కాదంబరికి డాక్టరేట్‌ | Kadambari kiran got doctorate from global peace university | Sakshi
Sakshi News home page

కాదంబరికి డాక్టరేట్‌

Published Thu, Jul 9 2020 1:42 AM | Last Updated on Thu, Jul 9 2020 1:42 AM

Kadambari kiran got doctorate from global peace university - Sakshi

కాదంబరి కిరణ్‌

‘మనం సైతం’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిర్విరామంగా సేవలు అందిస్తున్న నటుడు కాదంబరి కిరణ్‌ని డాక్టరేట్‌ వరించింది. ఆయన సేవలను గుర్తించిన ‘గ్లోబల్‌ పీస్‌ యూనివర్సిటీ’ వారు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించారు. పాత్రికేయుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కాదంబరి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘మనం సైతం’ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలందిస్తున్నారు. కరోనా వంటి క్లిష్ట కాలంలో కాదంబరి అందిస్తున్న సేవలు ఆయనకు మరింత పేరు తెచ్చిపెడుతున్నాయి. ‘‘ఈ డాక్టరేట్‌తో నా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నా’’ అన్నారు కాదంబరి కిరణ్‌. కాగా ఆయనకు డాక్టరేట్‌ ప్రకటించడం పట్ల పలువురు సినీ ప్రముఖులు, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement