ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డికి డాక్టరేట్‌  | MLC K Janardhan Reddy Received Doctorate | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 27 2018 3:33 AM | Last Updated on Tue, Nov 27 2018 3:33 AM

MLC K Janardhan Reddy Received Doctorate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు కె.జనార్దన్‌రెడ్డిని ఇంటర్నేషనల్‌ ఎకనామిక్స్‌ యూనివర్సిటీ ఫర్‌ సార్క్‌ కంట్రీస్‌ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. సోమవారం సికింద్రాబాద్‌లోని రాయల్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. విద్యాశాఖ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు వెనకబడిన వర్గాల బలోపేతానికి దోహదపడే కార్యక్రమాలను చేపట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించినందుకు ఈ అవార్డును అందించినట్లు యూనివర్సిటీ పేర్కొంది. ఈ సందర్భంగా పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.సరోత్తంరెడ్డి, బి.కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ పూల రవీందర్‌ జనార్దన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement