
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వెబ్‌సైట్ కథనాలపై అసహనం వ్యక్తం చేశారు. శ్రీనివాస కళ్యాణం చిత్రానికి ఘోస్ట్ డైరెక్టర్‌గా దిల్ రాజు వ్యవహరించాడని.. దిల్ రాజు డైరెక్షన్ ‘డెబ్యూ’ అంటూ వెటకారంగా కొన్ని వెబ్‌సైట్లు కథనాలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం జరిగిన శ్రీనివాస కళ్యాణం చిత్రం ప్రెస్ మీట్‌లో ఆయన స్పందించారు.
‘ఆ కథనాలు చూసి హర్టయ్యా. దిల్‌రాజు డెబ్యూ డైరెక్టర్‌గా చేశారూ.. అంటూ కథనాలు రాశారు. అది రాంగ్. ఇవి దర్శకుల సినిమాలు. వారి వెనుకాల సపోర్ట్‌గా నేను నిలుస్తానే తప్ప.. వారి వ్యవహారాల్లో ఎప‍్పటికీ జోక్యం చేసుకోను. మంచి చిత్రాన్ని అందించేందుకే మేం కృషి చేస్తాం. దయ చేసి మీడియాలో ఇలాంటి రాయటం సరికాదు’ అంటూ ఆయన పేర్కొన్నారు. డైరెక్టర్-ప్రొడ్యూసర్ రిలేషన్‌షిప్ బాగుంటేనే మంచి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని ఆయన అన్నారు.
కాగా, చిత్రం గ్యారెంటీగా హిట్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నితిన్-రాశీఖన్నా జంటగా.. వేగేశ్న సతీష్ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment