అక్కినేని అఖిల్ తాజాగా నటించిన చిత్రం ఏజెంట్. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్‌గా నటించింది. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్‌లో మరో ఫ్లాప్‌గా మిగిలింది. మేకోవర్ కోసం చాలా కష్టపడిన అఖిల్‌కు ఏజెంట్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది.
ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్‌పై మరో కన్‌ఫ్యూజన్ వచ్చి పడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు(మే19)నుంచే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు కూడా సోనీలివ్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. చదవండి: షూటింగ్‌లో ప్రమాదం.. సల్మాన్‌ఖాన్‌కు గాయాలు
అయితే మళ్లీ ఏమైందో ఏమో కానీ ఏజెంట్ స్ట్రీమింగ్‌ను వాయిదా వేసింది. థియేటర్ రిలీజ్‌కు, ఓటీటీ విడుదలకు కనీసం 20 రోజుల గ్యాప్ కూడా లేకపోవడంతో మరో వారం పాటు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. మే26న ఏజెంట్ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
Were is #Agent OTT RELEASE MAY 19 @SonyLIV @SonyLIVHelps pic.twitter.com/gLANHasQ1S
— OTTGURU (@OTTGURU1) May 19, 2023
Comments
Please login to add a commentAdd a comment