అమలాపురంలో ‘శ్రీనివాస కళ్యాణం’ | Nithin Srinivasa Kalyanam Been Shooting In Amalapuram | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 9 2018 6:37 PM | Last Updated on Sat, Jun 9 2018 6:47 PM

Nithin Srinivasa Kalyanam Been Shooting In Amalapuram - Sakshi

మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో గు​ర్తింపు పొందాడు డైరెక్టర్‌ సతీష్‌ వేగేశ్న. శతమానంభవతి లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తీసి అందర్నీ మెప్పించాడు . దిల్‌ రాజు నిర్మించిన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ దిల్‌ రాజు , సతీష్‌ వేగేశ్న కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. 

నితిన్‌, రాశీ ఖన్నా జోడిగా నటిస్తోన్న ‘శ్రీనివాస కళ్యాణం’  సినిమా షూటింగ్‌ దశలో ఉంది. ఈ సినిమాను కూడా ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ అమలాపురంలో జరుగుతోంది. ఈ సినిమాలోని పెళ్లికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ విరామ సమయంలో దిగిన కొన్ని ఫోటోలను సీనియర్‌ నరేష్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement