పల్లెటూరి డిటెక్టివ్‌ | Tanikella Bharani to lead Crime Thriller Asura Samharam | Sakshi
Sakshi News home page

పల్లెటూరి డిటెక్టివ్‌

Published Sun, Feb 2 2025 12:02 AM | Last Updated on Sun, Feb 2 2025 12:02 AM

Tanikella Bharani to lead Crime Thriller Asura Samharam

తనికెళ్ల భరణి(Tanikella Bharani) ప్రధాన పాత్రలో ‘అసుర సంహారం’(Asura Samharam)అనే చిత్రం రూపొందనుంది. కిశోర్‌ శ్రీకృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో మిధున ప్రియ కీలక పాత్ర చేయనున్నారు. శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ల సమర్పణలో శ్రీ సాయి తేజో సెల్యులాయిడ్స్‌ బ్యానర్‌పై సాయి శ్రీమంత్, శబరీష్‌ బోయళ్ల నిర్మించనున్న ఈ చిత్రాన్ని శనివారం ప్రకటించారు. ‘క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్‌ చిత్రాలకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది.

ప్రస్తుతం కాన్సెప్ట్, కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలకి ప్రేక్షకాదరణ ఉంటోంది. ఈ క్రమంలోనే విలేజ్‌ క్రైమ్‌ డ్రామాగా ‘అసుర సంహారం’  రూపొందనుంది. ఈ మూవీలో తనికెళ్ల భరణి విలేజ్‌ డిటెక్టివ్‌గా ఓ విభిన్నమైన పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్‌: మిధున ప్రియ, కెమేరా: బాలు ఏబీసీడీ, సంగీతం: కరీం అబ్దుల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement