MLC Janardhan Reddy
-
ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డికి డాక్టరేట్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు కె.జనార్దన్‌రెడ్డిని ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ యూనివర్సిటీ ఫర్ సార్క్ కంట్రీస్ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. సోమవారం సికింద్రాబాద్‌లోని రాయల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. విద్యాశాఖ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు వెనకబడిన వర్గాల బలోపేతానికి దోహదపడే కార్యక్రమాలను చేపట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించినందుకు ఈ అవార్డును అందించినట్లు యూనివర్సిటీ పేర్కొంది. ఈ సందర్భంగా పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.సరోత్తంరెడ్డి, బి.కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ పూల రవీందర్ జనార్దన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. -
24, 25 తేదీల్లో పీఆర్టీయూ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ–టీఎస్) 32వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సరోత్తంరెడ్డి, జి.చెన్నకేశవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లెలగూడలోని సామా యాదిరెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించే ఈ సమావేశాల్లో విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించి తీర్మానం చేస్తామని స్పష్టంచేశారు. వచ్చే రెండేళ్ల కాలానికి నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశాల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. -
గురుకులాలుగా ప్రభుత్వ పాఠశాలలు!
ఓకే అంటే సీఎం దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి సిద్దిపేట అర్బన్: ప్రభుత్వ పాఠశాలలను గురుకులాలుగా మార్చే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి అన్నారు. సిద్దిపేటలో గురువారం పీఆర్టీయూ ఆధ్వర్యంలో జనార్దన్‌రెడ్డిని సన్మానించారు.‘విద్యారంగంలో నూతన పోకడలు–ప్రభుత్వ పాఠశాలల మనుగడ’ అంశంపై జరిగిన రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో ఆయన మాట్లా డారు. ‘‘ సమస్యల పరిష్కారం విషయం నాకు వదిలేయండి.. గురుకుల ఉపా ధ్యాయుల్లాగా పనిచేసేందుకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వ పాఠశాలలను గురుకు లాలుగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. తన విజయంలో హరీశ్‌రావు పాత్ర ఎనలేనిదన్నారు. ఉపాధ్యాయుడిని స్టాఫ్‌రూంలోనే ఉంచి ‘నింపు..పంపు’ విధానాన్ని కొనసాగిస్తున్నారని, దీన్ని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తామని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఉద్యోగ విరమణ పరిమితిని 60 సంవత్సరాలకు పెంచాలని, సీపీఎ ఎస్‌ను రద్దు చేయాలనే తీర్మానాలను ఈ సదస్సు ఆమోదించింది. ఈ కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు సరోత్తంరెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, కొత్త నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూకుమ్మడిగా పీఆర్టీయూలో చేరిక
రామాయంపేట (నిజాంపేట): తెలంగాణ పీఆర్టీయూ మండల ప్రతినిధులు మూకుమ్మడిగా పీఆర్టీయులో చేరారు. ఈమేరకు సంఘం ప్రతినిధులు సోమవారంరాత్రి నిజాంపేటలో జరిగిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి సమక్ష్యంలో పీఆర్టీయులో చేరామని సంఘం మండల ప్రతినిధి గోపాల్‌రెడ్డి తెలిపారు. ఊపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయు నిరంతరంగా పోరాటం చేస్తుందని, ఈసంఘంతోనే తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఉద్దేశంతోనే సంఘంలో చేరినట్లు గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం గోపాల్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో పీఆర్టీయూ మండలశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రమోద్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆశయ్య, జిల్లా కౌన్సిలర్లు యాదవరెడ్డి, పి.శ్రీనివాస్, నర్సాగౌడ్, మున్వర్‌బేగ్, సురేశ్, రాజు పాల్గొన్నారు. మండల పీఆర్టీయూ కార్యవర్గం.. నిజాంపేట మండల పీఆర్టీయూ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండలశాఖ అధ్యక్షుడిగా గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జనార్దన్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా భానుప్రకాశ్, మండల ఉపాధ్యక్షుడిగా సునీల్, మహిళా ఉపాధ్యక్షురాలిగా రేఖను ఎన్నుకున్నారు. అలాగే కార్యదర్శులుగా వేణుగోపాల్, వెంకటేశ్, మౌనిక, ఉమారాణి, స్వప్న, స్వరూప, జిల్లా కౌన్సిలర్లుగా జాన్‌కుమార్, రమేశ్‌రెడ్డి, కిషన్, మహిపాల్‌రెడ్డిని ఎన్నుకున్నారు. -
'బంగారు తెలంగాణతో మమేకమవుతాం'
హైదరాబాద్: ఉద్యోగులకు పీఆర్సీలో 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నింపారని ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా రాష్ట్రాభివృద్ధిలో, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములవుతారని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఫిట్మెంట్ పెంచడం ద్వారా, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం సరఫరా చేయడం ద్వారా సీఎం కేసీఆర్ అందరి కడుపులు నింపారని అన్నారు.