
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీపై కృషి చేస్తానని మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్ అధ్యక్షతన ‘ఈద్ మి లాప్’కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వామిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలని కోరారు. సకలజనుల సమ్మెలో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రతి ఉద్యోగి ఐదు చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం నేతలు పాల్గొన్నారు.
పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కమలాకర్‌రావు
సాక్షి, హైదరాబాద్: పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన బీరెల్లి కమలాకర్‌రావు ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.సరోత్తంరెడ్డి అధ్యక్షతన బుధవారం ఇక్కడ జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన్ను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం పలు అంశాలపై కార్యవర్గం తీర్మానాలు చేసింది. ఉపాధ్యాయ బదిలీల్లో నష్టపోయిన వారికి న్యాయం చేయటంతో పాటు ఖాళీగా ఉన్న జీహెచ్‌ఎం, ఎంఈవో పోస్టులను సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరుతూ తీర్మానించింది.
Comments
Please login to add a commentAdd a comment