంట్‌గా ప్రముఖ సంస్థ ‘సదరన్ ట్రావెల్స్’ ఈ ఏడాదికిగాను టూరిజం ఎక్సలెన్సీ అవార్డును అందుకుంది. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి చందూలాల్ ఈ అవార్డును అందజేశారు. అలాగే తాజ్ ఫలక్‌నుమా (హైదరాబాద్) ఫైవ్‌స్టార్ స్థాయిలో, హోటల్ దస్పల్లా (హైదరాబాద్) ఫోర్ స్టార్ స్థాయిలో, అలంకృత రిసార్ట్స్ (రంగారెడ్డి జిల్లా)తోపాటు ఫోర్ స్టార్ స్థాయిలో, ప్రత్యేక విభాగంలో అవార్డును గెలుచుకుంది. హోటల్-లాడ్జి త్రీస్టార్ స్థాయిలో శ్రీవేంకటేశ్వర లాడ్జి (హైదరాబాద్), మినర్వా గ్రాండ్ (సికింద్రాబాద్)కు, బెస్ట్ టూరిజం డెస్టినేషన్ ఇన్ హైదరాబాద్ కింద రామోజీ ఫిల్మ్‌సిటీకి అవార్డులు లభించాయి. రామోజీ ఫిల్మ్‌సిటీ తరఫున సంస్థ ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ అవార్డు అందుకున్నారు. వివిధ అవార్డులు బెస్ట్ టూరిజం డెస్టినేషన్ అదర్ దాన్ హైదరాబాద్ కింద హరిత ఎకో టూరిజం రిసార్ట్స్ (కడెం), బెస్ట్ హరిత హోటల్‌గా హరిత కాకతీయ హోటల్ (వరంగల్), బెస్ట్ టూరిజం గైడ్‌గా జె.భాస్కర్‌రెడ్డి, బెస్ట్ టూరిజం ఫిల్మ్ కింద వెల్కమ్ టు తెలంగాణ తరఫున డి.సత్యనారాయణ, డిస్కవరీ ఆఫ్ తెలంగాణ కింద పి. చందర్ బడవత్, అతిథి దేవోభవ కింద అపోలో క్రేడిల్ ఆస్పత్రి(హైదరాబాద్)కి అవార్డు లభించింది. ఆ సంస్థ ప్రతినిధి డా.సునీల్ అవార్డును అందుకున్నారు. బెస్ట్ రెస్టారెంట్ కింద కారంపూడి (హైదరాబాద్), బెస్ట్ రెస్టారెంట్ అదర్ దాన్ హైదరాబాద్ కింద హోటల్ శ్వేత (కరీంనగర్) అవార్డులు పొందాయి. బెస్ట్ ఫొటోగ్రాఫర్స్ అవార్డులను బి.పూర్ణచందర్ (కల్చర్), వి.శరత్ (హెరిటే జ్ విభాగంలో), ప్రిన్స్ (నేచర్ విభాగంలో) అందుకున్నారు. -
నిర్మల్ జిల్లా ఏర్పాటు విరమించుకోవాలి
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాను రెండు జిల్లాలుగా మాత్రమే విభజించాలంటూ జిల్లా పరిరక్షణ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శుక్రవారం ఉదయం పట్టణానికి చేరుకున్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను జిల్లా పరిరక్షణ సమితి సభ్యులు ఘెరావ్ చేశారు. అనంతరం ఆయనకు పరిరక్షణ సమితి నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఆదిలాబాద్, మంచిర్యాలతోపాటు నిర్మల్‌ను కూడా జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని..అయితే నిర్మల్ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను విరమించేలా కేసీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని వారు స్వామిగౌడ్‌ను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. మీ అభ్యర్థనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ఆయన పరిరక్షణ సమితి సభ్యులకు హామీ ఇచ్చారు. -
రాజకీయాలనూ శాసిస్తున్నాయ్!
- ప్రైవేటు విద్యాసంస్థల తీరుపై స్వామిగౌడ్ - తమను ముట్టుకుంటే అంతం చేస్తామనే పరిస్థితి ఉందని ధ్వజం - టెన్త్ పాసైన వ్యక్తులు మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్నారని ఆవేదన - హైదరాబాద్‌లో ప్రాఫిటింగ్ ఫ్రం ది పూర్ పుస్తకావిష్కరణ - ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి, చుక్కా రామయ్య తదితరుల హాజరు సాక్షి, హైదరాబాద్ : ‘‘ప్రైవేటు విద్యాసంస్థలు రాజకీయ రంగాన్నీ శాసించే స్థాయికి చేరాయి. మమ్మల్ని ముట్టుకుంటే ఎవరినై నా అంతం చేస్తామని బెదిరించే స్థాయికి వ చ్చాయి’’ అని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మండిపడ్డారు. ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్(ఈఐ) సంస్థ ఆధ్వర్యంలో విద్య ప్రైవేటీకరణ-వ్యాపారీకరణ అంశంపై పలువురు ప్రొఫెసర్లు పరిశోధించి రూపొందిం చిన ‘ప్రాఫిటింగ్ ఫ్రం ది పూర్’ పుస్తకాన్ని ఆయన ఆదివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రైవేటు సంస్థలు భూతాల్లా విస్తరిస్తున్నాయన్నారు. పదో తరగతి పాస్‌కాని వ్యక్తులు మెడికల్ కళాశాలలను, ఏడో తరగతి చదవని వారు ఇంజనీరింగ్ కళాశాలలను నిర్వహిస్తున్నారంటే ప్రమాణాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవచ్చన్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని, భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈఐ సంస్థ పరిశోధనలో తేలిన అంశాలను ప్రభుత ్వం పరిగణనలోకి తీసుకుంటుందని, అందరికీ నాణ్యమైన విద్యను అందించే దిశగా సహకారం అందిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణి మాట్లాడుతూ విద్య ప్రైవేటీకరణకు అందరం వ్యతిరేకమేనని, సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలన్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా సబ్సిడీలు అధికంగా ఇవ్వడంతో కీలక శాఖలకు నిధుల కొరత ఏర్పడుతోందన్నారు. ఈఐ సూచించిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసికెళ్తానన్నారు. కార్యక్రమంలో ఈఐ చీఫ్ కోఆర్డినేటర్ శశిబాలాసింగ్, ప్రాజెక్ట్ డెరైక్టర్ ఆంగ్లియో, రీసెర్చ్ ఫ్రొఫెసర్లు సంగీతా కామత్, జొన్నలగడ్డ ఇందిర, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్, కొంపల్లి యాదవ్రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, జాఫ్రీ, మాజీ ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, సుబ్బారెడ్డి, తెలంగాణ, ఏపీలకు చెందిన వివిధ జిల్లాల ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఐక్యతతోనే గౌడ కులస్తుల అభివృద్ధి: స్వామిగౌడ్
హైదరాబాద్: గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి పార్టీలకతీతంగా, సంఘటితంగా ముందుకు సాగాలని శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన తెలంగాణ గౌడ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి అందరూ కృషి చేయాలని సూచించారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను ప్రభుత్వం పెట్టలేదని అనడం కంటే ప్రతి సొసైటీ ఒక విగ్రహం పెట్టేవిధంగా ప్రయత్నించాలని సూచించారు. సర్దార్ పాపన్న వంటి మహోన్నత వ్యక్తి పుట్టిన గౌడ కులంలో తాను పుట్టినందుకు గర్విస్తున్నానని అన్నారు. ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ ఐక్యంగా ఉంటేనే గౌడ కులస్తులు అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధించవచ్చని అన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా తాటి, ఈత చెట్లను నాటించాలని ప్రభుత్వానికి సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత గౌడ సంఘం ఆధ్వర్యంలో.. హైదరాబాద్ అమీర్‌పేటలోని సితారా హోటల్లో అఖిల భారత గౌడ సంఘం ఆధ్వర్యంలో సంఘం చైర్మన్ పేరం శివనాగేశ్వరరావు అధ్యక్షతన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గౌడ సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడిగా కేఈ వేణుమాధవ్, తెలంగాణ అధ్యక్షుడిగా ఎ.మాణిక్ప్రభుగౌడ్లతో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, మాజీ మంత్రి జి.రాజేశంగౌడ్‌లు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సినీహీరో, నిర్మాత జైహింద్‌గౌడ్, ఉపేందర్‌గౌడ్, బీసీ మహిళా సంక్షేమ అధ్యక్షురాలు శారద తదితరులు పాల్గొన్నారు. -
నేతలను అడ్డుకున్న జిల్లా సాధన సమితి
జనగామ: వరంగల్ జిల్లా జనగామ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ప్రకటించాలని కోరుతూ మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను జిల్లా సాధన సమితి నాయకులు శనివారం అడ్డుకున్నారు. మండలంలోని చౌడారం, పెద్దపహాడ్, ఎర్రగొల్లపహాడ్ గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాల ఆవిష్కరణ కోసం నేతలు జిల్లా పర్యటనకు వచ్చారు. విషయం తెలుసుకున్న జనగామ జిల్లా సాధన సమితి నాయకులు మంగలపల్లి రాజు ఇతర నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లి ఆర్టీసీ చౌరస్తాలో వారిని అడ్డుకున్నారు. జనగామ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని స్వామిగౌడ్ వారికి హామీ ఇవ్వడంతో శాంతించారు. -
ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పలేదు
వివేక్‌నగర్: తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఏనాడు చెప్పలేదని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను తెలంగాణ నిరుద్యోగ యువతతో భర్తీ చేస్తామని చెప్పామని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ సాధనలో ప్రజలందరి భాగస్వామ్యం ఉందన్నారు. తెలంగాణ ఎన్జీఓ యూనియన్ హైదరాబాద్ జిల్లా, హైదరాబాద్ గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం వట్టికోట ఆల్వార్ స్వామి స్మారక నగర గ్రంథాలయ సంస్థలో జరిగిన స్వామిగౌడ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎన్జిఓ నాయకుడిగా తనకు ఉన్న గుర్తింపై ఉన్నత పదవికి కారణమైందన్నారు. గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చే స్తానన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పండుగలా జరుపుకోవాలని సూచించారు. టీఎన్జిఓ సెంట్రల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దేవిప్రసాద్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులందరికీ ప్రతి నెల 1నే జీతాలు అందేలా చూస్తామన్నారు. తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమానికి కృషి చేసిన వట్టికోట అల్వార్ స్వామి పేరును నగర గ్రంధాలయానికి పెట్టడం అభినందనీయమన్నారు. అనంతరం స్వామిగౌడ్‌ను గ్రంథాలయ ఉద్యోగులు సత్కరించారు. కార్యక్రమంలో వెంకటేశ్వరశర్మ, రవీందర్‌రెడ్డి, ఎంఏ హమీద్, ఎస్ఎం హూస్సేన్, బి.రేచల్, జి . ప్రభాకర్, ఏవీఎన్ రాజు, బొల్లం మహేందర్, చాగంటి అయోద్య పాల్గొన్నారు. -
స్వామిగౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్రమాలు
హైకోర్టులో పిటిషన్ సాక్షి, హైదరాబాద్: టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ప్లాట్ల కేటాయింపుల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు, నిధుల దుర్వినియోగం జరిగాయని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీఎన్జీవో అధికారుల కాలనీ సం క్షేమ సంఘం ఉపాధ్యక్షుడు జె.రవీందర్‌రెడ్డి తదితరులు ఈ పిటిషన్ వేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను వ్యక్తిగతంగా ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యా న్ని హైకోర్టు సోమవారం విచారిం చనుంది. టీఎన్జీవో అధ్యక్షుడి హోదాలో స్వామిగౌడ్ ఇష్టారాజ్యంగా వ్యవహరించి, రూ.419కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని పిటిషనర్లు ఆరోపించారు. వాటర్ వర్క్స్, పారామెడికల్ సిబ్బంది, ఇతర జిల్లాల్లోని ఉద్యోగులకు ప్లాట్లు కేటాయించారని, ఈ విషయాన్ని స్వామిగౌడ్ కూడా అంగీకరించారన్నారు. -
జాతీయ పతాకం.. జాతీయ గీతం మన దేశ సంపద
స్వామిగౌడ్ నార్సింగి: రాజేంద్రనగర్ బండ్లగూడలోని శారదాధామంలో శుక్రవారం సాయంత్రం భారత జాతీయ పతాక 95వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, సరస్వతీ విద్యామందిర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ పతాకం, జాతీయ గీతం, వందేమాతరం జాతీయ సంపద అని అన్నారు. రోజూ ఉదయం లేవగానే భారతమాతాకీ జై అని నినదించి తమ పనులు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కె.హెచ్.ఎస్.జగదాంబ, వి.రాముడు యాదవ్, ప్రమీల యాదవ్, కె.సంజీవ్‌కుమార్, సురేష్, నర్సింహా రెడ్డి, రావుల విశ్వనాథ్‌రెడ్డి, రాంప్రసాద్‌రావు, ప్రవీన్‌కుమార్, పి.రాజు, ప్రజాప్రతినిధులు, నాయకులు మల్లేష్, కృష్ణా రెడ్డి, హరికృష్ణ, స్వర్ణలత భీమార్జున్‌రెడ్డి హాజరయ్యారు. -
మండలిలో ప్రశ్నల వివాదం
సభ్యుల లంబా స్పీచ్‌లతో కాలాతీతమవుతోంది: స్వామిగౌడ్ సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఒక్కో ప్రశ్నపై సభ్యులు పలు ఉప ప్రశ్నలు వేయడంతో అది లఘు చర్చకు దారితీస్తోందనీ, అందువల్ల మూడు ప్రశ్నల అనంతరం ప్రత్యేక ప్రస్తావన చేపడతానని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. దీంతో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష నేత షబ్బీర్‌అలీ, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, రాములునాయక్, పాతూరి సుధాకర్‌రెడ్డి, పొంగులేటి సుధాకరరెడ్డి తదితరులు తమ ప్రశ్నలను యథాతథంగా కొనసాగించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ దశలో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ప్రశ్న సంక్షిప్తంగా ఉంటే తమ సమాధానం సంక్షిప్తంగానే ఉంటుందని, పార్టీకి ఒకరికి అవకాశమిస్తే సరిపోతుందని సూచించారు. లేదంటే రోజుకు 2,3 ప్రశ్నల కంటే ఎక్కువరావని, చైర్మన్ ఆ దిశలో ఆలోచించాలని కోరారు. ఎమ్మెల్సీ పొంగులేటి మాట్లాడుతూ.. చైర్‌ను మంత్రి డిక్టేట్ చేసే పద్ధతి సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలపై పాతూరి సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, భానుప్రసాద్, బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధరగౌడ్ తమ స్థానాల్లో నిలబడి అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పొంగులేటి, ఎం.రంగారెడ్డి, కె.రాజగోపాల్‌రెడ్డి కూడా తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు. ఈ క్రమంలో పొంగులేటి-పాతూరిల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందిస్తూ తమకు చైర్‌పై అత్యంత గౌరవముందని, సభను ఎట్లా నడపాలో సూచనలు, విజ్ఞప్తులు మాత్రమే చేయగలమనీ, చైర్‌ను డెరైక్ట్ చేసే అధికారం లేదన్నారు. సభ్యులు ‘లంబా లంబా స్పీచ్లిస్తుండడంతో కాలాతీతమవుతోందనీ, కొందరు సభ్యులు అనుబంధ ప్రశ్నలు వేస్తున్నారే తప్ప ఇంట్లో కూర్చుని ప్రశ్నలు రాయలేకపోతున్నారని చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ఇకపై ప్రశ్నపై సంతకం చేసిన వారికే పరిమితమవుదామని ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని మళ్లీ ప్రారంభించి అన్ని ప్రశ్నలు పూర్తిచేశారు. -
ఎమ్మెల్సీలకు బడ్జెట్ లో ప్రత్యేక నిధులు
ప్రభుత్వానికి నివేదిస్తా: స్వామిగౌడ్ మెదక్: ఎమ్మెల్సీలకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని, ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిస్తామని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. గురువారం మెదక్ పట్టణంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీలకు తగిన గుర్తింపు లేదన్న విషయం వాస్తవమేనని చెప్పారు. అయితే, ఎమ్మెల్సీలు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తే దానిపై చర్చించి తగు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని చెప్పారు. పార్టీ మారిన సభ్యుల విషయమై న్యాయనిపుణులతో చర్చిస్తామని పేర్కొన్నారు. -
‘మండలి’ సిబ్బంది బతుకమ్మ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో పూల వేడుకగా బతుకమ్మ ప్రసిద్ధి చెందిందని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. మంగళవారం మండలి సచివాలయ సిబ్బంది అసెంబ్లీ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ స్వామిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా మహిళలతో కలసి ఆయన బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంత ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని, ఇలాంటి అవకాశం వలస పాలనలో రాలేదని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక ఆ స్వేచ్ఛ లభించిందని చెప్పారు. కార్యక్రమంలో శాసనసభ కార్యదర్శి రాజా సదారాం, డిప్యూటీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, టీఆర్ఎస్ నేత రాజేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ సిద్దిపేటకు రాజముద్ర
♦ వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం ♦ దేశంలో తొలి నియోజకవర్గంగా రికార్డు ♦ అధికారికంగా ప్రకటించిన స్పీకర్ మధుసూదనాచారి ♦ రాష్ట్రమంతటా ఇదేస్ఫూర్తి కొనసాగించాలని పిలుపు ♦ ‘రాజముద్ర’కు సంకేతంగా బ్యాండ్ కొట్టిన మండలి చైర్మన్ స్వామిగౌడ్ సిద్దిపేట జోన్: వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించిన మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గానికి శుక్రవారం రాజముద్ర పడింది. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అధికారిక ప్రకటన చేయగా.. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ రాజముద్రకు సంకేతంగా బ్యాండ్ కొట్టి సంబురాలు నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని 64,733 నివాస గృహాలకు 58,202 వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండగా నెల రోజుల్లోనే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణలో భాగంగా నియోజకవర్గంలో 5,531 మరుగుదొడ్లను నిర్మించి వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. దీంతో దేశంలోనే బహిరంగ మలవిసర్జన లేని నియోజకవర్గంగా సిద్దిపేటను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక పత్తి మార్కెట్ యార్డులో నిర్వహించిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం కావడం అభినందనీయమని, సిద్దిపేట నేడు రాష్ట్రానికి మరో స్ఫూర్తి దాయకంగా నిలిచిందని కితాబిచ్చారు. అసాధ్యాలను సాధ్యం చేసే ఘనతను సిద్దిపేట దక్కించుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణ పథకం సిద్దిపేటకే పరిమితం కాకుండా రాష్ట్ర మంతా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో తన నియోజకవర్గం భూపాలపల్లిలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. సమాజాన్ని ఆలోచింపజేసే కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతమైన సిద్దిపేటకు హరీశ్‌రావులాంటి నాయకుడు దొరకడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. సిద్దిపేట అంటే.. ఒక చరిత్ర, ఒక ఉద్యమం, ఒక శక్తి, అభివృద్ధి అని ఆయన అభివర్ణించారు. అంతకుముందు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రకటన చేశారు. ప్రకటన కొనసాగుతున్న సేపు పత్తిమార్కెట్ యార్డులో బాణా సంచాల మోత, ప్రజా ప్రతినిధుల, అధికారుల కరతాళ ధ్వనులతో సంబురాలు అంబురాన్ని అంటాయి. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఫారూక్‌హుస్సేన్, సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, సీఎం ఓఎస్డీలు దేశపతి శ్రీనివాస్, ప్రియాంక నర్గీస్, కలెక్టర్ రోనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు. -
గౌడ్స్ న్యూస్ వెబ్‌చానల్ ప్రారంభం
హైదరాబాద్: గౌడ కులస్తుల బతుకుచిత్రాన్ని యావత్తు జాతికి తెలియజేసేలా గౌడ్స్ న్యూస్ వెబ్సైట్ చానల్ పనిచేయాలని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ముత్యం ముఖేశ్‌గౌడ్ సారథ్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గౌడ్స్ వెబ్చానల్ను స్వామిగౌడ్ తన చాంబర్లో సోమవారం గౌడ సంఘాల నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర గౌడ సమాచారాన్ని నిరంతరం అందించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, గౌడ జేఏసీ కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్, వైస్ చైర్మన్ అంబాల నారాయణగౌడ్, బీసీ ఉద్యోగుల సంఘం ప్రధానకార్యదర్శి ముత్యం వెంకన్నగౌడ్, గౌడ యువజన సంఘం అధ్యక్షుడు ముత్యం మనోహర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
లండన్‌లో బోనాలు
హైదరాబాద్: తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల పండుగ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను తలపించేలా నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఈ సంవత్సరం జరుపుకునే బోనాల పండుగకు ప్రత్యేకత ఉందన్నారు. -
పట్టాలు పంపిణీ చేసిన శాసనమండలి చైర్మన్
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అర్హులైన పేదలకు భూమి పట్టాలను అందించారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కావగూడ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని గ్రామంలోని పేదలకు భూమి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, గ్రామసర్పంచి, పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. అనంతరం గ్రామ శివారులో ఉన్న కాముని చెరువును ఆయన సందర్శించారు. కాముని చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయడానికి అనువైన పరిస్థితులను ఎమ్మార్వో వెంకట్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. -
టీఆర్ఎస్ నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: టీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, యాదవరెడ్డి, వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్‌లు నూతన ఎమ్మెల్సీలుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌రావును మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా కొనసాగించాలని అధికార పక్షం భావిస్తున్నట్లు సమాచరం. -
దుర్గమ్మకు బోనాలు సమర్పించిన స్వామిగౌడ్
ప్రోటోకాల్ పాటించని ఆలయ అధికారులు విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ మండలి సభాపతి స్వామిగౌడ్ శనివారం బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ సిబ్బంది ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఏటా దుర్గమ్మను దర్శించుకుని ఆశీస్సులు అందుకుంటానన్నారు. ఈ ఏడాది సభాపతిగా బాధ్యతలు పెరగడంతో అమ్మవారి దర్శనం కాస్త ఆలస్యం అయిందన్నారు. తన కుటుం బం తరఫున అమ్మవారికి బోనాలు సమర్పించినట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటించకపోవడంతో కేంద్రం అన్యాయం చేసినట్లు అయిందన్నారు. గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో చేయాలని కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపై ఉండేవని, ఉద్యమ నేపథ్యంలో అభిప్రాయ భేదాలు తలెత్తాయని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేస్తామన్నారు. ఇదిలావుండగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన స్వామిగౌడ్‌ను ప్రధానగేటు నుంచి కాకుండా పక్కనే ఉన్న ప్రొవి జన్స్ స్టోర్స్ మీదుగా ఆలయానికి తీసుకువెళ్లడం విమర్శలకు దారి తీసింది. ప్రోటోకాల్‌ను పాటించకపోవడంపై దేవాదాయశాఖ మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. -
హిందూ జాతి మనుగడకు నలుగుర్ని కనాలి
⇒ తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ వ్యాఖ్య హైదరాబాద్: దేశంలో హిందూ జాతి మిగలాలంటే ఇంటికి నలుగురు పిల్లలను కనాలని, లేకపోతే జాతి మనుగడ సాగించదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ అన్నారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే స్మారక పోటీల విజేతల బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ సభలో స్వామిగౌడ్ మాట్లాడుతూ.. ఏ ఇజాలు లేని రోజుల్లోనే నిజాలు మాట్లాడిన మహాత్ముడు జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. శెట్టిబలిజ, గౌడ, కలాయి, కౌండిన్య తదితర గౌడ్ కులస్తులందరికీ ఒకే తీరు రిజర్వేషన్లు అమలుపై బీసీ కమిషన్‌కు పూర్తి వివరాలు అందజేశానని పేర్కొన్నారు. బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు డాక్టర్. కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. బహుజనులు తెచ్చుకున్న తెలంగాణలో వారిని విస్మరిస్తే మరో పోరాటం ప్రారంభమవుతుందన్నారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ఎ. రామలింగేశ్వరరావు మాట్లాడుతూ దేశ చరిత్రను పాక్షికంగానే రాశారని అందులో మహాత్ముల చరిత్రలు ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగానిని ఘనంగా సన్మానించారు. వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. -
వాడి, వేడిగా జూనియర్ ఆర్టిస్ట్‌ల సర్వసభ్య సమావేశం
హైదరాబాద్(బంజారాహిల్స్): తెలుగు సినీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ సాధారణ సర్వసభ్య సమావేశం వాడి, వేడిగా జరిగింది. ఆదివారం ఉదయం బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని కార్యాలయంలో సమావేశం జరిగింది. పెద్ద ఎత్తున జూనియర్ ఆర్టిస్ట్‌లో ఈ సమావేశంలో పాల్గొని తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా యూనియన్ ఆదాయ, వ్యయ ఖర్చులు చూపించాలంటూ సభ్యులు డిమాండ్ చేయగా ఆ మేరకు యూనియన్ అధ్యక్షుడు స్వామిగౌడ్, ప్రధాన కార్యదర్శి రవి అక్కడికక్కడే ఖర్చులను, ఆదాయాన్ని చూపించారు. లెక్కలన్నీ పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వాటిని తెలుపుతున్నామని చెప్పారు. ఎన్నికలు నిర్వహించాలని సభ్యులు డిమాండ్ చేయగా వచ్చే నెలలో ఎన్నికల తేదీని ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కొత్తగా చేరిన 200 మంది సభ్యులకు ఓటు హక్కు కల్పించవద్దంటూ పలువురు ఆర్టిస్టులు డిమాండ్ చేయగా ఓటు హక్కు ఉంటుందని అయితే పోటీ చేసే అవకాశం మాత్రం కల్పించబోమని స్పష్టం చేశారు. -
''ప్రతిపక్షం లేని సభలు నిరర్థకం''
-
సమస్యల ప్రాతిపదికన చర్చ
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సమావేశాల్లో సమస్యల ప్రాతిపదికనే ఆయా అంశాలపై చర్చ ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన మంగళవారం రూల్స్ కమిటీ సమావేశం జరిగింది. శాసనసభా వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు, కమిటీ సభ్యులు హాజరయ్యా రు. ఉమ్మడి ఏపీ మండలి నిబంధనలకే సవరణలు చేసి తెలంగాణ మండలికి అనుగుణంగా మార్పులు చేయనున్నారు. శనివారం నుంచి మొదలుకానున్న మండలి సమావేశాలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరపనున్నారు. ప్రశ్నోత్తరాల తర్వాతనే వాయిదా తీర్మానాలకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. మండలిలో పార్టీలు మారిన సభ్యుల అనర్హత గురించి కాంగ్రెస్ సభ్యుడు ఎం.ఎస్ ప్రభాకర్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇక, మండలిలో పార్లమెంటరీ కార్యదర్శులు సమాధానం చెప్పే అవకాశం ఉందా అన్న అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్(ఎజి) నుంచి స్పష్టత తీసుకోవాల్సి ఉందన్న చర్చ జరిగింది -
దండం పెడతా..
సక్రమంగా పనిచేయండి.. సీఎం రుణం తీర్చుకోండి ఉద్యోగులకు శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ పిలుపు సిద్దిపేట: ‘దండం పెడుతున్నా.. ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించండి. వివిధ పనుల కోసం వచ్చే వారికి సకాలంలో పనులు చేసి పంపండి. ప్రభుత్వానికి పేరు, ప్రతిష్టలు తీసుకురండి’ అని శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. సోమవారం ఆయన మెదక్ జిల్లా సిద్దిపేటలో ఎన్జీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు మిషన్ కాకతీయ పథకంపై నిర్వహించిన అవ గాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను గత ఐదు పీఆర్సీలలో ప్రత్యక్షంగా పాల్గొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ప్రస్తుత సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, రుణం తీర్చుకుందామని చెప్పారు. ఉద్యోగులను అవినీతిపరులుగా మార్చవద్దని రాజకీయ నాయకులను కోరారు. రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే: హరీశ్ రైతుల ఆత్మహత్యలను ఆపి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే మిషన్ కాకతీయ లక్ష్యమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని తెలిపారు. ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి అవలంబిస్తున్న విధానాల వల్లే దేశానికి కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి శ్రమించాలి: దేవీప్రసాద్ మిషన్ కాకతీయను విజయవంతం చేసేందుకు ప్రతి ఉద్యోగి శ్రమించాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు అన్నారు. మిషన్ కాకతీయ ప్రజాసంక్షేమ కార్యక్రమమని ఇందులో ప్రజలనూ భాగస్వామ్యం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, జేసీ శరత్‌లు తదితరులు మాట్లాడారు. అనంతరం టీఎన్జీవో కేలెండర్‌ను ఆవిష్కరించారు. -
తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. శుక్రవారం ద్రవ్యవినిమయ బిల్లును మండలి ఆమోదించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ బిల్లు ఆమోదానికి సహకరించింది. చివరి రోజు రెండు బిల్లులను సభ ఆమోదించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చివరిరోజు మాత్రమే శాసనమండలికి హాజరయ్యారు. 11 రోజుల్లో 49 గంటల 22 నిమిషాలు పాటు సమావేశాలు సాగాయి. ఈసారి సమావేశాల్లో పలు అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. కాంగ్రెస్, టీడీపీ సభ్యుల పార్టీ ఫిరాయింపుపై పలుమార్లు సభ వాయిదా పడింది. కాగా ఈ అంశం తన పరిధిలో ఉందని మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. -
ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మపై వివక్ష: స్వామిగౌడ్
ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ వివక్షకు గురైందని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ మహిళా ఉద్యోగుల బతుకమ్మ సంబరాల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత కూడా హైదరాబాద్ నగరంలో సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అలాంటి ఉద్యోగులను తరిమికొడతామని, తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. సొంత పదవిని కూడా కాపాడుకోలేని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తమను విమర్శిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. -
ప్రభుత్వ పాఠశాలలే ప్రగతికి సోపానాలు
మెదక్: కార్పొరేట్ విద్య కాలకూట విషమని, ప్రభుత్వ పాఠశాలలే ప్రగతికి సోపానాలు వేస్తాయని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో జరిగిన ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్పొరేట్ విద్య.. పాలబుగ్గల చిన్నారుల మెదడుపై మోయలేని భారాన్ని మోపుతోందన్నారు. విద్యార్థికి పాఠశాల, ఇల్లు తప్ప మరేవీ తెలియని పరిస్థితి నెలకొంటోందన్నారు. రాన్రాను విద్యార్థి ఆట పాటలకు.. ప్రాపంచిక జ్ఞానానికి...పల్లె వాతావరణాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్ని రోజులైతే గేదెలను సైతం జూకెళ్లి చూపించాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని అన్నారు. భారతీయ శాస్త్రవేత్తలు ప్రపంచానికే మార్గదర్శకులన్నారు. గ్రామీణ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రతి ఒక్కరి హృదయాలను పులకింపజేశాయన్నారు. ఇన్‌స్పైర్‌లో వారు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు శాస్త్రవేత్తలనే అబ్బురపరిచేవిగా ఉన్నాయన్నారు. మెతుకుసీమ బిడ్డలు మట్టిలో మాణిక్యాలని కొనియాడారు. తెలంగాణ ముద్దుబిడ్డ డీఈఓ రాజేశ్వర్‌రావు ఇంతకాలం ఆంధ్రాలో పనిచేశారని, ఆయన మెతుకుసీమకు బదిలీపై రావడంతో ఈరోజు ఇన్‌స్పైర్‌ను ఇంత ఘనంగా నిర్వహించగలుగుతున్నామన్నారు. ఇందుకు కృషిచేసిన ఉపాధ్యాయ సంఘాలకు, ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్‌లో సైన్స్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇన్‌స్పైర్‌లో విజేతలైన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాలని పిలుపునిచ్చారు. సైన్స్‌ఫెయిర్‌ను తిలకించేందుకు 124 పాఠశాలకు చెందిన విద్యార్థులు రావడం గమనార్హమన్నారు. డీఈఓ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ గత మూడు ఇన్స్పైర్ ప్రోగ్రాంలలో 4,046 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. డాక్టర్ సురేందర్ మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరంలో ఇన్‌స్పైర్‌ను మెదక్‌లో నిర్వహిస్తే లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. విజేతలైన 75 మంది విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ వనజాదేవి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగిఅశోక్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ లక్ష్మికిష్టయ్య, కౌన్సిలర్లు మాయ మల్లేశం, డిప్యూటీ ఈఓలు శోభ, పోమ్లా నాయక్, మోహన్, డైట్ ప్రిన్సిపాల్ రమేష్, ఎంఈఓలు నరేష్, నీలకంఠం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు మెదక్ రూరల్: ఇన్స్పైర్ కార్యక్రమం ముగింపు సందర్భంగా శుక్రవారం విద్యార్థుల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. విద్యార్థులు చేసిన వివిధ నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పట్టణంలోని సిద్దార్థ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శ్రీనిజ చేసిన భరతనాట్యం మంత్రముగ్దుల్ని చేసింది. నెత్తిన బోనాలు పెట్టి, పల్లెంపై నిలబడి, రెండు చేతుల్లో జ్యోతులను వెలిగించి ఆమె చేసిన నృత్యం ఔరా అనిపించింది. పాపన్నపేటకు చెందిన తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థినులు పాడిన పాటపై చేసిన నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది. -
రానున్నది మహర్దశ
చేవెళ్లరూరల్: రానున్న రోజుల్లో నగరానికి 39 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతమంతా గతంలో చూడని విధంగా అభివృద్ధి చెందుతుందని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. చేవెళ్ల మండలం ఖానాపూర్ గ్రామంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో శనివారం ఆయన అల్లుడు నిర్వహించిన అబిషేకపూజ కార్యక్రమంలో కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాల ఫలితంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. పాలనలోకి వచ్చిన రెండు నెలలకే ఇది చేయలేదు,అది చేయలేదనటం సరికాదన్నారు. రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉంటే ఎన్ని రేషన్‌కార్డులు ఉన్నాయనీ, దీనికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి అవకతవకులు లేకుండా ఉండేందుకే సమగ్ర సర్వే జరిగిందన్నారు. ప్రపంచంలోనే ఎక్కడ లేనివిధంగా ఈనెల 19న జరిగిన సమగ్ర సర్వేది గొప్ప చరిత్ర అన్నారు. ఈ ఆగస్టు 19 సర్వేడేగా మిగిలిపోతుందన్నారు. మన రాష్ట్రంలోని యువతకు 60నుంచి 70వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. నగరానికి చుట్టూ ఉన్న ప్రాంతాలు కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి చెందనున్నాయన్నారు. భూముల ధరలు బంగారం కానున్నాయని పేర్కొన్నారు. మండలి చైర్మన్‌గా అన్ని పార్టీలు సమానమేనని తెలిపారు. మండలి చైర్మన్ పోస్టు అనేది జిందా తిలస్మాత్ మందు లాంటిదని, అన్ని రోగాలకూ అది ఎలా పనిచేస్తోందో అలాగే చైర్మన్‌గా అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం గ్రామంలో పర్యటించి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సామ రవీందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, జనార్దన్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
మరో సింగపూర్ సిటీగా మహేశ్వరం
మహేశ్వరం: తెలంగాణ ప్రభుత్వంలో మహేశ్వరాన్ని మరో సింగపూర్ సీటిగా తీర్చిదిద్దుతామని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన పోచమ్మ బోనాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నట్లు చెప్పారు. మహేశ్వరం ప్రజలు తొందరపడి భూములు అమ్ముకోవద్దని సూచించారు. మహేశ్వరం, రావిర్యాల, తుక్కుగూడ, మంఖాల్, మన్సాన్పల్లి గ్రామాలకు భారీ ఐటీ, హార్డ్‌వేర్ కంపెనీలు రానున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఈ ప్రాంతలో కంపెనీలు, పరిశ్రమలు నెలకొల్పడానికి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. సమగ్ర సర్వేతో అర్హులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు. వర్షాలు సకాలంలో కురిపించి పాడీ పంటలు సమృద్ధిగా ఉండేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. అంతకుముందు గ్రామంలోని పోచమ్మ అమ్మవారికి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కొత్త మనోహర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దాసరి రామకృష్ణ, గ్రామ సర్పంచ్ ఆనందం, నాయకులు కూన యాదయ్య, డి. అశోక్, రాఘవేందర్‌రెడ్డి, ఎం.ఎ. సమీర్, మల్లేష్, తడకల యాదయ్య, సంజయ్, షఫీ, సలీం, చంద్రశేఖర్‌రెడ్డి ,ఠాగూర్ నాయక్ తదితరులున్నారు. -
సమగ్ర సర్వేలో పాల్గొన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్
-
సర్వేలో బీసీల విశ్వరూపం చూపాలి
శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ హైదరాబాద్: కులం బలపడకుండా బీసీ వర్గం బలపడదని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రధమ మహాసభ జరిగింది. బీసీ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన స్వామిగౌడ్ మాట్లాడుతూ.. బీసీ డిక్లరేషన్, సబ్‌ప్లాన్ అమలు జరగాలంటే ఈ నెల 19న జరిగే సర్వేను విజయవంతం చేయాలని కోరారు. సర్వేలో బీసీ కులాల విశ్వరూపం ఏమిటో చూపించాలన్నారు. అప్పుడే ప్రభుత్వాలకు మన బలమెంతో తెలుస్తుందని, హక్కులు సాధించుకోవడానికి వీలవుతుందని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు 87 శాతం ఉన్న అందరూ ఏకతాటిపైకి రాకపోవడానికి కారణం రాజకీయాలేనని అన్నారు. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు ప్రకటించారు. బీసీల్లో బలమైన నాయకుడైన ఆర్.కృష్ణయ్య సీఎం అయ్యేందుకు తాను కూడా ఓటు వేసి బలపరుస్తానని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి బండారు ప్రకాష్ , బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆచార్యులు, బీసీ సంక్షేమ -
స్వామిగౌడ్ ను అడ్డుకున్న ఓయూ జేఏసీ
హైదరాబాద్: కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయొద్దని ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్ ను ఓయూజేఏసీ అడ్డుకుంది. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో జరిగిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల విద్యా సదస్సుకు మండలి చైర్మన్ స్వామిగౌడ్, కోదండరాం, దేవీప్రసాద్, విఠల్ లు హాజరయ్యారు. ఈ సమావేశానికి నేతలు హాజరవుతున్నారని తెలుసుకున్న ఓయూ విద్యార్ధులు గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయవద్దని నిరసన వ్యక్తం చేశారు. దాంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేపట్టిన ఓయూ విద్యార్థులను పోలీసులు చెదరగొట్టారు. -
‘రెండో కాశ్మీర్‌గా.. ఆదిలాబాద్ జిల్లా’
ఆదిలాబాద్: జిల్లాలోని కుంటాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి కొమురంభీమ్ స్మృతివనం ఏర్పాటు చేసేలా ప్రణాళికలో పొందుపర్చినట్లయితే ఆదిలాబాద్ జిల్లా రెండో కాశ్మీర్‌గా అభివృద్ధి చెందుతుందని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్నతో కలసి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉద్యోగసంఘాల నాయకులు ఆయనను సన్మానించారు. అనంతరం, జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం జెడ్పీ అత్యవసర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ‘మన జిల్లా.. మన ప్రణాళిక..’కు ఆమోదం తెలిపారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా స్వామిగౌడ్ హాజరై మాట్లాడుతూ.. వనరులు, అడవులను సక్రమంగా వినియోగించుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా కాశ్మీర్ తరహాలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. -
జిల్లాకు అరుదైన గౌరవం
కరీంనగర్ సిటీ : జిల్లాకు మరో ఉన్నత పదవి లభించింది. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా బుధవారం ఎన్నికయ్యారు. ఇప్పటికే రాష్ట్ర అడ్వొకేట్ జనరల్, రెండు కీలకమంత్రి పదవులతో జిల్లాకు సముచిత స్థానం ఉండగా తాజాగా శాసనమండలి చైర్మన్‌లాంటి అత్యున్నత పదవి తొలిసారిగా జిల్లాకు దక్కింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన స్వామిగౌడ్ టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించారు. అప్పుడే కేసీఆర్ ఆయనను టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఉద్యోగ విరమణ అనంతరం టీఆర్ఎస్లో చేరిన ఆయనను కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీకి నిలిపారు. 2013 మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయన 2019 వరకు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇన్నాళ్లూ ఉమ్మడి రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా ఉన్న చక్రపాణి ఆంధ్రప్రదేశ్ మండలి చైర్మన్‌గా కొనసాగనున్నారు. తెలంగాణకు ప్రత్యేక మండలి ఏర్పాటు కాగా చైర్మన్ ఎన్నికను బుధవారం నిర్వహించారు. ఉద్యోగవర్గాలనుంచి ఎమ్మెల్సీగా గెలిచిన స్వామిగౌడ్‌కు మంత్రి పదవి ఇస్తామని కేసీఆర్ ఇంతకుముందే ప్రకటించగా... సామాజిక సమీకరణాల దృష్ట్యా పదవి దక్కలేదు. దీంతో మండలి చైర్మన్‌లాంటి ఉన్నత పదవిని స్వామిగౌడ్‌కు కట్టబెట్టేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. మండలిలో పూర్తిస్థాయి మెజారిటీ లేకున్నా కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్లో చేర్చుకోవడంతో పూర్తి పట్టు సాధించారు. ఈ క్రమంలోనే బుధవారం జరిగిన ఎన్నికల్లో స్వామిగౌడ్ మండలి చైర్మన్‌గా విజయం సాధించారు. భానుప్రసాద్ ఓటు స్వామిగౌడ్‌కే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న టి.భానుప్రసాద్‌రావు శాసనమండలి చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి స్వామిగౌడ్‌కు ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన భానుప్రసాద్‌రావు, కొద్ది రోజుల క్రితం గులాబీ గూటికి చేరారు. అయినప్పటికీ సాంకేతికంగా ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతున్నారు. మండలి చైర్మన్ ఎన్నికలను కాంగ్రెస్, టీడీపీలు బహిష్కరించగా, భానుప్రసాద్‌రావు ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలైన మొత్తం 21 ఓట్లు స్వామిగౌడ్‌కు పడడంతో, భానుప్రసాద్ కూడా స్వామిగౌడ్‌కు వేసినట్లు తేలిపోయింది. -
చప్రాసీ నుంచి మండలి చైర్మన్ దాకా..
ఇది గొప్ప ప్రజాస్వామ్యం: స్వామిగౌడ్ సాక్షి, హైదరాబాద్: చప్రాసీగా ఉన్న తనను పెద్దల సభకు చైర్మన్‌ను చేసిన ఘనత భారత ప్రజాస్వామ్యానిదేనని శాసనమండలి నూతన చైర్మన్ స్వామిగౌడ్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్యం మరెక్కడుందని వ్యాఖ్యానించారు. ఎక్కడో బీసీ కుటుంబంలో పుట్టి, అటెండర్‌గా ఉద్యోగం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనకు మండలి చైర్మన్‌గా అత్యున్నతమైన బాధ్యతను కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులకు, సహకరించిన సభ్యులకు తల వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. అంతకుముందు సభలో 21 మంది సభ్యులు నూతన చైర్మన్‌గా ఎన్నికైన స్వామిగౌడ్‌ను అభినందించడంతోపాటు ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం స్వామిగౌడ్ ప్రసంగిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రసంగం ఆయన మాటల్లోనే... * తట్టుకోలేని ఉద్వేగానికి గురవుతున్న సందర్భమిది. కన్నీళ్లు ఆగడం లేదు. తెలంగాణ సాయుధ, ఉద్యమ అమర వీరుల పోరాట ఫలితమే ఇది. నన్ను అక్కున చేర్చుకున్న నా ఊరుతోపాటు ఈ బాధ్యతను అప్పగించిన సభ్యులందరికీ తలవంచి నమస్కరిస్తున్నా. ఈ రోజు ఆచార్య జయశంకర్, అమర వీరుల ఆత్మలు పులకించినట్లే. * నేను పోరాటం మొదలుపెట్టాక ఏనాడూ మూడు గంటల సేపు మౌనంగా ఉన్న సందర్భం లేదు. ఈ రోజే తొలిసారిగా మీరంతా మాట్లాడుతుండగా మౌనంగా ఉన్నాను. చెప్పింది విని సలహాలు, సూచనలు తీసుకుని నిర్ణయం తీసుకోవడాన్ని నా బాధ్యతగా భావిస్తున్నా. * మీ అందరితో పోలిస్తే రాజకీయాల్లో నేను పసిబాలుడిని. మీ అందరి సహకారంతో తప్ప స్వతహాగా ముందుకు వెళ్లలేనివాడిని. ఇకపై నేను అధికార, ప్రతిపక్షానికి అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ రెండు పయ్యల(చక్రాల)ను పట్టాలపై సమంగా నడిపించేందుకు కృషి చేస్తా.