ప్రముఖ నటి పావలా శ్యామల (Pavala Syamala) కొన్నేళ్లుగా అనారోగ్యంతో సతమతమవుతోంది. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు అనారోగ్యం ఆమెను కుంగదీస్తోంది. మొదట్లో అద్దె ఇంట్లో ఉన్న ఆమె తర్వాత అనాథాశ్రమంలోకి షిఫ్ట్ అయింది. దాదాపు 300 సినిమాలు చేసి గొప్ప నటిగా కీర్తి పొందిన ఆమె ఏళ్ల తరబడి సాయం కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఆమె అడిగినప్పుడల్లా ఒకరిద్దరు సాయం చేస్తున్నా అది తన మందులకే సరిపోతోంది.
కొన ఊపిరితో ఉన్నా..
ఈ క్రమంలో తాజాగా మరోసారి పావలా శ్యామల తనకు సాయం చేయమని అర్థిస్తోంది. 'యాభై ఏళ్లు ఆర్టిస్టుగా బతికాను. ఈ మూడు సంవత్సరాల నుంచి నాకు ఎంత కష్టంగా ఉందో మీ అందరికీ తెలుసు. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ ఎవరూ స్పందించలేదు. ఎలాగోలా ఇంతవరకు లాక్కొచ్చాను. ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాను.
(చదవండి: పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. అబ్బాయి పేరెంట్స్ అయినా చెప్పాలిగా)
నేను చస్తే మనశ్శాంతిగా ఉంటుందా?
నా బిడ్డ కోసం బాధగా ఉంది. తను మాట్లాడలేదు. ఒక ఆర్టిస్టు బలవంతంగా విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా? ఎంతోమంది హీరోలతో కలిసి పని చేశాను. చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా పెద్దపెద్ద హీరోలతో చేశా.. ఆఖరికి ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నాను.
శక్తి లేదు
కానీ నా బిడ్డను చంపుకోలేకపోతున్నాను. ట్రీట్‌మెంట్ చేయించుకోలేక చాలా అవస్థ పడుతున్నాను. ఎవరికీ స్పందించే గుణం లేదా? ఇలా అనాథగా చంపేస్తారా? ఎవరి మనసులూ కరగవా? ఎవరికైనా నా దీన పరిస్థితి గురించి తెలుసా, తెలియదా? తెలియకపోతే దయచేసి ఈ వీడియో ద్వారా తెలియజేయమని కోరుకుంటున్నాను. నాకు ఇంక మాట్లాడే శక్తి లేదు' అంటూ సాయం చేయమని వేడుకుంటోంది.
సినిమా
పావలా శ్యామల.. కర్తవ్యం, అల్లరి రాముడు, మనసంతా నువ్వే, ఖడ్గం, ఇంద్ర, ఠాగూర్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, నిన్నే ఇష్టపడ్డాను, గోలీమార్, శ్రీమన్నారాయణ, డీ ఫర్ దోపిడి, మత్తు వదలరా.. ఇలా వందలాది చిత్రాల్లో నటించింది. తన విచిత్రమైన డైలాగ్ డెలివరీతో అందరినీ అలరించింది. ఎంతోమందికి వినోదాన్ని పంచిన ఆమె ఇప్పుడు చావు కోసం ఎదురుచూస్తుండటం శోచనీయం.
చదవండి: దుబాయ్ కారు రేసింగ్.. అజిత్ కుమార్ టీమ్ క్రేజీ రికార్డ్
Comments
Please login to add a commentAdd a comment