Urvashi Rautela will shake leg with Akhil Akkineni in Agent - Sakshi
Sakshi News home page

Urvashi Rautela : ఈసారి అఖిల్‌ అక్కినేనితో ఊర్వశీ రౌతేలా స్పెషల్‌ సాంగ్‌

Published Tue, Apr 11 2023 7:53 AM | Last Updated on Tue, Apr 11 2023 10:10 AM

Urvashi Rautela Will Shake Leg With Akhil Akkineni In Agent - Sakshi

‘ఏజెంట్‌’ తో ప్రత్యేక స్టెప్పులు వేయనున్నారట హీరోయిన్‌ ఊర్వశీ రౌతేలా. అఖిల్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ స్పై ఫిల్మ్‌ ‘ఏజెంట్‌’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్‌. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, సురేందర్‌ 2 సినిమాస్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశలో ఉంది. అయితే ఈ మూవీలోని ఓ ప్రత్యేక పాటలో ఊర్వశీ రౌతేలా డ్యాన్స్‌ చేయనున్నారని సమాచారం.

అఖిల్, ఊర్వశీల మాస్‌ స్టెప్స్‌తో ఈ పాట అదిరిపోయే రేంజ్‌లో ఉంటుందట. ‘ఏజెంట్‌’ చిత్రం ఈ నెల 28న విడుదలకానుంది. కాగా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో ‘బాస్‌ పార్టీ..’ అనే స్పెషల్‌ సాంగ్‌లో తన డ్యాన్స్‌తో అలరించారు ఊర్వశి. అలాగే రామ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా ఆమె ఓ స్పెషల్‌ సాంగ్‌ చేశారని తెలిసింది. కాగా ఊర్వశీ రౌతేలా ప్రధాన పాత్రలో నటించిన ‘బ్లాక్‌ రోజ్‌’ సినిమా తెలుగులో విడుదల కావాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement