
మరో ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా టాలీవుడ్‌లో తెరకెక్కుతోంది. నితిన్-రాశీఖన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, సాంగ్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్ర థీమ్ టీజర్‌ను కాసేపటి క్రితం రిలీజ్ చేశారు. టీజర్ విషయానికొస్తే... మనం పుట్టినప్పుడు మనవాళ్లందరూ ఆనంద పడతారు అది మనకు తెలీదు. మనం దూరం అయినప్పుడు మనవాళ్లందరూ బాధపడతారు అదీ మనకు తెలీదు. మనకు తెలిసి మనం సంతోషంగా ఉండి, మనవాళ్లందరూ సంతోషంగా ఉండేది ఒక్క పెళ్లిలో మాత్రమే. అలాంటి పెళ్లి గొప్పతనం చెప్పే ఓ చిన్ని ప్రయత్నమే మా ఈ శ్రీనివాస కళ్యాణం అంటూ సహజనటి జయసుధ వాయిస్ ఓవర్‌తో టీజర్‌ను రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న శ్రీనివాస కళ్యాణం ఆడియో జూలై 22న విడుదల చేయనున్నారు.