'మళ్లీ చూస్తానో లేదో'.. కన్నీళ్లు పెట్టిస్తున్న నటి పావలా శ్యామల మాటలు! | Senior Actress Pavala Syamala Emotional Comments On Her Present Health Situation, Latest Video Goes Viral - Sakshi
Sakshi News home page

Pavala Syamala Emotional Video: అందరు హీరోలతో నటించా.. కానీ నా బ్రతుకు చివరకు ఇలా

Published Tue, Mar 12 2024 7:57 AM | Last Updated on Tue, Mar 12 2024 8:57 AM

Pavala Syamala Latest Video Comments On Her Health Situation - Sakshi

ఇండస్ట్రీ రంగుల ప్రపంచం. పైకి కనిపించేదంతా నిజం కాదు. చాలామంది నటీనటులు సినిమాల్లో పేరు తెచ్చుకున్నప్పటికీ ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉంటారు. తెలుగు సీనియర్ నటి పావలా శ్యామల కూడా ప్రస్తుతం అలాంటి దీనస్థితిలోనే ఉన్నారు. చిరంజీవి, వెంకటేశ్, నాని, గోపీచంద్.. ఇలా చాలామంది స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. కానీ ఆర్థికంగా స్థిరపడలేకపోయారు. ప్రస్తుతం అనాథాశ్రమంలో బతుకు వెళ్లదీస్తున్నారు.

(ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?)

గత కొన్నాళ్ల నుంచి పావలా శ్యామల దీనస్థితి గురించి ఏదో ఒక వీడియో కనిపిస్తూనే ఉంది. నటుడు కాదంబరి కిరణ్ కూడా ఈమెకు మనం ఫౌండేషన్ తరఫున రూ.25 వేల వరకు సాయం చేశారు. ప్రస్తుతం వీల్ ఛైర్‌కే పరిమితమైన పావలా శ్యామల.. తాజాగా ఓ రియాలిటీ షోకు వచ్చారు. తన మాటలతో అక్కడున్న వాళ్లందరినీ కంటతడి పెట్టించారు.

'అందరు హీరోలతో నటించాను. అన్ని హిట్ సినిమాల్లో ఉన్నాను. కానీ చివరకు నా బ్రతుకు ఇలా అవుతుందనుకోలేదు. ఇంతటి దుస్థితి వస్తుందని ఊహించలేదు. నా కష్టాలని చెప్పుకొని మిమ్మల్ని బాధపెట్టాలని మళ్ల మీ ముందుకు రాలేదు. నేను బ్రతికుండి మళ్లీ మిమ్మల్ని చూస్తానో లేదో అనే భయంతో, ఒకసారి మీకు కనిపించి మీ అభిమానం పొందాలని ఇప్పుడు వచ్చాను' అని పావలా శ్యామల చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement