సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత రిలీజ్‌కు ముందే ఫుల్ పాజిటివ్ బజ్ ఏర్పాటు చేసుకున్న సినిమా తండేల్(Thandel Movie). నాగచైతన్య, సాయి పల్లవి(Sai Pallav)i జంటగా నటించిన ఈ చిత్రానికి ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా తండేల్ సాంగ్సే వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోయింది. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవిరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. మరి సెన్సార్ సభ్యులు ఇచ్చిన రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం.
బ్లాక్ బస్టర్ పక్కా!
సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదని, 'బ్లాక్ బస్టర్' పక్కా అని సెన్సార్ సభ్యులు తీర్పు ఇచ్చారట. ఇప్పటికే ఈ చిత్రంపై నిర్మాత అల్లు అరవింద్ ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు. 'తండేల్'కు అల్లు అరవింద్ 100 కు వంద మార్కులు ఇచ్చారని గీతా ఆర్ట్ సంస్థ తెలిపింది. ఇక నాగచైతన్య కెరీర్లో భారీ కలెక్షన్స్ తెచ్చే చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని నిర్మాత బన్నీ వాసు మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు.
నిడివి ఎంతంటే..
తండేల్ సినిమాను చాలా క్రిస్పీగా కట్ చేశారట. అనవసరం సన్నివేశాలు లేకుండా కథను మాత్రమే ఎలివేట్ చేసేలా సీన్స్ ఉంటాయట. యాడ్స్‌తో కలిసి 2:32 గంటల నిడివి మాత్రమే ఉంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కథనం ఎమోషనల్‌గా సాగుతుందని చిత్రబృందం తెలుపుతోంది.
తండేల్ కథేంటే..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ జాలరి కథ ఇది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. అయితే సినిమా మొత్తంలో పాకిస్తాన్ ఎపిసోడ్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందట. మిగతా కథంతా రాజు-బుజ్జితల్లి పాత్రల చుట్టే తిరుగుతుందట. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment