స్పైడర్ ఎలా ఉందంటే.. | SPYder Censor Reports are OUTSTANDING twitts Umair Sandhu | Sakshi
Sakshi News home page

స్పైడర్ ఎలా ఉందంటే..

Published Mon, Sep 18 2017 5:23 PM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM

స్పైడర్ ఎలా ఉందంటే..

స్పైడర్ ఎలా ఉందంటే..

‘స్పైడర్’తో సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని సినీ విశ్లేషకుడు, సెన్సార్‌బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. స్పైడర్‌ సినిమా మొత్తంలో బోరింగ్ ఎలిమెంట్లు అస్సలు లేవని, సినిమా బాగా వచ్చిందని, అద్భుతంగా ఉందని తనకు సెన్సార్‌బోర్డ్ సభ్యులు చెప్పారని పేర్కొన్నారు. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో సినిమా మొత్తం ప్రేక్షకులను అలరిస్తుందంటున్నారు. మొత్తానికి ఈ దసరాకు మహేశ్‌బాబు ఓ సూపర్ హిట్ కొట్టడం ఖాయమని తేల్చిచెప్పేస్తున్నారు. ఇప్పటికే స్పైడర్‌పై భారీ అంచనాలు ఉండగా ట్రైలర్ రిలీజ్ తర్వాత అది మరింతగా పెరిగింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. తాజాగా ఉమైర్ సంధు ట్వీట్‌తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందించాడు. తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో భరత్ మరో విలన్ గా కనిపించనున్నాడు. తమిళ నటుడు ఆర్జే బాలాజీ, పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  సింగిల్ కట్ కూడా లేకుండా ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. మద్యపాన, ధూమపాన సన్నివేశాలు అస్సలు లేకపోవడంతో సినిమాకు ముందు, ఇంటర్వెల్ సమయంలో వార్నింగ్ యాడ్స్‌కు మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement