
ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణికి వరంగల్ ఎస్‌ఆర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. తనికెళ్ల భరణి దాదాపు 800లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 52 సినిమాలకు మాటలు అందించారాయన.
‘సముద్రం’ సినిమాకి ఉత్తమ విలన్‌గా, ‘నువ్వు నేను’ చిత్రానికి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ‘గ్రహణం’ చిత్రంతో ఉత్తమ నటునిగా, ‘మిథునం’ సినిమాకిగాను ఉత్తమ రచయిత–ఉత్తమ దర్శకునిగా నంది అవార్డులు అందుకున్నారాయన. ఇక ఆగస్ట్ 3న వరంగల్‌లో జరిగే యూనివర్సిటీ స్నాతకోత్సవంలో తనికెళ్ల భరణికి డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు.