
లై, ఛల్‌మోహన్ రంగా సినిమాల ఫలితాలతో నితిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ ఆశించినంత మేర విజయం సాధించలేకపోయాడు. ఈ కుర్ర హీరో తన సినీ కెరీర్‌లో మరిచిపోలేని హిట్ ఇచ్చిన దిల్ రాజుతో కలిసి మళ్లీ ఇన్నేళ్లకు ఇంకో సినిమాను చేస్తున్నాడు. ‘దిల్’ సినిమా ఇటు నితిన్, దిల్ రాజు కెరీర్స్‌ను నిలబెట్టింది. మళ్లీ వీరిద్దరు కలిసి ‘శ్రీనివాస కళ్యాణం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌కు విపరీతమైన స్పందన వస్తోంది. భారీ తారాగణంతో వస్తోన్న ఈ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్, రాజేంద్ర ప్రసాద్, జయసుధల నటన ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. హీరో హీరోయిన్ల కూల్ లుక్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను శనివారం పూర్తి చేసుకుంది. సెన్సార్ కత్తెరకు పని చెప్పకుండా.. క్లీన్ యూ సర్టిఫికేట్‌ను పొందినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది.
2 hours and 20 minutes. Zero cuts. All set for a grand release on August 9th. #SrinivasaKalyanam@actor_nithiin @RaashiKhanna @Nanditasweta @mickeyjmeyer
— Sri Venkateswara Creations (@SVC_official) August 4, 2018
Directed by #vegesnasatish. #SrinivasaKalyanamFromAug9th pic.twitter.com/ActZnbuga6