kadambari kiran kumar
-
దీనస్థితిలో తెలుగు సీనియర్ నటుడు.. మరో నటుడు ఆర్థిక సాయం
ప్రముఖ సినీ నటుడు, 'మనం సైతం' ఫౌండేషన్ నిర్వహకులు కాదంబరి కిరణ్ మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. మంచానికే పరిమితమైన పావలా శ్యామలకు కొన్నిరోజుల క్రితం ఆర్థిక సాయం చేసిన ఈయన.. ప్రమాదానికి గురై ఆందోళనకరమైన పరిస్థితుల్లో హస్పిటల్లో చేరిన తెలుగు సీనియర్ నటుడు డీ. వీరభద్రయ్యకు రూ. 25,000 చెక్ అందజేశారు. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ) వీరభద్రయ్యకు మెరుగైన వైద్యం, కనీస అవసరాలను తీర్చేందుకుగానూ కాదంబరి కిరణ్ ఈ సాయం చేశారు. అలానే వీరభద్రయ్య కుటుంబ సభ్యులని ఓదార్చుతూ, వారిలో కాస్త ధైర్యం నింపారు. ఇకపోతే కాదంబరి కిరణ్.. గత కొన్నేళ్లుగా 'మనం సైతం' ఫౌండేషన్ తరఫున ఇండస్ట్రీలోని పేద కార్మికులకు, అవసరాల్లో ఉన్న పేదలకు తోచినంత సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు ఈయన్ని ప్రశంసిస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్) -
పావలా శ్యామలను ఆదుకున్న కాదంబరి కిరణ్
-
దీనస్థితిలో పావలా శ్యామల.. కాదంబరి కిరణ్ ఆర్థిక సాయం!
సినీ నటుడు,‘మనం సైతం' ఫౌండేషన్ నిర్వహకులు కాదంబరి కిరణ్ మరోసారి దాతృత్వం చాటుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావల శ్యామలకు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నాడు. సీనియర్ నటి పావల శ్యామలకు అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు తోడయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కాదంబరి కిరణ్.. ఆమెకు రూ. 25,000 చెక్కును అందించారు. పావల శ్యామలకు మెరుగైన వైద్యం, కనీస అవసరాలను తీర్చేలా సాయం చేశారు. (చదవండి: అమ్మ చనిపోయిన కాసేపటికే ఏడుపు ఆపేశా: శ్రీదేవి చిన్నకూతురు) మీడియా ద్వారా విషయం తెలుసుకున్న కాదంబరి కిరణ్ హైదరాబాద్ శివారులోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న నటి శ్యామల ను తనంతట తానే వెతుకుంటు వెళ్లి స్వయంగా సాయం చేసి పెద్దమనసు చాటుకున్నారు . ఆయన మానవత్వానికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినీ పరిశ్రమలో పేద కార్మికులకు, అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేయడానికి ‘మనం సైతం' అనే ఫౌండేషన్ స్థాపించి దశాబ్దం పైగా నిర్విరామంగా సేవలు కొనసాగించడం విశేషం. -
ఘనంగా నటుడు కాదంబరి కిరణ్ కుమార్తె పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు
-
టాలీవుడ్ నటుడి ఇంట పెళ్లిసందడి.. హాజరైన సినీ ప్రముఖులు
టాలీవుడ్ నటుడు కాదంబరి కిరణ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇవాళ ఆయన కుమార్తె కల్యాణం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తారామతి బారాదరిలో జరిగిన ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాదంబరి కిరణ్ చిన్న కుమార్తె పూర్ణ సాయిశ్రీకి సాయి భార్గవతో వివాహం జరిగింది. ఈ వేడుకకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హీరో శ్రీకాంత్, మురళి మోహన్, కోట శ్రీనివాసరావు, రామజోగయ్య శాస్త్రి, తనికెళ్ల భరణి, అలీ, భాస్కరభట్ల, సాయికుమార్, బండ్ల గణేష్ హాజరయ్యారు. సీనియర్ నటుడైన కాదంబరి కిరణ్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. భరత్ అనే నేను, రంగస్థలం, శ్రీమంతుడు చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. -
దటీజ్ రామ్‌చరణ్, ఆ మాటతో నా గుండె నిండిపోయింది: నటుడు
'ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న' అంటుంటారు. ఇండస్ట్రీలో ఎవరైనా ఆపదలో ఉన్నారంటే చాలు ఆదుకునే సెలబ్రిటీలు ఎందరో! అందులో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా ఒకరు. ఆపత్కాలంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌కు సాయపడి తన గొప్ప మనసు చాటుకున్నాడు చెర్రీ. తాజాగా ఈ విషయాన్ని కాదంబరి కిరణ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. 'మనకు తెలిసి రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడు, స్టార్ హీరో. కానీ నాకు తెలిసి ఆయన పెద్ద మనసున్న మనిషి. భక్తి , ప్రేమ, గౌరవం..ఇలాంటి విలువలు తెలిసిన మనిషి. సాటి మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం అతనిది. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే ఖర్చులకు సుకుమార్ అన్న చొరవతో రామ్ చరణ్‌ను సాయం అడిగి రూ.2 లక్షలు తీసుకుని మనం సైతం ద్వారా ఆ కార్యక్రమం పూర్తి చేశాను. అంతేకాకుండా సుక్కన్న, మనం సైతం, విజయ్ అన్న, రాము తదితరుల వద్ద లక్షా ఇరవై వేల రూపాయలు పోగుచేసి చనిపోయినామె నెలల పాప పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని ఇచ్చాం. ఇప్పుడు ఇన్నిరోజుల తర్వాత నేను ఎదురుపడితే రామ్‌చరణ్ ఆ పాప ఎలా ఉంది కాదంబరి గారూ? అని అడిగారు. అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది. బంగారు చెంచాతో పుట్టడం వేరు, బంగారు మనసుతో బతకడం వేరు. ప్రియచరణ్, నీకు భగవదాశీస్సులు' అంటూ వరుస ట్వీట్లు చేశాడు. దీన్ని ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తన ఫేస్బుక్లో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. మనకు తెలిసి రామ్ చరణ్ మన మెగాస్టార్ తనయుడు, స్టార్ హీరో నేను తెలుసుకున్నా..ఆయన అంతకంటే పెద్ద మనసున్న మనిషని భక్తి , ప్రేమ, గౌరవం..ఇలాంటి విలువలు తెలిసిన మనిషి. సాటి మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం అతనిది. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే pic.twitter.com/tjB9gTv66u — Manam Saitham kadambari kiran (@manamsaitham) April 12, 2022 నేను ఎదురుపడితే రామ్ చరణ్ "ఆపాప ఎలా వుంది కాదంబరి గారూ?" అని అడిగారు. అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది. బంగారు చెంచాతో పుట్టడం వేరు, బంగారు మనసుతో బతకడం వేరు. ప్రియ చరణ్! నీకు భగవదాశీస్సులు. — Manam Saitham kadambari kiran (@manamsaitham) April 12, 2022 చదవండి: కత్రీనా కైఫ్ ప్రెగ్నెంట్ ? నెట్టింట వీడియో వైరల్ యాక్షన్ బాట పట్టిన టాలీవుడ్ హీరోలు, టార్గెట్ అదేనట! -
కేసీఆర్‌ను కలిసిన 'మనం సైతం' కాదంబరి కిరణ్.. ఎందుకంటే ?
Manam Saitham Founder Kadambari Kiran Met CM KCR: రాజకీయనాయకులు, సినీ సెలబ్రిటీలకు మధ్య ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి. ఒకరివేడుకల్లో ఒకరు పాల్గొంటూ అనుబంధాలు పెంచుకోవడం పరిపాటే. టాలీవుడ్ నటుడు, 'మనం సైతం' వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కలిశారు. డిసెంబర్ 8న జరగనున్న తమ కుమార్తె వివహ మహోత్సవానికి రావల్సిందిగా కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ శుభలేఖను అందించారు. అలాగే 'మనం సైతం' ద్వారా సమాజహితం కోసం నిరంతరం అందిస్తున్న సేవా కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు కాదంబరి కిరణ్. కాదంబరి కిరణ్ ఎక్కువగా హాస్యప్రాధాన్యమున్న పాత్రల్లో నటించారు. ఇప్పటికీ 270 సినిమాల్లో నటించారు. 'అమ్మ నాన్న తమిళ అమ్మాయి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2013లో 'మనం సైతం' సంస్థ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీకి కాదంబరి కిరణ్ మద్దతు కూడా ఇచ్చారు. కాదంబరి కిరణ్ ఒక్కాగానొక్క కుమార్తె శ్రీకృతి వివాహం డిసెంబర్ 8న నిర్వహించనున్నారు. -
కేసీఆర్‌కే నా మద్దతు: కాదంబరి కిరణ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో పెద్దలు కేసీఆర్ సినిమా ఇండస్ట్రీని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు.. మనసున్న నేత కేసీఆర్ అన్నారు నటుడు, ‘మనం సైతం’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆయన మాట్లాడారు. ‘మనం సైతం’ తరఫున కేసీఆర్‌కి, టీఆర్ఎస్కి సపోర్టు చేస్తున్నాను అన్నారు. పేదవారికి సాయం చేసేందుకు తాను ఎప్పుడు వెళ్లిన కేటీఆర్, సంతోష్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ ఇండస్ట్రీకి కేటాయించబోయే 1500 ఎకరాల ఫిల్మ్ సిటీలో కొంతవరకు పేద కార్మికుల కోసం స్థలం ఇవ్వాలని కోరుకొంటున్నాను అన్నారు. (చదవండి: టాలీవుడ్‌కు వరాల జల్లు; కేసీఆర్‌కు చిరు కృతజ్ఞతలు) థియేటర్ల రీ ఓపెనింగ్.. కేసీఆర్‌కు ధన్యవాదాలు థియేటర్లు రీఓపెనింగ్ చేసుకునేలా జీవో ఇవ్వడంతో పాటు సినీ ఇండస్ట్రీకి లాభం చేకూర్చేలా పలు నిర్ణయాలు ప్రకటించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలుగు ఇండస్ట్రీ తరపున తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ధన్యవాదాలు తెలిపింది. చిన్న సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఇచ్చినందుకు.. థియేటర్లు ఇష్టప్రకారం షోలు పెంచుకునేందుకు.. సినిమా టికెట్ల ధరను 50 రూపాయల నుంచి 250 రూపాయల వరకు నిర్ణయించుకునేందుకు నిర్మాతలకు అధికారం ఇచ్చినందుకు.. సినీ కార్మికులకు రేషన్, హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చినందుకు తెలుగు సినీ నిర్మాతల మండలి నుంచి ప్రెసిడెంట్ సి.కల్యాణ్, సెక్రటరీలు పసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల.. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడేందుకు తీవ్రంగా కృషి చేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జునకు కృతజ్జతలు తెలిపారు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇతర డిపార్ట్‌మెంట్స్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. -
కాదంబరికి డాక్టరేట్
‘మనం సైతం’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిర్విరామంగా సేవలు అందిస్తున్న నటుడు కాదంబరి కిరణ్‌ని డాక్టరేట్ వరించింది. ఆయన సేవలను గుర్తించిన ‘గ్లోబల్ పీస్ యూనివర్సిటీ’ వారు గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. పాత్రికేయుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కాదంబరి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘మనం సైతం’ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలందిస్తున్నారు. కరోనా వంటి క్లిష్ట కాలంలో కాదంబరి అందిస్తున్న సేవలు ఆయనకు మరింత పేరు తెచ్చిపెడుతున్నాయి. ‘‘ఈ డాక్టరేట్‌తో నా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నా’’ అన్నారు కాదంబరి కిరణ్. కాగా ఆయనకు డాక్టరేట్ ప్రకటించడం పట్ల పలువురు సినీ ప్రముఖులు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. -
సినీ కార్మికులకు చేయూత
నటుడు కాదంబరి కిరణ్ సారథ్యంలోని ‘మనం సైతం’ ఆధ్వర్యంలో కరోనా కాలంలో ఇప్పటికే వేలాదిమందికి వంట సరుకులు ఉచితంగా అందించిన సంగతి తెలిసిందే. తాజాగా 230 మంది సినీ కార్మికులు, నిరుపేదలకు మంతెన వెంకట రామరాజువారి ‘వసుధ ఫౌండేషన్’ ద్వారా ఆర్థికసాయం అందించారు. దర్శకులు వీవీ వినాయక్, హీరోయిన్ పూనమ్ కౌర్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. కాదంబరి కిరణ్ చేస్తున్న నిస్వార్థ సేవకు తమ వంతుగా మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశ్యంతో ‘మనం సైతం’ కు ‘వసుధ ఫౌండేషన్’ చేయూత అందిస్తోందని మంతెన వెంకట రామరాజు అన్నారు. అనంతరం పూనమ్ కౌర్ చేతుల మీదుగా ‘మనం సైతం’ కార్యాలయం వద్ద మొక్క నాటించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, బీబీజీ రాజు, ‘మనం సైతం’ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ఐదు లక్షలు విరాళం
కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో రోజువారీ వేతనంతో బతికే పేద కళాకారులు, సాంకేతిక నిపుణులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారికి సాయం చేసేందుకు డైరెక్టర్ వీవీ వినాయక్ ఐదు లక్షలు విరాళం అందించారు. నటుడు కాదంబరి కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ‘మనం సైతం’ ఫౌండేషన్‌కు ఆయన ఈ నగదును అందజేశారు. ఈ సందర్భంగా వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘ఈరోజు అందర్నీ వణికిస్తోన్న కరోనా వైరస్‌ను మనం ఇళ్లల్లో ఉండి వణికించాలి. షూటింగ్స్ లేకపోవడంతో నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు నిత్యావసర వస్తువులను అందజేసే నిమిత్తం నా వంతుగా రూ. 5 లక్షల చెక్కును కాదంబరి కిరణ్‌కి అందజేశా. అవసరమైనవారు కిరణ్‌ని సంప్రదించి నిత్యావసర వస్తువులను తీసుకోవాలి’’ అన్నారు. నిర్మాత రామసత్యనారాయణ, వల్లభనేని అనిల్ పాల్గొన్నారు. -
కృష్ణ.. ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’
సాక్షి, హైదరాబాద్ : ఎంపీ సంతోష్‌కుమార్ విసిరిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ను స్వీకరించిన సినీ నటుడు కృష్ణ మంగళవారం మొక్కలు నాటారు. తమిళ నటుడు రజనీకాంత్, తెలుగు నటులు వెంకటేశ్, పవన్ కళ్యాణ్‌కు సవాలు విసిరారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించిన సంతోష్‌కుమార్‌ను అభినందించిన కృష్ణ, త్వరలోనే ఇది 10 కోట్ల మొక్కలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరూ 3 మొక్కలు నాటి, వాటి సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్‌తో పాటు నటుడు కాదంబరి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. -
‘సారు..కారు..16’కు మద్దతు
పంజగుట్ట: టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, నిరుపేదలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అములు చేస్తోందని సినీనటుడు, ‘మనంసైతం’ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ అన్నారు. ‘చిన్న సారు.. కారు.. 16’ లక్ష్యంగా తాము సైతం టీఆర్ఎస్కు సహకారం అందిస్తామని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురి కుటుంబాలకు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థికసాయం అందించారు. ఈ సంరద్భంగా కిరణ్ మాట్లాడుతూ.. తన 35 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, పేదరికం నుండి పైకి వచ్చానన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమన్నారు. బెల్లంపల్లిలో ఓ రైతు భూమిని వీఆర్ఓ అక్రమంగా లాక్కుంటే వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి అప్పటికప్పుడు బాధితుడికి సాయం చేశారని, పేదవారు ఇబ్బందుల్లో ఉంటే ఎలా స్పందిస్తారో సీఎం స్వయంగా చూపించారన్నారు. తమ వంతు బాధ్యతగా 16 లోక్‌సభ స్థానాల్లో ప్రచారం నిర్వహించి టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫిలిం ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్రావు(బందర్ బాబీ), జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్ వల్లభనేని, సురేష్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వరంగల్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు బొట్టుపల్లి రాజ్‌కుమార్ కొడుకు సోమేశ్వర్ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ తీవ్రంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. వాచ్‌మెన్‌గా జీవనం కొనసాగిస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పుల్లయ్యకు, ఇటీవలే భార్య చనిపోయి, తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న డ్రైవర్ నాగేశ్వర రావుకు ఈ సందర్భంగా కిరణ్ ఆర్థిక సాయం అందించారు. -
సినీ కార్మికులకు ఆరోగ్యభీమా కల్పిస్తాం
‘‘నిత్యం పోటీ ఉండే చిత్ర పరిశ్రమలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం. కాదంబరి కిరణ్‌తో పాటు ‘మనంసైతం’ బృందాన్ని అభినందిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని విభాగాల కార్మికులకు ఆరోగ్య భీమా సౌకర్యం లేదని తెలిసింది. అలాంటి శాఖల సినీ కార్మికులకు ఎఫ్డీసీ నుంచి సగం ఖర్చు తగ్గిస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తాం’’ అని ఎఫ్డీసీ చైర్మన్ పి. రామ్మోహన్ రావు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ‘మనం సైతం’ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రామ్మోహన్ రావు పదిమంది పేదలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘చిత్రపురి కాలనీలో ఓ వైద్యశాల నిర్మించాలని ప్రయత్నిస్తున్నాం. ‘మనం సైతం’ కార్యక్రమానికి నేను ఎప్పుడు అందు బాటులోనే ఉంటాను’’ అన్నారు. ‘‘మానవత్వం ఇంకా మిగిలే ఉందని మనం సైతం కార్యక్రమానికి వచ్చిన తర్వాత అనిపిస్తోంది. చాలా మంచి కార్యక్రమం’’ అని మాజీ మంత్రి లక్షా్మరెడ్డి సతీమణి శ్వేతా లక్షా్మరెడ్డి అన్నారు. ‘‘నేను ఎదుర్కొన్న బాధలు, కోపం, కసి, ప్రతీకారం, ఆవేదనల నుంచి మొదలైనదే ఈ మనం సైతం కార్యక్రమం. ఏడుగురు సభ్యులతో మొదలైన మా బృందంలో ఇప్పుడు దాదాపు లక్షా డెబ్భై వేలమంది ఉన్నారు’’ అన్నారు కాదంబరి కిరణ్. దర్శకుడు దశరథ్ తదితరులు పాల్గొన్నారు. -
మూఢ నమ్మకాలపై సందేశం
నందు, అనురాధా, బాలాజీ, ప్రమీల ముఖ్య తారలుగా ఫణిరామ్ తూఫాన్ దర్శకత్వంలో శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘ఐందవి’. ఎస్ఏ అర్మాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నటుడు కాదంబరి కిరణ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఫణిరామ్ తూఫాన్ మాట్లాడుతూ– ‘‘కొందరు యువతీ యువకులు సరదాగా గడుపుదామని ఇంటి నుంచి వెళతారు. అనుకోకుండా వారు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నారన్నదే ఈ సినిమా కథాంశం. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. మూఢ నమ్మకాలను ఆశ్రయించొద్దనే సందేశాన్ని ఇస్తున్నాం’’ అన్నారు. ‘‘ఓ సక్సెస్ఫుల్ ఫార్ములాను అనుసరించి ఈ సినిమా నిర్మించాం. అతీంద్రియ శక్తులు, హారర్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది. త్వరలో రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు శ్రీధర్. ∙బాలాజీ, ప్రమీల -
అసహాయులకు అండ..మనం సైతం
మనం బతకడమే కాదు.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనేదే ఆయన తత్వం.పేదవాళ్లకు ఎంతోకొంత సహాయం చేయాలనేదే ఆయన మనస్తత్వం. సినీ రంగంతో పాటు సమాజంలోని అసహాయులకు ఆసరాగా నిలవాలన్నదే ఆయన ఆశయం. ఆ దిశగా తనవంతు కృషి చేస్తున్నారు సినీ, టీవీ ఆర్టిస్ట్ కాదంబరి కిరణ్. ఇందుకు ‘మనం సైతం’ పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కిరణ్.. సినీరంగ ప్రస్థానం, సేవా కార్యక్రమాల విశేషాలు ఆయన మాటల్లోనే... నేను చిన్నప్పటి నుంచే పేదలకు సహాయం చేస్తుండేవాణ్ని. ఇందులో నా సన్నిహితులనూ భాగస్వాములను చేసేవాణ్ని. సినీ కార్మికులు, సమాజంలోని పేదలను చూసి చలించిపోయాను. వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో మూడేళ్ల క్రితం ‘మనం సైతం’ గ్రూప్ ఏర్పాటు చేశాను. ఫేస్బుక్, వాట్సప్, వెబ్సైట్ ద్వారా పేదల సమస్యలు వివరిస్తూ... నా వంతు సహాయాన్ని అందిస్తున్నాను. ఇందులో సినీ, రాజకీయ, సన్నిహితులను భాగస్వాములు చేస్తున్నాను. అన్ని రంగాలకు చెందిన వారు ఇందులో పాల్గొని సహాయం చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ రూ.2 లక్షలు విరాళమిచ్చారు. పలువురు సినీ పెద్దలు సైతం తోడ్పాటునందిస్తుండటం ఆహ్వానించదగిన పరిణామం. అలా మొదలైంది.. సిటీలో ఉంటున్న మా మేనమామల దగ్గర ఉండి చదువుకునేందుకు 1973లో కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చాను. సినిమాలపై ఆసక్తి ఉన్నా నాటకాల్లో రాణించాలని నాటక రంగంలో చేరాను. అయితే నాటకాల్లో అవకాశాలు తక్కువగా వచ్చేవి. 1986లో టీవీ రంగంలో అడుగుపెట్టాను. దర్శకుడిగా, నిర్మాతగా ‘లవ్ ఆల్ ఫస్ట్ సైట్’ అనే టెలీఫిలిం తీశాను. అది హిట్ అవడంతో టీవీ రంగంలోని అన్ని విభాగాల్లో పనిచేశాను. ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’, ‘కస్తూరి’ సీరియళ్లతో పాటు టీవీ ప్రోగ్రామ్స్ చేశాను. అదే టర్నింగ్ పాయింట్.. నా తొలి సినిమా జంధ్యాల దర్శకత్వం వహించిన ‘ప్రేమా జిందాబాద్’. ఆ తర్వాత బావా బావా పన్నీర్ తదితర సినిమాలు చేశాను. అయితే ‘అమ్మా.. నాన్మ.. ఓ తమిళ అమ్మాయి’లో ‘ఏమిరా బాలరాజు.. నీవల్ల దేశానికి ఏమిరా ఉపయోగం’ అంటూ కమెడియన్ ధర్మవరపు సుబ్రమణ్యం రివర్స్ పంచ్‌తో కుదేలైన బాలరాజు పాత్ర నాకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ తర్వాత దేశముదురు, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, లై, గోవిందుడు అందరి వాడేలే సినిమాల్లో చేశాను. ఇప్పటికి 270 సినిమాల్లో నటించాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మొదటి నుంచీ భాగస్వామిగా ఉన్నాను. ప్రస్తుతం రంగస్థలం, వీవీ వినాయక్, కొరటాల శివ సినిమాల్లో నటిస్తున్నాను. కేటీఆర్, పవన్ ఇష్టం రాజకీయాల్లో మంత్రి కేటీఆర్ చాలా ఇష్టం. నిరాడంబరంగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ సమర్థవంతమైన నాయకుడు. నటుడు పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఎదుటివారు కష్టాల్లో ఉంటే చలించి ఎంతదూరానికైనా వెళ్లే మనస్తత్వం ఆయనది. అనాథ చిన్నారులతో... -
'మా' అమ్మకు 700 మంది పిల్లలు: కాదంబరి
హైదరాబాద్: మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో సినిమా పాలిటిక్స్ వేడేక్కాయి. అధ్యక్ష బరిలో నిలిచిన రాజేంద్రప్రసాద్ ప్యానల్ బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం పెట్టి మురళీమోహన్ వర్గంపై విరుచుకుపడింది. నాగబాబు, శివాజీ రాజా, కాదంబరి కిరణ్ కుమార్... రాజేంద్రప్రసాద్ కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ... మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా) తమకు అమ్మ లాంటిదనాన్నరు. 'మా' అమ్మకు 700 మంది పైచిలుకు పిల్లలున్నారని చెప్పారు. తమ అసోసియేషన్ పేద కళాకారులకు ఎందుకు దూరమవుతుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పేద కళాకారులకు సేవ చేయాలన్న లక్ష్యంతో బతుకుతున్నానని కిరణ్ తెలిపారు. తన ఊపిరి ఉన్నంతవరకు సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు. -
ఇప్పటికీ ఆ ఫలితాన్ని అనుభవిస్తూనే ఉన్నాను - కాదంబరి కిరణ్
ఆటుపోట్లు, చిన్న చిన్న సుడిగుండాలు, పెద్ద పెద్ద వాయు గుండాలు... వెరసి సముద్రం. యాజిటీజ్‌గా మనిషి జీవితం కూడా అంతే. వాటన్నింటినీ అధిగమించిన వాడే స్థితప్రజ్ఞుడు. నటుడు కాదంబరి కిరణ్‌కుమార్ కూడా అలాంటివాడే. తన జీవితాన్ని ఒక్కసారి పరికించి చూస్తే... అన్నీ ఆటుపోట్లే కనిపిస్తాయి. నటన, దర్శకత్వం, నిర్మాణం... ఇలా రకరకాల ఆయుధాలతో విధితో పారాడి.. కాదు కాదు.. పోరాడు తున్న ఈ పోరాట సీనియర్ అండ్ సిన్సియర్ పర్సన్‌తో కాసేపు... *** ప్రస్తుతం ఏ ఏ సినిమాల్లో నటిస్తున్నారు? ‘అత్తారింటికి దారేది’ చేశా. ఇది గాక ఓ 13 సినిమాలు లైన్లో ఉన్నాయి. అలాగే కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నా. ఒకటి హిట్టయినా... ఫైనాన్షియల్‌గా కాస్త బలపడతా కదా. *** ఇండస్ట్రీ పరిస్థితి పెద్ద బాలేదంటున్నారు. ఇలాంటి టైమ్‌లో రిస్కులు పెట్టుకోవడం కరెక్ట్ కాదేమో? రిస్క్ అనేది నా లైఫ్‌లోనే ఉందన్నా. అలాంటివి పట్టించుకుంటే... బహుశా ఈ స్థాయిలో ఉండేవాణ్ణి కాదేమో. జీవితంలో తెలిసి కొన్ని తప్పులు చేశా. తెలీక ఇంకొన్ని తప్పులు చేశా. దీని వల్ల పెద్ద వాళ్లకు దూరమయ్యా. కొందరికైతే మిత్రుణ్ణయ్యా. ఓ విధంగా చెప్పాలంటే... నా జీవితమే... ఓ గ్రంథం. *** అదేంటో కాస్త వివరంగా చెబుతారా? మాది కాకినాడ. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే క్రేజ్. నటుణ్ణి అవ్వాలంటే... నాటకాన్ని మించిన ఇనిస్టిట్యూట్ ఉండదు కదా. కాకినాడలో ఎక్కువ అవకాశాల్లేవు. హైదరాబాద్‌లో మా అమ్మమ్మ, మావయ్య ఉండేవారు. వాళ్లని వంకగా చెప్పి... హైదరాబాద్ వచ్చేశాను. ముందు నాటకాల్లో అవకాశాల కోసం తిరిగా. ఎట్టకేలకూ ‘నిజం చెప్పకు’ అనే నాటకంలో వేషం దొరికింది. తర్వాత కొన్ని నాటకాలు, ఆ తర్వాత టెలివిజన్. దాంతో ఇక్కడ నేను బతకగలను అనే నమ్మకం పెరిగింది. 1986లో దూరదర్శన్‌లో నిర్మాత స్థాయికి ఎదిగాను. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అనే టెలీఫిలిం చేశాను. నేనే దర్శకుణ్ణి కూడా. నటునిగా నాకు తొలి అవకాశం ఇచ్చిన శశికుమార్‌ని హీరోగా పెట్టాను. ఇక ఆ తర్వాత కథ మీకు తెలిసిందే... *** మరి జర్నలిజంలోకి ఎందుకు వెళ్లారు? నాకు సినిమాలంటే పిచ్చి అని చెప్పాను కదా! సినిమా వాళ్లతో ఇంటరాక్ట్ అవ్వాలంటే... సినిమా జర్నలిజాన్ని మించింది లేదు. అందుకే జర్నలిజం కోర్స్ జాయిన్ అయ్యాను. తర్వాత ఓ ప్రముఖ సినీ వారపత్రికలో ఉద్యోగం సంపాదించా. కానీ నేను దూరదర్శన్‌లో నాటికలు చేసుకోవడం సదరు యాజమాన్యం వారికి నచ్చలేదు. నాకు మెమో ఇచ్చారు. నేను అక్కడున్నవారందరికీ స్వీట్లు పంచి ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశాను. ఎందుకంటే నాకు నటనే ముఖ్యం. *** మరి ‘కుర్రాళ్ల రాజ్యం’ (1996)తో దర్శకుడు కూడా అయ్యారుగా? అయిష్టంతోనే ఆ సినిమా అంగీకరించా. కానీ ఇద్దరు నిర్మాతలు మారారు. చివరకు మోసం కూడా చేశారు. దాంతో పాటు ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. హిట్ అయితే... మరో అంతస్తుకి ఎదుగుతాం. పోతే... మన అంతస్తు మనకుందిగా అనుకున్నాను కానీ, ఒక్క ఫ్లాప్‌తో అధఃపాతాళానికి దిగిపోతాననుకోలేదు. సినిమా పరిశ్రమలో మోసాలు ఆ సినిమా ద్వారా రుచి చూసి కూడా, ఇంకా ఎన్నో రకాలుగా మోసపోయాను. *** ఎన్నో రకాలుగా అంటే...? ఓ దర్శకుడు జెమినీ టీవీలో సెటైరికల్ ప్రోగ్రామ్స్ చేస్తుండేవారు. ఆ ప్రోగ్రామ్‌లో నాతో ఓ పాత్ర చేయించాడు. అది చిరంజీవిగారి సినిమాను విమర్శిస్తూ చేసిన ప్రోగ్రామ్. అందుకే నాతో చిరంజీవి గెటప్ వేయించి ఆ ప్రోగ్రామ్ తీశారు. టెలికాస్ట్ అయ్యింది. దాంతో చిరంజీవిగారి ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. ఇప్పటిక్కూడా ఆ ఫలితాన్ని అనుభవిస్తూనే ఉన్నాను. కానీ ఆ దర్శకుడికి మాత్రం చిరంజీవిగారు పిలిచి అవకాశం ఇచ్చారు. అతనెవరో కాదు... జయంత్ సి.పరాన్జీ. అలాగే... ఈవీవీగారు అప్పట్లో నాతో సినిమా ట్రయిలర్స్ చేయించేవారు. నేను కూడా ఎంతో ఇష్టంగా చేసేవాణ్ణి. ఓసారి ఎస్వీకృష్ణారెడ్డిగారిని టార్గెట్ చేస్తూ నాతో ఓ ట్రయిలర్ చేయించారు. ఆ ట్రయిలర్ ఆంతర్యం నాకు తెలీదు. తెలీకుండానే చేశాను. కానీ టెలీకాస్ట్ అయ్యాక... కృష్టారెడ్డిగారి కోపానికి గురయ్యాను. ఎన్టీఆర్ కేరక్టర్ చేసి కోట శ్రీనివాసరావు నష్టపోయారు. రేపు నీ గతీ అంతే... అన్నారు కృష్ణారెడ్డి. అనుకున్నట్లే నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదాయన. కానీ రెండోరోజే... ఈవీవీ, కృష్ణారెడ్డి గార్లు మాత్రం వేరే ఓపెనింగ్‌లో కలిసి టెంకాయలు కొట్టారు. ఇవన్నీ నాకు గుణపాఠాలు. *** జీవితంలో మరిచిపోలేని అంశం? ఏయన్నార్ కథానాయకుడిగా రెండు సీరియల్స్ చేయడం. మట్టిమనిషి, ఒకేఒక్కడు పేరుతో నేను తీసిన ఆ సీరియల్స్ నా జన్మ ధన్యం చేశాయి. నటునిగా చాలా పాత్రలు చేశాను. గుర్తుంచుకునే పాత్రలు మాత్రం తక్కువే కావచ్చు. కానీ మంచి పాత్రలు వస్తాయని మాత్రం నమ్మకంతో ఉన్నాను.