Censor Reports
-
‘తండేల్’ సెన్సార్ టాక్.. బొమ్మ అదిరిందట!
సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత రిలీజ్‌కు ముందే ఫుల్ పాజిటివ్ బజ్ ఏర్పాటు చేసుకున్న సినిమా తండేల్(Thandel Movie). నాగచైతన్య, సాయి పల్లవి(Sai Pallav)i జంటగా నటించిన ఈ చిత్రానికి ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా తండేల్ సాంగ్సే వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోయింది. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవిరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. మరి సెన్సార్ సభ్యులు ఇచ్చిన రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. బ్లాక్ బస్టర్ పక్కా!సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదని, 'బ్లాక్ బస్టర్' పక్కా అని సెన్సార్ సభ్యులు తీర్పు ఇచ్చారట. ఇప్పటికే ఈ చిత్రంపై నిర్మాత అల్లు అరవింద్ ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు. 'తండేల్'కు అల్లు అరవింద్ 100 కు వంద మార్కులు ఇచ్చారని గీతా ఆర్ట్ సంస్థ తెలిపింది. ఇక నాగచైతన్య కెరీర్లో భారీ కలెక్షన్స్ తెచ్చే చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని నిర్మాత బన్నీ వాసు మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు.నిడివి ఎంతంటే.. తండేల్ సినిమాను చాలా క్రిస్పీగా కట్ చేశారట. అనవసరం సన్నివేశాలు లేకుండా కథను మాత్రమే ఎలివేట్ చేసేలా సీన్స్ ఉంటాయట. యాడ్స్‌తో కలిసి 2:32 గంటల నిడివి మాత్రమే ఉంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కథనం ఎమోషనల్‌గా సాగుతుందని చిత్రబృందం తెలుపుతోంది.తండేల్ కథేంటే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ జాలరి కథ ఇది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. అయితే సినిమా మొత్తంలో పాకిస్తాన్ ఎపిసోడ్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందట. మిగతా కథంతా రాజు-బుజ్జితల్లి పాత్రల చుట్టే తిరుగుతుందట. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. -
‘ఆదిపర్వం’ పై సెన్సార్ సభ్యులు ప్రశంసలు
ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ - ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మిస్తున్నాయి. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ (U/A) సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. ఇటీవల ఐదు భాషల్లో విడుదలైన ట్రైలర్ కు అసాధారణ స్పందన లభిస్తోంది. ఈ చిత్రం పాటలు "అన్విక ఆడియో" ద్వారా విడుదలయ్యాయి. దాదాపు రెండు వందలమందికి పైగా నటీనటులు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతుండడం చెప్పుకోదగ్గ విశేషం.దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ..."బహు భాషల్లో రూపొందిన "ఆదిపర్వం" అద్భుతంగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ట్రైలర్ కి వస్తున్న అసాధారణ స్పందనకు తోడు సెన్సార్ సభ్యుల ప్రశంసలు ఈ చిత్రంపై మా నమ్మకాన్ని రెట్టింపు చేశాయి. త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం" అన్నారు! -
‘శ్రీనివాస కళ్యాణం’ సెన్సార్ రిపోర్ట్
లై, ఛల్‌మోహన్ రంగా సినిమాల ఫలితాలతో నితిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ ఆశించినంత మేర విజయం సాధించలేకపోయాడు. ఈ కుర్ర హీరో తన సినీ కెరీర్లో మరిచిపోలేని హిట్ ఇచ్చిన దిల్ రాజుతో కలిసి మళ్లీ ఇన్నేళ్లకు ఇంకో సినిమాను చేస్తున్నాడు. ‘దిల్’ సినిమా ఇటు నితిన్, దిల్ రాజు కెరీర్స్‌ను నిలబెట్టింది. మళ్లీ వీరిద్దరు కలిసి ‘శ్రీనివాస కళ్యాణం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌కు విపరీతమైన స్పందన వస్తోంది. భారీ తారాగణంతో వస్తోన్న ఈ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్, రాజేంద్ర ప్రసాద్, జయసుధల నటన ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. హీరో హీరోయిన్ల కూల్ లుక్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను శనివారం పూర్తి చేసుకుంది. సెన్సార్ కత్తెరకు పని చెప్పకుండా.. క్లీన్ యూ సర్టిఫికేట్‌ను పొందినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. 2 hours and 20 minutes. Zero cuts. All set for a grand release on August 9th. #SrinivasaKalyanam@actor_nithiin @RaashiKhanna @Nanditasweta @mickeyjmeyer Directed by #vegesnasatish. #SrinivasaKalyanamFromAug9th pic.twitter.com/ActZnbuga6 — Sri Venkateswara Creations (@SVC_official) August 4, 2018 -
స్పైడర్ ఎలా ఉందంటే..
‘స్పైడర్’తో సూపర్‌స్టార్ మహేశ్ బాబు మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని సినీ విశ్లేషకుడు, సెన్సార్‌బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. స్పైడర్ సినిమా మొత్తంలో బోరింగ్ ఎలిమెంట్లు అస్సలు లేవని, సినిమా బాగా వచ్చిందని, అద్భుతంగా ఉందని తనకు సెన్సార్‌బోర్డ్ సభ్యులు చెప్పారని పేర్కొన్నారు. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో సినిమా మొత్తం ప్రేక్షకులను అలరిస్తుందంటున్నారు. మొత్తానికి ఈ దసరాకు మహేశ్‌బాబు ఓ సూపర్ హిట్ కొట్టడం ఖాయమని తేల్చిచెప్పేస్తున్నారు. ఇప్పటికే స్పైడర్‌పై భారీ అంచనాలు ఉండగా ట్రైలర్ రిలీజ్ తర్వాత అది మరింతగా పెరిగింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. తాజాగా ఉమైర్ సంధు ట్వీట్‌తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందించాడు. తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో భరత్ మరో విలన్ గా కనిపించనున్నాడు. తమిళ నటుడు ఆర్జే బాలాజీ, పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సింగిల్ కట్ కూడా లేకుండా ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. మద్యపాన, ధూమపాన సన్నివేశాలు అస్సలు లేకపోవడంతో సినిమాకు ముందు, ఇంటర్వెల్ సమయంలో వార్నింగ్ యాడ్స్‌కు మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించారు. As per Censor Board Members, #SPYder has no Dull Moment throughout the film ! A full on Racy Screenplay ! @urstrulyMahesh looking Terrific 👍 pic.twitter.com/mYmPihP2Zi — Umair Sandhu (@sandhumerry) September 18, 2017