గురుకులాలుగా ప్రభుత్వ పాఠశాలలు!
ఓకే అంటే సీఎం దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి
సిద్దిపేట అర్బన్: ప్రభుత్వ పాఠశాలలను గురుకులాలుగా మార్చే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి అన్నారు. సిద్దిపేటలో గురువారం పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో జనార్దన్‌రెడ్డిని సన్మానించారు.‘విద్యారంగంలో నూతన పోకడలు–ప్రభుత్వ పాఠశాలల మనుగడ’ అంశంపై జరిగిన రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో ఆయన మాట్లా డారు.
‘‘ సమస్యల పరిష్కారం విషయం నాకు వదిలేయండి.. గురుకుల ఉపా ధ్యాయుల్లాగా పనిచేసేందుకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వ పాఠశాలలను గురుకు లాలుగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. తన విజయంలో హరీశ్‌రావు పాత్ర ఎనలేనిదన్నారు. ఉపాధ్యాయుడిని స్టాఫ్‌రూంలోనే ఉంచి ‘నింపు..పంపు’ విధానాన్ని కొనసాగిస్తున్నారని, దీన్ని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తామని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు.
ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఉద్యోగ విరమణ పరిమితిని 60 సంవత్సరాలకు పెంచాలని, సీపీఎ ఎస్‌ను రద్దు చేయాలనే తీర్మానాలను ఈ సదస్సు ఆమోదించింది. ఈ కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు సరోత్తంరెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, కొత్త నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.