కనువిందు చేస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ ట్రైలర్‌ | Nitin Srinivasa Kalyanam Trailer Released | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 2 2018 6:19 PM | Last Updated on Thu, Aug 2 2018 6:53 PM

Nitin Srinivasa Kalyanam Trailer Released - Sakshi

‘అ ఆ’ సినిమాతో భారీ హిట్‌ కొట్టాడు నితిన్‌. తరువాత ‘లై’, ‘ఛల్‌ మోహన్‌రంగా’ సినిమాలు చేసినా.. ఆ స్థాయిలో విజయవంతం కాలేదు. అయితే నితిన్‌ కేరిర్‌కు ఊపునిచ్చిన సినిమా ‘దిల్‌’. ఈ సినిమాను నిర్మించిన రాజు ‘దిల్‌’ రాజుగా ఇండస్ట్రీలో ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. మళ్లీ ఇన్నేళ్ల తరవాత నితిన్‌ హీరోగా, దిల్‌ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న సినిమా శ్రీనివాస కళ్యాణం.

ఈ మూవీలో మిక్కి జే మేయర్‌ అందించిన పాటలు ఇప్పటికే పాపులర్‌ అయ్యాయి. భారీ తారాగణంతో వస్తోన్న ఈ మూవీపై అందరి దృష్టి నెలకొంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు రిలీజ్‌ చేశారు. పెళ్లంటే.. పెద్ద పండుగ అని జయసుధ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకోగా.. పెళ్లి వేడుకను అద్భుతంగా చూపెట్టారు . నితిన్‌, రాశిఖన్నా కూల్‌ లుక్స్‌లో బాగున్నారు. ఇక సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్న ప్రకాష్‌ రాజ్‌, జయసుధ, రాజేంద్ర ప్రసాద్‌, సీనియర్‌ నరేష్‌ల నటన  హైలెట్‌గా నిలవనుంది. ‘శతమానం భవతి’ ఫేమ్‌ సతీష్‌ వేగేశ్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 9న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement