24, 25 తేదీల్లో పీఆర్‌టీయూ సమావేశాలు | PRTU meetings on Sept 24 and 25 | Sakshi
Sakshi News home page

24, 25 తేదీల్లో పీఆర్‌టీయూ సమావేశాలు

Published Fri, Sep 22 2017 1:46 AM | Last Updated on Fri, Sep 22 2017 10:02 AM

PRTU meetings on Sept 24 and 25

సాక్షి, హైదరాబాద్‌: ప్రోగ్రెసివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌ (పీఆర్‌టీయూ–టీఎస్‌) 32వ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలను ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సరోత్తంరెడ్డి, జి.చెన్నకేశవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లెలగూడలోని సామా యాదిరెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించే ఈ సమావేశాల్లో విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించి తీర్మానం చేస్తామని స్పష్టంచేశారు. వచ్చే రెండేళ్ల కాలానికి నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశాల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement