doctorate award
-
Action King Arjun: అర్జున్ సర్జాకు గౌరవ డాక్టరేట్ తో సత్కారం
-
తనికెళ్ల భరణికి డాక్టరేట్
ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణికి వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. తనికెళ్ల భరణి దాదాపు 800లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 52 సినిమాలకు మాటలు అందించారాయన.‘సముద్రం’ సినిమాకి ఉత్తమ విలన్‌గా, ‘నువ్వు నేను’ చిత్రానికి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ‘గ్రహణం’ చిత్రంతో ఉత్తమ నటునిగా, ‘మిథునం’ సినిమాకిగాను ఉత్తమ రచయిత–ఉత్తమ దర్శకునిగా నంది అవార్డులు అందుకున్నారాయన. ఇక ఆగస్ట్ 3న వరంగల్‌లో జరిగే యూనివర్సిటీ స్నాతకోత్సవంలో తనికెళ్ల భరణికి డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు. -
తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం
టాలీవుడ్ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ ఎస్ఆర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా, రచయితగా ఆయన చేసిన సేవలకుగానూ డాక్టరేట్‌తో సత్కరించనుంది. ఈ అవార్డును ఆగస్ట్ 3వ తేదీన వరంగల్‌లో జరిగే యూనివర్శిటి స్నాతకోత్సవంలో ప్రదానం చేయనున్నారు.కాగా.. తనికెళ్ల భరణి టాలీవుడ్లో దాదాపు 800కు పైగా చిత్రాల్లో నటించారు. అంతే కాకుండా దాదాపు 50 సినిమాలకు పైగా రచయితగా అనేక విజయాలను అందుకున్నారు. సముద్రం సినిమాకు ఉత్తమ విలన్‌గా, ‘నువ్వు నేను’ చిత్రంలో నటనకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, గ్రహణం మూవీకి ఉత్తమ నటుడిగా, మిథునం సినిమాకుగానూ ఉత్తమ రచయిత, దర్శకునిగా అయిదు నంది అవార్డులను అందుకున్నారు. కాగా.. గతంలో ఆస్కార్ అవార్డు గ్రహిత చంద్రబోస్‌ను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించిన సంగతి తెలిసిందే. -
అనకాపల్లి కలెక్టర్‌కు గౌరవ డాక్టరేట్
సాక్షి, అనకాపల్లి: పరిపాలనా దక్షతకు గుర్తింపు వచ్చింది. అంకిత భావానికి కితాబు లభించింది. సేవాతత్పరతకు అరుదైన గౌరవం దక్కింది. పెట్రోలియం అండ్ ఎనర్జీ యూనివర్సిటీ తొలి గౌరవ డాక్టరేట్‌ను అనకాపల్లి కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టికి ప్రదానం చేసింది. శనివారం విశాఖలో జరిగిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) మూడో స్నాతకోత్సవంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ గౌరవ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ అర్చన భట్టాచార్య డాక్టరేట్‌ను అందించారు. ఐటీడీఏ పీఓగా, జేసీగా, కలెక్టర్‌గా గిరిజనులకు అందించిన సేవలు, ఆయన హయాంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలన దక్షతకు గుర్తింపుగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. రవి పట్టాన్‌శెట్టి ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘స్వస్థ భారత్’లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అనకాపల్లి జిల్లా నుంచి అందుకున్న అవార్డును కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఇనిస్టిట్యూట్ భూ వివాదంపరిష్కారంలో కీలక పాత్ర పెట్రో యూనివర్సిటీ పున:ప్రారంభంలో కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి కీలక పాత్ర పోషించారు. తాత్కాలిక క్యాంపస్ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఉండగా.. సబ్బవరం వంగలి గ్రామంలో వర్సిటీని నిర్మించేందుకు రూ.855 కోట్లు మంజూరయ్యాయి. దీనికోసం 201.08 ఎకరాల వరకు ల్యాండ్ పూలింగ్ చేశారు. మధ్యలో సుమారు 20 ఎకరాల వరకు రైతులు తమకు అన్యాయం జరిగిందని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నిర్మాణ పనులకు ఆటంకం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో అనకాపల్లి కలెక్టర్ రవిపట్టాన్ శెట్టి నిర్వాసితులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. దీంతో హైకోర్టు వర్సిటీ నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం, పెట్రో యూనివర్సిటీకి అవరోధాలు తొలగిపోవడం జరిగింది. 2022 డిసెంబర్ 23న పనులు పున:ప్రారంభించారు. ప్రస్తుతం కాంపౌండ్ వాల్ నిర్మాణం చేశారు. పనులు కూడా జరుగుతున్నాయి. -
తల్లిదండ్రులకు అంకితం
సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ డాక్టరేట్ అందుకున్నారు. సినీరంగంలో రచయితగా తన ప్రస్థానాన్ని గుర్తించిన కాలిఫోర్నియాకు చెందిన ‘న్యూలైఫ్ థియొలాజికల్ యూనివర్సిటీ’ వారు డాక్టరేట్ అందించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో సాయిమాధవ్ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. ‘ఈ పురస్కారాన్ని నా తల్లిదండ్రులకు అంకితమిస్తున్నాను’ అన్నారాయన. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని ఆయన్ను అభినందించారు. -
కాదంబరికి డాక్టరేట్
‘మనం సైతం’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిర్విరామంగా సేవలు అందిస్తున్న నటుడు కాదంబరి కిరణ్‌ని డాక్టరేట్ వరించింది. ఆయన సేవలను గుర్తించిన ‘గ్లోబల్ పీస్ యూనివర్సిటీ’ వారు గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. పాత్రికేయుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కాదంబరి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘మనం సైతం’ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలందిస్తున్నారు. కరోనా వంటి క్లిష్ట కాలంలో కాదంబరి అందిస్తున్న సేవలు ఆయనకు మరింత పేరు తెచ్చిపెడుతున్నాయి. ‘‘ఈ డాక్టరేట్‌తో నా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నా’’ అన్నారు కాదంబరి కిరణ్. కాగా ఆయనకు డాక్టరేట్ ప్రకటించడం పట్ల పలువురు సినీ ప్రముఖులు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. -
నటి కుష్బూ డాక్టరయ్యారు!
సాక్షి, పెరంబూరు: నటి కుష్బూ డాక్టరయ్యారు. ఇదేమిటీ ఆమె యాక్టర్ కదా అని ఆశ్యర్యపడుతున్నారా? ఉత్తరాదికి చెందిన కుష్బూ తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో 20 ఏళ్లకు పైగా నటిస్తున్నారు. తెలుగు చిత్రం కలియుగపాండవులు చిత్రం ద్వారా దక్షిణాదిలో కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత తమిళ సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళంలోనే అత్యధిక చిత్రాలను చేశారు. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక చిత్రాల్లో నటించారు. తమిళంలో రజనీకాంత్, కమలహాసన్ వంటి సూపర్‌స్టార్స్‌తో జత కట్టిన నటి కుష్బూ. చదవండి: అదే నిజమైన ఉమెన్స్ డే ప్రస్తుతం రజనీకాంత్‌కు జంటగా అన్నాత్తా చిత్రంలో నటిస్తున్నారు. కాగా బుల్లితెరపై కూడా నటిగా తనదైన ముద్రవేసుకున్న ఈ సంచలన నటి నిర్మాతగా మారి పలు చిత్రాలను, టీవీ సీరియళ్లను నిర్మిస్తున్నారు. ఇక రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రచార కర్తగా బాధ్యతలను నిర్వహిస్తున్న కుష్బూ సినీ సేవలకు గానూ అమెరికాలోని ప్రపంచ తమిళ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను అందించి గౌరవించారు. గురువారం నటి కుష్బూ డాక్టరేట్ అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ఏపీ గవర్నర్‌కు గౌరవ డాక్టరేట్
-
ఏపీ గవర్నర్‌కు గౌరవ డాక్టరేట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు పంజాబ్‌లోని దేశ్ భగత్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. సామాజిక, శాస్త్ర రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికిగాను ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్టు ఆ విశ్వవిద్యాలయం ప్రకటించింది. న్యాయ నిపుణుడిగా, ప్రజాప్రతినిధిగా, రచయితగా ఆయన సమాజానికి విశేష సేవలు అందించారని కొనియాడింది. పంజాబ్‌లోని మండీ గోబింద్గర్హ్లోని దేశ్ భగత్ విశ్వవిద్యాలయం ఏడో స్నాతకోత్సవం సందర్భంగా ఆ విశ్వవిద్యాలయ కులపతి జోరాసింగ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు శుక్రవారం డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యం ఉండేలా యువత ప్రయత్నించాలని ఉద్భోదించారు. -
ఎగ్జిట్ పోల్సే.. ఎగ్జాట్ పోల్స్ కాదు
సాక్షి, గుంటూరు : ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మొద్దంటున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 1999 నుంచి వస్తోన్న ఎగ్జిట్ పోల్స్‌లో చాలా వరకూ తప్పుడు సమాచారాన్నే ఇచ్చాయన్నారు. శాంతి విశ్వవిద్యాలయం నుంచి తొలి డాక్టరేట్ పొందిన మొదటి భారతీయుడైన ఆయనకు ఆదివారం గుంటూరులోని క్లబ్లో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 42 ఏళ్ల తర్వాత తొలిసారి తాను లేకుండా ఎన్నికలు జరిగాయన్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసినందున ఎగ్జిట్ పోల్స్ హడావుడి సహజమే అన్నారు. అయితే వీటికి ఎలాంటి బేస్ ఉండదని.. ఎగ్జాట్ పోల్స్ కోసం చూడాలని వెంకయ్య హితవు పలికారు. మే 23 న అసలైన ఫలితాలు వచ్చేవరకు గెలుపు పట్ల అన్ని పార్టీలు నమ్మకంగానే ఉంటాయన్నారు వెంకయ్య నాయుడు. కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం అన్నింటికన్నా ప్రధానమన్నారు. బలమైన ప్రజాస్వామ్యం ఉంటే.. ఎన్నికలు, అభ్యర్థులు, పార్టీల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. అంతేకాక నేటి చట్టసభలు నడుస్తున్న తీరు బాధాకరమని, రాజకీయ నేతల భాష అభ్యంతరకరంగా తయారైందని.. రాజకీయాలు చాలా దిగజారిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఎవరూ ఎవరికీ శత్రువులు కారని, వ్యక్తిగత దూషణలు, పరుష పదజాలం సరికాదని ఆయన సూచించారు. క్యారెక్టర్.. క్యాండిడేట్.. క్యాలిబర్.. కెపాసిటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో అభ్యర్థులకు ఓట్లు వేయాలి. కానీ ప్రస్తుత రాజకీయల్లో క్యాష్, క్యాస్ట్ ఆధారంగా ప్రజలు ఓట్లు వేస్తున్నారని వెంకయ్యా నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కోట్లు ఖర్చు పెడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను మనమే అవహేళన చేసుకుంటున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డికి డాక్టరేట్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు కె.జనార్దన్‌రెడ్డిని ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ యూనివర్సిటీ ఫర్ సార్క్ కంట్రీస్ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. సోమవారం సికింద్రాబాద్‌లోని రాయల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. విద్యాశాఖ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు వెనకబడిన వర్గాల బలోపేతానికి దోహదపడే కార్యక్రమాలను చేపట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించినందుకు ఈ అవార్డును అందించినట్లు యూనివర్సిటీ పేర్కొంది. ఈ సందర్భంగా పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.సరోత్తంరెడ్డి, బి.కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ పూల రవీందర్ జనార్దన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.