
అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ కెరీర్‌లో తొలిసారి పాన్ ఇండియా చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా కాకినాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల్ మాట్లాడుతూ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
కొంతకాలంగా అఖిల్ పెళ్లిపై పలు వార్తలు వస్తున్నాయి. తాజాగా పెళ్లెప్పుడు అని అభిమాని అడిగిన ప్రశ్నకు అఖిల్ సమాధానిమిస్తూ..“అప్పుడే పెళ్లి చేసుకోమంటారా?” అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానంటూ తన రిలేషన్‌షిప్‌పై క్లారిటీ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment