దీనస్థితిలో పావలా శ్యామల.. కాదంబ‌రి కిర‌ణ్ ఆర్థిక సాయం! | Actor Kadambari Kiran Financial Help To Pavala Syamala, Deets Inside - Sakshi
Sakshi News home page

దీనస్థితిలో పావలా శ్యామల.. ఆర్థిక సాయం చేసిన కాదంబ‌రి కిర‌ణ్!

Published Thu, Jan 4 2024 5:17 PM | Last Updated on Thu, Jan 4 2024 5:55 PM

Kadambari Kiran Helps To Pavala Syamala - Sakshi

సినీ నటుడు,‘మనం సైతం' ఫౌండేషన్ నిర్వ‌హ‌కులు కాదంబ‌రి కిర‌ణ్ మరోసారి దాతృత్వం చాటుకున్నాడు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ సీనియ‌ర్ న‌టి పావ‌ల శ్యామ‌ల‌కు ఆర్థిక స‌హాయం అందించి మాన‌వ‌త్వం చాటుకున్నాడు. సీనియ‌ర్ న‌టి పావ‌ల శ్యామ‌లకు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు ఆర్థిక స‌మ‌స్య‌లు తోడ‌య్యాయి. ఈ విష‌యం తెలుసుకున్న కాదంబ‌రి కిర‌ణ్.. ఆమెకు రూ. 25,000 చెక్కును అందించారు. పావ‌ల శ్యామ‌లకు మెరుగైన వైద్యం, క‌నీస అవ‌స‌రాల‌ను తీర్చేలా సాయం చేశారు.  

(చదవండి: అమ్మ చనిపోయిన కాసేపటికే ఏడుపు ఆపేశా: శ్రీదేవి చిన్నకూతురు)

 మీడియా ద్వారా విషయం  తెలుసుకున్న కాదంబరి కిరణ్ హైదరాబాద్ శివారులోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న నటి శ్యామల ను  తనంతట తానే వెతుకుంటు వెళ్లి స్వయంగా  సాయం చేసి పెద్దమనసు చాటుకున్నారు . ఆయ‌న మాన‌వ‌త్వానికి ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సినీ పరిశ్రమలో పేద కార్మికులకు, అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేయడానికి ‘మనం సైతం' అనే ఫౌండేషన్ స్థాపించి దశాబ్దం పైగా  నిర్విరామంగా  సేవలు కొనసాగించడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement