అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటించగా, మమ్ముట్టి కీలక పాత్ర చేశారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి 2 పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘రామకృష్ణ గోవింద.. గోవింద హరి గోవింద...’ అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్. ‘
రామ పోయి కృష్ణ వచ్చె, బాధే పోయి హ్యాపీ వచ్చిందా, నైటే పోయి లైటే వచ్చె, ప్రేమే పోతూ పోతూ ఏదో ఏదో నేర్పించిందా.. గోవిందా గోవిందా గర్ల్‌ఫ్రెండ్ గోవిందా.. అయ్యిందా అయ్యిందా బ్రేకప్ అయ్యిందా, పోయిందా పోయిందా ప్రేమే దూరం పోయిందా, వచ్చిందా వచ్చిందా ఫ్రీడమ్ వచ్చిందా..’ అంటూ ఈ పాట సాగుతుంది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని రామ్ మిర్యాల పాడగా, శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు.
Comments
Please login to add a commentAdd a comment