మూకుమ్మడిగా పీఆర్‌టీయూలో చేరిక
రామాయంపేట (నిజాంపేట): తెలంగాణ పీఆర్‌టీయూ మండల ప్రతినిధులు మూకుమ్మడిగా పీఆర్టీయులో చేరారు. ఈమేరకు సంఘం ప్రతినిధులు సోమవారంరాత్రి నిజాంపేటలో జరిగిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి సమక్ష్యంలో పీఆర్‌టీయులో చేరామని సంఘం మండల ప్రతినిధి గోపాల్‌రెడ్డి తెలిపారు.
ఊపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్‌టీయు నిరంతరంగా పోరాటం చేస్తుందని, ఈసంఘంతోనే తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఉద్దేశంతోనే సంఘంలో చేరినట్లు గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం గోపాల్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో పీఆర్‌టీయూ మండలశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రమోద్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆశయ్య, జిల్లా కౌన్సిలర్లు యాదవరెడ్డి, పి.శ్రీనివాస్, నర్సాగౌడ్, మున్వర్‌బేగ్, సురేశ్, రాజు పాల్గొన్నారు.
మండల పీఆర్‌టీయూ కార్యవర్గం..
నిజాంపేట మండల పీఆర్‌టీయూ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండలశాఖ అధ్యక్షుడిగా గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జనార్దన్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా భానుప్రకాశ్, మండల ఉపాధ్యక్షుడిగా సునీల్, మహిళా ఉపాధ్యక్షురాలిగా రేఖను ఎన్నుకున్నారు. అలాగే కార్యదర్శులుగా వేణుగోపాల్, వెంకటేశ్, మౌనిక, ఉమారాణి, స్వప్న, స్వరూప, జిల్లా కౌన్సిలర్లుగా జాన్‌కుమార్, రమేశ్‌రెడ్డి, కిషన్, మహిపాల్‌రెడ్డిని ఎన్నుకున్నారు.