prtu
-
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు కసరత్తు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు నోటిఫికేషన్ జారీకానున్న నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు, పార్టీలు అప్పుడే మద్దతు కూడగట్టే పనిలో పడ్డాయి. 2025 మార్చి 29తో వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పదవీకాలం ముగియనుంది. దీంతో ఆలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 30న ఓటరు నమోదుకు నోటిఫికేషన్ జారీచేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బలం పెంచుకునేందుకు.... రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఈసారి తమ సంఘం నుంచి అభ్యర్థులను గెలిపించుకునేందుకు పీఆర్టీయూ అప్పుడే కసరత్తు ప్రారంభించింది. పెద్దఎత్తున ఓటర్లను నమోదు చేయించేందుకు చర్యలు చేపట్టింది. యూటీఎఫ్ కూడా అదే పనిపై దృష్టి సారించింది. నెల రోజుల నుంచి సంఘ సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేస్తోంది. గతంలో పోగొట్టుకున్న స్థానాన్ని ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో పీఆర్టీయూ ఉంది. సంఘంలోని నాయకుల్లో ఉన్న అభిప్రాయభేదాలను పక్కన పెట్టి అంతా కలిసి పనిచేసేలా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో సంఘాన్ని వీడిన, సంఘం నుంచి సస్పెండ్ చేసిన నేతలను కూడా మళ్లీ చేర్చుకుంటోంది. ఇందులో భాగంగా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండలో పీఆర్టీయూ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారని సస్పెండ్ చేసిన సుంకరి బిక్షంగౌడ్‌తోపాటు మరికొంతమంది నాయకులను ఇటీవల మళ్లీ సంఘంలోకి చేర్చుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే వారిని తిరిగి చేర్చుకున్నారన్న చర్చ సాగుతోంది. ఇక యూటీఎఫ్, ఎస్టీయూ, టీపీటీఎఫ్ కూడా ఈనెలాఖరు వరకు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. త్వరలోనే పీఆర్టీయూ అభ్యర్థుల ఖరారు పీఆర్టీయూ ప్రస్తుతం జిల్లా కార్యవర్గాల సమావేశాలు నిర్వహిస్తోంది. వాటిని ఈనెలాఖరులోగా పూర్తి చేసి, రాష్ట్ర కార్యవర్గ సమావేశం వచ్చే నెల 7న నిర్వహించాలని నిర్ణయించింది. అందులో కొత్తగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకోనుంది. ఆ సమావేశంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ తరఫున పోటీలో ఉండే వారి పేర్లను ఖరారు చేసే అవకాశముంది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానం నుంచి గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పోటీచేయగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన పులి సరోత్తంరెడ్డి రెబెల్‌గా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం పీఆర్టీయూ నుంచి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఎమ్మెల్సీగా పోటీచేయాలని భావిస్తున్నట్టుగా సంఘంలో చర్చ సాగుతోంది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీఆర్టీయూ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెళ్లి కమలాకర్‌రావు పోటీ చేయాలని భావిస్తున్నారు. వారిలో ఎవరిని ఖరారు చేస్తారన్నది మొదటి వారంలోనే తేలనుంది. మరోవైపు టీపీటీఎఫ్, యూటీఎఫ్ కూడా అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉంది. ఈసారి పార్టీల నుంచి పోటీ.. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఈసారి కాంగ్రెస్, బీజేపీ తరఫున కూడా అభ్యర్థులను పోటీలో నిలుపుతారన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే బీజేపీ తరపున ఈసారి వరంగల్–ఖమ్మం– నల్లగొండ స్థానంలో పోటీచేయాలని పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తంరెడ్డి భావిస్తున్నారు. ఆయనతోపాటు టీపీయూఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సాయిరెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలిసింది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ –కరీంనగర్ స్థానంలో బీజేపీ నుంచి నరహరి లక్ష్మారెడ్డి, సుధాకర్‌రెడ్డి పోటీచేయాలని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ రెండు స్థానాల్లో ఎక్కడి నుంచి పార్టీ పోటీ చేయమని చెబితే అక్కడి నుంచి పోటీచేసేందుకు సిద్ధమని పేర్కొంటున్నారు. -
పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనార్దన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ టీచర్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డిని నిలబెడుతున్నట్టు పీఆర్టీయూ తెలంగాణ ప్రకటించింది. శుక్రవారం జరిగిన సంఘం సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎం.అంజిరెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. జనార్దన్‌రెడ్డి విజయం కోసం సంఘంలోని ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, 317 జీవో వల్ల ఏర్పడ్డ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు. సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షుడు పర్వత సత్యనారాయణ, సంఘం అధ్యక్షుడు చెన్నయ్య, ఆర్థిక కార్యదర్శి ఎన్. చంద్రశేఖర్ రావు, వ్యవస్థాపక అధ్యక్షుడు ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ నేతలు చెన్నయ్య, అంజిరెడ్డి తదితరులు శుక్రవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణను కలిశారు. ‘తొలిమెట్టు’కోసం నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీని రద్దు చేయాలని, ఎన్జీవోల భాగస్వామ్యం సరికాదని తెలిపారు. -
బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ త్వరలో పూర్తి
గజ్వేల్: ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారన్నారు. సీపీఎస్ రద్దు, జీపీఎఫ్ సత్వర చెల్లింపులు, హెల్త్ కార్డుల అంశంపై కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యాశాఖ ఖాళీల భర్తీపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ డీఈవో, డీఈవో పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. డబుల్ ఇంజిన్ సర్కారుగా చెప్పుకునే గుజరాత్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో ఉపాధ్యాయుల వేతనం చాలా ఎక్కువని గుర్తుచేశారు. మరోవైపు పక్క రాష్ట్రాల్లో ఉపాధ్యాయులు సమస్యలపై కొట్లాడితే నిర్బంధిస్తున్నారని, అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదని పేర్కొన్నారు. తమది ఉద్యోగ, ఉపాధ్యాయ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని పేర్కొన్నారు. పెరిగిన తలసరి ఆదాయం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల రాష్ట్రంలో తలసరి ఆదాయం భారీగా పెరిగిందని, 2014కు ముందు 1.24 లక్షలుగా ఉంటే ప్రస్తుతం అది 2.70 లక్షలకు చేరుకుందని మంత్రి హరీశ్ చెప్పారు. దేశ తలసరి ఆదాయం తెలంగాణ కంటే తక్కువగా 1.48 లక్షలు ఉందని తెలిపారు. తెలంగాణ ఎదుగుదలను కేంద్రం జీర్ణించుకోలేకపోతోందని ఆక్షేపించారు. ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వం సాచివేత ధోరణిని అవలంబిస్తోందని మండిపడ్డారు. ఈ ఏడాది బోరుబావులకు మీటర్లు పెట్టనందుకు రూ. 6 వేల కోట్లు, ఎఫ్ఆర్బీఎం కింద రావాల్సిన రూ. 15 వేల కోట్లు కలుపుకొని మొత్తంగా రూ. 21 వేల కోట్లను ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కేంద్రం తెలంగాణకు నిలిపేసిందని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో 800 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్య 2,950కి పెంచామన్నారు. వచ్చే ఏడాది మరో 9 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, సిద్దిపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శశిధరశర్మ, వెంకటరాజం, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఎల్ఆర్ఎస్.. గప్‌చుప్! చడీచప్పుడు లేకుండా వెంచర్ల క్రమబద్ధీకరణ -
Telangana: సీబీఎస్ఈ స్కూళ్లలో తెలుగు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి పదోతరగతి వరకు తెలుగు సబ్జెక్టు తప్పని సరిగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. తెలుగు సబ్జెక్టు బోధించని స్కూళ్లకు రూ.లక్ష వరకూ జరిమానా విధించే అవకాశముందని స్పష్టం చేసింది. ఈ నిబంధనను ప్రత్యేకించి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ తదితర బోర్డు పాఠశాలల్లో అమలు చేసేందుకు సంబంధించి రూపొందించడం గమనార్హం. కేజీబీవీ సమస్యలు పరిష్కరించాలి: పీఆర్టీయూ సాక్షి, హైదరాబాద్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో సమస్యలను పరిష్కరించాలని పీఆర్టీయూ టీఎస్.. విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. సంఘం నేతలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు బుధవారం ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డితో కలిసి మంత్రిని కలిశారు. కేజీబీవీల్లో కేర్టేకర్ల నియామకం, ఆర్థిక, ఆపరేషన్ల గైడ్‌లైన్స్ మార్పు, ఉద్యోగులకు హెల్త్ కార్డులు వంటి సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఎడ్‌సెట్–2022 గడువు 22 వరకు పొడిగింపు ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్): టీఎస్ ఎడ్‌సెట్–2022 గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు కన్వీనర్ రామకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15తో ఎడ్‌సెట్–2022 గడువు ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు వారం పాటు అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశమిచ్చారు. ఇప్పటివరకు ఎడ్‌సెట్‌కు 24 వేలమంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. (క్లిక్: నువ్వొస్తేనే నేనెళ్తా.. హామీ ఇచ్చేవరకు కదిలేదే లేదు!) -
ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల టౌన్: ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదని జడ్చర్ల ఎమ్మెల్యే డా.లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం జడ్చర్ల మండలం శంకరాయపల్లి సమీపంలో నిర్మించిన పీఆర్టీయూ సంఘ భవనాన్ని ఎమ్మెల్సీ కె.జనార్దన్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో లక్ష్మారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటే కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయని, ఏ పథకం పెడితే ఎన్ని ఓట్లు వస్తాయో అని ఆలోచించటం సరైంది కాదన్నారు. వెనుకబడిన దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచించి దళితబంధు ప్రవేశపెడితే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని పేర్కొన్నారు. -
టీఆర్ఎస్కు పూల రవీందర్ రాజీనామా
సాక్షి, యాదాద్రి: పీఆర్టీయూ సభ్యుల కోరిక మేరకు టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లేనని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ప్రకటించారు. పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ వద్ద చేపట్టిన మహాధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాన్నారు. ఈ సందర్భంగా కొందరు ఉపాధ్యాయులు అడ్డగించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, తాను వరంగల్, జనగామ ధర్నాల్లో పాల్గొని యాదాద్రి భువనగిరి ధర్నాకు హాజరయ్యానని రవీందర్ అన్నారు. రాష్ట్ర సాధన కోసం ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించకపోతే హైదరాబాద్‌లో జరిగే మహాధర్నారోజు పీఆర్టీయూ ఎమ్మెల్సీలతో రాజీనామా చేయిద్దామన్నారు. మనకు టీఆర్ఎస్పార్టీ ముఖ్యం కాదని, పీఆర్టీయూ ముఖ్యమన్నారు. పీఆర్టీయూ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాల సమస్యలు పరిష్కారానికి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రభుత్వం 45శాతం పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ విధానం పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్స్, బదిలీల షెడ్యూల్ ప్రకటించి, అన్ని పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలన్నారు. అంతకుముందు భువనగిరి పట్టణంలో ప్రధాన రహదారిలోఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టర్ అనితారామచంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మోటె సత్తయ్య, గౌరవ అధ్యక్షుడు జాలిగామరామ్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి ముత్యంరాములు, వివిధ మండలాల నుంచి జిల్లా అధ్యక్షులు, కార్యరద్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చదవండి: ‘సాగర్’ లో నేడు టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ -
పీఆర్టీయూ టీఎస్ అధ్యక్షుడిగా శ్రీపాల్‌రెడ్డి
విద్యారణ్యపురి: ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ టీఎస్) రాష్ట్ర అధ్యక్షుడిగా పింగళి శ్రీపాల్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హన్మకొండలో జరుగుతున్న పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల ముగింపు సందర్భంగా శనివారం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన శ్రీపాల్‌రెడ్డి హన్మకొండలో స్థిరపడ్డారు. ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిజామాబాద్‌కు చెందిన బీరెల్లి కమలాకర్‌రావు మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సముద్రాల రాంన ర్సింహాచార్యులు ప్రమాణస్వీకారం చేయించారు. ఎన్నికల పరిశీలకులుగా పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి వ్యవహరించారు. కాగా, పీఆర్టీయూ రాష్ట్ర నూతన కార్యవర్గంలో ప్రతీ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా 250 మంది, ఉపాధ్యక్షులుగా 250కి అవకాశం కల్పించారు. అలాగే 50 మంది మహిళా ప్రతినిధులను ఎంపిక చేశారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వరుస విజయాలతో దూసుకుపోతున్న అధికార టీఆర్ఎస్కు షాక్ తగిలింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ ఓటమిపాలైయ్యారు. యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు. మొత్తం 18885 ఓట్లు పోలవ్వగా నర్సిరెడ్డికి 8976 ఓట్లు రాగా.. పూల రవీందర్‌కు 6279 ఓట్ల వచ్చాయి. గెలుపునకు కావల్సింది 9014 కావడంతో 38 ఓట్ల దూరంలో నర్సిరెడ్డి నిలిచిపోయారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లలో నర్సిరెడ్డి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. పూల రవీందర్‌కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించగా, నర్సిరెడ్డికి కాంగ్రెస్, వామపక్షలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. నర్సిరెడ్డి గతంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. -
పీఆర్టీయూ అభ్యర్థులకు మద్దతు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పీఆర్టీయూ–టీఎస్ అభ్యర్థి కూర రఘోత్తంరెడ్డికి తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మునగాల మణిపాల్‌రెడ్డి, ఏరుకొండ నరసింహస్వామి ప్రకటన విడుదల చేశారు. ఆయన గెలుపు కోసం కృషి చేయాలని తమ సంఘం ఉపాధ్యాయులకు వారు పిలుపునిచ్చారు. అలాగే రఘోత్తంరెడ్డితోపాటు నల్లగొండ–ఖమ్మం–వరంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పీఆర్టీయూ–టీఎస్ అభ్యర్థి పూల రవీందర్‌కు ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ (యూటీఏ) మద్దతు ప్రకటించింది. వారి గెలుపు కోసం తమ సంఘం కృషి చేస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఖాజా కుతుబుద్దీన్, షకీల్ అహ్మద్ తెలిపారు. తమ సంఘం అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం పట్ల ఆయా సంఘాలకు పీఆర్టీయూ–టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్‌రెడ్డి, బీరెళ్లి కమలాకర్‌రావు ధన్యవాదాలు తెలిపారు. చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు.. కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్–మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గ్రూపు–1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు పీఆర్టీయూ–టీఎస్ మద్దతు ప్రకటించింది. ఆయన గెలుపు కోసం తాము కృషి చేస్తామని శ్రీపాల్‌రెడ్డి, బీరెళ్లి కమలాకర్‌రావు పేర్కొన్నారు. -
‘మండలి’ మెట్లెక్కేదెవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పోటీకి సై అంటే సై అంటూ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల నేతలు ముందుకు వస్తున్నారు. పీఆర్టీయూ సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్‌తోపాటు ఇదే యూనియన్‌లో పని చేసి బయటకు వచ్చిన నేతలూ పోటీకి సిద్ధమయ్యారు. ప్రధానంగా పీఆర్టీయూ వ్యవస్థాపకుల్లో ఒకరైన మాజీ ఎమ్మెల్సీ బి. మోహన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఇటీవల ఈ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పులి సరోత్తంరెడ్డి బరిలో ఉన్నారు. ఖమ్మంలో పీఆర్టీయూ సిట్టింగ్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఆ జిల్లా కమిటీ తీర్మానం చేసింది. అయితే సంఘం నేతల ఒత్తిడితో చివరకు వెనక్కి తగ్గినట్లు తెలిసింది. మరోవైపు నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు పోటీకి సిద్ధమై వెనక్కి తగ్గారు. ఇద్దరు సిట్టింగ్ అభ్యర్థులు తమ పార్టీ వారే అయినప్పటికీ టీఆర్ఎస్ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయకుండా ఈ ఎన్నికల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్య నేతల మధ్య పోటాపోటీ.. నల్లగొండ–ఖమ్మం–వరంగల్, కరీంనగర్–మెదక్–నిజమాబాద్–ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూలు కూడా వచ్చింది. ఆయా స్థానాల నుంచి పోటీ పడుతున్న ముఖ్య నేతలు 16 మంది వరకు ఉండగా, అందులో ప్రధాన పోటీ పీఆర్టీయూకు సంబంధించిన అభ్యర్థుల మధ్యే ఉండే అవకాశం ఉంది. నల్లగొండ–ఖమ్మం–వరంగల్ స్థానం నుంచి పోటీలో నిలిపేందుకు పూల రవీందర్‌కు పీఆర్టీయూ మద్దతు ప్రకటించగా, ఇక్కడి నుంచి సరోత్తంరెడ్డి కూడా పోటీకి సిద్ధమయ్యారు. అలాగే మరో ప్రధాన సంఘమైన యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేసిన ఎ.నర్సిరెడ్డి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) తరఫున పోటీలో ఉంటున్నారు. మరోవైపు ఇతర సంఘాల నుంచి కలుపుకొని మొత్తంగా 13 మంది పోటీలో ఉండేందుకు సిద్ధమయ్యారు. పీఆర్టీయూ నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నర్సింహారెడ్డి బరిలో ఉన్నారు. అయితే బుధవారం టీఆర్ఎస్ ముఖ్య నేతల చర్చల నేపథ్యంలో పూల రవీందర్‌కు మద్దతుగా నర్సింహారెడ్డి పోటీ చేయకుండా ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో ఈ స్థానంలో ప్రధాన పోటీ రవీందర్, సరోత్తంరెడ్డి, నర్సిరెడ్డి మధ్యే ఉండే అవకాశాలున్నాయి. వీరే కాకుండా టీటీఎఫ్, ఆటా అభ్యర్థిగా ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తాటికొండ వెంకటరాజయ్య, రిటైర్డ్ డీఈవో చంద్రమోహన్, కేయూ అసోసియేట్ ప్రొఫెసర్ సంగాని మల్లేశం, పారుపల్లి సురేషన్, కొత్తపల్లి గురుప్రసాద్‌రావు పోటీలో ఉన్నారు. ఇప్పు డు వారంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. పీఆర్టీయూ జీవం పోసిన ఆ ఇద్దరు.. పీఆర్టీయూ వ్యవస్థాపక నేతల్లో ముఖ్యులు బత్తాపురం మోహన్‌రెడ్డి, పాతూరి సుధాకర్‌రెడ్డి. ఇప్పుడు వారిద్దరు కరీంనగర్–మెదక్–నిజమాబాద్– ఆదిలాబాద్ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. పీఆర్టీయూను వీడి మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా, సుధాకర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. పీఆర్టీయూ తమ అభ్యర్థిగా ఆ సంఘం సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు కె.రఘోత్తంరెడ్డికి మద్దతు ప్రకటించగా ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. సుధాకర్‌రెడ్డికి మద్ద తివ్వాలని టీఆర్ఎస్ అడిగితే రఘోత్తంరెడ్డిని ఆపే అవకాశాలున్నాయి. ఈ స్థానం నుంచి యూఎస్పీసీ అభ్యర్థిగా కొండల్‌రెడ్డి, ఎస్టీయూ అభ్యర్థిగా సుధాకర్‌రెడ్డి, టీటీఎఫ్ అభ్యర్థిగా సీహెచ్ రాములు, టీపీటీయూ అభ్యర్థిగా వేణుగోపాలస్వామి పోటీలో ఉన్నారు. వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ ఈ రెండు స్థానాల్లోనూ సిట్టింగ్‌లు ఇద్దరూ టీఆర్ఎస్ పార్టీ వారే అయినా ఆ పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీ పేరుతో అభ్యర్థులను నిలబెట్టకూడదన్న నిర్ణయంతో టీఆర్ఎస్ ఉన్నట్లు తెలిసింది. అయితే అనధికారికంగా మాత్రం వారికి మద్దతును కూడగట్టే ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగానే నల్లగొండలో కె. నర్సింహారెడ్డి పోటీలో ఉండకుం డా చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఇక కరీంనగర్ స్థానం నుంచి కూడా ఒకరిద్దరిని పోటీ నుంచి తప్పుకునేలా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
పీఆర్సీ అమలుకు కృషి చేస్తా: స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీపై కృషి చేస్తానని మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్ అధ్యక్షతన ‘ఈద్ మి లాప్’కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వామిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలని కోరారు. సకలజనుల సమ్మెలో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రతి ఉద్యోగి ఐదు చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం నేతలు పాల్గొన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కమలాకర్‌రావు సాక్షి, హైదరాబాద్: పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన బీరెల్లి కమలాకర్‌రావు ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.సరోత్తంరెడ్డి అధ్యక్షతన బుధవారం ఇక్కడ జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన్ను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం పలు అంశాలపై కార్యవర్గం తీర్మానాలు చేసింది. ఉపాధ్యాయ బదిలీల్లో నష్టపోయిన వారికి న్యాయం చేయటంతో పాటు ఖాళీగా ఉన్న జీహెచ్ఎం, ఎంఈవో పోస్టులను సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరుతూ తీర్మానించింది. -
కేసీఆర్ పాలనలో విద్యారంగం నిర్వీర్యం
కామారెడ్డి అర్బన్ : కేసీఆర్ గందరగోళ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని, విద్యారంగం దేశంలో 26వ స్థానానికి దిగజారిందని, అంతర్ జిల్లాల బదీలీలు, ప్రమోషన్లు లేకుండా వెబ్ కౌన్సిలింగ్ సాధారణ బదిలీలు చేపట్టడంతో ఉద్యోగుల్లో అయోమాయం నెలకొందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తమరెడ్డి అన్నారు. కామారెడ్డి పీఆర్టీయూ భవన్లో మంగళవారం మధ్యా హ్నం మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పర్యవేక్షణకు క్షేత్రస్థాయిలో రెగ్యులర్ అధికారులు లేక ఇబ్బందులు వస్తున్నాయన్నారు. జిల్లా విద్యాశాఖాధికారులతో పాటు డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు లేక ఇన్చార్జిలతో అస్తవ్యస్తంగా ఉందన్నారు. ప్రమోషన్లు చేపట్టిన తర్వాతనే ఈనెల 30 వరకు బదిలీల ప్రక్రియ చేయాలన్నారు. ప్రభుత్వం వీలైనంత తొందరగా సీపీఎస్‌పై నిర్ణయం తీసుకొకుంటే మళ్లీ ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఏకీకృత రూల్స్ సాంకేతిక సమస్యలతో నిలిచిపోందని అతి తొందరలోనే సాధిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు పి.దామోదర్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జె.మధుసూధన్‌రెడ్డి, పురుషోత్తం శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, నర్సింగరావు, సెట్యా, రాష్ట్ర కార్యదర్శులు సంతోష్‌కుమార్, రమేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు జి.గోవర్థన్, కార్యదర్శి శ్రీకాంత్, కామారెడ్డి, మాచారెడ్డి, రాజంపేట మండలాల అధ్యక్షులు సురేష్,హన్మాండ్లు, నర్సారెడ్డి, మనోహర్, భూమయ్యలు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
కర్నూలు(గాయత్రీ ఎస్టేట్):ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు బీవై రామయ్య పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకృష్ణదేవరాయ కూడలిలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. సుమారు 80 మంది ఉపాధ్యాయులు దీక్షలో కూర్చున్నారు. ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డితో కలిసి బీవై రామయ్య వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ మొదటి నుంచి ప్రత్యేక హోదాకే కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం అనేక పోరాటాలు చేస్తుంటే సీఎం చంద్రబాబు ఉద్యమకారులపై కేసులు పెట్టి జైళ్లకు పంపారని గుర్తుచేశారు. జగన్ పోరాటలకు సీఎం మైండ్ బ్లాక్ అయిందని, ఆలోచనా శక్తి సన్నగిల్లి ఏమి మాట్లాడుతున్నారో తెలియని స్థితికి వచ్చారన్నారు. రూ.3.50 లక్షల కోట్ల అవినీతి పాల్పడినట్లు లెక్కలు ఉన్నాయని, ఇవి కేంద్రం దగ్గర కూడా ఉన్నాయన్నారు. సీఎం జైలుకు వెళితే బయటికి వచ్చేపరిస్థి«తి ఉండదన్నారు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ సైతం పేర్కొన్నారన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై జగన్‌తో చర్చిస్తామన్నారు. ఎమ్మెల్యే గౌరుచరిత మాట్లాడుతూ ప్రత్యేక హోదానే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రత్యేక హోదాను సాధించుకోలే పోతున్నామన్నామని విమర్శించారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీనే ముద్దుంటూ కబుర్లు చెప్పిన సీఎం ఇప్పుడు మాటమార్చడం ఎంత వరకు సమంజసమో ఆలోచించుకోవాలన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 6న వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామ చేస్తారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వారంలోపు సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని జగన్ ఇదివరకే ప్రకటించారని.. దాన్ని కచ్చితంగా అమలు చేస్తామన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు వైష్ణవ కరుణానిధిమూర్తి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక్క రోజు నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. అంతకు ముందు పీఆర్టీయూ నాయకులు జెడ్పీ నుంచి శ్రీకృష్ణదేవరాయ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. దీక్షలను ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి ఓంకార్‌యాదవ్, కోశాధికారి నారాయణనాయక్‌లు దీక్షలకు మద్దతు ప్రకటించారు. పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి, రామకృష్ణ, గోపాల్, ఫయాజ్, బుగ్గన్న, జిల్లా నాయకులు నాగభూషణ్‌గౌడ్, లక్ష్మినారాయణ, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. -
సార్లే.. సారథులు..
సుజాతనగర్ : సమాజంలో తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం గురువులది.. విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేసేది వారి భాషణాలే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులు సర్కార్ బడుల పరిరక్షణలోనూ మేము సైతం అంటున్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిర్వహించే ఉద్యమాల్లో పాల్గొంటూ.. ఉపాధ్యాయ సంఘాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఆయా సంఘాల్లో రాష్ట్రస్థాయిలో కీలక పదవుల్లో ఉంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకత్వ పటిమను నలుదిశలా చాటిచెబుతున్నారు. రాందాస్, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఇల్లెందు మండలం చెన్నంగులగడ్డ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బానోత్ రాందాస్ టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో రాందాస్ వీఆర్‌పురం, బయ్యారం, సింగరేణి, మండలాల్లో పనిచేశారు. 2016లో మహబూబ్‌నగర్‌లో జరిగిన టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. ‘‘ఇదివరకు ఉన్న అప్రెంటిస్ వ్యవస్థ రద్దు కోసం సుమారు 16 సంవత్సరాల పాటు మా సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేశాం. ఆ వ్యవస్థను రద్దు చేయించగలిగాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అట్టడుగు అన్ట్రెయిన్డ్ ఉపాధ్యాయుల రెగ్యులర్ కోసం పోరాడి సాధించాం. సీపీఎస్ రద్దు కోసం గత ఏడాది ఢిల్లీలోని పార్లమెంట్ ముందు 15 వేల మంది ఉపాధ్యాయులతో ధర్నా నిర్వహించాం. విజయం సాధించే వరకూ పోరాడుతూనే ఉంటాం.’’ అని రాందాస్ అన్నారు. లక్ష్మణ్‌నాయక్, టీఎస్‌టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు టేకులపల్లి మండలానికి చెందిన ఇస్లావత్ లక్ష్మణ్‌నాయక్ తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్(గతంలో ఈ యూనియన్ టీటీటీఎఫ్గా ఉండేది) రాష్ట్ర అధ్యక్షుడిగా 2013 నుంచి కొనసాగుతున్నారు. ‘‘ఏజెన్సీ పాఠశాలల్లో జీఓ నెం 3 ప్రకారం నూరు శాతం ఉద్యోగాలు గిరిజన ఉపాధ్యాయులతోనే భర్తీ చేయాలని పోరాడాం. సాధించాం. పీఆర్సీలో రావాల్సిన ఏహెచ్‌ఆర్‌ఏ అలవెన్సులు వచ్చేలా ఉద్యమించాం. ఏజెన్సీలో పనిచేస్తున్న గిరిజనేతర ఉపాధ్యాయులను మైదాన ప్రాంతాలలోకి వెళ్లడానికి సహకరించాం. ముంపు ఉపాధ్యాయులను మన జిల్లాకు వచ్చేందుకు పోరాటం చేశాం. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు 342జీఓ ద్వారా ఉన్నత విద్య(ఎంఈడీ లేదా పీజీ) అవకాశం కల్పించాలని పోరాటాలు చేస్తున్నాం. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ (ఓపీఎస్) స్కీంనే కొనసాగించాలని కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నాం.’’ అని లక్ష్మణ్ నాయక్ అన్నారు. సీహెచ్ రవి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్వంచకు చెందిన చావా రవి ఖమ్మంలోని నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం 2014 జూన్ 2 నుంచి టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్టంలో 2006 నుంచి ‘ఐక్య ఉపాధ్యాయ’అనే మాస పత్రికకు ప్రధాన సంపాదకుడిగా పనిచేశారు. 1997 నుంచి 2006 ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ అన్ట్రెయిన్డ్ ఉపాధ్యాయులను స్పెషల్ విద్యావలంటీర్లుగా గుర్తించి వారికి అన్ని వసతులు కల్పించడానికి పోరాటం చేసి విజయం సాధించాం. సీపీఎస్ వ్యతిరేక ఉద్యమంలో మా సంఘం కీలక భూమిక పోషిస్తోంది. నాణ్యమైన విద్యాభోదన అందాలంటే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.’’ అని రవి పేర్కొన్నారు. కేఎస్సీ చౌదరి, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కొత్తగూడేనికి చెందిన కె.సురేష్ చంద్ర చౌదరి పాత కొత్తగూడెంలోని తెలంగాణ ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ‘‘గిరిజన ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్ల విషయంలో పోరాటం చేసి సాధించాం. గతంలో ఉన్న హెచ్ఆర్ఏను 14.5 శాతానికి పెంచడానికి సుదీర్ఘంగా ఉద్యమించాం. మహిళా ఉపాధ్యాయులకు 5 అదనపు క్యాజువల్ లీవులకోసం పోరాడి సాధించుకున్నాం’’ అని చౌదరి అన్నారు. జయబాబు, ఏటీఏ రాష్ట్ర అధ్యక్షుడు భద్రాచలం పట్టణానికి చెందిన కల్లూరి జయబాబు చర్ల మండలంలోని లెనిన్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్(ఏటీఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ సంఘానికి ఆయన 2012 నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ‘‘ఏజెన్సీలో ఏరియాలో నూరు శాతం ఉద్యోగాలు, పదోన్నతులు జీఓ నెం 03 ప్రకారం భర్తీ చేయాలని నిర్విరామంగా పోరాటాలు చేస్తున్నాం. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న గిరిజనేతర ఉపాధ్యాయులను మైదాన ప్రాంతానికి పంపడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాం. 2015 పీఆర్సీలో ఏజెన్సీ ప్రాంతంలో ఏహెచ్‌ఆర్‌ఏ జీఓ అమలు కోసం ఉద్యమించి విజయం సాధించాం.’’ అని జయబాబు వివరించారు. పూర్ణచందర్రావు, టీపీటీఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇల్లెందు మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన సాధినేని పూర్ణచందర్రావు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 1983 నుంచి పూర్ణచందర్రావు టీపీటీఎఫ్లో కొనసాగుతున్నారు. గతంలో ఏపీటీఫ్గా ఉన్నప్పుడు 1983 నుంచి 2007 దాకా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ‘‘ఐటీడీఏలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 1974 నుంచి 1986 దాకా స ర్వీస్ రెగ్యులైజేషన్ లేదు. ఆ సమస్యను ఐటీడీఏ పీఓ దృష్టి్టకి తీసుకెళ్లి రెగ్యులైజేషన్ సాధించాం.’’ అని పూర్ణచందర్రావు చెప్పారు. -
సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: 1.2 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్ భరోసాను దెబ్బతీస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాల్సిందేనని పీఆర్టీయూ–తెలంగాణ డిమాండ్ చేసింది. పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించి ఉద్యోగులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆదివారం హైదరాబాద్‌లో యూనియన్ అధ్యక్షుడు ఎం.అంజిరెడ్డి ఆధ్వర్యంలో పీఆర్టీయూ–తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు. పండితుల అప్‌గ్రెడేషన్ వెంటనే చేపట్టాలని, 2016 వేసవిలో మధ్యాహ్న భోజనం అందించేందుకు పని చేసిన టీచర్లకు ఆర్జిత సెలవులు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న డిప్యూటీ ఈవో, ఎంఈవో, గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయాలని, మెడికల్ రీయింబర్స్మెంట్ సదుపాయం పొడిగించాలని, పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. -
పీఆర్టీయూ నూతన కార్యవర్గం ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: పీఆర్టీయూ నూతన కార్యవర్గం సోమ వారం ప్రమాణ స్వీ కారం చేసింది. ఆది, సోమవారాల్లో జరిగిన యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో వచ్చే రెండేళ్లకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. పీఆర్టీయూ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సరోత్తంరెడ్డి, చెన్నకేశవరెడ్డిలు ఎన్నికైన విషయం తెలిసిందే. సోమవారం వారితో పాటు 31 జిల్లాల నుంచి 149 రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నామినేట్ చేశారు. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. -
24, 25 తేదీల్లో పీఆర్టీయూ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ–టీఎస్) 32వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సరోత్తంరెడ్డి, జి.చెన్నకేశవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లెలగూడలోని సామా యాదిరెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించే ఈ సమావేశాల్లో విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించి తీర్మానం చేస్తామని స్పష్టంచేశారు. వచ్చే రెండేళ్ల కాలానికి నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశాల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. -
ఉత్కంఠ భరితంగా...
♦ పీఆర్టీయూ జిల్లా ఎన్నికలు ♦ జిల్లా అధ్యక్షుడిగా బి.వి.రమణారావు, ♦ ప్రధాన కార్యదర్శిగా నరేంద్రబాబు ఎన్నిక నిర్మల్‌రూరల్: పీఆర్టీయూ జిల్లా ఎన్నికలు ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. నిర్మల్‌లోని దివ్య గార్డెన్స్‌లో జిల్లా కార్యవర్గ ఎన్నికలను ఓటింగ్ పద్ధతిన నిర్వహించారు. ఇందులో రెండు ప్యానెళ్లు పోటీ పడ్డాయి. బి.వి.రమణారావు వర్గం ఒక ప్యానెల్‌గా బరిలో దిగగా సుదర్శన్ మరో ప్యానెల్‌గా బరిలో దిగారు. 100 మంది సభ్యులు తమ ఓటింగ్‌ను వినియోగించుకున్నారు. రమణారావు ప్యానెల్ నుంచి రమణారావు మాత్రమే గెలుపొందగా సుదర్శన్ ప్యానెల్ నుంచి సుదర్శన్ తప్ప మిగితా పోటీ చేసిన అభ్యర్థులందరూ గెలుపొందారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలను నిర్వహించారు. ఇరు ప్యానెళ్ల మధ్య పోటాపోటీ నెలకొంది. రెండు ఓట్ల తేడాతో జిల్లా అధ్యక్షుడిగా రమణారావు రెండు ఓట్ల తేడాతో జిల్లా అధ్యక్షుడిగా బి.వి.రమణరావు గెలుపొందారు. రమణారావుకు 51 ఓట్లు రాగా ప్రత్యర్థి అయిన సుదర్శన్‌కు 49 ఓట్లు లభించాయి. దీంతో ఎన్నికల పరిశీలకులు రమణారావు గెలుపొందినట్లు ప్రకటించారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా నరేంద్రబాబు ఎన్నికయ్యారు. ఇతనికి 61 ఓట్లు రాగా ప్రత్యర్థి గొజ్జ జనార్దన్‌కు 31 ఓట్లు వచ్చాయి. దీంతో 30 ఓట్ల తేడాతో నరేంద్రబాబు విజయం సాధించారు. కార్యవర్గం అసోసియేట్ అధ్యక్షులుగా టి.రమేశ్, ఎ.ప్రభాకర్, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా సుహాసిని, ఉపాధ్యక్షులుగా అశోక్‌రెడ్డి, జి.ఎల్.వి.ప్రసాద్, మల్కాగౌడ్, కె.లక్ష్మణ్, మునీందర్‌రాజు, ఉపాధ్యక్షులుగా సీహెచ్.వందన, కార్యదర్శులుగా జమీల్ అహ్మద్, టి.నర్సిములు, లక్ష్మీరాజ్యం, జగదీశ్వర్, సాయినాథ్, మహిళా కార్యదర్శిగా అపర్ణ విజయం సాధించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్ని కైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారావు, నరేంద్రబాబు పేర్కొన్నా రు. తమ సంఘ పటిష్టత కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. తమ గెలు పునకు కృషి చేసిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి, పత్రిక ప్రధాన సంపాదకులు పర్వతి సత్యనారాయణ, జీవన్, ఎన్నికల పరిశీలకులు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కమలాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి మోహన్ పాల్గొన్నారు. -
గురుకులాలుగా ప్రభుత్వ పాఠశాలలు!
ఓకే అంటే సీఎం దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి సిద్దిపేట అర్బన్: ప్రభుత్వ పాఠశాలలను గురుకులాలుగా మార్చే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి అన్నారు. సిద్దిపేటలో గురువారం పీఆర్టీయూ ఆధ్వర్యంలో జనార్దన్‌రెడ్డిని సన్మానించారు.‘విద్యారంగంలో నూతన పోకడలు–ప్రభుత్వ పాఠశాలల మనుగడ’ అంశంపై జరిగిన రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో ఆయన మాట్లా డారు. ‘‘ సమస్యల పరిష్కారం విషయం నాకు వదిలేయండి.. గురుకుల ఉపా ధ్యాయుల్లాగా పనిచేసేందుకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వ పాఠశాలలను గురుకు లాలుగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. తన విజయంలో హరీశ్‌రావు పాత్ర ఎనలేనిదన్నారు. ఉపాధ్యాయుడిని స్టాఫ్‌రూంలోనే ఉంచి ‘నింపు..పంపు’ విధానాన్ని కొనసాగిస్తున్నారని, దీన్ని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తామని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఉద్యోగ విరమణ పరిమితిని 60 సంవత్సరాలకు పెంచాలని, సీపీఎ ఎస్‌ను రద్దు చేయాలనే తీర్మానాలను ఈ సదస్సు ఆమోదించింది. ఈ కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు సరోత్తంరెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, కొత్త నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఏకీకృత’ రూల్స్‌పై చర్యలు తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకు చర్యలు తీసుకోవాలని పీఆర్టీయూ నేతలు కేంద్ర హోం శాఖను కోరారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణు గోపాలచారి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి గురువారం హోం శాఖ కార్యదర్శి దిలీప్ కుమార్‌ను ఢిల్లీలో కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. పంచాయతీరాజ్ టీచర్ పోస్టులను లోకల్ క్యాడర్‌గా గుర్తిస్తూ రాష్ట్రపతి ఆమో దానికి ఉత్తర్వులు పంపాలని కోరారు. సర్వీస్ రూల్స్ ప్రతిపాదనలు పరిశీల నలో ఉన్నాయని, కేంద్ర హోం మంత్రి ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రపతికి పంపుతామని దిలీప్ కుమార్ హామీనిచ్చినట్లు సంఘం నేతలు తెలిపారు. -
చిరకాల సమస్యల్ని పరిష్కరించాలి
పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా కాకినాడ సిటీ : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా బుధవారం నిరసన తెలిపిన ఉపాధ్యాయులు డిమాండ్లపై కలెక్టరేట్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులకు రక్షణలేని సీపీఎస్‌ను తక్షణం రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పది నెలల పీఆర్సీ బకాయిలు నగదుగా చెల్లించాలని, పీఆర్సీ సిఫార్సులన్నింటినీ యథాతథంగా అమలు చేయాలని, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు లోకల్ కేడర్‌ను నిర్ణయించి చర్యలు తీసుకోవాలని, గిరిజన, మున్సిపల్, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో భాగస్వామ్యం కల్పించాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 2015 పీఆర్సీ వేతన స్కేల్ వర్తింప చేయాలని, అంతర్గత మూల్యాంకనంలో మార్పులు చేయాలని, జేఏసీ, జాక్టోతో, కుదుర్చుకున్న ఒప్పందాలపై ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఎన్‌వీవీ సత్యనారాయణ, సీహెచ్ ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని నిరసించారు. ప్రధానంగా నూతన పెన్షన్ విధానం పట్ల లక్షలాది ఉపాధ్యాయులు, ఉద్యోగుల్లో అభద్రత నెలకొందన్నారు. టీవీవీఎస్ తిలక్‌బాబు, నీలం వెంకటేశ్వరరావు, వి.భూపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
అయ్యవార్ల ఆగ్రహం
– డిమాండ్ల సాధనకు కలెక్టరేట్ ఎదుట ధర్నా – ఆందోళన ఉధతం చేస్తామని పీఆర్టీయూ హెచ్చరిక అనంతపురం అర్బన్ : తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందన కోసం చాలా కాలంగా వేచి చూసినవారు ఆఖరి అస్త్రంగా ఆందోళన బాట పట్టారు. ఉపాధ్యాయ సంఘమైన పీఆర్టీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధతరూపం దాల్చుతుందని పీఆర్టీయూ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామకష్ణారెడ్డి, శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రక్షణ లేని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను తక్షణం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు లోకల్ క్యాడర్‌ను నిర్ణయిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కషి చేయాలన్నారు. సర్వీసు రూల్స్ సాధనలో టీడబ్ల్యూ, మునిసిపల్, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో భాగస్వామ్యం కల్పించాలన్నారు. డీఎస్సీ–2008కి ఎంపికై హామీపత్రాల ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు డీఎస్సీ–2012 వారికన్నా తక్కువ వేతనం వస్తోందని, వీరికి వేతన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీకి సంబంధించి పది నెలల బకాయిలు నగదుగా చెల్లించాలన్నారు. పీఆర్, మునిసిపల్, గురుకుల, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు అర్థ జీతపు సెలవు నగదుగా మార్చుకునే ఉత్తర్వులను పీఆర్సీ–2015 సిఫారసులకు అనుగుణంగా ఇవ్వాలని, పెన్షన్ నిర్ణయించడంలో వెయిటేజీని ఎనిమిది ఏళ్లుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. జడ్పీపీఎఫ్ని జీపీఎఫ్‌గా మార్చాలని, మోడల్ పాఠశాలల ఉపాధ్యాయులకు పీఆర్సీ–2015 వేతన స్కేళ్లను వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. సర్వీస్ రూల్స్ రూపొందించాలని, స్పెషల్ టీచర్లు రూ.398 వేతనంపై పనిచేసిన కాలానికి నోషనల్ ఇంక్రిమెంంట్లు ఇవ్వాలని, 1990 – 1995 మధ్య కాలంలో నియమితులైన స్పెషల్ టీచర్లకు ఏఏఎస్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎల్వీ కేశవనాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, కార్యదర్శి ఈశ్వరరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులు సి.రామకష్ణారెడ్డి, కేశవరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఫణిరాజ్శర్మ, వి.శివశంకర్‌రెడ్డి, నాయకులు పుల్లారెడ్డి, రవీంద్ర, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. -
మూకుమ్మడిగా పీఆర్టీయూలో చేరిక
రామాయంపేట (నిజాంపేట): తెలంగాణ పీఆర్టీయూ మండల ప్రతినిధులు మూకుమ్మడిగా పీఆర్టీయులో చేరారు. ఈమేరకు సంఘం ప్రతినిధులు సోమవారంరాత్రి నిజాంపేటలో జరిగిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి సమక్ష్యంలో పీఆర్టీయులో చేరామని సంఘం మండల ప్రతినిధి గోపాల్‌రెడ్డి తెలిపారు. ఊపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయు నిరంతరంగా పోరాటం చేస్తుందని, ఈసంఘంతోనే తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఉద్దేశంతోనే సంఘంలో చేరినట్లు గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం గోపాల్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో పీఆర్టీయూ మండలశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రమోద్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆశయ్య, జిల్లా కౌన్సిలర్లు యాదవరెడ్డి, పి.శ్రీనివాస్, నర్సాగౌడ్, మున్వర్‌బేగ్, సురేశ్, రాజు పాల్గొన్నారు. మండల పీఆర్టీయూ కార్యవర్గం.. నిజాంపేట మండల పీఆర్టీయూ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండలశాఖ అధ్యక్షుడిగా గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జనార్దన్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా భానుప్రకాశ్, మండల ఉపాధ్యక్షుడిగా సునీల్, మహిళా ఉపాధ్యక్షురాలిగా రేఖను ఎన్నుకున్నారు. అలాగే కార్యదర్శులుగా వేణుగోపాల్, వెంకటేశ్, మౌనిక, ఉమారాణి, స్వప్న, స్వరూప, జిల్లా కౌన్సిలర్లుగా జాన్‌కుమార్, రమేశ్‌రెడ్డి, కిషన్, మహిపాల్‌రెడ్డిని ఎన్నుకున్నారు. -
26న కలెక్టరేట్ల ఎదుట పీఆర్టీయూ ధర్నా
తణుకుః పీఆర్టీయూ తలపెట్టిన నాలుగు అంచెల ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 26న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి పువ్వుల ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. రక్షణ లేని నూతన పెన్షన్ విధానం సీపీఎస్‌ను తక్షణమే నిలిపివేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలన్నారు. 2014 జూన్ 1 నుంచి 2015 మార్చి 31 వరకు చెల్లించాల్సిన పది నెలల పీఆర్సీ బకాయిలు నగదుగా చెల్లించాలన్నారు. ఎయిడెడ్, మునిసిపల్, గురుకులాల టీచర్ల సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఈ విధానంలో ఇబ్బందులను తెలుసుకోవడానికి ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం తక్షణం సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఉపాధ్యాయుల సమస్యలపై పోరుబాట
మచిలీపట్నం : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ మచిలీపట్నం నుంచి ఉద్యమాన్ని ప్రారంభించిందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం పీఆర్టీయు నాయకులు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మంత్రి కొల్లు రవీంద్రను కలుసుకుని వినతిపత్రం అందజేశారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 26న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద పీఆర్టీయూ నాయకులు ధర్నా నిర్వహించనున్నట్లు మత్తి కమలాకరరావు వెల్లడించారు. నవంబరు 18న విజయవాడలో మహాధర్నా చేస్తామన్నారు. సీపీఎస్ రద్దు, కామన్ సర్వీస్ రూల్స్ తదితర అంశాలపై ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నా చేయనున్నట్లు చెప్పారు. వినతిపత్రం అందజేసిన వారిలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరాజు, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శులు జీఎస్ పెరుమాళ్లు, కార్యదర్శి అప్పినేడి వెంకట రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి నెల్లికుదురు : సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తంరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాత పింఛన్ విధానంపై అసెంబ్లీ తీర్మానం చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి సర్వీస్‌రూల్స్ వర్తింప చేసేలా కృషి చేస్తామని, సీఆర్పీల సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడుతామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు స్వీకరించిన గుగులోతు రాము, పి.కల్పన, కర్ణాకర్, లింగమూర్తిని సన్మానించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల నుంచి పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డితో పాటు సొంటిరెడ్డి యుగేందర్, పెరుమాండ్ల యుగేందర్, బీరవెల్లి నర్సింహరెడ్డి, కూరపాటి వెంకటేశ్వర్లు, సూరిబాబు, మాసిరెడ్డి రమేష్‌రెడ్డి, డాక్టర్ టి.శ్రీనివాస్, ఖలీద్ మహమూద్, ఎండి.యాసీన్ పాల్గొన్నారు. -
పీఆర్టీయూ బలోపేతానికి కృషిచేయాలి
విద్యారణ్యపురి : ఉపాధ్యాయులు వృత్తి ధర్మా న్ని సక్రమంగా నిర్వర్తిస్తూ పీఆర్టీయూ బలోపేతానికి కృషిచేయాలని వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ కోరారు. ఆదివారం హన్మకొండలోని రెడ్డి మ్యారేజ్హాల్లో నిర్వహించిన ప్రోగ్రెసీవ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ) తృతీయ జిల్లా స్థాయి కార్యనిర్వాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉపాధ్యాయుల్లో అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. సమగ్రంగా చర్చించిన తర్వాత పీఆర్టీయూ నుంచి తమ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజిస్తుండగా ఏ జిల్లా ఉపాధ్యాయులను అదే జిల్లాలో కొనసాగిస్తారని పేర్కొన్నారు. ఒకవేళ తమ సొంతజిల్లాలో వద్దనుకుంటే ఇతర జిల్లాలో పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో ఉపాధ్యాయులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. అలాగే ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులు కొందరు తెలంగాణలో, తెలంగాణకు చెందిన కొందరు ఆంధ్రా లో పనిచేస్తున్నారని, ఇక్కడి వారిని అక్కడికి, అక్కడి వారిని ఇక్కడి పంపాలనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాలని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద త్వరలో జరిగే ధర్నాకు సీపీఎస్ వర్తించే ఉపాధ్యాయులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లాల పునర్విభజనతో ఏర్ప డే కొత్త జిల్లాల్లో పీఆర్టీయూలో బాగా పనిచేసిన వారికి పదవులు లభిస్తాయని తెలిపారు. ఆలిండియా టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐటీవో) చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఏకీకృత సర్వీస్ రూల్స్ త్వరలో రాబోతున్నాయని, ఆ దిశగా కృషి జరుగుతోందన్నారు. పండిట్స్ పీఈటీల అప్‌గ్రేడేషన్ కోసం కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. 398 ఉపాధ్యాయులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు సాధించి తీరుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి ప్రారంభించినప్పుడే బలోపేతమవుతాయని తెలిపారు. పీఆర్టీ యూ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తమరెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దుకోసం నవంబర్‌లో ఢిల్లీలో జరిగే ధర్నాను విజయవం తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ తిరునగరి శ్రీనివాస్, పీఆర్టీయూ జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ చీకటి సమ్మయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సంక్రా బద్రినారాయణ, బాధ్యులు కృష్ణారెడ్డి, యాకూబ్‌రెడ్డి, సూరిబాబు, మురళీధర్‌స్వామి, రామయ్య, జి ల్లాలోని అన్ని మండలాల పీఆర్టీయూ బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నా రు. కాగా జిల్లా జనరల్ సెక్రటరీ కార్యదర్శి నివేదికపై పలు మండలాల బాధ్యులు చర్చించారు. మాలకొండారెడ్డి చేరిక తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు దేవిరెడ్డి మాలకొండారెడ్డి ఆదివారం పీఆర్టీయూ టీఎస్‌లో చేరారు. హన్మకొండ రెడ్డి ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ టీఎస్) జిల్లా స్థాయి సమావేశంలో ఆయనకు ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తమరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి సభ్యత్వ రశీదును అందజేశారు. ఈసందర్భంగా మాలకొండారెడ్డి మాట్లాడుతూ తాను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష పదవికి ఇటీవలే రాజీనామా చేసినట్లు తెలిపారు. కాగా తెలంగాణ స్టేట్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్‌టీఎఫ్) జిల్లా అధ్యక్షుడు భాను ప్రసాద్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాసస్వామి కూడా చేరగా పీఆర్టీయూ సభ్యత్వాలు అందజేశారు. -
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
కరీంనగర్‌ఎడ్యుకేషన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్‌కు పీఆర్టీయూ తెలంగాణ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చోల్లేటి శ్రీనివాస్, పాతూరి రాజిరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 1, 2014 నుంచి సీపీఎస్ పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిన సందర్భంగా బ్లాక్‌డేగా పాటిస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గోనే శ్రీనివాస్, కార్యదర్శిసత్యనారాయణ పాల్గొన్నారు. సీపీఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు ఆధ్వర్యంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
సీపీఎస్ ఉద్యోగులకు పీఆర్టీయూ మద్దతు
మిర్యాలగూడ : సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనలకు పీఆర్టీయే పక్షాన మద్దతు తెలియజేస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానికంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించే ధర్నాకు మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పల్రెడ్డి ఉపేందర్‌రెడ్డి, మాలోతు బాలాజీనాయక్, పి, యాదగిరిరెడ్డి, మామిళ్ల శ్రీనివాస్‌రెడ్డి, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులకు 20శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : రాష్ట్రంలో ఏర్పడనున్న కొత్త జిల్లాల్లో పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులకు 20శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీని కలిసి వినతిపత్రం అందించారు. జెడ్పీ జీపీఎఫ్‌ను రద్దు చేసి జిల్లాల ప్రక్రియ కంటే ముందుగానే ఏజీ జీపీఎఫ్ ఖాతాలను కేటాయించి వాటిలో జెడ్పీ జీపీఎఫ్ డబ్బులు జమ అయ్యేట్లు చూడాలని పేర్కొన్నారు. జిల్లాల విభజన కంటే ముందే ఉపాధ్యాయుల పెండింగ్ రీయింబర్స్మెంట్ చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
పెన్‌పహాడ్ : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు పీఆర్టీయూ టీఎస్ ఎల్లప్పుడు కృషి చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సుంకరి భిక్షంగౌడ్, కార్యదర్శి కోమటిరెడ్డి నర్సింహారెడ్డిలు అన్నారు. శనివారం మండల కేంద్రంతో పాటు అన్ని పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనాజిపురం ఆదర్శ పాఠశాలలోని ఉపాధ్యాయులు సంఘంలో చేరారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంతో పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా వలంటీర్లను నియమించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జీపీఎఫ్ ఏరియల్స్ డిసెంబర్ లోపు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు తంగెళ్ల జితేందర్‌రెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోదేశి దయాకర్, అల్లాడి సత్యనారాయణగౌడ్, రాష్ట్ర నాయకులు చవగాని వెంకయ్యగౌడ్, మేకల రాజశేఖర్, జిల్లా నాయకులు మామిడి వెంకటయ్య, సంధ్యాల వినోద్, జి. ప్రవీన్, నల్లా శ్రీనివాస్, అనంతుల వెంకట్‌రెడ్డి, మెంచు వెంకన్నగౌడ్, అజ్మత్‌ఉన్నిసా, జమాల్‌షరీఫ్, రోజా రాణి, ప్రమీల, బీఎస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ ముందంజ
ఆలేరు: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పీఆర్టీయూ ముందంజలో ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. ఆలేరులోని బీసీ కాలనీలో నూతనంగా నిర్మించిన టీఎన్ పీఆర్టీయూ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మండలంలోని శారాజీపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు పంగ జనార్ధన్‌రెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని, త్వరలో పండిట్, పీఇటీల పోస్టులను ఆప్‌గ్రేడ్ చేసే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాసగల్ల అనసూర్య, జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, ఎంపీడీఓ చిల్కూరి శ్రీనివాస్, ఎంఈఓ లక్ష్మినారాయణ, సర్పంచ్ బెంజారం రజని, పీఆర్టీయూ నాయకులు నరహరి లక్షా్మరెడ్డి, సుంకరి భిక్షంగౌడ్, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, హెచ్ఎం ఇందిరాదేవి, ఉపాధ్యాయులు గడసంతల మధుసూదన్, పరిగెల రాములు, మాదాని జోసెఫ్, మంద సోమరాజు, తునికి చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
సమాజం గుర్తించేలా పని చేయాలి
ఎమ్మెల్సీ పూల రవీందర్ జన్నారం : సమాజం గుర్తించేలా ఉపాధ్యాయులు పని చేసి మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ఎమ్మెల్సీ పూల రవీందర్ పేర్కొన్నారు. మంగళవారం మండలానికి వచ్చిన ఆయన పీఆర్టీయూ భవన్ పీఆర్టీయూ మండల అధ్యక్షుడు కట్ట రాజమౌళి అధ్వర్యంలో సన్మానించారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఆంగ్లమాధ్యమం బోధిస్తున్నారని పేర్కోన్నారు. అదే విధంగా ఏకీకృత సర్వీసు రూల్‌పై ప్రభుత్వంతో చర్చించడం జరిగిందని, ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు అంకిత భవంతో పని చేసి, మంచి పేరు తీసుకురావాలని పేర్కోన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు దారట్ల జీవన్, ప్రధాన కార్యదర్శి ఇన్నారెడ్డి, పత్రిక సంపాదకులు పార్వతి సత్యనారాయణ, మండలాధ్యక్షుడు కట్ట రాజమౌళి, ప్రధాన కార్యదర్శి జాజాల శ్రీనివాస్, జిల్లా నాయకులు అనుముల రాజన్న, నాసాని రాజన్న, లచ్చన్న, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని రద్దు చేయాలి
అర్వపల్లి ఉపాధ్యాయుల కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని కొనసాగించాలని టీఎస్ పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి చిప్పలపల్లి ధర్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కాసర్లపహడ్, కొమ్మాల, తిమ్మాపురం, కోడూరు, లోయపల్లి, పేరబోయినగూడెం, అర్వపల్లిలోని కేజీబీవీ, ప్రా«థమిక పాఠశాలల్లో పీఆర్టీయూ సభ్యత్వ నమోదును నిర్వహించారు. ఈ సందర్బంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు బి. వేమారెడ్డి, కుర్రె శ్రీనివాస్, ఎస్. రామకృష్ణ, పీఆర్టీయూలో చేరారు. పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులలో విద్యావాలంటీర్లను నియమించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు డి. మహేష్, డి. యల్లయ్య, వీరేష్, నాగరాజు, రాము, మామిడి శ్రీను, లక్ష్మయ్య, సుధాకర్‌రెడ్డి, భద్రం, అశోక్ తదితరులు పాల్గొనారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
అర్వపల్లి : ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్ పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి చిప్పలపల్లి ధర్మయ్య కోరారు. గురువారం అర్వపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌తోపాటు మండలంలోని వివిధ గ్రామాల పాఠశాలల్లో పీఆర్ టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు డి.మహేష్, డి.యల్లయ్య, ఎన్.వెంకటేశ్వర్లు, పురుషోత్తం, నాగరాజు, సైదులు, జెల్లా ప్రసాద్, శ్రీధర్‌రెడ్డి, ప్రతాప్‌కుమార్, అంజద్, పాష, సాయిలు, శేఖర్, అబ్బయ్య, భాస్కర్, ప్రభాకర్, మంజుల, రమణకుమారి, కవిత, సురేందర్ పాల్గొన్నారు. -
పీఆర్టీయూ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు
కొండమల్లేపల్లి : పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కరానికి పీఆర్టీయూ ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు మిర్యాల భరతయ్య, ప్రధాన కార్యదర్శి భూతం ముత్యాలు, కొర్ర లోక్యానాయక్, నర్సింహ్మానాయక్, చందర్, గంగాధర్, చీన్యానాయక్, పెద్దన్న, బక్కయ్య, పద్మ, శ్రీలత, మంజుల, ఉమామహేశ్వరి ఉన్నారు. -
సక్సెస్ టీచర్లకు సన్మానం
– పీఆర్టీయూ కార్యక్రమంలో డీఈవో సుప్రకాష్ ఒంగోలు: సక్సెస్ టీచర్లకు సన్మానం అనేది ఒక స్ఫూర్తిదాయకమని, ఈ టీచర్లను రోల్‌మోడల్‌గా తీసుకొని మిగితా వారు కూడా ఈ విద్యా సంవత్సరం వందశాతం విద్యార్థులు ఉత్తీర్ణత సా«ధించేలా కృషిచేస్తారని ఆశిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి డీవీ సుప్రకాష్ అన్నారు. ఆదివారం స్థానిక ఆంధ్రకేసరి విద్యాకేంద్రం ఆవరణలో ప్రోగ్రెస్వ్ రికగై్జజ్డ్ టీచర్స్ యూనియన్ నిర్వహించిన సన్మాన సభకు డీఈవో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సబ్జక్టు టీచర్లను ఒంగోలులో సన్మానించడం శుభపరిణామమన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, సభాధ్యక్షుడు అయిన యం.రామ్‌భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకూ 29 మండలాల్లో 926 మంది ఉపాధ్యాయులను సన్మానించామన్నారు. మిగిలిన వారిని కూడా త్వరలోనే సన్మానిస్తామని పేర్కొన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు యం.కమలాకరరావు మాట్లాడుతూ సర్వీస్ రూల్స్ సాధనకు తమ సంఘం అవిరళ కృషి చేస్తుందన్నారు. తమ సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాకుండా ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి సాల్మన్‌రాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులను సన్మానించడం తనకు ఒక వరం లాంటిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒంగోలు డివిజన్లోని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోగలమని ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు, బి.రాజగోపాల్‌రెడ్డి, శివప్రసాద్, ఎ.వెంకటేశ్వర్లు, టి.శ్రీనివాసులు, మాధవరావు, యంవి రమణారెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చివరగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు రాంభూపాల్‌రెడ్డి దంపతులను జిల్లా విద్యాశాఖ అధికారి సుప్రకాష్, రాష్ట్ర అధ్యక్షుడు కమలాకరరావులు ఘనంగా సత్కరించారు. -
'పీఆర్సీ బకాయిలు విడుదల చేయండి'
మంత్రి ఈటలకు పీఆర్టీయూ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు పీఆర్టీయూ-టీఎస్ విజ్ఞప్తి చేసింది. సోమవారం సచివాలయంలో పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్షుడు సరోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, ఎయిడెడ్ టీచర్స్ గిల్డ్ అధ్యక్షుడు దేశ్‌పాండే మంత్రిని కలిశారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు, నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రతి నెలా 1వ తేదీన వేతనాలివ్వాలని కోరారు. -
25లోగా టీచర్ల బదిలీ కేటాయింపులు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులకు బదిలీ కేటాయింపు వివరాలను ఈ నెల 25 లోగా ఎస్ఎమ్ఎస్ ద్వారా పంపే అవకాశం ఉందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎం. కమలాకరరావు, ప్రధాన కార్యదర్శి భైరి అప్పారావులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న బదిలీలలో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగియడంతో నూతన పాఠశాల వివరాలను వెల్లడించనున్నారు. అయితే టీచర్లు వెంటనే తమ ప్రస్తుత స్కూల్ నుంచి కొత్త పాఠశాలకు బదిలీ అయితే జీతభత్యాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులు నాయుడు, బచ్చల పుల్లయ్యలతో కలసి పాఠశాల విద్యాశాఖ కమిషనర్, డెరైక్టర్ పి. సంధ్యారాణికి పరిస్థితిని వివరించామన్నారు. దీంతో టీచర్లను ప్రస్తుత స్థానం నుంచి ఈ నెల 31న రిలీవ్ చేసి వచ్చే నెల 1వ తేదిన నూతన పాఠశాలలో చేరేందుకు అంగీకరించినట్లు తెలిపారు. -
పీఆర్సీపై సీఎం కేసీఆర్‌ను కలసిన పీఆర్టీయూ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు పదో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని పీఆర్టీయూ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. 63 శాతం ఫిట్మెంట్తో 2013 జులై నుంచి వేతన సవరణ వర్తింపజేయాలని కోరారు. శుక్రవారం సచివాలయంలో ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డిలతో పాటు పీఆర్టీయూ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి సరోత్తమ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని, నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరుకు హామీ ఇచ్చారని తెలిపారు. -
ప్రభుత్వానికి బాసటగా ఉంటాం
పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ అభయం వేములవాడ : ఉపాధ్యాయులకు మేలుచేసి తమ అభ్యున్నతికి పాటుపడితే ప్రభుత్వానికి బాసటగా నిలుస్తామని పీఆర్టీయూ రాష్ట్ర ప్రభుత్వానికి భరోసా ఇచ్చింది. వేములవాడలో జరిగిన ‘ప్రోగ్రేసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్’ కౌన్సిల్ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డితోపాటు సంఘపెద్దలు తమ డిమాండ్లను వెల్లడించారు. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల 10వ పీఆర్సీని పక్షం రోజుల్లోగా అందించాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు. అలాగే 60 శాతం ఫిగ్మెంట్ కోరుతున్నామని త్వరలోనే 45 నుంచి 50 శాతం సాధించటం ఖాయమని తెలిపారు. కేజీ టూ పీజీ ఆంగ్లమాధ్యం అమలుచేయాలన్న కేసీఆర్ ఆకాంక్షలను స్వాగతిస్తున్నామన్నారు. 398 వేతనం కింద పనిచేసిన ఉపాధ్యాయులకు 2 ఇంక్రిమెంట్లు అందించాలన్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్నామని, ఆ తర్వాత ఆదివారాలు కూడా పనిచేశామని గుర్తుచేశారు. అందుకగానూ 16 రోజుల ఈఎల్‌సీలు ఇవ్వాలన్నారు. ఆలిండియా టీచర్స్ ఆర్గనైజేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఖాళీలను పూరించాలన్నారు. ఏ ప్రభుత్వమైనా ఉపాధ్యాయులకు మేలుచేస్తే సహకరిస్తామని లేదంటే నిదీస్తామని అదే పీఆర్టీయూ నైజమని తేల్చిచెప్పారు. ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థుల సిలబస్ తగ్గించాలన్నారు. రేషనలైజేషన్‌కు వ్యతిరేకం కాదనీ, అయితే స్కూల్ మ్యాపింగ్ విధానం విషయంలో మాత్రం పునరాలోచన అవసరమన్నారు. మరో ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ హెల్త్‌కార్డులు జారీచేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో నంబూరి కనకదుర్గ, కె.అనురాధ, ఝాన్సీలక్ష్మి, సీహెచ్.యాదగిరి, ఎం.మహేశ్, ఎల్.కిరణ్, నందాదేవి, పి.వనిత, శ్రీనివాసాచారి, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. -
'తోచిందల్లా సినిమా తీస్తే కట్టుబాట్లెందుకు'
హైదరాబాద్: ప్రతి ఆలోచననూ సినిమా తీస్తామంటే మనం ఏర్పరుచుకున్న కట్టుబాట్లుకు అర్థం ఉండదని రాంగోపాల్ వర్మను ఉద్దేశించి ఏపీ పీఆర్టీయూ అధ్యక్షుడు కమలాకరరావు, ప్రధాన కార్యదర్శి అప్పారావు అన్నారు. వర్మ తాను తీయాలనుకునే సావిత్రి చిత్రాన్ని సమాజం కోసం త్యాగం చేయాల్సిందేనని సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. యువతను రెచ్చగొట్టే సినిమాలు తీయడం సరికాదని హితవు పలికారు. 'శ్రీదేవి' పేరుతో రాంగోపాల్ వర్మ తీసుస్తున్న సినిమాపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందుగా సావిత్రి అని పేరు పెట్టిన వర్మ వివాదం రేగడంతో వెనక్కు తగ్గారు. సినిమా పేరు 'శ్రీదేవి'గా మార్చారు. -
'రాష్ట్ర విభజనపై చిక్కులు ఏర్పడతాయన్నది అపోహలే'
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై చిక్కులు ఏర్పడతాయన్నది అపోహలు మాత్రమేనని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలిపారు. కొందరు లేనిపోని అపోహలు కల్పిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారన్నారని పీఆర్ టీయూ ఆధ్వర్యంలో తెలంగాణపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఆర్టికల్ 371 Dని వెంటనే సవరించాలని పీఆర్ టీయూ సభ్యులు కోరారు. రాష్ట్ర విభజనపై చిక్కులు ఏర్పడతాయన్నది అపోహలేనని ఈ సందర్భంగా మంత్రి జానారెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులకు తాత్కాలిక భృతి విడుదలకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్సాటుతో సీమాంధ్రులకు ఎలాంటి నష్టం వాటిల్లదని మరో మంత్రి డి.కె.అరుణ పేర్కొన్నారు. తెలంగాణలో సీమాంధ్రలకు అభద్రత అవసరం లేదని ఆమె తెలిపారు. -
ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డిపై పీఆర్టీయూ ధ్వజం
ఇటు తెలంగాణలో అటు సీమాంధ్రలో పీఆర్టీయూ ద్వంధ్వ వైఖరి అవలంభిస్తోందంటూ టీఆర్ఎస్ మద్ధతుతో గెలిచిన ఎమ్మెల్సీ పాతూరి సుధాక ర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీఆర్టీయూ, పీఆర్టీయూ ఎమ్మెల్సీలు మండి పడ్డారు. తెలంగాణ ఉద్యమం కోసం స్వచ్ఛందంగా తాము పని చేస్తున్నామని పేర్కొన్నారు. 2011 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సమైక్య సంఘం మద్ధతు పొంది ఓడిపోయిన సుధాకర్‌రెడ్డి ఇపుడు టీఆర్ఎస్ చేరి టీఆర్ఎస్ను, తెలంగాణ ఉద్యమాన్ని సొంత రాజకీయ ప్రయోజనాలకు, ఎమ్మెల్సీగా గెలుపొందేందుకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. పీఆర్టీయూను, పీఆర్టీయూ ఎమ్మెల్సీలను విమర్శించే హక్కు సుధాకర్‌రెడ్డికి లేదన్నారు. హైదరాబాద్‌లోని పీఆర్టీయూ కార్యాలయంలో ఎమ్మెల్సీలు జనార్ధన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, రవీందర్‌లు విలేకరులతో మాట్లాడారు. సకల జనుల సమ్మె సందర్భంగా తెలంగాణలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలను కూడగట్టి టీటీజేఏసీని ఏర్పాటు చేసి ఛైర్మన్‌గా పూల రవీందర్ నేతృత్వంలో తాము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లామని పేర్కొన్నారు. తరువాత సమ్మెలో పాల్గొన టీచర్లకు ఆన్‌డ్యూటీ సదుపాయం ఇప్పించిన ఘనత కూడా తమదేనన్నారు. తాము సకల జనుల సమ్మె, ఉద్యమం చేస్తున్న సమయంలో నీవెక్కడున్నావని సుధాకర్‌రెడ్డిని విమర్శించారు. ఎమ్మెల్సీగా గెలుపొందేందుకు టీఆర్ఎస్లో చేరి తెలంగాణ పేరుతో గెలిచావని దుయ్యబ ట్టారు. తాము మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్వచ్ఛందంగా పనిచేశామని, తెలంగాణ పేరుతో, ఉద్యమం పేరుతో తాము ఏనాడు రాజకీయ ప్రయోజనాలు పొందలేదని స్పష్టం చేశారు. -
హెచ్ఎం, ఎంఈఓలకు జీపీఎఫ్ మంజూరు అధికారం!
జిల్లా పరిషత్తు(జడ్పీ) స్కూళ్లలోని దాదాపు 3 లక్షల మంది టీచర్ల జీపీఎఫ్ రుణాలకు సంబంధించి పార్ట్ ఫైనల్, ఫైనల్ పేమెంట్ మంజూరు అధికారాన్ని జిల్లా పరిషత్తు నుంచి స్థానిక ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులకు అప్పగించేందుకు ఉన్నతాధికారులు సానుకూలత వ్యక్తం చేసినట్లు పీఆర్టీయూ వెల్లడించింది. ప్రస్తుతం జిల్లా పరిషత్తు కార్యాలయాల ద్వారా మంజూరు చేస్తున్నందున నెలల తరబడి జాప్యం జరిగి జెడ్పీ స్కూళ్ల ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. 2002 మే నెలలో జారీ చేసిన జీఓ 40 ప్రకారం జీపీఎఫ్ లోన్స్/పార్ట్ ఫైనల్, ఫైనల్ పేమెంట్ మంజూరు చేసే అధికారం స్థానిక ఎంఈఓలకు, హెచ్ఎంలకు కల్పించినా అమలు కావటం లేదు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, విద్యాశాఖ, ట్రెజరీ ఉన్నతాధికారులు, పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి మంగళవారం సమావేశమై దీనిపై చర్చించారు. జీఓ 40 అమలుకు ఉన్నతాధికారులు సానుకూలత తెలిపి త్వరలో ఉత్తర్వులు జారీ చేసేందుకు అంగీకరించారని పీఆర్టీయూ నేతలు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో జీపీఎఫ్ ఖాతాలు సక్రమంగా నిర్వహించాలని, 2013 మార్చి నాటికి పూర్తి చేసి ఆన్లైన్లో పొందుపరచాలని అధికారులను నాగిరెడ్డి ఆదేశించినట్లు వెల్లడించారు. -
యూటీ ఆలోచనే వద్దు: పీఆర్టీయూ
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే ఆలోచనలు చేయవద్దని, హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనకే కట్టుబడి ఉండాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ) ప్రతినిధి బృందం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ ఇవ్వకుంటే.. సకల జనుల సమ్మె కోవలో మరోసారి సమ్మెకు సిద్ధమవుతామని ఆయనకు తెలిపింది. పీఆర్టీయూ ప్రతినిధి బృందం బుధవారం హోంమంత్రి షిండేతో సమావేశమైంది. అనంతరం బృందం సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. తాము ప్రస్తావించిన అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని షిండే హామీ ఇచ్చినట్టు తెలిపారు. పీఆర్టీయూ ప్రతినిధి బృందంలో పీఆర్టీయూ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.సరోత్తమ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కె.జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి తదితరులున్నారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే సమరమే: కేటీఆర్ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వకపోతే మళ్లీ సమరం చేస్తామని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ నేత కె.తారకరామారావు ఎంపీలు వివేక్, మంద జగన్నాధం, వేణుగోపాలచారిలతో కలిసి బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ను యూటీ చేయడం అంటే పెట్టుబడి, కబ్జాదారులకు కొమ్ముకాయడమేనన్నారు. హైదరాబాద్‌లో సమైక్య సభకు అనుమతివ్వడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. యూటీ అంటే తాటతీస్తాం: హరీష్ సిద్దిపేట: తలలు తెగిపడినా హైదరాబాద్‌ను యూటీగా ఒప్పుకోం అని టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. హైదరాబాద్ యూటీ అంటే తాట తీస్తామని మెదక్‌జిల్లా సిద్దిపేటలో బుధవారం ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఆదాయం అంతా కేంద్రానికి వెళుతుందనీ, అపుడు రెండు ప్రాంతాలకూ నష్టం జరుగుతుందన్నారు. యూటీ అంటే ఒప్పుకోం : ఈటెల సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం (యుూటీ)గా వూర్చేందుకు అంగీకరించబోవుని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్ రూపొందించిన మహాశాంతి ర్యాలీ పోస్టర్‌ను ఈటెల రాజేందర్, తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్ కన్వీనర్ కత్తి వెంకటస్వామి బుధవారం ఆవిష్కరించారు. ఈ నెల 7న హైదరాబాద్‌లో జరిగే మహా శాంతిర్యాలీలో లెక్చరర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. టీఎల్ఎఫ్ నేతలు సిద్దేశ్వర్, వసంత, గణేశ్, విజయకుమార్ పాల్గొన్నారు. యూటీ అంటే ఇరువురికీ నష్టమే: సీపీఐ సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రను అంగీకరించబోమని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేస్తే ఇరు ప్రాంతాలవారికీ నష్టమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే నారాయణ అన్నారు. యూటీ ప్రతిపాదనను ఎవరూ అంగీకరించరని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు విశ్వాసం కలిగించాలే తప్ప యూటీ పరిష్కారం కాదన్నారు. సమైక్యాంధ్రకు తాము అనుకూలం కాదని, ఈ నెల 7న హైదరాబాద్‌లో జరిగే సభకు తాము హాజరుకాబోమని నారాయణ తెలిపారు. యూటీ అంటే ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తాం: దానం సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌ను యూటీ (కేంద్రపాలిత ప్రాంతం) చేయాలనే ప్రతిపాదన వస్తే తాము వ్యతిరేకిస్తామని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి దానం నాగేందర్ తెలిపారు. -
పార్లమెంట్లో వెంటనే బిల్లు పెట్టాలి
జడ్చర్ల, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటకు సంబంధించిన పార్లమెంట్లో వెంటనే బిల్లు పెట్టాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జడ్చర్లలో ఎమ్మార్సీ కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్నారన్న సాకుతో తెలంగాణ బిల్లులో జాప్యం చేయవద్దని కోరారు. బిల్లు ఆమోదంలో ఆలస్యం జరిగితే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన వారవుతారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్వోత్తమ్రెడ్డిలతో కూడిన పీఆర్టీయూ బృందం సోమవారం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. తెలంగాణ బిల్లును ఆలస్యం చేయకుండా పార్లమెంట్లో త్వరగా ప్రవేశపెట్టే విధంగా ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, ఆంటోని, దిగ్విజయ్‌సింగ్, ప్రతి పక్ష నేత సుష్మాస్వరాజ్‌లను కలిసి విన్నవించనున్నట్లు తెలిపారు. తెలంగాణ కోసం ఇదివరకే 32రోజలు సమ్మె చేశామని, బిల్లును ఆలస్యం చేస్తే వంద రోజుల సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నా రు. ప్రత్యేక రాష్ట్రం వల్ల 1.50 లక్షల మంది ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్‌లో మార్పు జరుగుతుందని, విద్యావ్యవస్థ అంతా ఒకే గొడుగు కిందకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉపాధ్యాయులకు పదో పీఆర్సీ ని ఆలస్యం చేయకుండా వెంటనే అమలు చేయాలని, హెల్త్ కార్డులు జారీ చేయాలని, జీపీఎఫ్‌కు సంబంధించి 40 జీఓను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు రాంమ్మోహన్,తదితరులు పాల్గొన్నారు.