కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు శుక్రవారం రైలు ఎక్కుతూ కాలుజారి కింద పడి ప్రముఖ కామెడీ షో 'జబర్దస్త్' స్క్రిప్ట్ రైటర్, సహాయ నటుడు మృతి చెందాడు. ఆర్‌పీఎఫ్, రైల్వే ప్రయాణికుల కథనం ప్రకారం.. చుంచుపల్లి మండలంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మేదర మహ్మదీన్ హైదరాబాద్ వెళ్లేందుకు తెల్లవారుజామున భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్‌కు వచ్చాడు.
(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు?)
కాకతీయ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కుతుండగా కాలు జారి ప్లాట్‌ఫాంకు, రైలుకు మధ్య ఇరుక్కుపోయాడు. అప్పటికే రైలు కదులుతుండగా ప్లాట్‌ఫాం, రైలు మధ్య శరీరం మూడు, నాలుగు సార్లు తిరిగింది. గమనించిన ఆర్‌పీఎఫ్ పోలీసులు అతని చేతులు పట్టుకుని పైకి లాగారు. దీంతో మహ్మదీన్ పైకి లేచి నడుచుకుంటూ తనకు ఏమి కాలేదని పేర్కొన్నాడు. అయినా ఆర్‌పీఎఫ్ పోలీసులు 108 వాహనంలో కొత్తగూడెం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
అక్కడి వైద్యుల సూచన మేరకు ఖమ్మం తరలిస్తుండగా మృతి చెందాడు. కాగా మహ్మదీన్ ప్లాట్‌ఫాం, రైలుకు మధ్య నలిగిపోయి అతని శరీరంలోని అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు నిర్ధారించారు. శరీరంపై మాత్రం నామమాత్రపు గాయాలే ఉన్నాయి. ప్లాట్‌ఫాం నుంచి 108 వాహనం వరకు, ఆస్పత్రిలో కూడా నడుచుకుంటూ తిరిగిన వ్యక్తి మృతి చెందడం విస్మయానికి గురిచేసింది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ ఘటనపై ఆర్‌పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)
Comments
Please login to add a commentAdd a comment