Urvashi Rautela Defamation Suit On Umair Sandhu Tweet On Akhil harassment - Sakshi
Sakshi News home page

Urvashi Rautela: అఖిల్ అసభ్య ప్రవర్తన.. ఆ ‍ట్వీట్‌పై నటి సీరియస్‌..!

Published Sun, Apr 23 2023 4:44 PM | Last Updated on Sun, Apr 23 2023 6:20 PM

Urvashi Rautela defamation Suit On Umair Sandhu Tweet On Akhil harassment - Sakshi

బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా గురించి పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తాజాగా అఖిల్ ఏజెంట్‌ మూవీలో ఓ ప్రత్యేక సాంగ్‌లో ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు తాను సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్‌గా చెప్పుకునే వివాదస్పద సినీ క్రిటిక్ ఉమైర్‌ సంధుపై బాలీవుడ్ నటి ఆగ్రహం వ్యక్తం చేసింది. అతను చేసిన ఫేక్‌ ట్వీట్‌పై ఊర్వశి ఫైర్ అయింది. ఇలాంటి ఫేక్‌ పోస్ట్ చేసినందుకు అతనిపై పరువునష్టం దావా వేసినట్లు తెలిపింది బాలీవుడ్ బ్యూటీ. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది.   
 
అసలు ట్వీట్‌లో ఏముంది?

అఖిల్‌ ‍అక్కినేని.. ఊర్వశి రౌతేలాతో ఏజెంట్‌ మూవీ షూట్‌లో అసభ్యంగా ప్రవర్తించాడని ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను చూసిన బాలీవుడ్ భామ ఇది ఫేక్ అంటూ కొట్టిపారేసింది. అంతటితో వదలకుండా అతనిపై విమర్శల దాడి చేసింది. నువ్వు జర్నలిస్టే కాదంటూ చురకలంటించింది. ఇలాంటి ఫేక్‌ వార్తలు తమ కుటుంబానికి చాలా అసౌకర్యంగా కలిగించాయని ఊర్వశి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంలో ఊర్వశి రౌతేలా అభిమానులు మద్దతుగా నిలిచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement